మా శ్రీరామచంద్రునికి జయమంగళం! నిత్య శుభమంగళం! శ్రీమహాలక్ష్మికి పతియైన మాధవునికి మంగళం! తనను నిజమైన భక్తితో సేవించే దాసులను రక్షించేవానికి, ఆద్యంతములు లేని నిత్యస్వరూపునికి మంగళం! బ్రహ్మదేవుడు, రుద్రుడు స్తుతించేవానికి, గోవర్ధన పర్వతాన్ని ధరించినవానికి మంగళం! నిత్యమైనవానికి, సత్యస్వరూపుడైనవానికి, సమస్త దోషములకు అతీతమైన నిర్మలస్వరూపునికి మంగళం! సూర్యవంశానికి తిలకమై వెలసినవానికి, అసమానమైన ధైర్యపరాక్రమాలు కలిగిన ధీరునికి మంగళం! రాజులందరికీ రాజైన రాజాధిరాజునికి, కోటి సూర్యులతో సమానమైన దివ్యతేజస్సుతో ప్రకాశించేవానికి మంగళం! త్యాగరాజస్వామిచే స్తుతింపబడేవానికి, అమూల్యమైన రత్నము వంటి శ్రీరామునికి జయమంగళం! నిత్య శుభమంగళం!
మోహన రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని మంగళంపల్లి బాలమురాళీకృష్ణ గారు ఆలపించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి