బ్రోచే వారెవరే రఘుపతే!
నిను వినా బ్రోచే వారెవరే!
శ్రీరామ నెనరున బ్రోచే వారెవరే!
సకల లోక నాయక! బ్రోచేవారెవరే!
నరవర! నీ సరి బ్రోచేవారెవరే!
ముని సవంబు జూడ వెంట జని ఖల మారీచాదుల హతంబు జేసి బ్రోచే వారెవరే!
వాలి నొక్క కూల నేసి రవి బాలుని రాజుగ గావించి జూచి బ్రోచే వారెవరే!
దేవేంద్రాదులు మెచ్చుటకు లంక దయతో దానమొసంగి సదా బ్రోచే వారెవరే!
భవాబ్ధి తరుణోపయము నేరని త్యాగరాజు కరంబిడి బ్రోచే వారెవరే!
ఓ రామా! నీవు తప్ప నన్ను బ్రోచేవారెవరు? దుష్టులైన మారీచాదులను చంపి విశ్వామిత్రుని యాగమును గాచినావు, వాలిని ఒక్క బాణముతో చంపి సుగ్రీవుని రాజుగా చేసినావు, రావణుని సంహరించి లంకను విభీషణునికి అప్పగించి దేవేంద్రాది దేవతల మెప్పు కూడా పొందినావు. ఈ భవసాగరము దాటే ఉపాయము తెలియని ఈ త్యాగరాజుని చేయిపట్టుకుని బ్రోవుము.
శ్రీరంజని రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని సౌమ్య ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి