గరుడ గమన రారా నను నీ కరుణనేలు కోరా
గరుడుని వాహనంగా కలిగిన శ్రీరామా! నాపై నీ కరుణ చూపించి నన్నేలుకో! పరమపురుషా! మరే విధమైన భయమూ లేకుండా నిన్నే ఆశ్రయించాను. నాపట్ల ఎలాంటి భేదభావమూ చూపకుండా నన్ను ఆదరించుము. నేను పిలిచిన వెంటనే వచ్చి నన్ను కాపాడుము. నిన్ను తలచిన వెంటనే నాకు అభయమివ్వుము. సంపదలోనూ, బలంలోనూ, చివరకు నా కలలోనూ నీవే నాకు ఆధారమని పలవరిస్తున్న నన్ను కన్నతండ్రిలా ఆదుకొనుము. పాలసముద్రంపై శయనించే పరమాత్మా! దశరథుని కుమారుడవు! కమలాల వంటి కన్నులు కలవాడవు! నన్ను పాలలో ముంచినా, నీటిలో ముంచినా నేను నీకే చెందినవాడిని. నీ పాలనే పడ్డాను. ఇక ఆలస్యం చేయకుండా నన్ను రక్షించుము. స్వామీ! ఇంకా ఎందుకు రావు? ఇప్పుడైనా వచ్చి నన్ను ఏలుకొని కాపాడవేమి? నీవే నన్ను ఏలే ప్రభువని ఎంతో నమ్ముకున్నాను. కరుణకు నిలయమైన హరీ! మరి ఎందుకు రావు? భద్రగిరీశా! వరాలను, కృపను ప్రసాదించేవాడవు! నాపై ఇంత పట్టుదల ఎందుకు? నా చింతలన్నింటినీ తొలగించి, ఈ రామదాసుని హృదయంలో కొలువై ఉన్న ప్రభువుగా నన్ను రక్షించు స్వామీ!
సురటి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని ఆకాశవాణి భక్తిరంజని బృందగానంలో వినండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి