ఓజోऽసి సహోऽసి బలమసి భ్రాజోऽసి దేవానాం ధామ నామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరోం గాయాత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి ఛన్దర్‌షీనావాహయామి శ్రియమావాహయామి
గాయత్రియా గాయత్రీ ఛందో విశ్వామిత్ర ఋషిః సవితా దేవతాః
అగ్నిర్ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్ హృదయగ్‌ం రుద్రశ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపానవ్యానోదానసమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యానసగోత్రా గాయత్రీ చతుర్విగ్ంశత్యక్షరా త్రిపదా షట్కుక్షిః పఞ్చశీర్‌షోపనయనే వినియోగః
ఓ దేవీ! నీవు మా యింద్రియముల యొక్క శక్తివై యున్నావు, శత్రువులను తిరస్కరించే శక్తివి, శరీరమునకు బలమగుచున్నావు, తేజస్సువగుచున్నావు. అగ్నీంద్రాది దేవతల నివాసము నీవు, వారి నామములు కలదానవు (అనగా ఆయాదేవతలు నీవే), సర్వజగద్రూపవు, సంపూర్ణ ఆయుస్స్వరూపవు, నిఖిల చేతన సమూహము నీవే, జీవరాశి ఆయుష్యము నీవే, సకల పాపములను తిరస్కరించెడి తల్లివి నీవు, ప్రణవ ప్రతిపాదితమైన పరమాత్మ స్వరూపవు నీవు. ఇటువంటి అమ్మను గాయత్రిగా సావిత్రిగా సరస్వతిగా త్రికాలములందు నా మనసునందు ఉపాసన చేయుటకు ఆయాదేవతాస్వరూపముగా ఆవాహన చేయుచున్నాను.
ఈ గాయత్రికి గాయత్రి అనే ఛందస్సు, విశ్వామిత్రుడు ఋషి, సూర్యుడు దేవత, ముఖమగ్ని, శిరస్సు బ్రహ్మ, విష్ణువు హృదయము, శిఖ రుద్రుడు, యోని భూమి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచప్రాణాత్మికయైనది, దేవదత్త కూర్మ ధనంజయ నాగ కృకరములనెడి ఉపప్రాణములతో కూడినది, శ్వేతవర్ణము కలది, సాంఖ్యాయనుడను ఋషితో సమానమైన గోత్రము కలది, ఇరువది నాలుగు అక్షరములు కలది, ఋగ్యజుస్సామవేదములనెడి మూడు పాదములు కలది, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము, ఊర్ధ్వ దిశ, అధో దిశ అనే ఆరు దిక్కులు ఉదరముగా కలది, శిక్ష, వ్యాకరణము, కల్పము, నిరుక్త్మము, జ్యోతిషము అనేవి శిరస్సులుగ కలది అగు గాయత్రిని వేదాధ్యయనము కొరకు గురువు వద్ద వినియోగించుచున్నాను.
శ్రీగురుభ్యోనమః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి