సామజవరగమన సాధుహృత్సారసాబ్జపాల కాలాతీత విఖ్యాత
సామనిగమజ సుధామయ గాన విచక్షణ
గుణశీల దయాలవాల మాం పాలయ
వేదశిరోమాతృజ సప్తస్వర నాదాచలదీప స్వీకృత
యాదవకుల మురళీవాదన వినోద మోహనకర త్యాగరాజ వందనీయ
ఓ గజరాజు వంటి గంభీరమైన నడక కలిగినవాడా! సజ్జనుల హృదయసారమనే కమలములకు ప్రభువైన వాడా! కాలానికి అతీతమైన కీర్తి కలిగినవాడా! సామవేదం నుంచి పుట్టిన అమృతమయమైన గానంలో నిపుణుడా! సద్గుణశీలుడా! దయకు నిలయమైనవాడా! నన్ను రక్షించు. వేదాల శిరస్సు నుంచి ఉద్భవించిన సప్తస్వరాల నాదపర్వతానికి దీపంలా వెలిగేవాడా, దానిని స్వీకరించినవాడా! యాదవ వంశంలో జన్మించి మురళీవాదనలో ఆనందించి అందరినీ మోహింపజేసేవాడా! త్యాగరాజు పూజించే శ్రీకృష్ణా! నన్ను కాపాడు.
హిందోళ రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మంగళపంపల్లి బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి