27, నవంబర్ 2026, శుక్రవారం

దక్షిణామూర్తే విదళిత దాసార్తే - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి


దక్షిణామూర్తే విదళిత దాసార్తే చిదానందపూర్తే సదామౌనకీర్తే

అక్షయసువర్ణవటవృక్షమూలస్థితే రక్ష మాం సనకాదిరాజయోగిస్తుతే
రక్షితసద్భక్తే శిక్షితదుర్యుక్తే అక్షరానురక్తే అవిద్యావిరక్తే

నిఖిలసంశయహరణనిపుణతరయుక్తే నిర్వికల్పసమాధినిద్రాప్రసక్తే
అఖండైకరసపూర్ణారూఢశక్తే అపరోక్షనిత్యబోధానందముక్తే
సుఖతరప్రవృత్తే స్వాజ్ఞాననివృత్తే స్వగురుగుహోత్పత్తే స్వానుభోగతృప్తే

ఓ దక్షిణామూర్తీ! ఆశ్రయించిన భక్తుల ఆర్తిని తొలగించువాడా! చిదానందముతో పరిపూర్ణుడవైనవాడా! నిరంతర మౌనముచే ప్రసిద్ధి పొందినవాడా! నాశనములేని సువర్ణ వటవృక్షము క్రింద ఆసీనుడవైనవాడా! సనకాది మహాయోగులచే స్తుతింపబడువాడా! నన్ను రక్షించుము. సద్భక్తులను రక్షించువాడా! దుర్యుక్తులను శిక్షించువాడా! నాశనములేని పరబ్రహ్మతత్త్వమునందు అనురక్తి కలవాడా! అవిద్యకు అతీతుడవైనవాడా! సమస్త సందేహములను తొలగించుటలో అత్యంత నిపుణుడవైనవాడా! నిర్వికల్ప సమాధి స్థితిలో నిమగ్నుడవైనవాడా! అఖండమైన అద్వైతానందరసముతో పరిపూర్ణమైన శక్తిని కలిగినవాడా! ప్రత్యక్ష ఆత్మానుభూతితో కూడిన నిత్యజ్ఞానానందమయుడవై, సమస్త బంధముల నుండి విముక్తుడవైనవాడా! పరమానందమయమైన స్వభావము కలవాడా! ఆత్మస్వరూపమును గూర్చిన అజ్ఞానము తొలగినవాడా! గురుగుహుని (సుబ్రహ్మణ్యస్వామిని) ఉద్భవింపజేసినవాడా! స్వీయ ఆత్మానందానుభవములో పరిపూర్ణ తృప్తిని పొందినవాడా! ఓ శ్రీదక్షిణామూర్తీ! నన్ను రక్షించుము.

శంకరాభరణం రాగంలో స్వరపరచబడిన ఈ ముత్తుస్వామి దీక్షితుల వారి కృతిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గోకర్ణేశ్వర పాహిపాహి మాం - ముత్తుస్వామి దీక్షితుల వారి కృతి

గోకర్ణేశ్వర పాహిపాహి మాం గోత్రభిదాదిపూజితమూర్తే సుకీర్తే శ్రీకంబుహేమగిరికార్ముకధర శ్రీపతిశరధరణీధర పురహర శోకహర హరశుభనికరాకర కోకనదపద గురుగుహాక...