బాడ్మింటన్లో ఇవ్వాళ్ల ప్రపంచంలో రెండో ర్యాంకు ఈ హైదరాబాది అమ్మాయిది. ఇదేమి సులభం కాదు. గురువు, శిష్యురాలి కఠిన, కఠోర శ్రమ ఫలితం మన సైనా ఈ అగ్ర స్థానంలో ఉండటానికి కారణం. క్రికెట్ తప్ప వేరే ఏ క్రీడను ఆదరించని, అభిమానించని ఈ భారత దేశంలో మనందరికీ గర్వ కారణమైన సైనాకు మంచి భవిష్యత్తు ఉంది. సానియాలా కాకుండా ఈ అమ్మాయి తన ఆట మీద, శరీర దారుఢ్యం మీద దృష్టి పెట్టి, మీడియా దృష్టికి చెదరకుండా ఆటను నిలుపుకొని ముందుకు వెళ్తోంది. గోపీచంద్ గారికి, సైనాకు మా శుభాకాంక్షలు. ఆట బాగుంటే నెంబర్ 1 చేరుకోవటం కష్టమేమి కాదు. కానీ చేరిన స్థానాన్ని నిలుపుకొని, సామర్థ్యాన్ని పెంచుకొని సుదీర్ఘమైన కెరీర్ నిర్మించటం అతి కష్టమైనది. సైనా ఈ దిశలో ఆలోచించి ముందడుగు వేయాలని ఆశిస్తూ, ఒక్క సచిన్ టెండూల్కర్ కే కాదు సైనా లాంటి మంచి ఆటగాళ్లకు కూడా సరైన గుర్తింపు, గౌరవము, ప్రతిఫలము ప్రభుత్వం ఇవ్వాలని నా విన్నపం.
సైనా కెరీర్లో కొన్ని మైలు రాళ్ళు:
- ఒలంపిక్స్ లో క్వార్టర్ ఫైనల్స్ చేరిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
- ప్రపంచ జూనియర్ బాడ్మింటన్ టైటిల్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2008)
- మూడు వరుస సూపర్ సిరీస్ టైటిల్స్ గెలిచిన మొట్ట మొదటి భారతీయ బాడ్మింటన్ క్రీడాకారిణి. (2009 -2010 )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి