19, సెప్టెంబర్ 2026, శనివారం

శక్తి సహిత గణపతిం - ముత్తుస్వామి దీక్షితుల కృతి

శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం
విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం

భక్తాళి పోషకం భవసుతం వినాయకం
భుక్తిముక్తిప్రదం భూషితాంగం రక్తపదాంబుజం భావయామి

శంకరుడు మొదలైన దేవతలచే సేవింపబడేవాడు, వైరాగ్యాన్ని ఆచరించిన మునిశ్రేష్ఠులచే, దేవరాజైన ఇంద్రునిచే, గురుగుహుడైన సుబ్రహ్మణ్యునిచే స్తుతింపబడేవాడు, పార్వతీదేవితో కూడి ఉన్న గణపతిని నేను ధ్యానిస్తున్నాను. భక్తసమూహాన్ని పోషించి రక్షించేవాడు, భవుడైన శివుని కుమారుడు, విఘ్నాలను తొలగించే వినాయకుడు, భుక్తి అనగా లోకంలో లభించే సుఖసంపదలను, ముక్తి అనగా జననమరణ బంధవిముక్తిని ప్రసాదించేవాడుం దివ్యాభరణాలతో అలంకరింపబడిన దేహం, ఎర్రని కమలాలవంటి పాదాలు కలిగిన పార్వతీ సహిత గణపతిని నేను నా మనస్సులో ధ్యానిస్తున్నాను.

శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని నొట్టుస్వరాలను నేర్పించటానికి వినియోగిస్తారు. దీనిని జొన్నలగడ్డ శ్రీరాం మరియు కల్యాణ్ వసంత్ ఆలపించారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గణేశకుమార పాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల కృతి

గణేశకుమార పాహి మాం గజముఖ మనోరథ సిద్ధి దాయకా ఆగమపదాదినుత భవ శ్రీ గురుగుహనుత గజముఖ  గజముఖుడవు, బాలస్వరూపుడవైన గణేశా! నన్ను కాపాడుము. నా మనోరథా...