బృహదీశ్వరాయ నమస్తే శ్రీబ్రహ్మానందాయ బలేశ్వరాయ
బృహన్నాయకీ మనోల్లాసాయ భాసమాన చర్మాంబరధరాయ
బృహదీశ్వరునకు, పరబ్రహ్మానంద స్వరూపునకు, అపారమైన బలసంపన్నుడైన ఈశ్వరునకు నా నమస్కారములు. బృహన్నాయికాదేవి మనస్సుకు ఆనందమును కలిగించువానికి, ప్రకాశవంతమైన చర్మమును వస్త్రముగా ధరించినవానికి, సుందరమైన చంద్రకళను శిరస్సున ధరించినవానికి, శ్రేష్ఠమైనవానికి, మనోహరమైన చిరునవ్వుతోను కమలములవంటి పాదములతోను శోభించువానికి, సమస్త చరాచర ప్రపంచమే తన స్వరూపముగా కలిగినవానికి, సద్గురువైన గురుగుహునితో (సుబ్రహ్మణ్యస్వామితో) కూడియున్న సదాశివునకు, కరుణారసముతో నిండియున్నవానికి, కైవల్యమును (మోక్షమును) ప్రసాదించువానికి, తంజావూరు క్షేత్రమునకు అధిపతియైనవానికి, ఇంద్రుడు మొదలైన దేవతలచే వందింపబడువానికి, అరుణవర్ణముతో ప్రకాశించు దివ్యమైన స్వరూపము కలిగిన శ్రీ బృహదీశ్వరునకు నా నమస్కారములు.
శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని మల్లాది సోదరులు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి