సుగుణములే చెప్పుకొంటి సుందర రఘురామా!
వగలెరుంగలేక ఇటు వత్తువనుచు దురాశచే
స్నానాది సుకర్మంబులు దానాధ్యయనంబులెరుగ
శ్రీనాయక క్షమియించుము శ్రీత్యాగరాజవినుత
సుందర స్వరూపుడవైన ఓ రఘురామా! నీవు నాపై కరుణించి దర్శనమిచ్చెదవను ఆశతో నీ మాయలను తెలుసుకోలేక నీ సుగుణములనే చెప్పుకొనుచున్నాను. పుణ్యతీర్థములలో స్నానములు మొదలైన మంచి కర్మలు, దానములు, వేదాధ్యయనములను నేను ఎరుగను. సీతాదేవికి నాయకుడవు, పరమశివునిచే నుతించబడిన శ్రీరామా! నీవే నన్ను క్షమించి దర్శనమిచ్చి కాపాడుము.
చక్రవాకం రాగంలో కూర్చబడిన ఈ కృతిని బాలమురళీకృష్ణ గారు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి