పద కవితా పితామహుడు శ్రీకృష్ణుని ఉయ్యాల వైభోగాన్ని వర్ణిస్తూ రచించిన లాలి కీర్తనను మధ్యమావతి రాగంలో అందంగా కట్టారు నేదునూరి కృష్ణమూర్తిగారు. ఎంతో అందంగా లయ, ప్రాసలతో సాగుతుంది ఈ కీర్తన. ధిమి ధిమి ధ్వానాల నాట్యముతో, ఘల్లు ఘల్లు శబ్దములతో కలువరేకుల్లాంటి కనులున్న చిన్ని కృష్ణునికి యుక్తవయసులో ఉన్న స్త్రీలు బంగారు ఉయ్యాలలో లాలి లాలి లాలి అని జోల పాడారుట.
ఉయ్యాల బాలు నూచెదరు కడు
నొయ్య నొయ్య నొయ్యనుచు
నొయ్య నొయ్య నొయ్యనుచు
బాల యవ్వనలు పసిడి ఉయ్యాల
బాలుని వద్ద పాడేరు
లాలి లాలి లాలి లాలెమ్మ
లాలి లాలి లాలి లాలనుచు ||
తమ్మి రేకు కను దమ్ముల నవ్వుల
పమ్ము జూపుల పాడేరు
కొమ్మలు మట్టెల గునుకుల నడపుల
ధిమ్మి ధిమ్మి ధిమ్మనుచు ||
చల్లు జూపుల జవరాండ్లు రే
పల్లె బాలుని పాడేరు
బల్లిడు వేంకటపతి జేరందెలు
ఘల్లు ఘల్లు ఘల్లనుచు ||
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి