వసంతకాలపు సొగసులన్నీ మూర్తీభవించిన అలమేలుమంగమ్మా! నిన్ను ఏమని పొగడగలము? నీ నిర్మలమైన కన్నులలోని కాంతులే కదమ్మా నీ ప్రియుడైన శ్రీ వేంకటేశ్వరునికి ప్రకాశించే వెన్నెలలు! ఆనందంతో నీ మేనిపై మొలకెత్తే పులకరింతలే కదమ్మా ఆయనకు మెత్తని పూల పానుపులు! నీ మధురమైన పెదవులలోని తేనెలే కదమ్మా అనురాగమూర్తియైన నీ ప్రియునికి మధురమైన విందులు! నీ పెదవులపై విరిసే సున్నితమైన చిరునవ్వులే కదమ్మా మీ అనురాగానికి పరిమళించే కర్పూరపు సుగంధాలు! తన్మయత్వంతో నీవు ఆలింగనం చేసుకొనే నీ కౌగిలియే కదమ్మా శ్రీ వేంకటేశ్వరునికి సకల సంపదలతో కూడిన దివ్యనగరం! మీ ఇరువురి హృదయాలలో నెలకొన్న గాఢమైన ప్రేమానురాగాలే కదమ్మా మీ దివ్యకల్యాణాలకు మూలకారణాలు!
అభేరి రాగంలో స్వరపరచబడిన ఈ అన్నమాచార్యుల వారి కృతిని గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి