19, నవంబర్ 2010, శుక్రవారం

కాలభైరవాష్టకం


కాశీలోని కాలభైరవ దేవాలయం

సనాతన ధర్మంలో ఒక గొప్ప విశేషం ఆగమ శాస్త్రానుసారంగా మహనీయులచే స్థాపించబడిన ప్రతి దేవాలయానికీ ఒక క్షేత్రపాలకుడిని కూడా గుర్తించి ఆలయం నిర్మించటం. పేరులో ఉన్నట్లు క్షేత్రపాలకుడు ఆ క్షేత్రానికి కాపలాదారు. అంటే ఆ దేవతా స్వరూపానికి నమ్మిన బంటు లేదా ఆ దేవతామూర్తి యొక్క మరొక రూపమే. తన శక్తిని క్షేత్రపాలకునికి ఆ దేవతామూర్తి నిరంతరం అందజేస్తూ ఉంటుంది. మీరు నిశితంగా పరిశీలించండి - కొన్ని వైష్ణవాలయాలలో హనుమంతుడు, శివ, శక్తి సంబంధితమైన ఆలయాలలో కాలభైరవుడు క్షేత్రపాలకులుగా ఉంటారు. కాలభైరవుని వృత్తాంతము శివపురాణంలో చెప్పబడింది. ఈ సారి కాశీ వెళితే తప్పకుండా కాలభైరవుని దర్శించుకోండి. అలాగే, నేపాల్ వెళ్లినప్పుడు కాఠ్మండు లోని దర్బారు స్క్వేరులో గల కాలభైరవుని దర్శించుకోగలరు.

కాఠ్మండులోని కాలభైరవ విగ్రహం

వారణాసి (కాశీ) పుణ్య క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. పరమశివుని ఉగ్రాంశగా భావించబడే రూపం కాలభైరవుడు. దీనికి ఒక చిన్న గాథ కూడా ఉంది. ఒకసారి బ్రహ్మ శివుని అవమానించి, తన  ముఖముతో శివుని చూసి పక పక నవ్వాడు. అప్పుడు శివుని నుండి కాల భైరవుడు జన్మించి ఆ శిరస్సును నరికేస్తాడు. విష్ణువు విన్నపముతో శివుడు బ్రహ్మను మన్నించి శాంతిస్తాడు.  కాని శిరస్సు ఖండించిన ఆ పాపము  కాలభైరవుడిని వెంటాడింది. ఆ శిరస్సు కూడా కాలభైరవుని వీడక ఉంది. ఈ పాతకము, దాని శిక్షను దూరం చేసుకోటానికి కాలభైరవుడు కాశీ క్షేత్ర ప్రవేశము చేయాలని సంకల్పిస్తాడు. ఆయన ప్రవేశించ గలుగుతాడు, ఆ పాపము ఊరి బయటనే ఉండిపోతుంది. అప్పటినుంచి ఆ కాలభైరవుడు కాశీ క్షేత్రానికి కోత్వాల్ (క్షేత్ర పాలకుడు) గా వ్యవహరించబడ్డాడు. ఈ కాల భైరవునకు వాహనము శునకము. ఈ స్వామి దర్శనము చేయనిదే కాశీ యాత్ర పూర్తి కానట్లే అని ప్రతీతి. జగద్గురువు ఆదిశంకరులు రచించిన మహిమాన్విత, ప్రాశస్త్యము పొందిన కాలభైరావాష్టకం, తాత్పర్యము. యూట్యూబ్ శ్రవణం

కాశీ క్షేత్రపాలకుడు కాల భైరవుడు 

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థితం సమస్తలోకవిగ్రహమ్
వినిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశనం
కర్మపాశమోచకం సుశర్మధాయకం విభుమ్
స్వర్ణవర్ణశేషపాశశోభితాంగమండలం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాత్తనష్టపాపజాలముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథకాలభైరవం భజే

           ఫల శ్రుతి

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రపుణ్యవర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనం
ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం నరా ధ్రువమ్

ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం
శ్రీ కాలభైరవాష్టకం సంపూర్ణమ్

తాత్పర్యము:
దేవేంద్రునిచే పూజించబడిన పాదపద్మములు కలిగిన, సర్పమును యజ్ఞోపవీతము గా కలిగిన వాడు, చంద్రుని ధరించిన వాడు, కృపాకరుడు, దిక్కులనే వస్త్రములుగా కలిగిన వాడు, నారదాది మునులచే పూజించ బడిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను.

కోటి సూర్యుల వలె ప్రకాశించు వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, జగదీశ్వరుడు, నీలకంఠుడు, కామ్యములను తీర్చేవాడు, మూడు నేత్రములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, పద్మముల వంటి కన్నులు కలవాడు, అజేయమైన త్రిశూలము కలవాడు, నాశనము లేని వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

శూలము, టంకము, పాశము, దండము మొదలగునవి ఆయుధములుగా ధరించిన వాడు,  నల్లని మేను కలవాడు, సనాతనుడు, నాశనము లేని వాడు, మొదటి వాడు, రోగాతీతుడు, విక్రముడు, ప్రభువు, విచిత్రమైన నాట్యమంటే ఇష్టపడే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

కోరికలు తీర్చి, మోక్షాన్ని ప్రసాదించే వాడు,  పేరుగాంచిన సౌందర్యమున్న దేహము కలవాడు, శివుని రూపమైన వాడు (స్థిరమైన వాడు), భక్త ప్రియుడు, లోకేశ్వరుడు, వేరు వేరు రూపములలో విలసించే వాడు, చిరు గజ్జెలు కలిగిన బంగారు మొలత్రాడు ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ధర్మమనే సేతువును పాలించేవాడు, అధర్మ మార్గములను నాశనము చేసే వాడు, కర్మ బంధములనుండి తప్పించే వాడు, మనము చేసే తప్పులను తెలియచేసి మనకు సిగ్గును కలిగించే వాడు,  బంగారు రంగులో ఉన్న పాశము, సర్పములు దేహ భాగములకు ఆభరణములుగ కలిగిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

రత్నములు పొదిగిన పాదుకలచే అలరారు పాదములు కలిగిన వాడు,  అంతటాయున్న వాడు, రెండవసాటి లేని వాడు, ఇష్ట దైవమైన వాడు, కామ్యములు తీర్చేవాడు, మానవులకు మృత్యు భయమును తొలగించే వాడు, తన దంతముల ద్వారా మోక్షమును కలిగించే వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

బ్రహ్మచే సృష్టించ బడిన వాటిన తన అట్టహాసముతో నాశనము చేయ గలిగిన వాడు,  సర్వ పాపహారము చేసే వీక్షణములు కలవాడు, తెలివైన వాడు, చండ శాసనుడు, అష్ట సిద్ధులను ప్రసాదించే వాడు (అణిమ, గరిమ మొదలగునవి),  కపాలముల మాల ధరించిన వాడు, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

భూత నాయకుడు, ఎనలేని కీర్తిని ప్రసాదించే వాడు, కాశీ పుర వాసుల మంచి చెడును విచారించే వాడు, నీతి మార్గములో నిపుణుడు, శాశ్వతుడు, జగత్పతి, కాశీ పురానికి పాలకుడు అయిన కాలభైరవుని నేను భజిస్తున్నాను. 

ఫల శృతి 

అనంతమైన జ్ఞాన మూలమైన, సత్కార్యముల ఫలమును పెంచే, శోకము, మోహము, దారిద్ర్యము, కోరిక, క్రోధము నశింపచేసే ఈ మనోహరమైన కాలభైరవాష్టకం పఠించే  వారికి ఆ భైరవుని సన్నిధి ప్రాప్తించును. 

ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన కాలభైరవాష్టకం.

18, నవంబర్ 2010, గురువారం

దక్షిణామూర్తి స్తోత్రము - తాత్పర్యము

పరమాత్మ, గురువు, ఆత్మ రూపంలో విశేషంగా వ్యక్తమయ్యే దక్షిణామూర్తిని స్తుతిస్తూ ఆదిశంకరులు ఈ స్తోత్రం రచించారు. వేదాంతాన్ని అభ్యసించటంలో ముఖ్య ఉద్దేశము అజ్ఞానాన్ని (అవిద్యను) తొలగించుకొనుటకు. ఇది ఎలా?  సంకల్పముతో మాయ మీద ఉన్న మోహమును వదులుకోవటం, ఆత్మానందము పొంది భయమును, భీతిని అధిగమించటం వలన. ఆత్మ సాక్షాత్కారము పొందిన ఒక గురువు సహాయముతో, గురుబోధలను అనుసరించి, ఆయనను దైవముగా భావించి సాధకుడు ఈ స్థితిని చేరుకుంటాడు.  ఇదే అద్వైత సారం - గురువునకు, దైవమునకు గల అభేదమును తెలుసుకొనుట. ఈ స్తోత్రమున దక్షిణామూర్తిని గురువు రూపము యందు ధ్యానిన్చినందు వలన కలిగే ఆత్మ ప్రకాశమును మనకు తేట తెల్లము చేసారు. ఈ స్తోత్రము మనకు జీవము, ఈశ్వరుడు, బ్రహ్మ అన్ని ఒకటే అన్న తత్వాన్ని ఎరుగుటకు సహాయపడుతుంది. గురు రూపంలో ఉన్న ఆ దక్షిణామూర్తి మనలను అజ్ఞానమనే అంధకారము నుండి సత్యమనే ప్రకాశము వైపు నడిపించు గాక.  ఇంత అద్భుతమైన ఆత్మ తత్త్వ వివేచనా స్తోత్రమును మనకు అందించిన ఆదిగురువులకు శత సహస్ర వందనములు. యూట్యూబ్ శ్రవణం మలయాళ నేపథ్య గాయకుడు కే. సుకుమార్ గారి గళంలో



ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణమూర్తయే నమః



దక్షిణామూర్తి స్తోత్రము
విశ్వం దర్పణదృశ్యమాననగరీతుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యదా నిద్రయా
యః సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మానమేవాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాణ్నిర్వికల్పం పునః
మాయాకల్పితదేశకాలకలనావైచిత్ర్యచిత్రీకృతమ్
మాయావీవ విజృంభయత్యపి మహాయోగీవ యః స్వేచ్ఛయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

యస్యైవ స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే
సాక్షాత్తత్త్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్
యత్సాక్షాత్కరణాద్భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

నానాచ్ఛిద్రఘటోదరస్థిత్మహాదీపప్రభాభాస్వరం
జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిం స్పందతే
జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్సమస్తం జగత్
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః
స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి భ్రాంతా భృశం వాదినః
మాయాశక్తివిలాసకల్పితమహా వ్యామోహసంహారిణే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్
సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్
ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి
వ్యావృత్తాస్వనువర్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా
స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతం
శిష్యాచార్యతయా తయైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః
స్వప్నే జాగ్రతి వా య ఏష పురుషో మాయాపరిభ్రామితః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే

భూరంభాస్యనలోఽనిలోఽంబరమహర్నాథో హిమాంశుః పుమాన్
ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకమ్
నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్విభోః
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే 

సర్వాత్మత్వమితి స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
తేనాస్య శ్రవణాత్తదర్థమననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్
సర్వాత్మత్వమహావిభూతిసహితం స్యాదీశ్వరత్వం స్వతః
సిద్ధ్యేత్తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతమ్

వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి


తాత్పర్యము:

ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది.  నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు.  మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము)  పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై  శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా  తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది.  మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్,  చేతన, సుషుప్తా మొదలగునవి)  వచ్చే మార్పులకు అతీతంగా  ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే,  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి),  శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు.

ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును.

సంసార బంధములు, జనన మరణ  ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.

15, నవంబర్ 2010, సోమవారం

శివాష్టకం - తాత్పర్యము

శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దేశాల్లో కొంత తేడా ఉంది. నాకు తెలిసిన సాహిత్యం, తాత్పర్యము, యూట్యూబ్ శ్రవణం ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళంలో

ఉజ్జయిని మహాకాలేశ్వరుడు

ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం
భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే

గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం
జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే

ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం
అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే

వటాధో నివాసం మహాట్టాట్టహాసం మహాపాపనాశం సదాసుప్రకాశం
గిరీశం గణేశం  సురేశం మహేశం శివం శంకరం శంభుమీశానమీడే

గిరీంద్రాత్మజాసంగాహీతార్ధదేహం గిరౌ సంస్థితం సర్వదా సన్నిగేహం
పరబ్రహ్మబ్రహ్మాదిభిర్వంద్యమానం శివం శంకరం శంభుమీశానమీడే

కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదాంభోజనమ్రాయ కామం దధానం
బలీవర్దయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశానమీడే

శరచ్చంద్రగాత్రం గణానంద పాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం
అపర్ణాకళత్రం సదా సచ్చరిత్రం శివం శంకరం శంభుమీశానమీడే

హరం సర్పహారం చితా భూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం
శ్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశానమీడే

ఫల శృతి

స్తవం యః ప్రభాతే నరః శూలపాణే పఠేత్ సర్వదా భర్గ భావానురక్తః
సుపుత్రం ధనం ధాన్య మిత్రం కళత్రం విచిత్రం సమాసాద్య మోక్షం ప్రయాతి

తాత్పర్యము: 

ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి,  గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని వాడు, కొలత లేని వాడు,  మహా మోహములను సంహరించే వాడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

వట వృక్షము (మర్రి చెట్టు) క్రింద నివసించేవాడు, అట్టహాసంగా నవ్వేవాడు, మహా పాపములను నాశనము చేసే వాడు, ఎల్లప్పుడూ ప్రకాశించే వాడు, హిమవత్పర్వతాలకు అధిపతి,  గణ నాయకుడు, దేవతలకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

అర్థ దేహమున పార్వతిని కలిగిన వాడు, కైలాసమున నివసించువాడు, ఆర్తుల రక్షకుడు, ఆత్మ యైన వాడు, బ్రహ్మచే కొలువబడిన వాడు,  అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

కపాలము, త్రిశూలం చేతులలో ధరించిన వాడు, పాదపద్మములను ఆశ్రయించిన వారి కోర్కెలు తీర్చే వాడు, నందిని అధిరోహించే వాడు, దేవతలకు, గణములకు అధిపతి, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

శరత్కాలములో చంద్రుని వంటి ముఖము కలవాడు, గణములకు సంతోషాన్ని ఇచ్చే వాడు, మూడు నేత్రములు కలవాడు, స్వచ్చమైన వాడు, కుబేరుని స్నేహితుడు, పార్వతికి భర్త, ఎల్లప్పుడూ సచ్చరిత్ర కలిగిన వాడు, అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.


హరుడు, సర్పములు హారములుగా కలవాడు, శ్మశానంలో తిరిగే వాడు, ప్రపంచమైన వాడు, వేదాల సారమైన వాడు, భేద భావము, వికారము లేని వాడు, శ్మశానములో నివసించే వాడు, మనసులో పుట్టిన కోరికను దహించే వాడు (మన్మథుని దహించిన వాడు అని కూడా అర్థం), అందరికి దేవుడు అయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను.

ఫల శృతి:

ఆర్తితో, శరణాగతితో, భక్తితో ఈ స్తోత్రముతో శూలపాణిని స్తుతించిన వారికి మంచి భార్య, సంతానము, ధనము, ధాన్యము, విశేషమైన జీవనము కలిగి పిమ్మట శివ సాయుజ్యము కలుగును.

14, నవంబర్ 2010, ఆదివారం

దారిద్య్ర దుఃఖ దహన స్తోత్రము - తాత్పర్యము

దారిద్య్రము అనేది మానవ జాతికి అత్యంత భయానకమైన, దుఃఖభరితమైన స్థితి. భుక్తికి, జీవనానికి ధనమనేది ఎంత ముఖ్యమో ఇప్పటి కలికాలంలో ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆ పరమేశ్వరుని ప్రార్థించి ఈ దారిద్య్రమనే దుఃఖమును దహించమని వేడుకుందాము. మీకోసం దారిద్ర్య దుఃఖ దహన స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం యూట్యూబ్లో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి గళంలో.

సోమనాథ్ లో నేత్ర పర్వము

విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖరధారణాయ
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిపకంకణాయ
గంగాధరాయ గజరాజవిమర్దనాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

భక్తిప్రియాయ భవరోగభయాపహాయ ఉగ్రాయ దుర్గభవసాగరతారణాయ
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ ఫాలేక్షణాయ మణికుండలమండితాయ
మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

పంచాననాయ ఫణిరాజవిభూషణాయ హేమాంశుకాయ భువనత్రయమండితాయ
ఆనందభూమివరదాయ తమోమయాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

భానుప్రియాయ భవసాగరతారణాయ కాలాంతకాయ కమలాసనపూజితాయ
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

రామప్రియాయ రఘునాథవరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవతారణాయ
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ దారిద్య్ర దుఃఖదహనాయ నమః శివాయ

          వశిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణం 
          సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనం 
          త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్


తాత్పర్యము: 

విశ్వేశ్వరుడు, నరకమనే సాగరమును దాటించేవాడు, శ్రవణానంద మైన వాడు, నెలవంకను ధరించిన వాడు, కర్పూరము యొక్క కాంతి వలె తెల్లగా ఉన్నవాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీ ప్రియ వల్లభుడు, చంద్ర వంకను ధరించిన వాడు, యముని అంతము చేసే వాడు, సర్పములను కంకణములుగా ధరించిన వాడు, గంగను కేశములలో ధరించిన వాడు, గజాసురుని సంహరించిన వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

భక్తులకు ప్రియుడు, రోగ భయమును పోగొట్టే వాడు, ఉగ్రుడు, సంసారమనే సాగరాన్ని దాటించే వాడు,  జ్యోతిర్మయుడు, గుణ నామ కీర్తనకు నృత్యం చేసే వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పులిచర్మమును ధరించే వాడు, శ్మశానములో కాలే శవముల భస్మమును శరీరమునకు పూసుకొనిన వాడు, నుదుట కన్ను కలవాడు, రత్నములు పొదిగిన కుండలములు చెవులకు ధరించిన వాడు, మంచి ధ్వని కలిగించే ఆభరణములు కాళ్ళకు ధరించిన వాడు, జటా ఝూటములు కలిగిన వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పంచముఖములు కలిగిన, ఫణి రాజు ఆభరణముగా కలిగిన వాడు, బంగారు వస్త్రములు ధరించిన వాడు, త్రిలోక వంద్యుడు, వర ప్రదాత, ఆనంద సాగరుడు, అంధకారము నిండినవాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

పార్వతీదేవి యొక్క విలాసమునకు ప్రపంచమైన వాడు, మహేశ్వరుడు, ఐదు ముఖములు కలిగిన వాడు, శరణన్న వారి పాలిటి కల్పతరువు, వారికి సర్వం తానైన వాడు, సర్వలోకాలకు అధిపతి, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

 సూర్యునికి ప్రియమైన వాడు, భవ సాగరాన్ని దాటించే వాడు, యముని సంహరించేవాడు, బ్రహ్మచే పూజించబడిన వాడు, మూడు కన్నులు కలిగిన వాడు, అన్ని శుభలక్షణములు కలిగిన వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

రామునికి ప్రియమైన వాడు, రామునికి వరములు ప్రసాదించిన వాడు, నాగ జాతికి ప్రియమైన వాడు, నరకమనే సాగరాన్ని దాటించేవాడు, పుణ్యాల్లో పుణ్యము కలిగిన వాడు, దేవతలచే కొలువబడిన వాడు, దారిద్య్రమనే దుఃఖమును దహించేవాడు అయిన పరమ శివునికి నా నమస్కారములు.

వశిష్ఠ మహాముని రచించిన ఈ స్తోత్రము ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము పఠించిన వారికి అన్ని సంపదలు కలిగి చివరకు స్వర్గ ప్రాప్తి కలుగును.

13, నవంబర్ 2010, శనివారం

శివపంచాక్షరీ స్తోత్రం - తాత్పర్యము

ఆది శంకరులు రచించిన అద్భుతమైన స్తోత్రము శివ పంచాక్షరీ. ఇది శివుని పంచాక్షరీ మంత్రమైన నమః శివాయ లోని ప్రతి అక్షరాన్ని శివుని రూపంగా, కొన్ని లక్షణాలతో, ప్రాసలో వర్ణించబడింది. అత్యంత మహిమాన్వితమైనది. ఆ స్తోత్రము, తాత్పర్యం క్రింద.యూట్యూబ్  దృశ్యం, శ్రవణం ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారి అమృత గాత్రంలో.

నమః శివాయ
 
నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ

మందాకినీ సలిల చందనచర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ
మందారపుష్ప బహుపుష్పసుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ

శివాయ గౌరీవదనాబ్జవృంద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమః శివాయ

వశిష్ఠ కుంభోద్భవ గౌతమార్య మునీంద్ర దేవార్చిత శేఖరాయ
చంద్రార్క వైశ్వానరలోచనాయ తస్మై వకారాయ నమః శివాయ

యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ
దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమః శివాయ

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే
ఇతి శ్రీమచ్ఛంకరాచార్యవిరచిత శివపంచాక్షరీ స్తోత్రం సమాప్తం

తాత్పర్యము: 

నాగేంద్రుని హారము వలె ధరించిన, మూడు నేత్రములు కలిగిన, శరీరమంతా భస్మవిలేపనము కలిగిన, మహేశ్వరుడైన, శాశ్వతుడు, శుద్ధమైన వాడు, దిగంబరుడు, 'న'కార రూపుడయిన ఆ శివునికి నా నమస్కారములు.

మందాకినీ మొదలగు నదుల జలములతో అర్చించబడి,  గంధలేపనము చేయబడి, మందారము మొదలగు బహు సుపుష్పములచే పూజించబడే, నంది మొదలగు ప్రమథ గణములకు అధిపతి అయిన 'మ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.

సకల శుభకరుడు, కమలము వంటి గౌరీ దేవి వదనమును వికసింప చేసే సూర్యుడు, దక్ష యజ్ఞము నాశనము చేసిన వాడు, నీలకంఠుడు, వృషభము (ఎద్దు) పతాకముపై చిహ్నముగా కలవాడు, 'శి'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.

వశిష్ఠుడు, అగస్త్యుడు, గౌతముడు మొదలగు మునీంద్రులచే పూజింపబడిన శిరస్సు (లింగం) కలిగిన, చంద్రుడు, సూర్యుడు, అగ్ని త్రినేత్రములుగా కలిగిన, 'వ'కార రూపుడైన శివునికి నా నమస్కారములు.

యక్ష రూపములో ఉన్న, జటా ఝూటములు కలిగిన, పినాకము (అనే ధనుస్సు) చేత కలిగిన, సనాతనుడు (ఆది/అంతము లేని వాడు, అన్నిటికన్నా ముందు వచ్చిన వాడు), దివ్యమైన వాడు, దేవ దేవుడు, దిగంబరుడు, 'య'కార రూపుడు అయిన శివునికి నా నమస్కారములు.

ఫల శృతి:

శివుని సన్నిధిలో ఈ పంచాక్షరి స్తోత్రమును పఠనం చేసిన వారికి శివలోక ప్రాప్తి, శివుని సహవాసం కలుగును. ఇది శ్రీమచ్ఛంకరాచార్యులు రచించిన పంచాక్షరీ స్తోత్రం.

12, నవంబర్ 2010, శుక్రవారం

చమకమ్ - తాత్పర్యము

భక్తుడు తనకు ఏమి కావలెనో ఆ రుద్రుని చమక రూపంలో అడగబడింది. నమకంలో లాగానే దీనిలో కూడా పదకొండు అనువాకములు. నమక చమకాలు కలిపి చదివితేనే అభిషేకం సంపూర్ణం. చమకాన్ని భక్తుని వాక్కులో రుద్రుని ఆశీర్వచనంగా వ్యాఖ్యానించ బడింది. చమకం, తాత్పర్యము, శ్రవణం మీకోసం. యూట్యూబ్ లంకెలు మొదటి భాగం రెండవ భాగం


చమకప్రశ్నః 

అథ ప్రథమోఽనువాకః
 
అగ్నావిష్ణూ సజోషసేమా వర్ధన్తు వాం గిరః
ద్యుమ్నైర్వాజేభిరాగతం
వాజశ్చ మే ప్రసవశ్చ మే
ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే
స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శ్రుతిశ్చ మే
జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మేఽపానశ్చ మే
వ్యానశ్చ మేఽసుశ్చ మే చిత్తం చ మ ఆధీతం చ మే
వాక్చ మే మనశ్చ మే చక్షుశ్చ మే శ్రోత్రం చ మే దక్షశ్చ మే
బలం చ మ ఓజశ్చ మే సహశ్చ మ ఆయుశ్చ మే
జరా చ మ ఆత్మా చ మే తనూశ్చ మే శర్మ చ మే వర్మ చ మే
ఽంగాని చ మేఽస్థాని చ మే పరూషి చ మే
శరీరాణి చ మే  ౧

ఇతి ప్రథమోఽనువాకః

అథ ద్వితీయోనువాకః

జ్యైష్ఠ్యం చ మ ఆధిపథ్యం చ మే మన్యుశ్చ మే
భామశ్చ మేఽమశ్చ మేఽమ్భశ్చ మే జేమా చ మే మహిమా చ మే
వరిమా చ మే ప్రథిమా చ మే వర్ష్మా చ మే ద్రాఘుయా చ మే
వృద్ధం చ మే వృద్ధిశ్చ మే సత్యం చ మే శ్రద్ధా చ మే
జగచ్చ మే ధనం చ మే వశశ్చ మే త్విషిశ్చ మే క్రీడా చ మే
మోదశ్చ మే జాతం చ మే జనిష్యమాణం చ మే సూక్తం చ మే
సుకృతం చ మే విత్తం చ మే వేద్యం చ మే భూతం చ మే
భవిష్యచ్చ మే సుగం చ మే సుపథం చ మ ఋద్ధం చ మ ఋద్ధిశ్చ మే
క్లుప్తం చ మే క్లుప్తిశ్చ మే మతిశ్చ మే సుమతిశ్చ మే  ౨

ఇతి ద్వితీయోనువాకః

అథ తృతీయోనువాకః

శం చ మే మయశ్చ మే ప్రియం చ మేఽనుకామశ్చ మే
కామశ్చ మే సౌమనసశ్చ మే భద్రం చ మే శ్రేయశ్చ మే
వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే
యన్తా చ మే ధర్తా చ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే
విశ్వం చ మే మహశ్చ మే సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే
సూశ్చ మే ప్రసూశ్చ మే సీరం చ మే లయశ్చ మ ఋతం చ మే
ఽమృతం చ మేఽయక్ష్మం చ మేఽనామయచ్చ మే జీవాతుశ్చ మే
దీర్ఘాయుత్వం చ మేఽనమిత్రం చ మేఽభయం చ మే సుగం చ మే
శయనం చ మే సూషా చ మే సుదినం చ మే  ౩

ఇతి తృతీయోనువాకః

అథ చతుర్థోఽనువాకః 

ఊర్క్చ మే సూనృతా చ మే పయశ్చ మే రసశ్చ మే
ఘృతం చ మే మధు చ మే సగ్ధిశ్చ మే సపీతిశ్చ మే
కృషిశ్చ మే వృష్టిశ్చ మే జైత్రం చ మ ఔద్భిద్యం చ మే
రయిశ్చ మే రాయశ్చ మే పుష్టం చ మే పుష్టిశ్చ మే
విభు చ మే ప్రభు చ మే బహు చ మే భూయశ్చ మే
పూర్ణం చ మే పూర్ణతరం చ మేఽక్షితిశ్చ మే కూయవాశ్చ మే
ఽన్నం చ మేఽక్షుచ్చ మే వ్రీహియశ్చ మే యవాశ్చ మే మాషాశ్చ మే
తిలాశ్చ మే ముద్గాశ్చ మే ఖల్వాశ్చ మే గోధూమాశ్చ మే
మసురాశ్చ మే ప్రియంగవశ్చ మేఽణవశ్చ మే
శ్యామాకాశ్చ మే నీవారాశ్చ మే  ౪

ఇతి చతుర్థోఽనువాకః

అథ పంచమోఽనువాకః  

అశ్మా చ మే మృత్తికా చ మే గిరయశ్చ మే పర్వతాశ్చ మే
సికతాశ్చ మే వనస్పతయశ్చ మే హిరణ్యం చ మే
ఽయశ్చ మే సీసం చ మే త్రపుశ్చ మే శ్యామం చ మే
లోహం చ మేఽగ్నిశ్చ మ ఆపశ్చ మే వీరుధశ్చ మ
ఓషధయశ్చ మే కృష్టపచ్యం చ మేఽకృష్టపచ్యం చ మే
గ్రామ్యాశ్చ మే పశవ ఆరణ్యాశ్చ యజ్ఞేన కల్పన్తాం
విత్తం చ మే విత్తిశ్చ మే భూతం చ మే భూతిశ్చ మే
వసు చ మే వసతిశ్చ మే కర్మ చ మే శక్తిశ్చ మే
ఽర్థశ్చ మ ఏమశ్చ మ ఇతిశ్చ మే గతిశ్చ మే  ౫

ఇతి పంచమోఽనువాకః  

అథ షష్ఠోఽనువాకః

అగ్నిశ్చ మ ఇన్ద్రశ్చ మే సోమశ్చ మ ఇన్ద్రశ్చ మే
సవితా చ మ ఇన్ద్రశ్చ మే సరస్వతీ చ మ ఇన్ద్రశ్చ మే
పూషా చ మ ఇన్ద్రశ్చ మే బృహస్పతిశ్చ మ ఇన్ద్రశ్చ మే
మిత్రశ్చ మ ఇన్ద్రశ్చ మే వరుణశ్చ మ ఇన్ద్రశ్చ మే
త్వష్టా చ మ ఇన్ద్రశ్చ మే ధాతా చ మ ఇన్ద్రశ్చ మే
విష్ణుశ్చ మ ఇన్ద్రశ్చ మేఽశ్వినౌ  చ మ ఇన్ద్రశ్చ మే
మరుతశ్చ  మ ఇన్ద్రశ్చ మే విశ్వే చ  మే దేవా ఇన్ద్రశ్చ మే
పృథివీ చ  మ ఇన్ద్రశ్చ మేఽన్తరీక్షం చ  మ ఇన్ద్రశ్చ మే
ద్యౌశ్చ మ ఇన్ద్రశ్చ మే దిశశ్చ మ ఇన్ద్రశ్చ మే
మూర్ధా చ మ ఇన్ద్రశ్చ మే ప్రజాపతిశ్చ మ ఇన్ద్రశ్చ మే  ౬

ఇతి షష్ఠోఽనువాకః

అథ సప్తమోఽనువాకః

అశుశ్చ మే రశ్మిశ్చ మేఽదాభ్యశ్చ మేఽధిపతిశ్చ మ
ఉపాశుశ్చ మేఽన్తర్యామశ్చ మ ఐన్ద్రవాయశ్చ మే
మైత్రావరుణశ్చ మ ఆశ్వినశ్చ మే ప్రతిపస్థానశ్చ మే
శుక్రశ్చ మే మన్థీ చ మ ఆగ్రయణశ్చ మే వైశ్వదేవశ్చ మే
ధ్రువశ్చ మే వైశ్వానరశ్చ మ ఋతుగ్రాహాశ్చ మే
ఽతిగ్రాహ్యాశ్చ మ ఐన్ద్రాగ్నశ్చ మే వైశ్వదేవాశ్చ మే
మరుత్వతీయాశ్చ మే మాహేన్ద్రశ్చ మ ఆదిత్యశ్చ మే
సావిత్రశ్చ మే సారస్వతశ్చ మే పౌష్ణశ్చ మే
పాత్నీవతశ్చ మే హారియోజనశ్చ మే  ౭

ఇతి సప్తమోఽనువాకః

అథ అష్టమోఽనువాకః

ఇధ్మశ్చ మే బర్హిశ్చ మే వేదిశ్చ మే ధిష్ణియాశ్చ మే
స్రుచశ్చ మే చమసాశ్చ మే గ్రావాణశ్చ మే స్వరవశ్చ మ
ఉపరవాశ్చ మే అధిషవణే చ మే ద్రోణకలశశ్చ మే
వాయవ్యాని చ మే పూతభృచ్చ మే ఆధవనీయశ్చ మ
ఆగ్నీధ్రం చ మే హవిర్ధానం చ మే గృహాశ్చ మే సదశ్చ మే
పురోడాశాశ్చ మే పచతాశ్చ మేఽవభృథశ్చ మే
స్వగాకారశ్చ మే  ౮

ఇతి అష్టమోఽనువాకః

అథ నవమోఽనువాకః
 
అగ్నిశ్చ మే ధర్మశ్చ మేఽర్కశ్చ మే సూర్యశ్చ మే
ప్రాణశ్చ మేఽశ్వమేధశ్చ మే పృథివీ చ మేఽ దితిశ్చ మే
దితిశ్చ మే ద్యౌశ్చ మే  శక్క్వరీరంగులయో దిశశ్చ మే
యజ్ఞేన కల్పన్తామృక్చ మే సామ చ మే స్తోమశ్చ మే
యజుశ్చ మే దీక్షా చ మే తపశ్చ మ ఋతుశ్చ మే వ్రతం చ మే
ఽహోరాత్రయోర్వృష్ట్యా బృహద్రథన్తరే చ మే యజ్ఞేన కల్పేతాం  ౯

ఇతి నవమోఽనువాకః

అథ దశమోఽనువాకః

గర్భాశ్చ మే వత్సాశ్చ మే త్రవిశ్చ మే త్రవీ చ మే
దిత్యవాఠ్ చ మే దిత్యౌహీ చ మే పంచావిశ్చ మే
పంచావీ చ మే త్రివత్సశ్చ మే త్రివత్సా చ మే
తుర్యవాట్ చ మే తుర్యౌహీ చ మే పష్ఠవాట్ చ మే పష్ఠౌహీ చ మ
ఉక్షా చ మే వశా చ మ ఋషభశ్చ మే వేహశ్చ మే
ఽనడ్వాంచ మే ధేనుశ్చ మ ఆయుర్యజ్ఞేన కల్పతాం
ప్రాణో యజ్ఞేన కల్పతామపానో యజ్ఞేన కల్పతాం
వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతా
శ్రోత్రం యజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం
వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం
యజ్ఞో యజ్ఞేన కల్పతాం   ౧౦

ఇతి దశమోఽనువాకః

అథ ఏకాదశోఽనువాకః
 
ఏకా చ మే తిస్రశ్చ మే పంచ చ మే సప్త చ మే
నవ చ మ ఏకదశ చ మే త్రయోదశ చ మే పంచదశ చ మే
సప్తదశ చ మే నవదశ చ మ ఏక విశతిశ్చ మే
త్రయోవిశతిశ్చ మే పంచవిశతిశ్చ మే
సప్తవిశతిశ్చ మే నవవిశతిశ్చ మ
ఏకత్రిశచ్చ మే త్రయస్త్రిశచ్చ మే
చతస్రశ్చ మేఽష్టౌ చ మే ద్వాదశ చ మే షోడశ చ మే
విశతిశ్చ మే చతుర్విశతిశ్చ మేఽష్టావిశతిశ్చ మే
ద్వాత్రిశచ్చ మే షట్త్రిశచ్చ మే చత్వరిశచ్చ మే
చతుశ్చత్వారిశచ్చ మేఽష్టాచత్వారిశచ్చ మే
వాజశ్చ ప్రసవశ్చాపిజశ్చ క్రతుశ్చ సువశ్చ మూర్ధా చ
వ్యశ్నియశ్చాన్త్యాయనశ్చాన్త్యశ్చ భౌవనశ్చ
భువనశ్చాధిపతిశ్చ  ౧౧

ఇతి ఏకాదశోఽనువాకః

ఇడా దేవహూర్మనుర్యజ్ఞనీర్బృహస్పతిరుక్థామదాని
శసిషద్విశ్వేదేవాః సూక్తవాచః పృథివీమాతర్మా
మా హిసీర్మధు మనిష్యే మధు జనిష్యే మధు వక్ష్యామి
మధు వదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాస
శుశ్రూషేణ్యాం మనుష్యేభ్యస్తం  మా దేవా అవన్తు
శోభాయై పితరోఽనుమదన్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇతి శ్రీ కృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
చతుర్థకాండే సప్తమః ప్రపాఠకః

తాత్పర్యము:  

మొదటి అనువాకము:

ఓ దేవా! అగ్ని విష్ణు రూపమైన వాడ!  మీరు నా పట్ల సంతుష్టులై ఉండుటకు నేను నుతించే ఈ పదములు ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతుండు గాక. నాకు ఎల్లపుడు ఆహారము, ధనము సమృద్ధిగా నుండు గాక. 

రెండవ అనువాకము:

నేను రుద్రుని అర్చించుట వలన - ఆహారము, దాన్ని ఇచ్చే మనసు,  ఉత్సాహము, కాపాడుకునే శక్తి, ఆహారాన్ని సంపాదించే శక్తి, దోషములు లేకుండా మంత్రోచ్చారణ చేసే సామర్థ్యం, యశస్సు, ఉచ్చారణ, వివేకము, స్వర్గము, ఆత్మ శక్తి,  అపాన వ్యానాదులు,  ఆత్మ, ఆలోచన, ఆలోచనచే గ్రహించ బడేవి, వాక్కు, మనస్సు, ఇంద్రియములు, జ్ఞానమును పొందుటకు కావలసిన ఇంద్రియ శక్తి, ఆత్మ బలము, శత్రువులను సంహరించే శక్తి, ఆయుష్షు, వృద్ధాప్యం, ఆరోగ్యకరమైన శరీరము, ఆనందము, శరీరాన్ని కాపాడటానికి ఆయుధాలు, బలమైన, స్థిరమైన అవయవములు, ఎముకలు, కీళ్ళు మొదలగు అవయవములు - నాతో, నాలో ఉండు గాక. 

మూడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - కీర్తి, నాయకత్వము, క్రోధము, చలించని మనసు, చల్లని నీరు, గెలిచే మరియు గౌరవము పొందే సామర్థ్యము, స్థిరాస్తులు, పుత్ర పౌత్రాదులు,   అప మృత్యువు లేని సంతానము, ధన ధాన్యములు, పెరిగే జ్ఞానము, సత్యము, వివరము పట్ల ధ్యాస, ఆకట్టుకునే సామర్థ్యము, శరీర సౌందర్యము, క్రీడలు ఇతర విషయముల వలన కలిగే ఆనందము, చేసేది, చేయబడేది, దేవతలా ఆశీర్వాదము, సత్కార్యములు, ఖజానా, నిలిచే సంపాదన, ఎక్కువ సంపాదించే సామర్థ్యము, ఎక్కడికైనా వెళ్ళగలిగే శక్తి, మంచి మార్గములు, మంచి యజ్ఞ ఫలము, పుణ్యము, సత్సంపాదన, పని చేయ గలిగిన మంచి సామర్థ్యము, ముందు చూపు, నిలకడ - నాకు కలిగి, నాతో ఉండు గాక.

నాలుగవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - ఇహ లౌక, పారలౌకిక ఆనందాలు, కోరిక, దాని ఫలము, ప్రీతి కలిగించే బంధు జనము, రక్షణ, యశస్సు , కీర్తి, మంచి అలవాట్లు, అదృష్టము, సంపద, తండ్రి వలె నన్ను నడిపించే సద్గురువు,  ఆస్తులను కాపాడుకునే శక్తి, స్థైర్యము, మంచితనము, గుర్తింపు, వేద శాస్త్రాల జ్ఞానము, అధ్యాపకత, పని చేసే, చేయించ గలిగే సామర్థ్యము, ఆజ్ఞాపించే అధికారము, పశు సంపద, అవరోధము లేని మార్గము, మంచి అగ్నిహోత్రము, ద్రవ్యములు, వాటి వలన కలిగే శుభములు, క్షయ వ్యాధి నుంచి రక్షణ, జ్వరములనుండి రక్షణ, ఔషధ సేవ లేని జీవితం, దీర్ఘాయుష్షు, అందరితో స్నేహంగా ఉండే వాతావరణము, నిర్భయము, సత్ప్రవర్తన, మంచి నిద్ర, మంచి ఉదయము, మంచి రోజులు - నాతో ఉండు గాక. 

అయిదవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన - భుక్తి, మంచి వాక్కు, పాలు, మీగడ, నెయ్యి, తేనె, బంధువులతో భోజనము, పానము, వ్యవసాయము, వర్షములు, విజయ భూమి, వృక్షములు, మొక్కల సేద్యము, స్వర్ణము, రత్నములు, సంపదతో వచ్చే కీర్తి, ఆరోగ్యము, విలువైన పంట, మంచి పంట తెచ్చే ఇతర శుభములు, దినదినాభి వృద్ధి, పూర్ణత్వము, ఉత్కృష్టము కన్నా ఉన్నతమైనది, మరణము లేని స్థితి, బియ్యము, సజ్జలు, గోధుమలు, రాగులు, మినుములు, పెసలు మొదలగు ధాన్యములు, నూనె గింజలు, పప్పు దినుసులు - అన్ని నా వద్ద సమృద్ధిగా ఉండు గాక.

ఆరవ అనువాకము:

ఓ రుద్రా!  నిన్ను అర్చించుట వలన - రాళ్ళు, మట్టి, కొండలు, పర్వతాలు, ఇసుక, భూమి యందు పెరిగే అన్ని వస్తువులు, అన్ని రకముల ఖనిజములు, లవణాలు, అగ్ని, నీరు, తీగ మొక్కలు,  ఔషధపు మొక్కలు, పెంచేవి, పెంచని మొక్కలు, గ్రామాలలో, అరణ్యాలలో ఉండే సంపద, పశుసంపద, అగ్నిహోత్రములో వాడే ద్రవ్యములు,  పిత్రార్జితములు, సంతానము మరియు ఇతరులకు చెందిన ఆస్తులు, స్థిర, చరాస్తులు, నా ధర్మమునకు చెందిన కర్మలు, కర్మలు చేయుటకు కావలసిన శక్తి, వాటి ఫలము, ఆనందము పొందే సాధనములు, వాటి ఫలితములు - నాతో ఉండు గాక. 

ఏడవ అనువాకము:
ఓ రుద్రా! నిన్ను అర్చించుట వలన -  అగ్ని మరియు ఇంద్రుడు, చంద్రుడు మరియు ఇంద్రుడు, సూర్యుడు మరియు ఇంద్రుడు, సరస్వతి మరియు ఇంద్రుడు, పూషా మరియు ఇంద్రుడు, బృహస్పతి మరియు ఇంద్రుడు, మిత్రుడు మరియు ఇంద్రుడు, వరుణుడు మరియు ఇంద్రుడు, త్వష్ట మరియు ఇంద్రుడు, ధాత మరియు ఇంద్రుడు, అశ్వినీ దేవతలు మరియు ఇంద్రుడు, మరుత్ దేవతలు మరియు ఇంద్రుడు, వసువులు మరియు ఇంద్రుడు, భూమి మరియు ఇంద్రుడు, అంతరిక్షము మరియు ఇంద్రుడు, స్వర్గము మరియు ఇంద్రుడు, నాలుగు దిక్కులు మరియు ఇంద్రుడు, మూర్ధ్నము మరియు ఇంద్రుడు, ప్రజాపతి మరియు ఇంద్రుడు - నన్ను ఆశీర్వదించు గాక.

ఎనిమిదవ అనువాకము:


ఓ రుద్రా! నిన్ను అర్చించుట కొరకు  -  సోమయాగమునకు కావలసిన పాత్రలు, ఆజ్య పాత్రలు, ఘ్రుత పాత్రలు,  ఇంద్రాది దేవతలకు సమర్పించ వలసిన సోమరస పాత్రలు,  ఆశ్వినాది ఇతర దేవతలకు సోమరస పాత్రలు, వైశ్వదేవాది దేవతలకు సోమరస పాత్రలు మొదలగునవి నా చేత ఉన్నాయి.

తొమ్మిదవ అనువాకము:

ఓ రుద్ర! నేను నీ భక్తుడనయినందు వలన - మర్రి చెట్టు చిదుగులు, దర్భలు, యాగశాల, సహాయమునకు స్త్రీలు, సోమరస పాత్రలు, సోమ తీగ చిగుళ్ళు నూరుటకు రాళ్ళు, సమిధలు, చెక్కలు, అగ్ని సృష్టించుటకు భూమిలో రంధ్రములు, ద్రోణము, వాయవ్యసము, ఇతర పవిత్రమైన పాత్రలు,యాగ ద్రవ్యములు ఉంచుటకు, స్త్రీలు ఆసీనులు అగుటకు, ఇతరులు వీక్షించుటకు ప్రదేశము, చెరువు (హోమములో హుతమునకు), బలి, అనంతరము స్నానమునకు ప్రదేశము, సమిథలతో పాటు హవానములో వేసే ఇతర ద్రవ్యములు నా చెంత ఉండు గాక.

పదవ అనువాకము:

ఓ రుద్రా! నేను నీ భక్తుడనయినందు వలన యాగామునకు కావాల్సిన అగ్ని, అగ్ని కార్యమునకు కావాల్సిన ఇతర పూర్వ కార్యక్రమములు, దిక్పాలకులకు, పంచాభూతములకు చేయవలసిన సమర్పణ (ఆశ్వాది బలులు), వేద పారాయణ , ప్రాయశ్చిత్తము, శాంతి హోమములు, పూర్ణాహుతి ముహూర్త నిర్ణయం, పూర్ణాహుతి కార్యక్రమము, ఇతర క్రియలు నా చేతుల మీదుగా జరుగు గాక.

(ఇక్కడ గో స్తన్యము నుండి పాలు త్రాగుట, అశ్వాన్ని బలి ఇవ్వటం, వివిధ దేవతలకు బలి సమర్పించటం, శుద్ధి, ప్రాయశ్చిత్తం వివరాలు పై రెండు అనువాకాల్లో పేర్కొన బడ్డాయి)

పదకొండవ అనువాకము:

గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు. ).

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక. 

ఓం శాంతి శాంతి శాంతి ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

10, నవంబర్ 2010, బుధవారం

శీర్షిక మార్పు

ఉగాది పచ్చడి అని షడ్రుచులు కనిపించేలా రాద్దాము అనుకుని మొదలు పెట్టిన బ్లాగ్, ఇవాళ అంతర్యామిగా మార్చాలని ఎందుకు అనిపించింది?. కారణం సరిగ్గా తెలియటం లేదు - తెలియని శక్తి ఏదో నన్ను ఇలా భగవంతునికి సంబంధించిన వ్యాసాలే రాయటానికి ముందుకు నడుపుతోంది. ఎందుకు అనేది తెలుసుకోవటానికి కూడా మనసు అంగీకరించటం లేదు. మార్గము, గమ్యము మళ్లీ ఏమైనా మారితే అప్పుడు ఆలోచిస్తాను ఏమి చెయ్యాలో. ఒక రకంగా ఆ సర్వేశ్వరుని గ్రహించటానికి ఎన్ని మార్గాలో? వాటిలో అణురేణువు శాతం గురించి మన అనుభవాలను, ఆలోచనలను రాయ గలిగినా, అది ఒక జీవిత కాలపు సార్థకమే. అందుకని అంతర్యామి - అంతయును నీవే అన్న శీర్షిక నిర్ణయించి మారుస్తున్నాను.

శరణాగత రక్షణ బిరుదని - భద్రాచల రామదాసు కృతి

శరణాగత రక్షణ బిరుదని నే శరణంటిగదయ్యా వెరవకుమని అభయంబొసగవే నను గన్నతండ్రివయ్యా కరివరదా సిరులొసగను దశరథ నందన రావయ్యా నిరతము నీ నామము నా జిహ్వక...