27, నవంబర్ 2026, శుక్రవారం

శ్రీసాంబశివం చింతయామ్యహం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


శ్రీసాంబశివం చింతయామ్యహం గణేశ్వర గురుగుహాది వందిత

భూసురాది పూజిత మృదు చరణం భాగవత ప్రముఖాది రక్షణం
వసుప్రదం వరదాభయ నిపుణం వాసుదేవ కుబేరాది భరణం

గణపతి, గురుగుహుడైన సుబ్రహ్మణ్యుడు మొదలైనవారిచే వందింపబడే పార్వతీ సమేతుడైన శ్రీ సాంబశివుని నేను ధ్యానించుచున్నాను. బ్రాహ్మణులు మొదలైనవారిచే పూజింపబడే సుకుమారమైన పాదములు కలవాడును, భగవద్భక్తులలో శ్రేష్ఠులైనవారిని రక్షించేవాడును, సంపదలను ప్రసాదించేవాడును, వరములను, అభయమును అనుగ్రహించుటలో నిపుణుడును, వాసుదేవుడైన శ్రీమహావిష్ణువు, కుబేరుడు మొదలైనవారిని పోషించి సంరక్షించేవాడును అయిన శ్రీ సాంబశివుని నేను ధ్యానించుచున్నాను.

బిలహరి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని పాల్ఘాట్ రాంప్రసాద్ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గోకర్ణేశ్వర పాహిపాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

గోకర్ణేశ్వర పాహిపాహి మాం గోత్రభిదాదిపూజితమూర్తే సుకీర్తే శ్రీకంబుహేమగిరికార్ముకధర శ్రీపతిశరధరణీధర పురహర శోకహర హరశుభనికరాకర కోకనదపద గురుగుహాక...