సాహిత్యం
=======
గానమూర్తే శ్రీకృష్ణ వేణుగానలోల త్రిభువన పాల పాహి
మానినీమణి శ్రీరుక్మిణి మానసాపహార మారజనక దివ్య
నవనీతచోర నందసత్కిశోర నరమిత్ర ధీర నరసింహ శూర
నవమేఘ తేజ నగజా సహజ నరకాంతకాజ నత త్యాగరాజ
భావం
======
వేణుగానలోలుడవు, ముల్లోకములను పాలించేవాడవు, గానమూర్తివైన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము. నారీశిరోమణి అయిన రుక్మిణీదేవి మనసును దోచుకున్నవాడవు, మన్మథునికి జనకుడవు, దివ్యగానమూర్తివి అయిన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము. వెన్నదొంగవు, నందుని ముద్దుబిడ్డవు, అర్జునునికి మిత్రుడవు, ధీరుడవు, నరసింహుడవు, శూరుడవు. క్రొత్త మేఘముల వంటి కాంతి కలవాడవు, పార్వతీదేవి సహోదరుడవు, నరకాసురుని సంహరించిన వాడవు, బ్రహ్మ, శివులచే నుతించబడినవాడవు, గానమూర్తివైన శ్రీకృష్ణా! నన్ను రక్షింపుము.
శ్రవణం
=======
గానమూర్తి రాగంలో కూర్చబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.
.jpeg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి