పురందరదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
పురందరదాసు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, సెప్టెంబర్ 2026, ఆదివారం

పురందరదాసుల వారి ప్రఖ్యాత దేవర్నామా భాగ్యద లక్ష్మీ బారమ్మా




భాగ్యద లక్ష్మీ బారమ్మా నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ బారమ్మా

హెజ్జెయ మేలె హెజ్జెయనిక్కుత గెజ్జె కాల్గళ ధ్వనియ తోరుత
సజ్జన సాధు పూజెయ వేళెగె మజ్జిగెయొళగిన బెణ్ణెయంతె

కనక వృష్టియ కరెయుత బారె మనకామనెయ సిద్ధియ తోరె
దినకర కోటి తేజది హొళెయువ జనకరాయన కుమారి బేగ

అత్తిత్తలగదె భక్తర మనెయలి నిత్య మహోత్సవ నిత్య సుమంగళ
సత్యవ తోరువ సాధు సజ్జనర చిత్తది హొళెయువ పుత్థళి బొంబె

సంఖ్యెయిల్లద భాగ్యవ కొట్టు కంకణ కైయ తిరువుత బారె
కుంకుమాంకితె పంకజ లోచనె వేంకటరమణన బింకద రాణి

సక్కరె తుప్పద కాలువె హరిసి శుక్రవారద పూజెయ వేళెగె
అక్కరెయుళ్ళ అళగిరి రంగన చొక్క పురందర విఠ్ఠలన రాణి

సమస్త సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే ఓ లక్ష్మీదేవి! మాయమ్మా! మా యింటికి రావమ్మా! అడుగు మీద అడుగు వేస్తూ, కాలిగజ్జెల సవ్వడులు చేస్తూ, సజ్జనులు సాధువులు పూజ చేసేవేళలో మజ్జిగ చిలుకుతున్నప్పుడు కొద్దికొద్దిగా వచ్చే వెన్నలా నిదానంగా రావమ్మా! కోటి సూర్యుల తేజస్సుతో ప్రకాశించే ఓ జనకుని కుమార్తె అయిన లక్ష్మీదేవీ! మా మనసులలోని కామ్యములను నెరవేరుస్తూ, కనకవృష్టిని కలిగిస్తూ మా యింటికి రావమ్మా! సత్యాన్ని ఆచరించే సాధువులు, సజ్జనుల చిత్తములలో నివసించే ఓ బంగారు బొమ్మా! వేరెక్కడికీ వెళ్లకుండా భక్తుల గృహములలో నిత్య మహోత్సవములు, నిత్యపూజలు అందుకునేందుకు రావమ్మా! లెఖ్ఖలేని భాగ్యములను అనుగ్రహిస్తూ, బంగారు కంకణములు, కుంకుమ ధరించిన కలువలు వంటి కన్నులు కలిగిన వేంకటరమణుని అందమైన పట్టపురాణీ! మా యింటికి రావమ్మా! నీపై ఎంతో మక్కువతో తదేక దృష్టితో ఉన్న అళగిరి రంగడు, అందమైన పురందర విఠలుని రాణివైన లక్ష్మీదేవీ! చక్కెర, నెయ్యి ఉప్పొంగేలా అనుగ్రహించి శుక్రవార పూజా వేళ మా యింటికి రావమ్మా!

మధ్యమావతి రాగంలో స్వరపరచబడిన ఈ పురందరదాసుల వారి కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి ఆలపించారు. 

6, ఆగస్టు 2017, ఆదివారం

వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం - పురందరదాసు దేవర్నామా


వేంకటాచల నిలయం వైకుంఠపురవాసం 
పంకజ నేత్రం పరమ పవిత్రం
శంఖ చక్రధర చిన్మయ రుపం

అంబుజోద్భవ వినుతం అగణితగుణ ధామం 
తుంబురు నారదగాన విలోలం

మకర కుండలధర మదన గోపాలం
భక్త పోషక శ్రీ పురందర విఠలం

శ్రీవేంకటాద్రి నివాసంగా కలిగిన, వైకుంఠ వాసుడు కలువల వంటి కన్నులు గలవాడు, పరమ పవిత్రమైన వాడు, శంఖ చక్రములు ధరించిన వాడు చిదానంద రూపుడు శ్రీవేంకటేశ్వరుడు. పంకజము నుండి జన్మించిన బ్రహ్మచే నుతించిబడిన వాడు, ఎన్నలేని గుణములకు నిలయమైన వాడు, తుంబుర నారదాదుల గానములో తేలియాడే వాడు ఆ స్వామి. మకర కుండలములు ధరించిన ఆ మదన గోపాలుడు భక్తులను పోషించే పురందర విఠలుడు.

- పురందరదాసు

శ్రీనివాస నాయకునిగా నామకరణం చేయబడిన బాలుడు మహా వాగ్గేయకారుడై కర్ణాటక శాస్త్రీ సంగీతానికి ఆద్యుడైనారు. ఆయన గురువులైన వ్యాసతీర్థుల వారు ఆయనకు పురందరదాసు అని పేరు మార్చారు. పురందర విఠల అనే ముద్రతో అద్భుతమైన దాస సాంప్రదాయ కృతులను రచించారు. ఈనాడు మనకున్న కర్ణాటక సంగీతం ఆయన చలవే. వేంకటేశ్వరుడు, శ్రీకృష్ణుడు, గణపతి, మహాలక్ష్మి మొదలైన దేవతా స్వరూపాలపై ఆయన వేల కీర్తనలను రచించి పాడారు. కనడ భాషలో వీటిని దేవర్నామా అంటారు. కన్నడ దేశంలో దాస సాంప్రదాయం ఎంతో ప్రబలం కావటానికి పురందరులు కృషి చేశారు. ఈ సాంప్రదాయం ఇప్పటికీ పటిష్టంగా దక్షిణ భారతమంతా విస్తరించి సనాతన ధర్మ ప్రచారానికి తోడ్పడుతోంది. పురందరుల వారు ఎక్కువ మటుకు కన్నడ భాషలో, కొన్ని సంస్కృతంలో రచనలు చేశారు. వాటిలో ఒకటి వేంకటాచల నిలయం అనే దేవర్నామా సింధుభైరవి రాగంలో కూర్చబడింది. పురందరుల వారి కృతులను ఎమ్మెల్ వసంతకుమారి గారు చాలా ప్రచారం చేశారు. వారి గాత్రంలో ఈ దేవర్నామాను వినండి. 

యంత్రోద్ధారక హనుమాన్ - హంపి

హంపిలోని తుంగభద్రానది ఒడ్డున ఉన్న చక్రతీర్థం సనాతనమైనది. రాములవారు వాలిని వధించిన తరువాత సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసిన స్థలమిది. విజయనగ...