నదులకు కవిత్వానికి ఏదో అవినాభావ సంబంధం. వేటూరి వారు 'కృష్ణా తరంగాల సారంగరాగాలు' అంటూ మూడు దశాబ్దాల కింద శంకరభారణంలో, 'ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి' అంటూ ఇటీవల గోదావరిలో, రెండు దశాబ్దాల ముందు ఆరుద్ర గారు 'వేదంలా ఘోషించే గోదావరి అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి' అంటూ ఆంధ్రకేసరి చిత్రంలో మనకు అందుబాటులో ఉండేటట్లు చక్కని గీతాల్ని అందించారు. సాహిత్యము, చారిత్రిక కట్టడాలు, పుణ్యక్షేత్రాలు వాటి పోషకులు నదీ పరీవాహక ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి అనటానికి ఎన్నో తార్కాణాలు. విజయనగర సామ్రాజ్యము, చోళులు, పాండ్యులు, మహా వాగ్గేయకారులు, రెడ్డి రాజులు, వెంగీరాజులు, అమరావతి కథలు - ఇలా చెప్పుకుంటూ పోతే అనంతమైన చిట్టా నదీనదాలను అల్లుకుని. మరి ఇంత అద్భుతమైన చరిత్ర గలిగిన నదులు మనరాష్ట్రం గుండా ప్రవహిస్తూ ఉంటే వాటికి సంబంధించిన కథలు, గాథలు ఎన్నో.
ఇక రంగంలోకి దూకుదామా?. నాలుగేళ్ల క్రితం వానలు మొదలయ్యిన ఒక నెలకు మా టీం లో ఉన్న ఔత్సాహికులు పోలవరం ప్రాజెక్ట్ వస్తే పాపికొండలు మునిగి పోతాయి అని, పాపికొండలు చూద్దాం ప్రసాద్ గారు అంటే, వెంటనే నాలుగు కుటుంబాలతో ఒక ప్రణాళిక వేసాము. గోదావరి ఎక్ష్ప్రెస్స్ రైలెక్కి రాజమండ్రిలో అర్థరాత్రి దిగాము. అక్కడ అక్షయ హోటల్లో ఏసీ రూమ్స్ ముందే బుక్ చేసుకుని దిగాము. కాసేపు పడుకొని ఉదయం ఫలహారం చేసి పాపికొండల యాత్ర కోసం టికెట్ బుక్ చేసాము. పాపికొండల యాత్రకు వెళ్లే మోటర్ పడవలు పట్టిసీమ నుంచి బయలుదేరుతాయి. బోటులో ఆట, పాట, ఆహారం, పానీయాలు, అల్పాహారాలు అన్ని ఆంధ్ర ప్రదేశ్ టూరిజం వాళ్ళదే. చిరుతిళ్ళు కొనుక్కోవటానికి వసతి కూడా ఏర్పాటు చేసారు.
దాదాపు 50 మంది పట్టే మోటర్ బోటులో బయల్దేరాము. పట్టిసీమలో వీరేశ్వరుడి దేవస్థానం చాలా పురాతనమైనది. నది మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. ఈ ఒడ్డు నుంచి ఈ దేవస్థానంకి వెళ్ళాలంటే పడవనుంచి ఒక కిలోమీటర్ దూరం ఇసుకలో నడవాలి. నీళ్ళు బాగా ఉంటే దూరం తగ్గొచ్చు. తప్పకుండా చూడాల్సిన దేవస్థానం కాబట్టి బద్ధకంగా పడవలో కూర్చోకుండా దిగి నడిస్తే మీకు అర్థం అవుతుంది ఆ అనుభూతి ఎంత బావుంటుందో. స్వాతిముత్యం చిత్రంలో సువ్వి సువ్వి పాట ఇక్కడ చిత్రీకరించిందే.
బోటు ప్రయాణంలో మొదటి ఆసక్తి కరమైన అంశం పోలవరం ప్రాజెక్ట్ మొదలు, చివరలు. అది దాటినా తర్వాత నది మధ్యలో ఒక చిన్న గుడి కనిపిస్తుంది. వరదలు వచ్చినప్పుడు ఈ గుడి మునుగుతుందని బోటు డ్రైవర్ చెప్పాడు. తర్వాత దేవీపట్నం మలుపు చాలా బాగుంటుంది. అక్కడ నది పూర్తిగా ౯౦ డిగ్రీలు మలుపు తిరుగుతుంది. ఈ మలుపు దగ్గర నదిలో సుడిగుండం ఉంది. అందుకని బోటు ఒడ్డుకు దగ్గరగా, వీలైనంత మెల్లగా వెళ్తుంది. ఇక్కడ నది ఒడ్డునే ఉన్న పోచమ్మ చాలా మహిమగలదని నానుడి. ఈ మలుపు తర్వాత ఇక అసలు పాపికొండల యాత్రకు నాంది.
ఇరుపక్కల ఇసుక తిన్నెలు, పచ్చని చెట్లతో నిండిన పర్వతాలు, అక్కడక్కడ కనిపించే ఆదివాసీలు. పూర్తిగా నిశ్శబ్దంగా సిటీ రణగొణ ధ్వనికి దూరంగా ప్రకృతిమాత ఒడిలో ఉండే వారిజీవితం ఎంత నిరాడంబరమో. నదిలో చేపలు పడుతూ, చిన్న చిన్న పడవలలో అటు ఇటు వస్తువులు చేర వేసుకుంటూ, పాటలు పాడుకుంటూ చీకు చింత లేకుండా ఉన్నారా వారు అనిపించింది. శంకరాభరణం చిత్రంలో సా రి గ రీ గ ప దా పా స రి గ ప దా ప గ రీ రి గ ప ద సా నీ దా పా గ ప ద ప ద ప...అనే సన్నివేశం/పాటలో శంకర శాస్త్రి నదిలో పాడుతూ, పిల్ల చేత పాడిస్తూ, తర్వాత తులసి పాత్రలో మంజు భార్గవి ఇసుక మీద నాట్యం చేసే సన్నివేశం చిత్రీకరించిన ప్రాంతం, మేఘ సందేశం చిత్రంలో 'ప్రియే చారుశీలే' లాంటి పాటలు చిత్రీకరించిన ప్రాంతం ఈ ప్రయాణం మొదటి భాగంలో కనిపిస్తాయి. మనస్సు, కళ్ళు అలా సమ్మోహితమై చూస్తూనే ఉంటాయి ఈ యాత్రలో ప్రకృతి అందాలను.
