శరవణభవ గురుగుహం షణ్ముఖం భజేహం
వరదాభయకరం శక్త్యాయుధ ధర కరం
పురుహుతాది సేవితం భాగవతాది సన్నుతం
పార్వతీ కుమారం నవనందనాదియుత ధీరం
నాదాంత విహరం నత భక్తజన మందారం
గర్విత శూరాది హరం గణపతి సోదరం వరం
వల్లీ దేవసేనానందకరం చతురతరం
రెల్లుగడ్డిలో జన్మించిన వాడు, ఆరుముఖములు కలిగిన గురుగుహుని నేను భజించుచున్నాను. వరములిచ్చి అభయమొసగే వాడు, శక్తి ఆయుధముగా చేత గలిగిన వాడు, ఇంద్రాదులచే సేవించబడే వాడు, భక్తులచే నుతించబడే వాడు అయిన సుబ్రహ్మణ్యుని నేను భజించుచున్నాను. పార్వతీ పుత్రుడు, నందనులతో కూడిన ధీరుడు, ఓంకారమునందు విహరించే వాడు, నుతించే భక్తుల పాలిట కల్పవృక్షమైన వాడు, గర్వించిన రాక్షస వీరులను సంహరించిన వాడు, గణపతి సోదరుడు, శుభకరుడు, వల్లీ దేవసేనలకు ఆనందము కలిగించే వాడు, చతురుడు, నిపుణుడు అయిన సుబ్రహ్మణ్యుని నేను భజించుచున్నాను.
- ముత్తుస్వామి దీక్షితుల వారు
బౌళి రాగంలోని ఈ కీర్తనను రంజని-గాయత్రి సోదరీమణులు గానం చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి