పంచ మాతంగ ముఖ గణపతినా పరిపాలితోహం సుముఖేన శ్రీ
ఐదు గజముఖములు కలిగినవాడు, భక్తుల పాలిట సుముఖుడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు. పంచభూతాత్మకమైనవాడు, సృష్టికి కారణమైన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే నుతించబడిన వాడు, ఐదు ముఖములు గల శివుని సుతుడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు. వరద అభయ ముద్రలతో, పాశము, అంకుశము, కపాలము, ఏకదంతము, మోదకము, ముద్గరము (సమ్మెట), రుద్రాక్షమాల ధరించినవాడు, కమలాపురములో విహరించేవాడు, ఇంద్రాది అఖిల దేవతలచే పూజించబడే విఘ్నేశ్వరుడు, శ్రేష్ఠుడైన కుమారస్వామికి సోదరుడు, అందమైన ఉదరము గలవాడు, కరుణకు ప్రసిద్ధి గాంచినవాడు, కలి దోషములను హరించి భవసాగరమును దాటించే వాడు అయిన గణపతి నన్ను కాపాడుచున్నాడు.
- ముత్తుస్వామి దీక్షితుల వారు
మలహరి రాగంలో స్వరపరచబడిన ఈ కృతిని మహారాజపురం సంతానం గారు ఆలపించారు.

ధన్యవాదాలు Prasad Akkiraju గారూ!
రిప్లయితొలగించండిౘాలా రోజులనుంచీ వెతుకుతున్న మంచి కీర్తన పంచారు మీరు
What is the raga
రిప్లయితొలగించండిమలహరి
రిప్లయితొలగించండి