పచ్చదనం, ఇంకా మానవుడి ఆక్రమణ, అరాచకానికి గురి కానీ ప్రాంతాలు, అడవులు నదికి రెండు వైపులా. అక్కడక్క ఎప్పుడో ఋషులో/యోగులో మునులో ఇక్కడ తపస్సు చేసారా అనే ఆనవాళ్ళు కనిపిస్తాయి. 4 గంటల పాటు సాగే యాత్రలో ముందుకు వెళ్తున్న కొద్దీ నది ప్రవాహం పెరుగుతుంది. వెడల్పు తగ్గి గోదావరి ఉగ్ర రూపము కదల లేక కదుల్తున్న పడవ అనిపిస్తే ఇక పాపికొండలు దగ్గర పడ్డట్టే. ఇక్కడ కొండల ఎత్తు ఎక్కువ, లోయ వెడల్పు తక్కువ కాబట్టి నది వేగంగా ప్రవహిస్తుంది.
బోట్లో కూర్చొని గల గల లాడే గోదావరిని తాకటానికి నేను నా భార్య విశ్వప్రయత్నం చేసాము. అక్కడక్కడ సఫలం అయ్యాము. స్వచమైన గోదావరి నీళ్ళు అలా శరీరాన్ని తాకుతుంటే ఆ అనుభవం వర్ణించలేనిది. ఈ ప్రయాణమంతా మమ్మల్ని మేము మర్చిపోయి, మంత్రముగ్ధులయ్యాము. అక్కడక్కడ నదిలో కలిసే ఉపనదులు, ఏరులు, వాగులు, కాలువలు మహాద్భుతంగా ఉంటాయి. మధ్యలో వాన మొదలయ్యింది. చినుకులు, సూర్య కిరణాలు, ఇంద్ర ధనుస్సు, వేడి, చల్ల గాలి, పులకించి నాట్యమాడే ప్రకృతి, మా మనసులు ఉప్పొంగి పొయ్యాయి.
పాపికొండల దగ్గరకు వచ్చేసరికి మధ్యాహ్నం ఒంటి గంట అయ్యింది. ఆ ప్రాంతంలో భోజనం పెట్టాడు టూర్ గైడ్. మంచి కారం కారంగా శాఖాహార భోజనం వేడి వేడిగా. భోజనం అయ్యేసరికి చివరి మజిలీ పేరంటాళ్ళ పల్లె వచ్చేసింది. ఇక్కడినుంచి భద్రాచలం ఇంకొక 7 - 8 గంటల ప్రయాణం. అక్కడ బోటు ఆపి ఒక కొండ మీద ఆశ్రమం, గుడి చూడమన్నారు. ఆ ఆశ్రమంలో రామకృష్ణ పరమహంస తపస్సు చేసారుట. అక్కడ ప్రకృతి ప్రశాంతత, సౌందర్యం చూస్తే అర్థం అవుతుంది రామకృష్ణులు ఎందుకు ఎంచుకున్నారో ఆ ప్రదేశాన్ని. అక్కడ గిరిజనులు తయారు చేసిన వెదురు వస్తువులు అద్భుతమైన నైపుణ్యంతో చేసిన కళాఖండాలు చాలా తక్కువ ధరకు అమ్ముతారు. ఆ ఆశ్రమము, గుళ్ళు చూసుకొని తిరుగు ప్రయాణం రాజమహేన్ద్రవరానికి మొదలు మధ్యాహ్నం మూడింటికి. మళ్ళా ప్రకృతి సౌందర్యం ఆస్వాదిస్తూ, చూసినవి గుర్తు చేసుకుంటూ పట్టిసీమ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో చేరాము. నా జీవితంలో మర్చిపోలేని యాత్ర, అనుభూతి ఈ పాపికొండల షికారు యాత్ర.
15, జులై 2010, గురువారం
నెంబర్ ౨ సైనా నెహ్వాల్
రాజీవ్ ఖేల్ రత్న, ద్రోణాచార్య, పద్మశ్రీ - మూడు అవార్డులనూ పొందిన ఏకైక భారతీయ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్. ఈ మూడు భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాకరమైన పురస్కారాలు. 2001 లో అల్ ఇంగ్లాండ్ బాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్న గోపీచంద్ తర్వాత హైదరాబాద్లో గోపీచంద్ అకాడెమీని స్థాపించి అంతర్జాతీయ టోర్నీలలో పోటి చేసి గెలవగల సత్తా ఉన్న క్రీడాకారుల్ని అందజేస్తున్నాడు ఈ దేశానికి. ఆ యువ ద్రోణాచార్యుడి చేతిలో తర్ఫీదు పొందిన షటిల్ బాడ్మింటన్ వనితా కిశోరం సైనా నెహ్వాల్.
బాడ్మింటన్లో ఇవ్వాళ్ల ప్రపంచంలో రెండో ర్యాంకు ఈ హైదరాబాది అమ్మాయిది. ఇదేమి సులభం కాదు. గురువు, శిష్యురాలి కఠిన, కఠోర శ్రమ ఫలితం మన సైనా ఈ అగ్ర స్థానంలో ఉండటానికి కారణం. క్రికెట్ తప్ప వేరే ఏ క్రీడను ఆదరించని, అభిమానించని ఈ భారత దేశంలో మనందరికీ గర్వ కారణమైన సైనాకు మంచి భవిష్యత్తు ఉంది. సానియాలా కాకుండా ఈ అమ్మాయి తన ఆట మీద, శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టి, మీడియా దృష్టికి చెదరకుండా ఆటను నిలుపుకొని ముందుకు వెళ్తోంది. గోపీచంద్ గారికి, సైనాకు మా శుభాకాంక్షలు. ఆట బాగుంటే నెంబర్ 1 చేరుకోవటం కష్టమేమి కాదు. కానీ చేరిన స్థానాన్ని నిలుపుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని సుదీర్ఘమైన కెరీర్ నిర్మించటం అతి కష్టమైనది. సైనా ఈ దిశలో ఆలోచించి ముందడుగు వేయాలని ఆశిస్తూ, ఒక్క సచిన్ టెండూల్కర్ కే కాదు సైనా లాంటి మంచి ఆటగాళ్లకు కూడా సరైన గుర్తింపు, గౌరవము, ప్రతిఫలము ప్రభుత్వం ఇవ్వాలని నా విన్నపం.
సైనా కెరీర్లో కొన్ని మైలు రాళ్ళు:

- ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
- ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ టైటిల్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
- మూడు వరుస సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2009 -2010 )
అత్రి మహర్షి, అనసూయ మాత - దత్తాత్రేయ జననం
| గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మా తస్మైః శ్రీ గురవే నమః||
పతివ్రతల్లో అగ్రగణ్యురాలు అత్రి మహర్షి పత్ని అనసూయ మాత. అత్రి అంటే త్రిగుణాలను జయించిన వాడు అని (సత్వరజస్తమో గుణములు), అనసూయ అంటే అసూయ లేనిది అని అర్థం. అత్రి సప్తర్షులలో ఒకడు, బ్రహ్మ పుత్రుడు. కర్దమ ప్రజాపతి, దేవహూతిలకు పుట్టిన పుత్రిక అనసూయ. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారు శ్రీ గురుచరిత్ర ప్రవచనంలో ఈ అనసూయ మాత గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పారు.ఆయన ప్రవచనంనుంచి ఈ ఆదర్శ దంపతులు, దత్తాత్రేయ జననం గురించి వివరం.
రామాయణంలో అత్రి, అనసూయల ప్రస్తావన వస్తుంది. ఆవిడ పండు ముసలి ఆ యుగంలో. సీతారాములు అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు అత్రి మహర్షి ఈవిడ ఒక్క మానవుల చేతనే కాదు సమస్త లోకములకు వంద్యురాలు అని పరిచయం చేస్తాడు సీతమ్మకు. ఆవిడ ఎంత గొప్పదో దీన్ని బట్టి తెలుస్తుంది. అనసూయలాగా అసూయ లేకుండా ఉండాలంటే 1 . నీకన్న పైనున్న వారి గుణములను గుర్తించి, అంగీకరించి నలుగురి ముంది స్తుతించటం, వారిలా నేను అయితే బాఉండు అని అనుకోవటం 2 . మీకన్నా కింద ఉన్నవారిని అయ్యో వీరి దుర్గుణములు పోగొట్టుకొని ఉన్నత స్థానాన్ని ఎప్పుడు పొందుతారో అని అనుకోవటం. అనసూయ సమస్త జగమును ప్రేమించటం తప్ప ఎన్నడు దూషణ, అసూయ లేకుండా చూసింది. అలా త్రిగుణాలకు అతీతుడైన అత్రి, ప్రేమ తత్వ రూపమైన అనసూయల దాంపత్యం అనుపమానం, అపూర్వం.
ఆ అనసూయమ్మ మహా పతివ్రత అయ్యింది. మహా పతివ్రత ఎలా అయ్యింది?. దోషం లేని భర్తను అనుసరించి. ఆ తల్లికున్న గొప్పతనం ఏంటంటే - వివాహమయ్యిన క్షణం నుంచి భర్తను అనుగమించటం, భర్త మాటను ధర్మంగా పాటించటం. అలా ఉంది నా భార్య అని అత్రి సీతమ్మకు చెప్తాడు. ఒడిలి, ఒంగి, పండు అరిటాకులా ఉన్న అనసూయమ్మ సీతను ఆశీర్వదించి - నీవు భాగ్యవంతురాలివి తల్లి - అంటుంది. సీతమ్మ వెంటనే చిరునవ్వుతో 'అవునమ్మ నాకన్నా భాగ్యవంతురాలు లేదు' అంటుంది. 'భోగ భాగ్యాలు, సుఖాలు, కన్నవారిని వదిలి భర్త, భర్త మాటయే పరమావధిగా తలచి కానలకు వచ్చావు తల్లి' అని శ్లాఘిస్తుంది అనసూయ సీతమ్మను. సీత రాములకు అత్రి, అనసూయల దర్శనంతో అయోధ్య కాండను ముగిస్తాడు వాల్మీకి.
'అనసూయ పాతివ్రత్యం ఎలాంటిది అంటే - మహా క్షామం పదేళ్ళపాటు వచ్చింది ప్రపంచంలో. అప్పుడు అనసూయమ్మ నన్ను అనుగమించిన పాతివ్రత్యంతో గంగానదిని ప్రవహింపచేసింది. చెట్టు, పుట్ట, చేమ, ప్రాణి కోటిని రక్షించింది' - అని సీతమ్మకు చెప్తాడు అత్రి. 'భర్తను అనుగమించి వచ్చావు సీతమ్మ' అని ఎంతో ఆనంద పడుతుంది అనసూయమ్మ. అప్పుడు సీతమ్మ 'అమ్మా! నా వివాహ సమయంలో ఈ విషయాన్నే నా తల్లి నాకు చెప్పింది. భర్త మాటయే ఆచారము. ఎప్పుడు నన్నే మనమున ఉంచి, సదాచార సంపన్నుడై, ధర్మ రక్షకుడైన భర్త ఈ రామయ్య. ఆయనను నేను అనుగమించటంలో గొప్పతనం ఏముందమ్మ' అని అంటుంది సీతమ్మ. అనసూయ సీతతో ఇలా అంటుంది - 'సభర్త్రుకస్య సహధర్మచారిణి - ఎప్పుడు భర్తను అనుసరించి ఆయన చెప్పినట్టు చేయడమే నీకు గొప్ప ధర్మము. అలా ఉండటం వల్ల కీర్తి, ధర్మము సంపూర్ణమవుతాయి'. అలా రామాయణంలో స్త్రీ ధర్మాన్ని బోధించిన మహా పతివ్రత అనసూయ. భర్త అనుమతితో పదివేల సంవత్సరాలు తపస్సు చేసిన మహాతల్లి. భర్తచే పొగడబడి, భర్త అనురాగము చూరగొన్న స్త్రీ ఈ మహా పతివ్రత అనసూయ.
ఆ అనసూయను త్రిమూర్తులు శ్లాఘించి 'అమ్మా! నువ్వు లోకానికి ఇంత మేలు చేసావు. నీకు మేము ఏమి ఇవ్వగలం?' అని అడుగుతారు. అప్పుడు ఆ తల్లి 'అమ్మా అని పిలిచారు కదా, అలాగే నా కడుపునా బిడ్డగా పుట్టండి' అని అడుగుతుంది. 'అంతకన్నా మా భాగ్యమేంటి తల్లి' అని ఆ బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు ఆశీర్వదిస్తారు అనసూయను. అత్రి మహర్షి కూడా తపస్సు చేస్తే బ్రహ్మ సంతోషించి 'త్రిమూర్త్యాత్మకం గా మీకు పుత్రుడు జన్మిస్తాడు' అని వరమిస్తాడు.
ఒకసారి ముగ్గురు అమ్మలకు (గౌరీ, సరస్వతి, లక్ష్మి) ఈవిడ పాతివ్రత్యాన్ని పరీక్షించాలని అనిపించింది. వెంటనే తమ పతులకు ఆ పరీక్ష పెట్టాలని చెప్తారు. వెంటనే ముగ్గురు మూర్తులు అత్రి మహర్షి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం కోరారు. 'స్నానాచామనాలు చేసి భోజనం చెయ్యండి' అని కోరుతాడు అత్రి. అప్పుడు త్రిమూర్తులు అత్రితో 'మా నియమం భోజనం చేసేటప్పుడు యజమానురాలు నగ్నయై వడ్డించాలి' అంటారు. ఆశ్చర్యపడి అత్రి ఆ విషయాన్ని అనసూయకు చెపుతాడు. అప్పుడు ఆ పతివ్రత భర్తతో 'స్వామీ అలాగే. మీ మర్యాద పోనివ్వను' అంటుంది. అప్పుడు ఆమె ఆలోచించి, భర్త పాదాలకు నమస్కరించి - 'మనసా వాచా కర్మణా అత్రి మహర్షి ఆజ్ఞను దాటని దాననైతే వీరు ముగ్గురు శిశువులు అవుదురు గాకా' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వెంటనే త్రిమూర్తులు పసిపిల్లలుగా మారుతారు. వెంటనే నగ్నయై వడ్డిస్తుంది వారికి. వారి భుజించిన తర్వాత మళ్ళీ సవస్త్రయై వచ్చి 'నేను అత్రి మహర్షి మాటను శిరసావహించిన దాననయితే మీరు పూర్వ స్థితిని పొందుదురు గాక' అని మంత్రాక్షతలు చల్లుతుంది. వారు పూర్వ స్థితిని పొందుతారు. అప్పుడు ఆవిడకు ఆలోచన వస్తుంది - వీరిని కడుపున పుట్టకుండానే నా బిడ్డలగా చేస్తాను అని మళ్ళీ భర్తను స్మరించి పసిపిల్లల్లా మార్చి ఊయలలో ఊపింది అనసూయమ్మ. ఇక ఆ అనసూయమ్మ అనుమతిస్తే తప్ప త్రిమూర్తులు తమ తమ విధులు నిర్వర్తించలేరు. ఈ విషయాన్ని చూసిన ముగ్గురు అమ్మలు సిగ్గుపడి అనసూయ వద్దకు వచ్చి 'మా భర్తలకు పూర్వ రూపాన్ని ప్రసాదించు తల్లి' అని ప్రార్థిస్తారు. ఆ అనసూయ వెంటనే త్రిమూర్తులకు పూర్వ రూపాన్ని కలిగిస్తుంది. అప్పుడు ఆ బ్రహ్మవిష్ణుమహేశ్వరులు 'అమ్మా అనసూయ మాతా! నీ కడుపున పుట్టి నీ పాలు తాగి బిడ్డలుగా పెరగాలని ఉందమ్మా!' అని అడుగుతారు. 'తప్పకుండ మీరు మాకు బిడ్డలుగా వచ్చెదరు గాక' అని సంకల్పం చేస్తుంది ఆ తల్లి. అదే సమయానికి దేవతలు పరిగెత్తుకుంటూ వచ్చి అత్రి మహర్షి కాళ్ళ మీద పడి - 'మహర్షీ! సూర్య చంద్రులను రాహువు తన అస్త్రముల చేత గ్రహిస్తున్నాడు. మీరే రక్షించాలి. సూర్యున్ని మిగల్చండి ఈ లోకానికి' అని ప్రార్థిస్తారు. అప్పుడు అత్రి తన తపశ్శక్తితో సూర్యునికి అక్షయ రూపాన్ని ప్రసాదిస్తాడు. ఒక్క హుంకారంతో రాక్షసులను నాశనం చేస్తాడు. అలా సూర్యచంద్రులను రక్షిస్తాడు అత్రి మహర్షి.
ఇక దత్తాత్రేయ అవతారము:
అత్రి ఆ అనసూయ మాతకు సంతానాన్ని ప్రసాదించాలని సంకల్పిస్తాడు. బ్రహ్మ అంశతో సోముడు (చంద్రుడు), శంకరుడి అంశతో దుర్వాసుడు (తమోగుణ ప్రధానుడై), పూర్ణమైన విష్ణు స్వరూపంతో, నారాయణ తేజస్సుతో (అంశంగా కాకుండా, పూర్ణ విష్ణు స్వరూపంగా) దత్తాత్రేయుడు జన్మిస్తారు. అత్రి తేజస్సుతో ఆ ఆత్రేయుడు దత్తాత్రేయుడు గా అవతరించారు. విశ్వానికి తొలి గురువయ్యాడు. సమస్త బ్రహ్మాండం నిండి నారాయణ రూపమైన ఆ దత్తాత్రేయుడు మనకు అత్రి, అనసూయల వలన లభించాడు.
| అవధూతాయ విద్మహే అత్రి పుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్ |
8, జులై 2010, గురువారం
ఎనభై ఏళ్ల బాలుడు బాలమురళి
ఆయన ముఖం చూస్తే ఏ అరవై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని ఆయన గాత్రం వింటే ఏ నలభై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. కేవలం ఆయన నవ్వునే చూస్తే ఏ ముప్ఫై ఏళ్ళు ఉంటాయో అనిపిస్తుంది. ఆయన మాట వింటే పదేళ్ళ పిల్లాడిలా కిల కిల మంటూ ఉంటుంది. ఆయన తెలుగు భాష తేనె లాగ తియ్యగా, మందాకినీ జలాల అంత స్వచ్చ్చంగా సరస్వతీ దేవి వీణాగానంలా వీనులకి హాయిగా ఉంటుంది. ఆ సంగీత సామ్రాజ్య స్వర సార్వభౌముడు ఎనభై వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వాగ్దేవి మానసపుత్రునికి నా పాదాభివందనములు. మురళీ గాన రసాస్వాదనలో మునిగి తేలుతున్న వీక్షక, ప్రేక్షక జనానీకం, రసప్రియులు, రసజ్ఞుల తరపున పద్మ విభూషణ్ డా|| మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారికి జన్మ దిన శుభాకాంక్షలు. ఆ సరస్వతీదేవి మీ నోట ఇలానే నూరు వసంతాలు పలకాలని మా ఆకాంక్ష.
'ఎందరో మహానుభావులు' అని ఘన రాగ పంచరత్న కీర్తన పాడినా, 'ఏ తీరుగ నను దయ చూసేదవో' అని రామదాసు కీర్తనలను ప్రాచుర్యంలోకి తెచ్చినా, ' 'పిబరే రామ రసం' అని భక్తి రసం ఒలికిన్చినా, 'అసమానమైన తిల్లాన మురళీగాన వినోదమైన తిల్లాన' అని తిల్లానలకు ఆది గురువుగా, 'ఏమి సేతురా లింగా' అని పామరులు పాడుకొనే తత్త్వ గీతాన్ని పాడినా, 'ఓంకార ప్రణవ' అని స్వీయ రచనలో స్తుతించినా, 'సలలిత రాగ సుధా రస సారం' అని నర్తనశాల చిత్రంలో బృహన్నల పాత్రకు జీవం పోసినా, 'మౌనమే నీ భాష ఓ మూగ మనసా' అని గుప్పెడు మనసులో ఆత్రేయ గీతానికి అత్యున్నత కీర్తి తెచ్చిపెట్టినా - ఇలా చెప్పుకుంటూ పొతే కొన్ని పేజీలు అయిన చాలవు ఆ మహానుభావుడి బహు కళా ప్రావీణ్యానికి.
శుద్ధ స్ఫటిక సంకాశంలా ఆయన కర్నాటక సంగీత ప్రవాహం, మంజుల సౌరభ మృదు కుంజంలా ఆయన సినీ నేపథ్యగానం, నటన, వాగ్గేయకారుడిగా ఎన్నో కీర్తనలు, రాగాలను సృష్టించిన ఆయన సంగీత జ్ఞానం - ఇవన్ని ఒక ఎత్తు. ఆయన పాడేటప్పుడు కనిపించే భక్తి, జ్ఞానము, లయ, కొత్త దనము, విని, చూసేవారిని సమ్మోహితుల్ని చేసే ఆయన స్వర ఝరి, వినమ్రత ఇంకొక ఎత్తు.
తెలుగు భాషను ఖూనీ చేసే ఛాందస తమిళ సంగీతకారుల ప్రవాహానికి, ధాటికి తట్టుకొని, నిలబడి, శిఖరాన్ని అధిరోహించి అక్కడ దశాబ్దాలు నిలబడగలిగిన ఏకైక సంగీతజ్ఞుడు ఆయన. సంగీతంలో ఉత్సాహాన్ని, జ్ఞానాన్ని, భక్తిని, రక్తిని, అనురక్తిని ఒకే కచేరిలో చూపించే విశిష్ట గాయకుడు బాలమురళి గారు. 25000 కు పైగా కచేరీలు, 400 కు పైగా కృతిరచనలు చేసి ఇప్పటికీ నవయవ్వనంలో ఉన్న గాయకుడిలా ఆడుతూ పాడుతూ పాడేస్తున్నారు మంగళంపల్లి.
తెలుగునాట టెలివిజన్ లేనప్పుడు రేడియోలో భక్తి గీతాలు, తత్వాలు, దాస సంప్రదాయ కీర్తనలు, లలిత గీతాలను తన గానంతో బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు. 'గాయతి వనమాలీ' అనే సదాశివ బ్రహ్మేంద్ర కృతి, 'శ్రీ కృష్ణా యను నామ మంత్రము' అనే అమర నారేయన కృతి, 'రామ రామ యనరాద' అనే రంగదాసు కృతి - ఇలా ఎన్నో ఆయన వాక్ప్రవాహంలో ప్రసిద్ధి పొందినవి.
ఆ మహనీయుడికి ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన భారత రత్న ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఆయన సంగీత ప్రవాహం ఇలానే కొనసాగాలని ప్రార్థన.

కౌసల్యా సుప్రజా రామా
వాల్మికి రామాయణం బాలకాండంలో రాసిన ఈ శ్లోకం మనకు చాలా సుపరిచితమైనది.
కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నరశార్దూల! కర్తవ్యం దైవమాహ్నికం ||
ఈ శ్లోకం యొక్క సందర్భం నాకు ఈరోజు రామాయణ పారాయణలో వచ్చింది. విశ్వామిత్రుడు యాగ సంరంక్షణ నెపంతో బాలుడైన, నూనూగు మీసాలు కూడా రాని రాముడిని భయంకర రాక్షసులైన మారీచ సుబాహులను పోరాడి చంపడానికి దశరథుడిని కోరుతాడు. పుత్ర వాత్స్యల్యము, మోహముతో ఆ మహారాజు భీతి చెంది నేను ఆ బాలుడిని పంపలేను అంటాడు. వశిష్ఠ గురువులు అప్పుడు దశరథుడికి హితబోధ చేస్తాడు. విశ్వామిత్రుడి గొప్పతనము, ఆయన శక్తి, సామర్థ్యాలు వివరంగా చెప్పి ఆయన ఉండగా ఆ రాక్షసులు రాముడికి ఏ అపాయమూ కలుగచేయలేరని ఆశ్వాసన కలిగిస్తాడు. అప్పుడు దశరథుడు రామలక్ష్మణులను విశ్వామిత్ర మహర్షితో సంతోషంగా, నిస్సందేహంగా పంపిస్తాడు.
అలా తన ఆశ్రమానికి తీసుకెళ్ళే దారిలో సరయు, గంగ నదులు దాటుతూ, కొన్ని ఆశ్రమాల, అడవుల ప్రాముఖ్యతను రామలక్ష్మణులకు తెలియజేస్తాడు విశ్వామిత్రుడు. వారికి బల, అతి బల విద్యలు నేర్పిస్తాడు. ఈ విద్యల వల్ల వారికి ఆకలిదప్పులు, దాహము, నిస్సత్తువ లాంటివి లేకుండా ఎల్లప్పుడూ శక్తివంతులై ఉంటారు. ఆ యాత్రలో నదీ తీరాన రామచంద్రుడు నిద్రపోతున్నప్పుడు, మహర్షి రాముడిని నిద్ర లేపుతూ ఈ శ్లోకం పఠిస్తాడు - " కౌసల్య తనయుడవైన ఓ రామా! సంధ్య, అగ్నిహోత్రం మొదలైన కర్తవ్యాలు నెరవేర్చాలి. మేలుకో!". అప్పటి వరకు అల్లారు ముద్దుగా రాచరికంలో పెరిగిన రామచంద్రుడికి ముందు ముందు నెరవేర్చాల్సిన, కార్యాలు, ధర్మసంరక్షణ చాలా ఉన్నాయి అని గుర్తు చేస్తూ ఈ మేలుకొలుపు. ఆ కర్తవ్యపాలనకు కావలసిన విద్యలను, అస్త్ర శస్త్రాలను ప్రసాదిస్తు వారితో ముందుకు సాగుతాడు ఆ మహర్షి.

6, జులై 2010, మంగళవారం
పెళ్లి కాని భావి భారత ప్రధాని
ఈ మధ్యనే మన యువరాజుగారు నలభై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు. రాజకీయంగా తల్లి అండదండలు, వేరే దిక్కు లేని కాంగ్రెస్ పార్టీ బాగా అయ్యగారిని అత్యున్నత పదవికి దగ్గరికి నెడుతున్నాయి. స్వయంగా మన ప్రధానమంత్రిగారే ఎన్నో సార్లు అయ్యగారు తన కుర్చీలో కూచుంటే బాగుంటుంది, ఆయనకు అర్హత ఉంది అని చాలా సార్లు చెప్పి మేడంకి తన ప్రభుభక్తిని చాటుకున్నారు. చాలామంది ఇది ఆయన వినమ్రత అని తప్పుగా అర్థం చేసుకొని ఆయనను సానుభూతితో చూస్తారు కానీ ఆయనకు ఆ ఇద్దరి భజన చెయ్యకపోతే ఒక్క రోజు కూడా గడవదు. అది అసలు విషయం.
ఇక అబ్బాయిగారు, రాజకీయంగా అన్ని ఆలోచించి తన ఇమేజ్ బాగా పెరిగే విధంగా సరైన అడుగులు వేస్తున్నట్టు కనపడుతోంది. గత లోక్ సభ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల ఎంపికలో ముఖ్య పాత్రధారి అన్న విషయం తెలిసిందే. అలాగే ఉత్తరప్రదేశ్లో అడుగంటిన కాంగ్రెస్ వోటుబ్యాంకును పెంచి 18 లోకసభ స్థానాలు గెలవటానికి కష్టపడ్డారు. మాయావతితో తలపడ్డట్టే ఉండి అవిశ్వాస తీర్మానంలో అక్కయ్య మద్దతు కోసం లోపాయకారి ఒప్పందం చేయించటంలో కూడా అబ్బాయి, మేడం పాత్ర చాలా ఉంది.
రూపం చూసి పడిపోయే భారతీయ ఓటరు అబ్బాయిగారికి పట్టం కడితే ఉబ్బి తబ్బిబ్బయిపోతాడు. ఎందుకంటే మనకు ఆ కుటుంబం తప్ప దిక్కులేదు. అందులో, ప్రతిపక్షం అధ్వాన్న స్థితిలో ఉంది. ప్రస్తుత ప్రధానిగారు వయస్సు మీరుతున్నారు. తల్లిగారేమో నాకు వద్దు ఈ కుర్చీ అని త్యాగ రాణి అయ్యారు. తను ప్రధాని అయితే తన విదేశి గతం కాంగ్రెస్ ను, తనను రాజకీయంగా దెబ్బతీస్తుంది అని బాగా అర్థం అయ్యి మేడం అబ్బాయిగారిని ముందుకు నెట్టారు. తన తండ్రిలా ఒకేసారి ప్రధాన మంత్రి అవ్వకుండా అబ్బాయిగారు ఒక్కోమెట్టు ఎదుగుతున్నట్టు మనకు సినిమా చూపిస్తున్నారు. ఆయన ఇప్పటికే రెండోసారి ఎంపీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి. అలాగే బుందేల్ఖండ్, అమేథీ ప్రాంతాల మనోభావాలను, వెనుకుబాటుతనాన్ని ఉదహరించే పాత్రలో మంచి పావులు కదుపుతున్నారు.
యువతకు మార్గదర్శిగా, వారిని రాజకీయాల్లోకి రావాలని ఉత్తేజపరుస్తూ, అప్పుడప్పుడు కాలేజీలు, స్కూళ్ళకు వెళుతూ తను వారికి ప్రతినిధిగా, ప్రతిబింబంగా ఒక ఇమేజ్ చాలా జాగ్రత్తగా నిర్మిస్తున్నాడు ఈ యువరాజు. పేద ప్రజలతో ఫోటోలు, గ్రామాలకు వెళ్లి గుడిసెల్లో భోజనం చెయ్యటం, వారితో కాసేపు గడిపి ఆ వూరి ప్రజలను సమ్మోహితులను చెయ్యటం ఆయనకు నాయనమ్మ, తండ్రి దగ్గరనుంచి బాగా అబ్బింది. ఈ విద్యలో మన కాంగ్రెస్ నాయకులను మించిన వాళ్లు లేరు. ఉభయ భాష పరిజ్ఞానము (హిందీ, ఇంగ్లీష్), స్ఫురద్రూపము, అన్నిటికి మించి అత్యంత శక్తివంతమైన పరంపర, పార్టీ ఆయన వెంట ఉన్నాయి. ఆయనకు పార్టీలో ఎదురు లేదు. ఎదురు ఉండే అవకాశము లేదు. గత ఎన్నికల్లో పార్టీకి 206 సీట్లు రావటం ఆయన చలవే అని మీడియా మనల్ని ఇప్పటికే నమ్మించేసాయి. జరిగింది కూడా అదేనేమో. 2014 ఎన్నికల్లో (వీలయితే ఈలోపే) అబ్బాయిగారు ప్రధాని అవ్వటానికి అన్ని విధాలుగా పరిస్థితులను ఏర్పరుస్తున్నారు మేడం. ఆయనలాగా ఆలోచించి ఆయనకు తోడు నీడగా ఉండే రెండోతరం నాయకులు ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో మంత్రులుగా పని చేస్తున్నారు. పాతనీరు ఇంకొక 2 -3 ఏళ్ళల్లో తెరవెనకకు వెళ్లే అవకాశం ఉంది.
ఆ పార్టీలో గత్యంతరం అయ్యి, ఆ కుటుంబం వద్దు అనుకుంటే తప్ప వేరే వాళ్లకు అగ్రతాంబూలం దక్కే అవకాశం లేదు. కాబట్టి అబ్బాయిగారికి గ్రహాలూ,దారులు అన్ని రేస్ కోర్సు రోడ్ వైపు చూపిస్తున్నట్టే. పార్టీ మంచి పరిస్థితిలోనే ఉంది. ఎన్నికలు బానే గెలుస్తున్నారు, దేశం అంతో ఇంతో ముందుకు వెళ్తోంది, ప్రతిపక్షం దీనావస్థలో ఉంది, రాజకీయ దురంధరులు ఏఐసీసీ కోర్ కమిటీ సభ్యులు, మేడంకు రాజకీయ సలహాదారులు, వ్యాపార అగ్రగాములు ఆమెకు వెన్నంటి ఉన్నారు. ఇవన్ని అబ్బాయిగారి పట్టాభిషేకానికి మంచి శుభసూచకాలు. అదును చూసి భీష్మాచార్యుల్ని రిటైర్ చేయించి ఏ రాష్ట్రపతి పదవో ఇచ్చేస్తే, మన అబ్బాయిగారి రాజ్యాభిషేకం జరపవచ్చు.
ఈ మధ్యనే మన సారథి ధోని కూడా మూడు ముళ్ళు వేసేశాడు. అయ్యా మరి, మీరుకూడా ఆ పనేదో కానిచ్చి మాకు భావి ప్రధాన మంత్రిని, కాంగ్రెస్ పార్టీ అధినేతను ఇవ్వాలి కదా?. ఇస్తే నాయనమ్మ వానప్రస్థానికి వెళ్ళొచ్చు. చెల్లెలి పిల్లకు కూడా ఉన్నారు కానీ ఎంతైనా మీ రక్తం మీదే కదా. తొందరగా మాకు నాయకత్వ వారసత్వాన్ని ఇస్తే మేము ఇప్పటినుంచే వారి భజన, పూజ చేసి "నీవే తప్ప ఇతః పరంబెరుగ సంరక్షించు భద్రాత్మకా" అని గజేంద్రుడు శ్రీ మహావిష్ణువుని వేడుకున్నట్టు వేడుకొని వారి పాదాక్రాన్తులమై ఇంకొన్ని వందల ఏళ్ళు మీ వంశాభివృద్ధికి పాటు పడతాము.
లలితా సహస్ర నామాలు మొదలయ్యేది - 'శ్రీ మాతా శ్రీ మహారాజ్ఞీ' తో. అలా మాకు రాజమాత, పెద్దదిక్కు అయిన మేడం త్వరగా పుత్రుడికి వివాహం చేస్తారని ఆశిస్తూ...

5, జులై 2010, సోమవారం
బంద్ ఎందుకు?
ఇటీవల పెట్రో, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా భాజపా నేతృత్వంలో ఇవ్వాళ్ల భారత్ బంద్. నిరసన తెలపటానికి వేరే మాధ్యమమేమి లేదా ఈ ప్రజా నాయకులకు?.
ఇది ప్రజానాయకులకు నా బహిరంగ లేఖ:
మీకు దమ్ము, నిజాయితీ ఉంటే:
దేనికండి మీరు చేసే బంద్?. ముక్కు పచ్చలారని పసి పాప వైష్ణవిని విజయవాడలో దారుణంగా, అమానుషంగా చంపి కొలిమిలో తగలబెడితే ఏ ఒక్క నాయకుడికి పట్టలేదు. ఆ చంపిన వాళ్ళను ఎవ్వరు ఏమి చెయ్యలేకపోయారు. పార్లమెంటు దాడిలో నిందితుడైన అఫ్జల్ కు ఇంతవరకు ఉరిశిక్ష పడేట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇదేనా మీలో ఉన్న నిబద్ధత?. ఒకరోజు బంద్ చేస్తే ఎంత మంది చిన్న చితక వ్యాపారం చేసే వాళ్ళు నలిగి నష్ట పోతారో తెలుసా?. ఎంతమంది మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలవల్ల ఒకరోజు ఆదాయం కోల్పోతారో మీకు తెలుసా?.
బంద్ అనేది చట్ట వ్యతిరేకం అని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చి నెట్టి మీద మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాదు. అక్కడ నిరసనలు తెలిపేది ప్రజలు కాదు. కేవలం మీ పార్టీల నాయకులు, మీకింద పని పాట లేకుండా కూర్చునే చోటా నాయకులు. మీలో సగం మందికి అసలు దేనికి నిరసన తెలుపుతున్నారో కూడా తెలీదు.
బంద్ వల్ల జరిగే నష్టం మీకు తెలియకపోతే తెలుసుకోండి.
ప్లీజ్. ఆపండి ఈ అర్థం పర్థం లేని, అసౌకర్యము, బాధ, నష్టము కలిగించే బందులు.
ఇది ప్రజానాయకులకు నా బహిరంగ లేఖ:
మీకు దమ్ము, నిజాయితీ ఉంటే:
- ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ మరియు పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు మొదలవుతాయి. అక్కడ నిలదీయండి. ఈ నిర్ణయాన్ని పూర్తిగా ప్రభుత్వం విశదీకరించేవరకు సభను జరగనీయకండి.సహాయ నిరాకరణ చెయ్యండి సభలో. మీ మీద ప్రభుత్వ మనుగడ చాలా ఆధారపడి ఉంది. అది గుర్తుపెట్టుకొని మీ వ్యూహాన్ని వెయ్యండి.
- నెలలో ఉపఎన్నికలు ఉన్నాయి అక్కడ ఎండగట్టండి యూపీఏ విధానాలను. పత్రికల్లో రాయండి, నిర్ణయం తీసుకున్న మంత్రులు, ప్రధాన మంత్రి, సోనియా గాంధి గారింటి ముందు నిలబడి నినాదాలు చెయ్యండి, నిరాహార దీక్ష చేపట్టండి. మీ వాదనలో బలం, నిజాయితీ ఉంటే ప్రభుత్వం దిగి రావాల్సిందే.
దేనికండి మీరు చేసే బంద్?. ముక్కు పచ్చలారని పసి పాప వైష్ణవిని విజయవాడలో దారుణంగా, అమానుషంగా చంపి కొలిమిలో తగలబెడితే ఏ ఒక్క నాయకుడికి పట్టలేదు. ఆ చంపిన వాళ్ళను ఎవ్వరు ఏమి చెయ్యలేకపోయారు. పార్లమెంటు దాడిలో నిందితుడైన అఫ్జల్ కు ఇంతవరకు ఉరిశిక్ష పడేట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేకపోయారు. ఇదేనా మీలో ఉన్న నిబద్ధత?. ఒకరోజు బంద్ చేస్తే ఎంత మంది చిన్న చితక వ్యాపారం చేసే వాళ్ళు నలిగి నష్ట పోతారో తెలుసా?. ఎంతమంది మీరు తీసుకునే తప్పుడు నిర్ణయాలవల్ల ఒకరోజు ఆదాయం కోల్పోతారో మీకు తెలుసా?.
బంద్ అనేది చట్ట వ్యతిరేకం అని దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చి నెట్టి మీద మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రాదు. అక్కడ నిరసనలు తెలిపేది ప్రజలు కాదు. కేవలం మీ పార్టీల నాయకులు, మీకింద పని పాట లేకుండా కూర్చునే చోటా నాయకులు. మీలో సగం మందికి అసలు దేనికి నిరసన తెలుపుతున్నారో కూడా తెలీదు.
బంద్ వల్ల జరిగే నష్టం మీకు తెలియకపోతే తెలుసుకోండి.
- విద్యార్థులు విద్య సంవత్సరంలో ఒక అమూల్యమైన రోజు.
- రవాణా వ్యవస్థకు దెబ్బ - బస్సులు, రైళ్ళు, ఆటోల మీద ఆధారపడి రోజు పనులకు వెళ్లే వివిధ తరగతుల వాళ్లు.
- రోడ్డు పక్కన, రోడ్డు మీద, జన సమ్మర్దమైన మధ్య తరగతి ప్రాంతాల్లో ఉండే చిన్న వ్యాపారులు - కిరాణా, పాలు, పండ్లు, కూరలు, హోటల్స్ - ఇలా ఎన్నో.
- పెద్ద వ్యాపారాలకు అనుబంధంగా ఆధారపడి ఉన్న సగటు వ్యాపారులు, పని వాళ్ళు, కాంట్రాక్టు ఉద్యోగులు.
- ప్రభుత్వ కార్యాలయాల్లో పని. అసలే మనము నత్త నడక. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందం ఈ బంద్.
- అదను చూసుకొని కొన్ని ముఖ్యమైన వస్తువుల ధరలను పెంచటం వల్ల ప్రజలకు జరిగే నష్టం, ఇబ్బందులు.
- మీరు రైళ్లు, బస్సులు ఆపినందు వల్ల ఒక పనిమీద గమ్యానికి చేరాల్సిన మనిషి పని మీరు చేస్తారా?. ప్రజా జీవితాన్ని సాఫీగా నడిపే బాధ్యత మీలో లేనప్పుడు, వాళ్ళను బాధ పెట్టే హక్కు కూడా మీకు లేదు.
- రైల్వే, ఆర్టీసీ ఎమన్నా మీ అమ్మ, నాన్న వ్యక్తిగత ఆస్తా మీ ఇష్టం వచ్చినట్టు తగలబెట్టటానికి?. మీ పార్టీ ఫండ్ నుంచి ఆ నష్టాన్ని పూడుస్తారా?. మీరు చేసే నష్టం లేకపొతే అవి చాలా సమర్థవంతం గా పనిచేయ్యగల సంస్థలు.
- ఇంటర్వ్యూ కి వెళ్ళాల్సిన యువకుడికి మీ వల్ల కలిగిన ఇబ్బందివల్ల నష్టాన్నిఎవరు తీరుస్తారు?. మీ పార్టీ తరపున అతనికి ఉద్యోగం ఇప్పించగలరా?.
- ప్రాణాల కోసం వేరే ఊళ్లు వెళ్లే రోగుల బాధలు ఎవరు తీరుస్తారు?. వాళ్ల కోసం మీ పార్టీ వాళ్లు వాహనం ఏర్పాటు చెయ్యగలరా?.
- సందట్లో సడేమియా అని మోసం చేసే ఆటో వాలాల నుంచి కలిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు?. పోలీసులు కడతారా ఈ డబ్బులు?.
- మధ్యాహ్నం రెండుగంటలకు గమ్యం చేరాల్సిన రైలు రాత్రి రెండుగంటలకు చేరితే దాని వల్ల జరిగే అసౌకర్యం ఊహించగలరా?. ఒక 18 ఏళ్ళ అమ్మాయిని మీలో ఎవరైనా అర్థరాత్రి ఇలాంటి పరిస్థితిలో ఇంటికి తీసుకెళ్ళి దింపి వాళ్ల అమ్మ నాన్నలను తృప్తి పరచగలరా?.
- మీరు చేసే ధర్నా వల్ల ట్రాఫిక్ జామ్ అయి ఎంత మంది ఇబ్బంది పడతారో ఊహించగలరా?. మిమ్మల్నే ఈ పరిస్థితిలో పెట్టుకొని ఒక్కసారి ఎంత కష్టంగా ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించండి. మీకే గుండెపోటు వచ్చి ఖైరతాబాద్ జంక్షన్లో ట్రాఫిక్ ఆగిపోయి మీకు అత్యవసర సేవ అందకపోతే?. ఊహించండి.
ప్లీజ్. ఆపండి ఈ అర్థం పర్థం లేని, అసౌకర్యము, బాధ, నష్టము కలిగించే బందులు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి
వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దే...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...