ఉదయం యోగాలో సూర్యనమస్కారాలు చేసెటప్పుడు వచ్చిన కవితావేశంలో రాసిన సూర్య నమస్కారం:
సిత్రాల సిత్రాల సూరీడు పొద్దున్నె నిద్దుర లేపాడు
వేడి వేడి బాణాల సూరీడు రేతిరిని దాటి వచ్చాడు
దండాలు దండాలు సూరీడు నీ వెలుగుతో బతుకుల కాపాడు
ఏడు గుర్రాల సూరీడు మా భూదేవిని సల్లంగా నువు సూడు
ఎర్రని పండనుకొని సూరీడు నిను హనుమయ్య మింగగ వచ్చాడు
ఎండ మండించిన సూరీడు మేఘాలని వర్షంగా పంపాడు
నువ్వు రాకుంటే సూరీడు మాకు బువ్వ బతుకు లేదు సూరీడు
నువ్వు రాకుంటే సూరీడు చెట్టూ చేమా ఏడ్చేను సూరీడు
చంద్రునితో కలిసి సూరీడు ఈ పుడమిని ఏలూ సూరీడు
ప్రత్యక్ష దైవము సూరీడు నీ పాదాల మొక్కుతా సూరీడు
సిత్రాల సిత్రాల సూరీడు మా ఆరోగ్యదాత ఈ సూరీడు
మంచి రిధం వచ్చింది ప్రసాద్, పాటలు రాస్తూ ఉండండి.
రిప్లయితొలగించండి