సుందర నాస మౌక్తిక శోభిత కృష్ణం |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్
పుట్టుకనుంచి అవతార సమాప్తి దాకా, ఆయన లీలలు, మహిమలు, పాత్రలు అనంతం. పాలు తాగే వయసులోనే పూతనాది రాక్షసులను చంపి, ఆడే పాడే వయసులో కంసాది దానవులను సంహరించి, రాధాది గోపికలతో రాసక్రీడలు సల్పి, యాదవుల సంరక్షకుడై గోవర్ధన గిరిని చిటికెన వేలితో ఎత్తి, ధర్మ సంరక్షణకై పాండవులకు అండగా నిలిచి, విహ్వల, వివస్త్రయైన ద్రౌపది మానము కాపాడి, రాగము, భయము, క్లైబ్యముతో సమరాన అస్త్రములను విడిచిన అర్జునునికి మహాద్భుత గీతోపదేశము చేసిన పూర్ణ అవతారము ఆ శ్రీకృష్ణుడు. మనలో ఒకడిగా ఉంటూ, మనకు జీవన గతిని, కర్మ ఫల సారాన్ని అందజేసి మనకు మార్గ దర్శకుడయ్యాడు కాబట్టే ఆయన జగద్గురువు. ఉరసా మనసా శిరసా ఆ లీలా మానుష మూర్తి సహస్ర పాద పద్మములకు నా నమస్కారములు.
ఆ సుందర మనోహర సునయన సుచరణ శుభగాత్రుడైన నల్లని వానిని వర్ణించటం ఎవరి తరం? వల్లభాచార్యులు మధురాష్టకంలో ఆ వేణుగోపాలుని సర్వ సులక్షణ రస ప్రవాహంలా రచించారు. ఆయన, ఆయన చుట్టూ ఉన్నవి, ఆయన శరీరంపైన ఉన్నవి, మొత్తం, అంతటా, అన్నీ మధురమే. ఈ అష్టకం వింటూ ఉంటే ఆ స్వామి శోభాయమాన మైన రూపం కళ్లలో మెదలి రోమ రోమము ఆయన భక్తి సుధారసాస్వాదనలో తరించాలిసిందే. ఈ కృష్ణాష్టమి నాడు మీ అందరు ఆ బాలకృష్ణుని అనుగ్రహాన్ని పొందాలని నా కామ్యము.
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
వేణూర్మధురో రేణూర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురం
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దళితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
వేణూర్మధురో రేణూర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురం
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమణం మధురం
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచి మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దళితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం
శ్రీ కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః
చాలా బాగా చెప్పారు..
రిప్లయితొలగించండి