2, సెప్టెంబర్ 2010, గురువారం

చిన్ని కృష్ణునికి లాలిపాట

 

పద కవితా పితామహుడు శ్రీకృష్ణుని ఉయ్యాల వైభోగాన్ని వర్ణిస్తూ రచించిన లాలి కీర్తనను మధ్యమావతి రాగంలో అందంగా కట్టారు నేదునూరి కృష్ణమూర్తిగారు. ఎంతో అందంగా లయ, ప్రాసలతో సాగుతుంది ఈ కీర్తన.  ధిమి ధిమి ధ్వానాల నాట్యముతో, ఘల్లు ఘల్లు శబ్దములతో కలువరేకుల్లాంటి కనులున్న చిన్ని కృష్ణునికి యుక్తవయసులో ఉన్న స్త్రీలు బంగారు ఉయ్యాలలో లాలి లాలి లాలి అని జోల పాడారుట.

ఉయ్యాల బాలు నూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు 


బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు ||


తమ్మి రేకు కను దమ్ముల నవ్వుల
పమ్ము జూపుల పాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు ||


చల్లు జూపుల జవరాండ్లు రే
పల్లె బాలుని పాడేరు
బల్లిడు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు ||

1, సెప్టెంబర్ 2010, బుధవారం

రోగ నిరోధక శక్తి

తిప్పతీగ

కలబంద(ఆలో వేరా)
తులసి
రాందేవ్ 

వర్షాకాలం, పరిశుభ్రత ఎక్కువ ఉండని కాలం. కాబట్టి అన్ని రకాల సూక్ష్మ క్రిములు వృద్ధి చెంది రోగాలు వ్యాప్తి చెందే సమయం.  బాబా రాందేవ్ ప్రకారం, ఇటువంటి సమయంలో స్వైన్ ఫ్లూ, డెంగీ, మలేరియా వంటి ప్రాణాంతక జ్వరాలనుంచి కాపాడుకోటానికి కొన్ని చిట్కాలు:
  1. ప్రతిరోజూ ఉదయం పరకడుపున ప్రాణాయామం 15 నిమిషాలు. అనులోమ విలోమము, భస్త్రిక, కపాల భాతి - తప్పకుండా చేస్తే ఊపిరితిత్తులు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ఆక్సిజన్ శరీరం లోని కణాలకు బాగా వెళ్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  2. ప్రతి రోజు ఉదయం తులసి ఆకులను కొన్ని తింటే సర్వ రోగ నివారిణి. ఆకులు బాగా కడిగి (ఒక 10 ఆకులు) నమిలి తింటే దివ్యౌషధం. 
  3. కలబంద (ఆలో వేరా) ఆయుర్వేదం ప్రకారం సంజీవని లాంటిది. పైన బెరడును తీసేసి, మధ్యలో మెత్తగా ఉండే పదార్థాన్ని అలాగే కానీ రసం చేసి కానీ తీసుకుంటే ఈ విష జ్వరాల బారిన పడకుండా ఉండవచ్చు.
  4. తిప్పతీగ (మనకు ఆంధ్ర ప్రదేశ్ లో బానే దొరుకుతుంది, చిత్రం పైన) రసం, తులసి రసం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది.  తిప్పతీగ వివరాలు.
అన్నిటికన్నా ముఖ్యమైనది - ఇవి పని చేస్తాయి అన్న నమ్మకం, క్రమం తప్పకుండా తీసుకుని, ప్రాణాయామం చేస్తే రోగాలు మీకు దూరం.

31, ఆగస్టు 2010, మంగళవారం

కృష్ణం వందే జగద్గురుం

సుందర నాస మౌక్తిక శోభిత కృష్ణం
వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్

పుట్టుకనుంచి అవతార సమాప్తి దాకా, ఆయన లీలలు, మహిమలు, పాత్రలు అనంతం. పాలు తాగే వయసులోనే పూతనాది రాక్షసులను చంపి, ఆడే పాడే వయసులో కంసాది దానవులను సంహరించి, రాధాది గోపికలతో రాసక్రీడలు సల్పి, యాదవుల సంరక్షకుడై గోవర్ధన గిరిని చిటికెన వేలితో ఎత్తి, ధర్మ సంరక్షణకై పాండవులకు అండగా నిలిచి, విహ్వల, వివస్త్రయైన ద్రౌపది మానము కాపాడి, రాగము, భయము, క్లైబ్యముతో సమరాన అస్త్రములను విడిచిన అర్జునునికి మహాద్భుత గీతోపదేశము చేసిన పూర్ణ అవతారము ఆ శ్రీకృష్ణుడు. మనలో ఒకడిగా ఉంటూ, మనకు జీవన గతిని, కర్మ ఫల సారాన్ని అందజేసి మనకు మార్గ దర్శకుడయ్యాడు కాబట్టే ఆయన జగద్గురువు. ఉరసా మనసా శిరసా ఆ లీలా మానుష మూర్తి సహస్ర పాద పద్మములకు నా నమస్కారములు.

ఆ సుందర మనోహర సునయన సుచరణ శుభగాత్రుడైన నల్లని వానిని వర్ణించటం ఎవరి తరం? వల్లభాచార్యులు మధురాష్టకంలో ఆ వేణుగోపాలుని సర్వ సులక్షణ రస ప్రవాహంలా రచించారు.  ఆయన, ఆయన చుట్టూ ఉన్నవి, ఆయన శరీరంపైన ఉన్నవి, మొత్తం, అంతటా, అన్నీ మధురమే. ఈ అష్టకం వింటూ ఉంటే ఆ స్వామి శోభాయమాన మైన రూపం కళ్లలో మెదలి రోమ రోమము ఆయన భక్తి సుధారసాస్వాదనలో తరించాలిసిందే. ఈ కృష్ణాష్టమి నాడు మీ అందరు ఆ బాలకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని నా కామ్యము.

అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

వేణూర్మధురో రేణూర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురం
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దళితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం

శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః

శ్రీకృష్ణాష్టమి - కొన్ని తరంగాలు

నారాయణ తీర్థులు కృష్ణభక్తి సామ్రాజ్యంలో తన్మయత్వం చెంది సంస్కృత భాషలో రాసిన అమృతం లాంటి కీర్తనలు తరంగాలుగా ప్రసిద్ధి చెందాయి. రేపు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఆ సుందర మోహనాన్గుడిని వర్ణిస్తూ ఆయన రచించిన కొన్ని తరంగాలు:





౧. బాల గోపాల కృష్ణా  - మోహన రాగం ఆది తాళం

(కూచిపూడి కళాప్రదర్శనలలో సంప్రదాయబద్ధంగా ప్రదర్శింపబడే జనరంజక తరంగం)

బాల గోపాల కృష్ణ పాహి పాహి ||
నీల మేఘ శరీరా నిత్యానందం దేహి ||

కలభ సుందర గమన కస్తూరి శోభితానన
నళిన దళాయత నయన నందనందన
మిళిత గోపవధూజన మీణాంక కోటి మోహన
దళిత సంసారబంధన దారుణ వైరినాశన ||

యజ్ఞ యజ్ఞ సంరక్షణ యాదవ వంశాభరణ
యజ్ఞ ఫల వితరణ యతి జనతారణ
అజ్ఞాన ఘనసమీరణ అఖిల లోకకారణ
విజ్ఞాన దళితావరణ వేదాంత వాక్యప్రమాణ ||

వ్యత్యస్త పాదారవింద విశ్వవందిత ముకుంద
సత్యాఖండ బోధానంద సద్గుణబృంద
ప్రత్యస్తమిత భేదకంద పాలిత నంద సునంద
నిత్యద నారాయణతీర్థ నిర్మలానంద గోవింద ||
 



౨. ఆలోకయే - హుస్సేనీ రాగం ఆది తాళం

ఆలోకయే శ్రీ బాలకృష్ణం - సఖి ఆనంద సుందర తాండవ కృష్ణం ||

నవనీత ఖండ దధి చోర కృష్ణం భక్త భవ పాశ బంధ మోచన కృష్ణం || 
 
నీల మేఘ శ్యామ సుందర కృష్ణం నిత్య నిర్మలానంద బోధ లక్షణ కృష్ణం ||
చరణ నిఖ్హ్వణిత నూపుర కృష్ణం కర సంగత కనక కంకణ కృష్ణం ||
కింకిణీజాల ఘణ ఘణిత కృష్ణం లోక శంకిత తారావళీ మౌక్తిక కృష్ణం ||
సుందర నాసామౌక్తిక శోభిత కృష్ణం నందనందనం అఖండ విభూతికృష్ణం ||
కంఠోప కంఠ శోభి కౌస్తుభ కృష్ణం కలి కల్మశ తిమిర భాస్కర కృష్ణం ||
వంశీ నాద వినోద సుందర కృష్ణం పరమ హంస కులశంసిత చరిత కృష్ణం ||
గోవత్స బృంద పాలక కృష్ణం కృత గోపికా జాల ఖేలన కృష్ణం ||
నంద సునందాది వందిత కృష్ణం శ్రీ నారాయణ తీర్థ వరద కృష్ణం ||


౩. పరమపురుష -  బేహగ రాగం ఆది తాళం

పరమ పురుష మను యామవయం సఖి పరమ పురుషమను యామ ||

సురుచిర హాసం సుందర నాసం తరుణారుణ కిరణాధర సరసం ||

నంద కుమారం నగవర ధీరం
బృందావన భువి వివిధ విహారం
బృందారక గణ వందిత
చరణా
వింద మిళిత మణి మధుకర నికరం ||

  భావుక చరణం భవ సంతరణం
భవ్యసేవక జన భాగ్య వితరణం
ఆవ్యయ విమల విభూతి విజృంభిత 
దివ్య మణి రచిత వివిధాభరణం ||

పరమోదారం పాపవిదూరం 
స్మర సాయక స్రగ్ధ రమయతి చతురం
విరచిత మురళీ గీత రసామృత
భరిత ఘనం ఘన కౌస్తుభహారం ||

యువతీ గీతం యోగి సులలితం
కవిజన మానస కమలవిలసితం
శివ నారాయణ తీర్థవిరచితం
శ్రీ గోపాల దయా రస మిళితం ||

 
౪. కృష్ణం కలయ సఖి - ముఖారి రాగం

కృష్ణం కలయ సఖి సుందరం - బాల ||

కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ
విష్ణుం సురారి గణ జిష్ణుం సదా - బాల ||



నృత్యంత మిహ ముహురత్యంతమపరిమిత
భృత్యానుకూల మఖిల సత్యం సదా - బాల ||



ధీరం భవ జలధి పారం సకల వేద
సారం సమస్త యోగి తారం సదా - బాల ||



శృంగార రస భర సంగీత సాహిత్య
గంగా లహరీ ఖేల సంగం సదా - బాల ||



రామేణ జగదభి రామేణ బలభద్ర
రామేణ సహావాప్త కామేన సదా - బాల ||



రాధారుణాధర సుధా పరి సచ్చిదానంద
రూపం జగత్రయ భూపం సదా - బాల||



దామోదరమఖిల కామాకరం ఘన
శ్యామాకృతిం అసురభీమం సదా - బాల ||



అర్థం శిధిలీకృతానర్థం శ్రీనారాయణ
తీర్థం పరమపురుషార్థం సదా - బాల ||

30, ఆగస్టు 2010, సోమవారం

యాభై సామెతలు

తెనుగుదనం వంటి తీయదనము లేదు 
తెలుగు కవుల వంటి ఘనులు లేరు 
తెనుగు తల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!

నిన్న తెలుగు భాషా దినోత్సవం. ఈ సందర్భంగా ఒక యాభై సామెతలు మీకోసం. సందర్భాన్ని బట్టి మీరు కూడా సామెతలు వాడుతూ ఉండండి. భాష నిలుస్తుంది, మీరు చెప్పాల్సిన మాటలో సందేశం ఎదుటి వారికి బాగా అందుతుంది. తెలుగు భాష పరిస్థితి ఏమిటి నేను ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. మన వంతు కృషి చేద్దాం. మాతృభాషను కాపాడుదాం.

  1. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని (ఎప్పుడూ నసుగుతూ, అసంతృప్తితో ఉండే వాళ్ల గురించి)
  2. హనుమంతుని ఎదుట కుప్పి గంతులా (సమర్థులు, తెలిసిన వారి ముందు తెలిసీ తెలియని విద్యని ప్రదర్శించటం)
  3. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు (అన్ని అయిన తర్వాత నేను చెప్పిన మాట వినలేదు, అలా చేసి  ఉండాల్సింది, ఇలా చేసి ఉండాల్సిని అనే వాళ్ల గురించి)
  4.  సూదిలా వచ్చి దబ్బనంలా తేలినట్లు (బాగు పడటం గురించి)
  5. అందరికీ శకునం చెప్పే బల్లి కుడితి తొట్లో పడిందిట (నలుగురికి చెప్పేది తనకు పనికి రాలేదు అని)
  6. శుభం పలకరా పెళ్లి కొడకా అంటే పెళ్లి కూతురు ముండ ఎక్కడ ఉంది అన్నాడుట (ఎదుటి వాళ్ళు ఏమి చెపుతున్నారు అర్థం చేసుకోలేని మూర్ఖుల గురించి, వాళ్ల ధోరణి)
  7. అందితే జుట్టు అందకుంటే కాళ్లు (స్వార్థ పరులు)
  8. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు (ప్రతి దానికి ఒక పధ్ధతి, సరైన మార్గం ఉంటుంది అని)
  9. అక్క మనది అయితే బావ మన వాడా? (సంబంధాన్ని బట్టి వ్యవహారం అని)
  10. విగ్రహ పుష్టి నైవేద్య నష్టి (తిండికి తప్ప దేనికి పనికి రాని దేహ పుష్టి ఉన్న సోమరుల గురించి)
  11. అడిగేవాడికి చెప్పేవాడు లోకువ (మన మంచి కోరి చెప్పే వాళ్ళను గౌరవించాలి అన్న భావన)
  12. వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి (భారతం, గారెలు మధ్య ఉపమానం)
  13. అడగందే అమ్మైనా పెట్టదు (మనకు కావాల్సింది అడిగి తీసుకోవాలి అని)
  14. వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు (అన్ని మన చేతుల్లో ఉండవు అని)
  15. అత్త లేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు (అత్తా కోడళ్ళ మధ్య సంబంధం ఎప్పుడూ ఉత్తమంగా ఉండదు అని వ్యంగ్యం)
  16. వడ్డించే వాడు మన వాడైతే కడ పంక్తిని కూర్చున్నా ఒక్కటే (ఇచ్చే వాడు మనకు కావలిసిన వాడు అయితే, మనం ఎక్కడ ఉన్నా ఫలం మనకు అందుతుంది అని)
  17. అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలా? (పారాడే వయసులో కొడుకు తల్లి మధ్య ఉండే అనుబంధం, గడ్డాలు, మీసాల వయసులో ఉండదని)
  18. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక (నిజం భగవంతునికి తెలుసు)
  19. ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, వలపు సిగ్గు ఎరుగదు (పరిస్థితిని బట్టి సంతృప్తి, రుచి, సుఖం అని)
  20. లేడికి లేచిందే పరుగు (ముందు వెనక చూడకుండా, ఆలోచించకుండా, అనుకోగానే రంగంలో దూకే వాళ్ల గురించి)
  21. ఇంటి కన్నా గుడి పదిలం (భగవంతుని కోవెలలో ప్రశాంతత, భద్రత ఎక్కువ అని)
  22. లాభం గూబల్లోకి వచ్చింది (దురాశకు పొతే అసలుకే మోసం వస్తుంది అని)
  23. ఇల్లలకగానే పండగ అవుతుందా (ఏదో ఒక పని అయ్యింది కనా పొంగి పోయి హడావిడి చెయ్యటం కాదు, అన్ని అయ్యేదాకా ప్రణాళికతో, జాగ్రత్తగా ఉండాలి అని)
  24. లంకలో పుట్టిన వారందరూ రాక్షసులే (కాదు కదా!)
  25. ఉట్టికి ఎక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కునా (మన సామర్థ్యాన్ని బట్టి చేసే పని, కలలు ఉండాలి)
  26. రౌతు కొద్దీ గుర్రం (చేసే వాడి సామర్థ్యాని బట్టి ఫలితం)
  27. ఎక్కడైనా బావా అనొచ్చు కానీ వంగతోట దగ్గర మాత్రం కాదు (వంగతోటలో అందరు బావ మరదళ్ళు ఉంటారు, అక్కడ బావా అంటే వేరే ఎవరైనా రావచ్చు. అందుకని, సందర్భాన్ని బట్టి సంబోధన ఉండాలి అని)
  28. రోలు వెళ్లి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు (ఎప్పుడు రోలును రోకలితో బాడుతూనే ఉంటారు, అలాగే మద్దెలను కూడా. కాబట్టి కష్టాలు అందరికీ ఉంటాయి, వాటి గురించి సరైన చోట, సరైన వ్యక్తుల వద్ద మాత్రమే మాట్లాడాలి)
  29. ఎలుకకు పిల్లి సాక్ష్యం (నిజ నిర్ధారణలో సరైన వ్యక్తులను సాక్ష్యం కోరాలి అన్న దానికి వ్యంగ్యం)
  30. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు (అదృష్టం కలిసి వస్తే)
  31. కండ్లార్పినమ్మ ఇండ్లార్పును (నిలకడ లేని స్త్రీ ఉన్న చోట వృద్ధి ఉండదు అన్నదానికి)
  32. రామాయణం అంతా విని రాముడికి సీత ఏమి కావాలన్నట్టు (ప్రశ్న ఏదో అడగాలి కాబట్టి అడిగి, చెప్పేది సరిగ్గా వినని వాళ్లకి)
  33. కందకు లేని దురద బచ్చలికి ఏల (అనుభవించే వాడికి లేని బాధ నీకెందుకు అని)
  34. మొగుడు కొట్టినందుకు కాదు తోడికోడలు వెక్కిరించినందుకు విచారం (ఇంకొక స్త్రీ వలన పొందే అవమానం ఎంత బాధాకరం గా ఉంటుందో అన్న దానికి ఉపమానం)
  35. బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయలంత అన్నాడుట (మాటలలో కోతలు ఎంతగా ఉండొచ్చో అన్న దానికి ఉదాహరణ)
  36. కాకి ముక్కుకు దొండ పండు (వధూ వరుల పొందిక గురించి)
  37. బావ మరిది బ్రతక కోరును, దాయాది చావ కోరును (తోబుట్టువును ఇచ్చాడు కాబట్టి బావమరది నీ మంచి కోరతాడు, నువ్వు చస్తే ఆస్తి వాళ్ళది కాబట్టి దాయాది నీ చావు కోరతాడు).
  38. భోజనానికి ముందు స్నానానికి వెనక (మొదట భోజనం చేస్తే వేడిగా, అన్ని వంటకాలు అందుతాయి. అలానే, చివరన స్నానం చేస్తే వేడి నీళ్లన్నీ నీవే)
  39. పిన తండ్రి పెళ్ళాం పిన తల్లి కాదు, మేన మామ పెళ్లాం మేనత్తా కాదు (ప్రేమలు కొన్ని రక్త సంబంధాలలో ప్రత్యేకంగా ఉంటాయి) 
  40. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ (మాటను ఒక్క సారే చెప్పించుకోవాలి)
  41. పితికే బర్రెను ఇచ్చి పొడిచే దున్నను తెచ్చుకున్నట్టు (తెలిసి తెలిసి తప్పులు చెయ్యటం)
  42. నిత్యమూ చచ్చే వారికి ఏడ్చే వారెవరు (ఆత్మ స్థైర్యంతో ఉండమని)
  43. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే (ఎక్కువ మంది పెద్దరికం చేస్తే ఎలా ఉంటుందో అన్న సందర్భం)
  44. తా వలచినది రంభ తా మునిగింది గంగ (తన అభిప్రాయమే నిజము, మంచి అనుకునే వాళ్ల గురించి)
  45. సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది (పెళ్ళిళ్ళలో పని వాళ్లకు ఉండే శ్రమ గురించి)
  46. తా దూర కంత లేదు మెడకో డోలు  (వసతిని, పరిస్థితి, సామర్థ్యాన్ని బట్టి పని చేసుకోవాలి అని)
  47. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో (ఎప్పటి పని అప్పుడే చేసుకొని జాగ్రత్త పాడమని)
  48. తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు (సోమరిపోతుల గురించి)
  49. తా చెడ్డ కోతి వనమెల్లా చెరచింది (చెడ్డ వాని సాంగత్యం మంచి వాళ్ళను కూడా చెడగొడుతుంది)
  50. డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు (డబ్బు లేని వాడు ఈ లోకంలో గౌరవించ బడడు)

27, ఆగస్టు 2010, శుక్రవారం

హరివరాసనం

హరిహరసుతాష్టకం

హరివరాసనం విశ్వమోహనం
హరిదధీశ్వరం ఆరాధ్యపాదుకం
అరివిమర్దనం నిత్యనర్తనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శరణకీర్తనం భక్తమానసం
భరణలోలుపం నర్తనాలసం
అరుణభాసురం భూతనాయకం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

ప్రణయసత్యకం ప్రాణనాయకం
ప్రణతకల్పకం సుప్రభాజితం
ప్రణవమందిరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

తురగవాహనం సుందరాననం
వరగధాయుధం వేదవర్ణితం
గురుకృపాకరం కీర్తనప్రియం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

త్రిభువనర్చితం దేవతాత్మకం
త్రినయనం ప్రభుం దివ్యదేశికం
త్రిదశపూజితం చింతితప్రదం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

భవభయాపహం భావుకావహం
భువనమోహనం భూతిభూషణం
ధవళవాహనం దివ్యవారణం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

కలమృదుస్మితం సుందరాననం
కలభకోమలం గాత్రమోహనం
కలభకేసరీ వాజివాహనం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

శ్రితజనప్రియం చింతితప్రదం
శృతివిభూషణం సాధుజీవనం
శృతిమనోహరం గీతలాలసం
హరిహరాత్మజం దేవమాశ్రయే

శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప
శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప

మైత్రీం భజత - పరమాచార్యుల రచన

కంచి పరమాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి రచన. చూడండి.

నడిచే దైవం పరమాచార్యులు

మైత్రీం భజత అఖిల హ్రుజ్జేత్రీం
ఆత్మవదేవ పరానపి పశ్యత
యుద్ధం త్యజత స్పర్ధా త్యజత
త్యజత పరేష్వ క్రమమాక్రమణం
జననీ ప్రుథివీ కామదుఘాస్తే
జనకో దేవః సకలదయాళుః
దామ్యత దత్త దయధ్వం జనతాః
శ్రేయో భూయాత్ సకలజనానాం

తాత్పర్యం:
అందరి హృదయాలను జయించే మైత్రిని పెంపొందించు. ఇతరులను నీవలెనే చూచుకొనుము. యుద్ధం, పోరు (స్పర్ధ) త్యజించు. ఇతరుల మీద నీ తామస పరాక్రమాన్ని చూపించకు. ఈ జన్మభూమి మన కోర్కెలను తీర్చటానికి సిద్ధంగా ఉంది. అత్యంత దయాళువైన ప్రభువు మనకు తండ్రిగా ఉన్నాడు. ప్రజలారా! దయతో, కరుణతో మీకు చేతనైన సాయం ఇతరులకు చేయండి. మీరందరు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి.

వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి

వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార  వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...