కోదండరామా కోదండరామా కోదండరామా పాహి
ఓ కోదండరామా! మమ్ములను రక్షింపుము. నీ అండ మాకు కావలి, నీవు వేరెక్కడికీ పోవద్దు. మాతో వాదములు, పరాకు వద్దు. శ్రీరామా! మమ్ములను చేపట్టి ఆదుకొనుము, మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుము. ఓ రఘువీరా! నీవు జగదేకశూరుడవు, నీకు జయము. మా భయాలను పారద్రోలేవాడవు, భక్తుల పాలిట కల్పవృక్షానివి! మణులతో పొదగబడిన ఆభరణములతో అలంకరించబడిన వాడవు, మృదువైన సంభాషణలు చేసేవాడవు, యుద్ధములో విజయశంఖారావాన్ని పూరించేవాడవు, అందమైన రూపము కలవాడవు, మమ్ములను రక్షింపుము. శ్రీరామా! నీవే మాకు తల్లి, తండ్రి, తాత మరియు దైవము. కలువల వంటి కన్నులు, అందమైన రూపము కలవాడవు! పరమ పవిత్రమైన వాడవు, గొప్ప చరిత్ర కలవాడవు, మమ్ములను రక్షింపుము. ఓ శ్రీరామ! నీకు వందనములు, మాతో వాదనలు ఎందుకు? మమ్ములను శిక్షించటం మీకు తగదు. అందమైన చిరునవ్వు కలవాడవు, లక్ష్మీదేవితో విలాసముగానున్నవాడవు, దాసులను పాలించేవాడవు, భద్రాద్రిలో నివసించే వాడవు, మమ్ములను రక్షింపుము.
బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ భద్రాచల రామదాసు కృతిని మల్లాది సోదరులు పిల్లలకు నేర్పించిన వీడియో.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి