గజాననయుతం గణేశ్వరం భజామి సతతం సురేశ్వరం
అజేంద్ర పూజిత విఘ్నేశ్వరం గణాది సన్నుత పదపద్మకరం
కుంజర భంజన చతురతర కరం గురుగుహాగ్రజం ప్రణవాకారం
గజముఖము కలిగిన గణేశ్వరుడిని, దేవతలకు అధిపతియైన ఆ గణపతిని నేను ఎల్లప్పుడూ భజిస్తున్నాను. బ్రహ్మ, ఇంద్రుడు మొదలైనవారిచే పూజింపబడే వాడు, గణములు మొదలైనవారు స్తుతించే కమలముల వంటి పాదాలు, హస్తాలు కలిగినవాడు, కుంజరుడనే రాక్షసుడిని సంహరించడంలో అత్యంత సమర్థతను చూపినవాడు, సుబ్రహ్మణ్యస్వామికి అగ్రజుడు, ఓంకారస్వరూపుడు అయిన ఆయనను నేను నిరంతరం ఆరాధిస్తున్నాను.
ముత్తుస్వామి దీక్షితుల వారు చక్రవాకం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి