వినాయక విఘ్ననాశక మాం తారయ దయానిధే
అనాథ రక్షక ఆరూఢ మూషిక శివ గురుగుహ విధి పూజిత
దయాసముద్రుడవు, విఘ్నములను నాశనము చేసే వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము. అనాథులకు రక్షకుడవై, మూషికాన్ని వాహనంగా అధిరోహించినవాడవు నీవు. శివుడు, గురుగుహుడైన కుమారస్వామి, బ్రహ్మదేవుడు పూజించే వాడవు, శరణు వచ్చిన జనులను పరిపాలించేవాడవు. దేవరాజపురమనే కాంచీపురంలో ఆనందంగా కొలువై, వేగవాహినీ నదిచే మహిమ వర్ధిల్లినవాడవు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని అనే దివ్య నేత్రములు కలవాడవు, రతీపతియైన మన్మథునిచే కూడా స్తుతింపబడే శుభమంగళ స్వరూపుడవు, వాయుపుత్రుడైన హనుమంతునికి ఆనందాన్ని కలిగించేవాడవు, రామునికి మిత్రుడవు, సమస్త పావనకరులలో శ్రేష్ఠుడవైన వినాయకా, సంసారసాగరము నుండి నన్ను దాటించుము.
వేగవాహిని రాగంలో స్వరపరచబడిన ముత్తుస్వామి దీక్షితుల కృతిని ప్రియా సోదరీమణులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి