భవనుత నా హృదయమున రమింపుము బడలిక దీర
భవతారక నాతో బహుపల్కిన బడలిక దీర కమల సం"భవనుత"
శివునిచేత నుతించబడిన శ్రీరామా! నా హృదయములో అలసట తీరేలా వసించి నా హృదయమును అలరింపుము. బ్రహ్మ చేత నుతించినబడే వాడవు, సంసారసాగరమును తరింపజేయు శ్రీరమా! అనేక సార్లు నాతో మాట్లాడి నా మొరలను విని అలసిపోయితివి కనకు నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. ఆంజనేయునికి ఆప్తుడవైన శ్రీరామా! నా గృహమునకు వేంచేసి యుండి నాకు ఆశ్చర్యము కలిగించి శ్రమించితివి, నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. ఓ రామా! శ్రేష్ఠమైన నైవేద్యములు చేసి పెట్టలేదు, పైపెచ్చు పరవాలేదని సరిపెట్టుకున్న నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము. నాకు బలమునిచ్చి అలసిపోయావేమో, ఈ త్యాగరాజుకు నీవే ప్రభువు,నా హృదయములో వసించి సేద తీర్చుకొనుము.
మోహన రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి