మహా వాగ్గేయకారుడు, అపర రామభక్తుడు త్యాగరాజు వేర్వేరు ఉత్సవాల్లో, వేడుకల్లో సీతారాముల వైభవాన్ని వర్ణిస్తూ రాసిన కీర్తనలు ఉత్సవ సాంప్రదాయ కీర్తనలుగా ప్రసిద్ధి చెందాయి. నిత్య నైమిత్తిక సేవల్లో మేలు కొలుపు, మంగళ స్నానాది శౌచములు, ఆరగింపులు, ఆరతులు, ఊయల, శయనములతో కూడిన షోడశోపచారములు ఈ కీర్తనలకు మూలం. ఆ దివ్య దంపతులు సపరివారసమేతంగా పొందే ఈ సేవలను త్యాగరాజు కన్నులకు కట్టినట్టుగా భక్తితో రమణీయంగా రచించాడు. చిత్తూర్ నాగయ్య గారి త్యాగయ్య చిత్రంలో మరియు కెవి సోమయాజులు గారి త్యాగయ్య చిత్రంలో ఈ వైభవాన్ని అనుభూతి, భక్తి తగ్గకుండా చూపించారు, వినిపించారు. ఆ ఉత్సవ సాంప్రదాయ కృతుల్లో ప్రతిది మన సమాజంలో జరిగే దైవిక ఉత్సవాల్లో భక్తుల నోట మంచి ప్రాచుర్యాన్ని పొందాయి. అందులో ఒకటి సీతారాముల కళ్యాణంలో రాముల వారి గుణగణాలను వర్ణించే ఈ క్రింది కృతి. శంకరాభరణం రాగం ఖండచాపు తాళంలో స్వరపరచబడింది. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఈ కృతితో పాటు మిగతా ఉత్సవ సాంప్రదాయ కృతులను కూడా కమనీయంగా పాడి బహుళ ప్రాచుర్యంలోకి తెచ్చారు.
పల్లవి:
సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే
చరణాలు:
1 . పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవిసోమ వరనేత్ర రమణీయ గాత్ర | సీతా కళ్యాణ |
తాత్పర్యము: వాయుదేవుని పుత్రుడైన హనుమంతునిచే స్తుతించబడిన పావనమైన చరిత్ర గలిగిన వాడు, సూర్య చంద్రులను కన్నులుగా కలవాడు, సుందరమైన శరీరము కలవాడు ఆ రాముడు.
2. భక్తజన పరిపాల భరిత శరజాల భుక్తిముక్తిదలీల భూదేవ పాల | సీతా కళ్యాణ |
తాత్పర్యము: భక్తులను పాలించే కల్పతరువు, శస్త్రాలను ధరించిన వాడు, భుక్తి (జీవనాధారాలైన వృత్తి, భోజనము), ముక్తి ప్రసాదించేవాడు, భూమిని పాలించేవాడు, సీతాపతి ఆ రాముడు.
3. పామరాసుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేతధామ | సీతా కళ్యాణ |
తాత్పర్యము: అజ్ఞానాన్ని, అసురులను నాశనం చేసేవాడు, భక్తుల కామ్యఫలదాయకుడు, నీలమేఘ శరీరుడు, సకల లోకములలోకెల్లా అందమైన వాడు, సాకేతపురాన్ని పాలించిన వాడు ఆ రాముడు.
4. సర్వలోకాధార సమరైకవీర గర్వమానస దూర కనకాంగ ధీర | సీతా కళ్యాణ |
తాత్పర్యము: ఈ జగత్తు అంతటికి ఆధారమైన వాడు, యుద్ధంలో ఎదురులేని వీరుడు, గర్వానికి దూరంగా ఉండే వాడు, స్వర్ణకాంతితో మెరిసిపోయే ధీరుడు ఆ రాముడు.
5. నిగమాగమ విహార నిరుపమ శరీర నగధరాఘవితార నతలోకాధార | సీతా కళ్యాణ |
తాత్పర్యము: వేదవేదాంగాలు, శాస్త్ర పురాణాలలో వర్ణింపబడి, స్తుతిన్చబడి వాటిలో విహరించేవాడు, అసమానమైన శరీరం కలవాడు, సమస్త ఆభరణ భూషితుడు, పాపశమనుడు, భక్తలోకానికి ఆధారుడు ఆ రాముడు.
6. పరమేశనుత కీర్త భవజలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత | సీతా కళ్యాణ |
తాత్పర్యము: శంకరునిచే స్తుతించబడిన వాడు, సంసార సాగరాన్ని దాటించేవాడు, సూర్యవంశంలో జన్మించిన వాడు, త్యాగరాజుచే నుతించబడిన వాడు ఆ రాముడు.
4, జులై 2010, ఆదివారం
3, జులై 2010, శనివారం
సూరీడికి నమస్సుమాంజలి
ఉదయం యోగాలో సూర్యనమస్కారాలు చేసెటప్పుడు వచ్చిన కవితావేశంలో రాసిన సూర్య నమస్కారం:
సిత్రాల సిత్రాల సూరీడు పొద్దున్నె నిద్దుర లేపాడు
వేడి వేడి బాణాల సూరీడు రేతిరిని దాటి వచ్చాడు
దండాలు దండాలు సూరీడు నీ వెలుగుతో బతుకుల కాపాడు
ఏడు గుర్రాల సూరీడు మా భూదేవిని సల్లంగా నువు సూడు
ఎర్రని పండనుకొని సూరీడు నిను హనుమయ్య మింగగ వచ్చాడు
ఎండ మండించిన సూరీడు మేఘాలని వర్షంగా పంపాడు
నువ్వు రాకుంటే సూరీడు మాకు బువ్వ బతుకు లేదు సూరీడు
నువ్వు రాకుంటే సూరీడు చెట్టూ చేమా ఏడ్చేను సూరీడు
చంద్రునితో కలిసి సూరీడు ఈ పుడమిని ఏలూ సూరీడు
ప్రత్యక్ష దైవము సూరీడు నీ పాదాల మొక్కుతా సూరీడు
సిత్రాల సిత్రాల సూరీడు మా ఆరోగ్యదాత ఈ సూరీడు

ఝుమ్మంది నాదం - చిత్ర సమీక్ష
చిత్రం: ఝుమ్మంది నాదం
విడుదల: జూలై 2, 2010
తారాగణం: మంచు మనోజ్, తాపసి, మోహన్ బాబు, సుమన్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, తనికెళ్ళ భరణి తదితరులు.
దర్సకత్వం: రాఘవేంద్ర రావు
నిర్మాత: మంచు లక్ష్మీ ప్రసన్న
సంగీత దర్శకులు: ఎం ఎం కీరవాణి
నేపథ్య గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సునీత, గీతా మాధురి, కృష్ణ చైతన్య, చైత్ర, అనూజ్, దీపు తదితరులు.
ఝుమ్మందినాదం చిత్రానికి కావలిసిన పరికరాలు - అనుభవఙ్ఞుడైన దర్శకులు రాఘవేంద్రులు, సంగీత వాణి కీరవాణి, ప్రతిభ ఉన్న నటులు మనోజ్, మోహన్ బాబు, బ్రహ్మానందం, సుమన్, అందమైన నూతన కథానయిక తాప్సి - అన్నీ ఉన్నాయి కానీ నాకు మళ్లీ రాఘవేంద్రరావు పైత్యం ఎక్కువ అనిపించింది.
తెలుగు సాంప్రదాయం అని మంచి సంగీతంతో, కోనసీమ, అరకు సౌందర్యాలతో, భిన్నమైన పాత్రలో మోహన్ బాబు, ఎమ్మెస్, బ్రహ్మి, ధర్మవరపుల హాస్యంతో మొదలయ్యిన మొదటి భాగం రెండో భాగానికి వచ్చేసరికి బూతులు, ద్వంద్వార్థాలు, రొటీన్ సంగీతం (పెళ్లి మరియు సంక్రాంతి పాటలు), మసాలా - రాఘవేంద్రరావు చిత్రాల్లో కనిపించే యాపిల్స్, రంగులు, బుడగలు, అంగాంగ ప్రదర్శన, కొబ్బరి చిప్పలు గాడిద గుడ్డులా తయారయ్యింది చివరకు. పెళ్లి తంతుల మీద పాటలు చూసి చూసి, రంగుల పాటలు చూసి చూసి ఇవంటే కొంత మొహం ఎత్తింది నాకు.
తెలుగు రాని అమ్మాయిని తీసుకుని తెలుగుదనం మీద చిత్రం తీయటం ఎందుకో అర్థం కాలేదు. ఏమన్నా అంటే ఆ అమ్మాయి పాత్ర ఎన్నారై అనొచ్చు. కాని ఆ అమ్మాయి అంతరించిపోతున్న తెలుగుదనం, సాంప్రదాయ సంగీతం మీద ప్రాజెక్టు చేయటానికి భారతదేశానికి వస్తుంది. మరి అదేంటో - కట్టు, బొట్టు, నడవడిలో ఎక్కడా తెలుగుదనం కనిపించదు. మొత్తం మీద - సంగీతం (కొన్ని పాటలు), కొంత హాస్యం, మంచు మనోజ్ అభినయం బాగున్నాయి. వయస్సున్న పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు బానే చేసారు. చిత్రానికి బలం చేకూర్చాల్సిన నాయిక అందం గుదిబండ అయ్యిందేమో అనిపించింది.
కొత్త గాయకులకు అవకాశం ఇచ్చిన కీరవాణి గారికి అభినందనలు. బాలు, బృందం పాడిన శాస్త్రీయ సంగీత ప్రధాన తొలిపాట, బాలు, గీతా మాధురిల యుగళగీతం 'లాలి పాడుతున్నది ', సునీత, కృష్ణచైతన్యల 'ఎంత ఎంత' అనే శృంగార యుగళగీతం, అలాగే అనూజ్, చైత్రల జానపద/ఆదివాసి యుగళ గీతం 'ఏం సక్కగున్నావ్ రా' వీనుల విందు. చిత్రం ముగింపులో ఉన్న పాట హైలైట్. చంద్రబోస్ గారు రాసిన 'దేశమంటే మతం కాదోయ్' దేశహిత సందేశం ఉన్న ఈ గీతం చాలా బాగుంది.
వస్త్ర ధారణ, మేకప్, నాయిక, మితిమీరిన శృంగారం - వీటిని కొంచెం జాగ్రత్తగా ఎంపిక చేస్తే చాలా బాగుండేది చిత్రం. మొత్తం మీద కీరవాణి గారి సంగీతం ఆహ్లాదకరం, శ్రవణానందకరం. మంచు మనోజ్ కు మంచి భవిష్యత్తు ఉంది. 5 లో 2 -1 /2 మార్కులు ఇస్తాను నేను. ఈ మొత్తం మార్కులు సంగీతానికే.

2, జులై 2010, శుక్రవారం
ముందుకు సాగటం ఎలా - ఉత్తేజ పరిచే గీతం ఒకటి
మడిసి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా చెప్పండి మాస్టారు!. శోకం, మానసిక వ్యధ, ఆందోళన, కన్నీళ్లు ఇవన్ని అందరికి ఎప్పుడోకప్పుడు వచ్చేవే. మాకు ఇవేవి లేవండి మేము వీటికి అతీతులము అంటే నాకు చెప్పండి వాళ్ళని కలిసి పాదాభివందనం చేస్తాను ఎందుకంటే వాళ్ళు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన "శీతోష్ణః సమదుఃఖేషు..." శ్లోకానికి ఉదాహరణలు, యోగులు. మనం యోగులము కాదులెండి కానీ, మనకు కూడా వీటిని దాటటానికి ఆ పరమాత్మ కొన్ని మార్గాలు ఇచ్చాడు.
కష్టాలు కష్టాల లాగ తీసుకోవద్దు, ధైర్యంగా ఉండాలి, కష్టాలు, సుఖాలు పరమాత్మ మాయ వగైరా వగైరా ఇలాంటివి ఏమి నేను చెప్పను ఎందుకంటే అవి ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లకు రుచించవు, సరియైనదిగా అనిపించదు. నవ్వేసి సమస్య లేదు అనుకోవటం, ఎల్లప్పుడూ మానసిక నిగ్రహం, సంతులనలో ఉండటం చాలా తక్కువ మందికి సాధ్యం. కానీ, ప్రపంచంలో మనం ఎదుర్కుంటున్న పరిస్థితి ఎప్పుడోకప్పుడు ఎవరో ఇంకొకరు ఎదుర్కుని అధిగమించగలిగి ఉంటారు. మనం మొదలు కాదు, చివర కాదు. కనుక, తప్పకుండా పరిష్కారం ఉంటుంది.
మరి ఏమిటి చెయ్యటం?. ఈ పాట ఒక మంచి ఉదాహరణ ఏమి చెయ్యొచ్చో అన్నదానికి. పాజిటివ్ ఆలోచనలతో పోరాడమని దీని సారాంశం. ఎందుకంటే అనుకూల (పాజిటివ్) ఆలోచనలు వ్యతిరేక (నెగటివ్) ఆలోచనల కన్నా చాలా బలమైనవి. కొన్ని అనుకూల ఆలోచనలతో ఒక వ్యతిరేక ఆలోచనను పోరాడటం దీనిలో మొదటి మెట్టు. రెండోది - ఉన్న పరిస్థితిలోంచి బయటకు ఎవ్వరు లాగలేరు. అది మనం అడుగు వేస్తె తప్ప అవ్వని పని. అడుగు వెయ్యటానికి, ఆలోచనలు రావటానికి పక్కనవాళ్ళు సాయపడగలరు.
ఆశ వదలకుండా ఒక అడుగు అనుకూల ఆలోచనతో వేస్తె అక్కడ తప్పకుండా మనకున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అందుకనే మన పెద్దలు అన్నారు - సమస్య ఉంటే పది మందితో చెప్పుకోవాలిరా అని. దాని అర్థం సానుభూతి పొందటానికి కాదు - కష్టంలో ఉన్న మనిషి యొక్క మానసిక పరిస్థితి అడుగు ముందుకు వేసే ఆలోచనలను రానివ్వకపోవచ్చు. అలాంటప్పుడు నలుగురితో కలిసి, మాట్లాడితే - కొత్త ఆలోచనలు మన మనస్సులోకి వెళ్లే అవకాశం ఎక్కువ. అలాగే, నలుగురుతో మాట్లాడితే మనకున్న సమస్యకన్నా ఇంకా పెద్ద సమస్య కనిపించొచ్చు. అప్పుడు మన సమస్యను 'ఆ ఇది చాలా చిన్నది, నన్నేమి చెయ్యలేదు, పాపం వాళ్ళు ఇంకా ఎంత పెద్ద భవసాగరంలో ఉన్నారో' అని కొట్టి పారేసే అవకాశం వస్తుంది. అంటే ఏమిటి?. - ఒక అనుకూల ఆలోచన మొదలయ్యినట్టే కదా?. అది చాలు మీ సమస్యను పూర్తిగా అధిగమించటానికి.
సాధనాలు ఏమిటి?
చిత్రం: వెలుగునీడలు
గాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు
గేయ రచయితా: శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు

గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా
|| కల కానిది విలువైనది ||
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
|| కల కానిది విలువైనది ||
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం

- ముందడుగు వేసే ధైర్యం - ఇక్కడ మనకు ఆ పరిస్థితిలో ధైర్యం ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వ్యవస్థను ఆశ్రయించాలి - కుటుంబం, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు, గురువులు, తోటి పనివారు, పుస్తకాలు. కానీ మొట్టమొదటి అడుగు మనమే వెయ్యాలి. పక్కవాళ్ళు వేయించారు అని అనిపించినా అది మన మనస్సు చెప్పనిదే జరగదు.
- పరిష్కారం ఉంది అనే నమ్మకం, భగవంతుడు ఎప్పటికీ మనల్ని ఇలానే ఉంచడు అన్న విశ్వాసం.
చిత్రం: వెలుగునీడలు
గాయకులు: ఘంటసాల వేంకటేశ్వరరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
నటీనటులు: సావిత్రి, అక్కినేని నాగేశ్వరరావు
గేయ రచయితా: శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు)
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనె బలి చేయకు
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
గాలి వీచి పూవుల తీగ నేల వాలి పోగ
జాలి వీడి అటులేగాని వదులవైతువా
చేర దీసి నీరు పోసి చిగురించ నీయవా
|| కల కానిది విలువైనది ||
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
అలముకున్న చీకటిలోనె అలమటించనేల
కలతలకే లొంగి పోయి కలువరించనేల
సాహసమను జ్యోతిని చేకొని సాగిపో
|| కల కానిది విలువైనది ||
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి శుఖమున్నదిలే
అగాధమౌ జలనిధిలోన ఆణిముత్యమున్నటులే
శోకాల మరుగున దాగి సుఖమున్నదిలే
ఏది తనంత తానై నీ దరికి రాదు
శోధించి సాధించాలి అదియే ధీర గుణం
|| కల కానిది విలువైనది ||
1, జులై 2010, గురువారం
ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలు
డాక్టర్ మంతెన సత్యనారాయణరాజు గారి ప్రకృతి జీవన విధానం/వైద్య సలహాల పుణ్యమా అని ఆంధ్రులు తినే తిండి లో ఎంత చెడు, చేదు ఉందో తెలుస్తోంది. ఆయన పుస్తకాలు బజారులో దొరుకుతున్నాయి. మీకు వీలైనప్పుడు కొనుక్కోండి. లేదా కేబుల్ టీవిలో చానల్స్ తిప్పుతూ ఉంటే మీకు ఆయన తప్పకుండ ఏదో ఒక ఛానెల్లో కనిపిస్తారు. కొన్నాళ్ళు శ్రద్ధగా ఆయన కార్యక్రమాలు చూస్తే మీకు వివరాలు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు చెబుతారు. కొన్ని ముఖ్యాంశాలు.
౧.మనం తినే ఆహారంలో ఉప్పు అన్నిటికన్నా ప్రమాదకరమైన వస్తువు. మీకు వీలయితే ఉప్పును పూర్తిగా మానేయ్యండి. మరి శరీరానికి ఉప్పు ఎలా?. - ప్రకృతి మనకు ఇచ్చే ప్రతి కూరగాయలో ఉప్పు మన శరీరానికి తగినంత ఉంటుంది. అందుకని ఇంకా వేరేగా ఉప్పు వెయ్యక్కర్లేదు వంటల్లో. అబ్బో ఎలా అండీ తినటం. కష్టమే. ఉప్పు మానేసిన వాళ్ళలో ఫలితాలు చూసాను. చక్కర కన్నా ఉప్పు మధుమేహ వ్యాధిగ్రస్తులకు శాపం. ఎందుకు ఎలా అనేది ఆయన పుస్తకాల్లో వివరంగా ఉంది.
౨. రెండో ప్రేమాదకరమైన ఆహారం పాలిష్ పట్టిన బియ్యంతో వండిన అన్నం, పొట్టు తీసిన గోధుమలతో పట్టిన గోధుమ పిండి. ఆంధ్ర ప్రదేశ్ లో మధుమేహరోగులు దేశమంతటి కన్నా ఉండటానికి కారణం ఈ పాలిష్ పట్టిన ధాన్యంతో చేసిన ఆహారం. కాబట్టి తప్పకుండ పొట్టు తీయని ముడి బియ్యపు అన్నము, పొట్టుతో కూడిన గోధుమ పిండితో చేసిన రొట్టెలు/పుల్కాలు తినండి.
౩. మూడో ప్రమాదకరమైన వస్తువు వంట నూనె. శరీరంలోకి వంటనూనె ద్వారా వెళ్లే కొవ్వు అస్సలు అవసరంలేదుట. ప్రకృతి మనకు ఇచిన పప్పులు, గింజలు (వేరుశనగ, నువ్వులు వగైరా), కొబ్బరి లాంటివి మితంగా తీసుకుంటే చాలుట. కాబట్టి వేపుళ్ళు, నూనెలో ముంచిన కూరలు మానటమే కాదు, అసలు నూనె వెయ్యకుండా కూరలు చేసుకుంటే మంచిది.
పై మూడు పాటిస్తే చాలా మటుకు శరీరం బాగుపడుతుంది. ఎందుకంటే - ఉప్పులేకుండా, నూనెలేకుండా తినాలి అంటే ఫస్ట్ మానెయ్యాల్సింది ఊరగాయలు. దానితో సగం రోగాలు అదుపులోకి వస్తాయి.
వేరే చిట్కాలు:
౧. ఎప్పుడైనా తీపి తినాలి అనిపిస్తే పంచదార, బెల్లం కాకుండా తేనె, ఖర్జూరపు పొడి ప్రత్యామ్నాయాలుగా వాడండి.
౨. మొలకలు, పండ్లు, ఉడకబెట్టిన కూరలు ఆహారంలో ముఖ్యభాగం కావాలి.
౩. నూనె వెయ్యకుండా పెసరట్టు, పొట్టు మినపపప్పుతో చేసిన ఆవిరి కుడుములు లాంటివి ఉదయం ఫలహారంలో తినొచ్చు. ఇడ్లి/దోస/పూరి లాంటివాటితో పైన '౨' లో చెప్పిన సమస్యలే. కాబట్టి ప్రకృతి ప్రసాదించిన పండ్లు, మొలకలు, కూరగాయలు తింటే మంచిది.
౪. నూనె వెయ్యని పుల్కాలు, ముడి బియ్యంతో అన్నం - ఇవి ముఖ్య ఆహారంలో (మధ్యాహ్నం, సాయంత్రం) మితంగా తీసుకోవచ్చు.
౫. సాయంకాలం భోజనం వీలైనంత త్వరగా తినండి.
౬. మంచి నీళ్ళు బాగా తాగండి. ఉదయం లేవగానే ౧-౨ లీటర్లు, ప్రతి భోజనం తర్వాత ఒక గంటకి, భోజనానికి ఒక గంటముందు మళ్ళీ తాగండి.
౭, ద్రాక్ష, ఆపిల్ లాంటి పళ్ళు తినేటప్పుడు బాగా కడిగి శుభ్రం చేసి తినండి ఎందుకంటే వీటిమీద చాలా క్రిమిసంహారకాలు ఉంటాయి. అలాగే కాబేజీ, కాలీఫ్లవర్ లాంటి కూరగాయలను బాగా కడిగి, పూర్తిగా ఉడికిన తర్వాతే తినాలి.
౮. పులుపుకు ప్రత్యామ్నాయంగా నిమ్మ రసం, కాలాన్ని బట్టి దొరికే ఉసిరి, చింత కాయలు, మామిడికాయలు, దానిమ్మ గింజలు వాడుకోవచ్చు.
౯. కారం కావాలంటే ఎండుకారం/ఎందు మిరపకాయలకు బదులుగా పాచి మిరపకాయ వాడండి.
ఇవండీ నాకు తెలిసిన సూత్రాలు.మీరు పాటించి చూడండి. ఆరోగ్యకరమైన ఆహారం తింటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయిట. ఆహారానికి తోడు మంచి వ్యాయామం (ప్రాణాయామం, యోగాసనాలు) చేస్తే మీరు రెండు వందల ఏళ్ళు అయిన బతకొచ్చు అని రాజు గారి సలహా. మీరు పాటిస్తున్నారా ప్రసాద్ గారు అంటే ప్రయత్నిస్తున్నాను, ఫలితాలు మెల్లగా కనిపిస్తున్నాయి అని మాత్రం చెప్పగలను. బాగా పాటిస్తున్న వాళ్ళలో ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. అది సత్యం.

రాష్ట్ర రాజకీయ పార్టీల భవిష్యత్తు
2009 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సానుభూతి పవనాలు కానీ, ప్రభుత్వ వ్యతిరేక వోటు కానీ ఉండే పరిస్థితులు లేవు అని తెలిసి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు టీడీపీకి పట్టు ఉన్న గోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో మరియు ఉత్తర కోస్తా ప్రాంతంలో ప్రజారాజ్యం రంగంలోకి దిగే పరిస్థితులు తెచ్చారు. దానితో ఆ ప్రాంతాల్లో టీడీపీ బీసీ వోటుబ్యాంకుకు గండి పడింది. అందుకనే బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్ మరియు బాబు అవినీతి, తెలుగు ఆత్మగౌరవం లాంటి నినాదాలతో ఎంత హోరాహోరీగా పర్యటించినా, అవకాశవాద రాజకీయంతో తెలంగాణరాష్ట్రసమితితో పొత్తు పెట్టుకుని మహాకూటమి అవతారమెత్తి తెలంగాణ ప్రాంతంలో పోటీ చేసినా, వైఎస్సార్ విజేతగా నిలిచి ప్రతిపక్ష పార్టీ ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీయగలిగారు.
సరే ఇదంతా ఒక ఎత్తయితే, దురదృష్టకరమైన పరిస్థితిలో వైఎస్సార్ దుర్మరణం మరణశయ్య మీద ఉన్న టి.ఆర్.ఎస్ కు ప్రాణంపోసి నట్టయింది. ప్రకృతి విపత్తులు, హైదరాబాద్ ఆరవ జోన్ వివాదం, రోశయ్య-జగన్ మధ్య జరిగిన అంతర్యుద్ధం ఇవి టి.ఆర్.ఎస్ కు మంచి ఊతం ఇచ్చాయి. దానితో ప్రభంజనంలా కేసీఆర్ దీక్షచేసి ఉద్యమాన్ని ప్రజ్వలించారు. దీనికి మన చిదంబరం గారు ఆజ్యం పోసి, తెలంగాణ ప్రక్రియ మొదలయ్యిందని చెప్పగానే తమ రాజకీయ ఉనికికే ఎసరు అని గ్రహించిన సీమాంధ్ర నేతలు పార్టీలకతీతంగా ఏకమై మూకుమ్మడి రాజీనామాలు చేసి సంక్షోభం సృష్టించారు. ఇక ఆంద్ర రాష్ట్రం రావణ కాష్టమయ్యింది ఒక రెండు నెలలు. దానితో దిమ్మ తిరిగిన మేడం, గృహ శాఖామాత్యులు మనముందు శ్రీకృష్ణ కమీటిని వేసి ఆ మంటలను కొన్నాళ్ళు బందీ చేశారు.
ఇదండీ సంగతి. వీటన్నిటి మధ్య తెలుగు దేశం పార్టీ నిట్టనిలువుగా చీలింది (ప్రత్యేకరాష్ట్రం వర్సెస్ సమైక్య రాష్ట్రం నినాదంపై). బాబు తన చాణక్యుడి బుర్రను ఉపయోగించి తెలంగాణ ప్రాంతపు ఎమ్మెల్యేలలో గట్టి వాడైన నాగం జనార్ధన్ రెడ్డిని ఆ ప్రాంతపు ప్రజాప్రతినిధుల నాయకుడిగా నిర్ణయించి మీడియాలో ఆయనతో మాట్లాడించి తను తెరవెనక నాటకం నడిపించారు. తెలంగాణ, సీమాంధ్ర తనకు రెండుకళ్ళు అని డైలాగు కొట్టి తనను ప్రశ్నించిన తెలంగాణ వాదుల (తెలంగాణ ప్రాంతపు కాంగ్రెస్ నేతలు, టీఆరెస్, భాజపా) నోళ్ళు మూయించారు. అలా పార్టీని ఇంకా తన గుప్పిట ఉంచుకోగాలిగారు ఇప్పటివరకు. వాళ్ళు రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో లేరు కాబట్టి ఏమి చేయలేమన్న వాదనను ముందుకు నెట్టి, రెండు చోట్లా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి వాళ్ళే తెలంగాణ తేవాలి, వాళ్లకు చిత్తశుద్ధి లేదు అని కూడా వాదిస్తూ వచ్చారు. చాలామటుకు బాబు రాజనీతి పనిచేసినట్టే లెక్క. ఈలోపల కాంగ్రెస్ పార్టీ లో జరిగిన బాగోతం అందరికి తెలిసిందే.
మరి ఇక ముంది ఏమిటి?.
౧. అంతర్గతంగా తెలంగాణ అంటే ఇష్టం లేని బాబు, ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణపై బహిరంగంగా వ్యతిరేకించలేరు. అలా చేస్తే ఆ పార్టీపై తన ఏకచ్చత్రాధిపత్యానికి ముప్పే. అలా అని ముందు అడుగు వేసి తెలంగాణకు అనుకూలం, ఎట్టి పరిస్థితిలో అయినా తెలంగాణ రావాల్సిందే ఆనే నినాదంతో ఉప ఎన్నికల్లోకి వెళ్ళలేరు. ఇక వ్యూహం ఎలా ఉంటుంది? - కాంగ్రెస్ పార్టీ అసమర్థత, టీఆరెస్ అవకాశవాదం లాంటి నినాదాలతో వెళ్ళాలి. ఇది అంతగా పని చెయ్యని వ్యూహం. కాబట్టే నాయుడుకి ఈ ఉప ఎన్నికలపై పెద్దగా ఆశలు ఉండకపోవచ్చు. కాంగ్రెస్ ఓటమి తన గెలుపు అని అనుకోవచ్చు కానీ అది టీడీపీకి కూడా ఓటమి అని గ్రహించి తెలంగాణపై తన అభిప్రాయం కుండబద్దలు కొట్టినట్టు చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇక పార్టీ అంతర్గతం చూస్తే, అటు బాలయ్య, సింహాద్రి, ఇటు కొందరు ముఖ్యమైన తెలంగాణ నాయకులు (ఎర్రబెల్లి, కడియం, నాగం) నాయకత్వాన్ని గమనిస్తున్నారు. బాబు ఏమాత్రం ఏమరపాటు చూపినా పార్టీలో అలజడి, నాయకత్వ మార్పుకోసం డిమాండ్లు తప్పవు. బాలయ్యను వియ్యంకుడిని చేసుకొని, సింహాద్రిని అక్కవైపు బంధుత్వంలో కలిపి తన స్థానాన్ని ఇప్పటికి కాపడుకున్నట్టు అనిపిస్తున్నా రాజకీయంలో రక్తసంబంధం, చుట్టరికం ఒక స్థాయి తర్వాత గుర్తు ఉండదు అని బాబుగారి గతం మనకందరికీ విస్పష్టంగా చెబుతోంది.
౨. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం జగన్ ని బలహీన పరిచే ప్రయత్నంలో ఉంది. కొంతవరకు ఆ యత్నంలో సఫలమయినట్టే. రోశయ్య లేదా ఇంకొకరు ముఖ్యమంత్రి గా డిసెంబర్ ౩౧ వరకు కొనసాగుతారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే నివేదిక డివైడెడ్ గా ఉంటుంది అని ఇప్పటికే అందరికి తెలిసిన విషయం - అంటే - తెలంగాణ సెంటిమెంట్ చాలా బలంగా ఉండి, సమస్య పరిష్కారానికి ప్రత్యేక రాష్ట్రమొక్కటే మార్గం అని చెప్తుంది ఆ కమిటీ. కానీ, మిగిలిన ప్రాంతాల వాళ్ళనుంచి చాలా ఉత్తర దక్షిణ ధృవాల్లాంటి అభిప్రాయలు, సమైక్యవాదం కూడా బలంగా ఉంది అని, ఆయ ప్రాంతపు ప్రజల మనోభావాలు కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెప్తుంది ఈ కమిటి. మళ్ళీ మొదటికేగదా?. దీనితో టీఆరెస్ మళ్ళీ ఉద్యమం, ఉపఎన్నికల్లో గెలిచిన సమరోత్సాహంలో ఉద్యమాన్ని బలంగా ముందుకు తీసుకెళ్తుంది.
౩. ఆ మధ్యలో, కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల్లో దెబ్బతిని, ప్రభుత్వాన్ని కూల్చటానికి పొంచి ఉన్న రోశయ్య వ్యతిరేకులు (ఇందులో జగన్ కూడా), తెలంగాణపై తమకు ఉనికి ఉండదు అని ఇంకొన్ని పనికిమాలిన ఎత్తులు వేస్తూ, రోశయ్యను తిడుతూ, ఇందైరేక్ట్ గా అమ్మగారి మీద బాధ్యత పెడుతూ, అటు టీఆరెస్, ఇటు టీడీపీ, ఇంకోపక్క ప్రరాపాతో నాలుగు స్తంభాలాట ఆడుతూ - బలహీన పడే పార్టీ కాంగ్రెస్సే. మరీ ఇబ్బంది అయితే రోశయ్య గారిని దింపి ఒక డమ్మీ తెలంగాణవాదిని ముఖ్యమంత్రి చేసి, ఆత్మవంచన చేస్తూ కాలం భారంగా గడిపేస్తారు.
మొత్తానికి, నా ఉద్దేశంలో, రాజకీయంగా రెండు ప్రధాన పక్షాలకి చాలా పరీక్షాకాలం. అధికార వ్యతిరేకతతో కాంగ్రెస్ కి కొంత ఎక్కువ. ఉపఎన్నికలలో ఘనవిజయం సాధిస్తే టీఆరెస్ బాగా బలపడటం, కాంగ్రెస్ రాజనీతి, వివిధప్రాంతాల ప్రజల మనోభావాల మధ్య సతమతమై ఒక ప్రాంతంలో ఉనికి కోల్పోయే పరిస్థితిలో కాంగ్రెస్, టీడీపీ - ఇదండీ మనకి వచ్చే ఏడాది పాటు ఉండబోయే రాజకీయ ముఖచిత్రం.
ఏ రాయయితేనేమి? . నష్టం మనలో ప్రతి ఒక్కరికి.
౧. అభివృద్ధి వైపు దూసుకుపోతున్న రాష్ట్రాని భ్రష్టు పట్టించాయి రాజకీయ పార్టీలు.
౨. రాష్ట్రం ప్రాంతాల వారీగా ప్రజల మనస్సులో విడిపోయినట్టే.
౩. ఇలానే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేంతవరకు రాష్ట్రం ఒంటి కాలి మీద పడుతూ లేస్తూ ఉంటుంది. ఈలోపల కొన్ని అమాయకపు ప్రాణాల బలి, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం, ప్రాంతీయ విద్వేషాలు, రెచ్చగొట్టే భావాలతో టీవీ చానెళ్ళు మారుమ్రోగుతుంటాయి.
ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో నాదొక విన్నపం మన రాజధానిలో కూచున్న న్యాయనిర్ణేతలకు:
అమ్మా సోనియా, అయ్యా చిదంబరం గారు, వీరప్ప మొయిలీ గారు, అహ్మద్ పటేల్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు,
కొంచెం ప్రజల వైపునుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. గట్టి నిర్ణయం కావాలి కానీ అందరిని మెప్పించేది కాదు. తెలంగాణ సమస్యకు అందరికి ఆమోదయోగ్యమయిన పరిష్కారం లేదు. అందరు కొంత సర్దుకుంటే తప్ప ఈ సమస్యను అధిగమించలేరు. చిదంబరంగారు, హోం శాఖ అంటే నాలుగు మంచి ఇంగ్లీష్ సంభాషణలు చేసి, విలేఖరులను బోల్తా కొట్టించి, పొగరుగా మాట్లాడి నాకు చాలా అనుభవం, జ్ఞానము ఉన్నాయి అని మనం కాలరు ఎగరేసుకుంటే సరిపోదు. ఒక సర్దార్ వల్లభాయిపటేల్ లా జనహితము, దేశహితము అయిన నిర్ణయం తీసుకుని దానికి కట్టుబడి, అందరిని ఒప్పించి, అవసరమైతే సామదానభేదదండోపాయాలు ఉపయోగించి పరిష్కరించాలి. ఖద్దరు లుంగి, తెల్ల చొక్కా వేసుకుంటే, లేక తెల్ల చీర కట్టుకుంటే గాంధేయులు అయిపోరు. మీ మనస్సులో, ఆలోచనల్లో, ఆచరణలో దృఢసంకల్పం, చెదరని ఆత్మ విశ్వాసం, దేశ ప్రయోజనాలను కాపాడే ఉన్నత విలువల్ని చూపించండి. ఈ సమస్య తప్పకుండ పరిష్కారమవుతుంది.

రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఇవాళ్ళ ఎందుకో పొద్దునే ఈ పాట విన్నాను రేడియోలో. సున్నితమైన శృంగారం, వర్ణన గొప్ప సాహిత్యంతో నారాయణరెడ్డి కలాన ఈ గేయంగా అవతరించింది. మైసూరులో రవివర్మ గీసిన చిత్రాలు నిలువెత్తున ఒక ప్రదర్శనశాలలో పెట్టారు. ఆ చిత్రాలను చూసిన తర్వాత సినారె గారు ఈ పాటను ఏ సందర్భానికి రాసారో అర్థం అయ్యింది. తేట తేనె తెలుగులో, సామాన్య భాషలో నాయికను నాయకుడు వర్ణించాడు. కథానాయిక జయచిత్రకు, రవివర్మ చిత్రాలలో ఉన్న స్త్రీలకు పోలిక అని కాదు, ఆ పాత్రలో కథానాయకుడి ప్రేమ, ఆరాధన అలా కనిపించిందేమో. అందుకే ఈ పాట బాలు పాడిన పాటల్లో ఒక మరపురాని గీతంగా మిగిలిపోతుంది.
చిత్రం: రావణుడే రాముడైతే (1978)
నేపథ్యగాయకులు: బాలసుబ్రహ్మణ్యం, జానకి
సంగీత దర్శకుడు: జి.కె. వెంకటేష్
గేయ రచయిత: సినారె
నటీనటులు: జయచిత్ర, నాగేశ్వరరావు
ఆ ఆ ఆ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ ఆ ఆ రవి చూడని పాడని నవ్యనాదానివో |రవివర్మకే|
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్నుదాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ నీ పాటనే పాడనీ |రవివర్మకే|
ఏ గగనమో కురులజారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ కదలాడనీ పాడనీ |రవివర్మకే|

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి
వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దే...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...