24, నవంబర్ 2026, మంగళవారం

కైలాసనాథేన సంరక్షితోऽహం - ముత్తుస్వామి దీక్షితులవారి కృతి


కైలాసనాథేన సంరక్షితోऽహం కైవల్యప్రద నిపుణతరేణ శ్రీ

కైలాసగిరి విహారేణ శైలరాజాత్మజా మోహాకారేణ

సద్గతి దాయకాంభోజచరణేన చారుశరచ్చంద్రకలాధరేణ
సద్గురుగుహసన్నుతపదేన సత్యజ్ఞానానందేన
సనకాదిసంశయహరణేన చిదానందహృదయస్థితేన

మోక్షమును ప్రసాదించుటలో అత్యంత సమర్థుడైన శ్రీ కైలాసనాథునిచే నేను సంరక్షింపబడుచున్నాను. కైలాసపర్వతముపై విహరించేవాడును, పర్వతరాజు కుమార్తెయైన పార్వతీదేవిని మోహింపజేసే సుందర స్వరూపము కలవాడైన శ్రీ కైలాసనాథునిచే నేను సంరక్షింపబడుచున్నాను. భక్తులకు సద్గతిని ప్రసాదించే పద్మములవంటి చరణములు కలవాడును, శరత్కాల చంద్రుని సుందరమైన చంద్రకళను శిరస్సున ధరించినవాడును, సద్గురువైన గురుగుహునిచే స్తుతింపబడే పాదములు కలవాడును, సత్యజ్ఞానానంద స్వరూపుడును, సనకాది మహర్షుల సంశయములను తొలగించి వారికి పరతత్త్వజ్ఞానమును ప్రసాదించేవాడును, చిదానందమయమైన హృదయమునందు నివసించేవాడును అయిన కైలాసనాథునిచే నేను సంరక్షింపబడుచున్నాను.

కాంభోజి రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితులవారి కృతిని రాధాజయలక్ష్మి గార్లు ఆలపించారు.   


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కైలాసనాథేన సంరక్షితోऽహం - ముత్తుస్వామి దీక్షితులవారి కృతి

కైలాసనాథేన సంరక్షితోऽహం కైవల్యప్రద నిపుణతరేణ శ్రీ కైలాసగిరి విహారేణ శైలరాజాత్మజా మోహాకారేణ సద్గతి దాయకాంభోజచరణేన చారుశరచ్చంద్రకలాధరేణ సద్గుర...