25, సెప్టెంబర్ 2026, శుక్రవారం

బ్రోవ భారమా! రఘురామా! - త్యాగరాజస్వామి కృతి


బ్రోవ భారమా! రఘురామా! భువనమెల్ల నీవై నన్నొకని 

శ్రీవాసుదేవ! అండ కోట్ల కుక్షిని యుంచుకోలేదా?

కలశాంబుధిలో దయతోనమరులకై యదిగాక
గోపికలకై కొండ లెత్త లేదా కరుణాకర త్యాగరాజుని బ్రోవ భారమా!
ఓ వాసుదేవా! ఈ విశ్వంలో జీవరాశుల సృష్టిని నీ కడుపులో ఉంచుకోలేదా? క్షీరసాగర మథనంలో దేవతలపై దయతో కూర్మాకృతిని దాల్చిన నీవు, మరల కృష్ణావతారంలో ఇంద్రుని ఆగ్రహానికి గురైన గోపకులాన్ని చిటికెన వేలిపై గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వారిని కాపాడావు. కరుణాకరుడవైన ఓ రామా! నన్ను కాపాడటం నీకు భారమా? ఈ ప్రపంచమంతా నీవై యున్నావే? నన్ను బ్రోవ భారమా?
వాగ్గేయకారుల కృతులలో విశ్వవ్యాపకుడైన పరమాత్మ వైభవాన్ని అవతారాలను నుతిస్తూ అద్భుతంగా ఆవిష్కరించారు. అన్నమాచార్యులవారు వందేహం జగద్వల్లభం అనే కృతిలో మందరధరం గురుం అంటే త్యాగరాజులవారు తనదైన శైలిలో ఈ బ్రోవ భారమా అనే కృతిలో కలశాంబుధిలో దయతోనమరులకై అని పలికారు. తనను నమ్ముకున్న గోకులాన్ని రక్షించి గోవర్ధన గిరిధరుడైనాడు అని మనకు తెలియజేశారు త్యాగరాజ స్వామి. అంతటి మహత్కర కార్యాలను చేసిన ఆయనకు ఒక మానవుడుని కాపాడటం భారమా! అని ప్రశ్నించాడు. ఈ త్యాగరాజస్వామి వారి కృతిని మల్లాది సోదరులు ఆలపించారు .

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

వినాయకుని వలెను బ్రోవవే - త్యాగరాజస్వామి కృతి

  వినాయకుని వలెను బ్రోవవే నిను వినా వేల్పులెవరమ్మా అనాథరక్షకి శ్రీకామాక్షి సుజనాఘమోచని శంకరి జనని నరాధములకును వరాలొసగనుండరాములై భూసురాది దేవ...