ఏ తావునరా నిలకడ నీకు? ఎంచి చూడనగపడవు
సీతా గౌరి వాగీశ్వరియను స్త్రీ రూపములందా గోవిందా
భూకమలార్కానిలనభమందా లోకకోటులందా
శ్రీకరుడగు త్యాగరాజ కరార్చిత శివ మాధవ బ్రహ్మాదులయందా
శ్రీరామా! నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు? ఎంత తరచి చూచినా కనబడనివాడవు. సీత, పార్వతి, సరస్వతి అనే స్త్రీ రూపములలోనా? శ్రీకృష్ణుని రూపములోనా? భూమి, నీరు, సూర్యుడు, వాయువు, ఆకాశములయందా? కోట్లాది లోకములయందా? త్యాగరాజు అర్చించిన శుభములను కలిగించే బ్రహ్మ విష్ణు శివులయందా? నీవు ఎక్కడ నిలకడగా ఉండెదవు?
కల్యాణి రాగంలో కూర్చబడిన ఈ కృతిని రంజని గాయత్రి సోదరీమణులు ఆలపించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి