5, నవంబర్ 2026, గురువారం

పతికి మంగళ హారతిరే - త్యాగరాజస్వామి కృతి


పతికి మంగళ హారతిరే భామలార నేడు సాకేత

మతికి సొంపు కలుగ జేయు సద్గుణ తతికి మానవతి సీతా

కామాది రిపు విదారికి హరికి సామాది నిగమచారికి సూర్య
సోమాక్షునికి త్యాగరాజ ప్రేమావతారునికి కోసల

ఓ స్త్రీలారా! నేడు సాకేతపురానికి ప్రభువైన శ్రీరామచంద్రునికి మంగళహారతులు ఇవ్వండి! మనస్సుకు ఆనందాన్ని కలిగించే సద్గుణ సమూహము కలిగినవానికి, మానవతియైన సీతాదేవికి పతియైనవానికి మంగళహారతులు ఇవ్వండి! కామము మొదలైన అరిషడ్వర్గములను నశింపజేసేవానికి, సమస్త పాపములను హరించే శ్రీహరికి మంగళహారతులు ఇవ్వండి! సామవేదము మొదలైన వేదములచే ప్రతిపాదింపబడే పరమాత్మునికి, సూర్యచంద్రులను తన నేత్రములుగా కలిగిన విశ్వరూపునికి, త్యాగరాజస్వామి ప్రేమకు అవతారమై వెలసిన కోసలదేశాధీశుడైన శ్రీరామచంద్రునికి మంగళహారతులు ఇవ్వండి!

ఆరభి రాగంలో స్వరపరచబడిన ఈ త్యాగరాజస్వామి కృతిని సౌమ్య గారు ఆలపించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పతికి మంగళ హారతిరే - త్యాగరాజస్వామి కృతి

పతికి మంగళ హారతిరే భామలార నేడు సాకేత మతికి సొంపు కలుగ జేయు సద్గుణ తతికి మానవతి సీతా కామాది రిపు విదారికి హరికి సామాది నిగమచారికి సూర్య సోమాక...