10, నవంబర్ 2010, బుధవారం
శీర్షిక మార్పు
ఉగాది పచ్చడి అని షడ్రుచులు కనిపించేలా రాద్దాము అనుకుని మొదలు పెట్టిన బ్లాగ్, ఇవాళ అంతర్యామిగా మార్చాలని ఎందుకు అనిపించింది?. కారణం సరిగ్గా తెలియటం లేదు - తెలియని శక్తి ఏదో నన్ను ఇలా భగవంతునికి సంబంధించిన వ్యాసాలే రాయటానికి ముందుకు నడుపుతోంది. ఎందుకు అనేది తెలుసుకోవటానికి కూడా మనసు అంగీకరించటం లేదు. మార్గము, గమ్యము మళ్లీ ఏమైనా మారితే అప్పుడు ఆలోచిస్తాను ఏమి చెయ్యాలో. ఒక రకంగా ఆ సర్వేశ్వరుని గ్రహించటానికి ఎన్ని మార్గాలో? వాటిలో అణురేణువు శాతం గురించి మన అనుభవాలను, ఆలోచనలను రాయ గలిగినా, అది ఒక జీవిత కాలపు సార్థకమే. అందుకని అంతర్యామి - అంతయును నీవే అన్న శీర్షిక నిర్ణయించి మారుస్తున్నాను.
నమకమ్ - తాత్పర్యము
రుద్రాధ్యాయములో (శ్రీ రుద్రం) నమకం-చమకం ముఖ్యమైనవి. 'నమ' తో అంతమయ్యే శ్లోకాలు నమకము గాను, 'చమే' తో అంతమయ్యే శ్లోకాలు చమకంగా చెప్పబడ్డాయి. ఇందులో నమకము రుద్రునికి భక్తుని ప్రార్థనగా, చమకము భక్తునికి రుద్రుని ఆశీర్వచనం గా చెప్పబడ్డాయి. ఈ నమక చమకాలు ఏ విధంగా పఠనం చేయాలి అన్నది చేసే రుద్ర విధిని బట్టి - లఘు రుద్రం, మహా రుద్రం, అతి రుద్రం, శత రుద్రం ఇలా. ఆ నమక చమకాల్లోని నమకం, దాని తాత్పర్యము మీకోసం. ఒక వారం పది రోజుల్లో చమకం, తాత్పర్యము కూడా ప్రచురిద్దామని నా అభిలాష. పరమేశ్వరుడి అనుగ్రహం కోసం అందరం ప్రార్థిద్దాం. నమకం శ్రవణం యూట్యూబ్ లంకెలు - మొదటి భాగం రెండో భాగం మూడో భాగం.
శ్రీ రుద్రప్రశ్నః నమకమ్అథ ప్రథమోఽనువాకః
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః
యాత ఇషుః శివతమా శివం బభూవ తే ధనుః
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయా
యా తే రుద్ర శివా తనూరఘోరాపాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్తవే
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ంసీః పురుషం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛా వదామసి
యథా నః సర్వమిజ్జగదయక్ష్మగ్ం సుమనా అసత్
అధ్యవోచ దధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీగ్ంశ్చ సర్వాం జంభయన్త్సర్వాశ్చ యాతుధాన్యః
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుః సుమంగలః
యే చేమాగ్ం రుద్రా అభితో దిక్షు
శ్రితాః సహస్రశోవైషాగ్ం హేడ ఈమహే
అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహితః
ఉతైనం గోపా అదృశన్నదృశన్నుదహార్యః
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి నః
నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః
ప్రముంచ ధన్వనస్త్వముభయోరార్త్నియోర్జ్యాం
యాశ్చ తే హస్త ఇషవః
పరా తా భగవో వప
అవతత్య ధనుస్త్వగ్ం సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానాం ముఖా శివో నః సుమనా భవ
విజ్యం ధనుః కపర్దినో విశల్యో బాణవాగ్ం ఉత
అనేశన్నస్యేషవ ఆభురస్య నిషన్గథిః
యా తే హేతిర్మీఢుష్టమ హస్తే బభూవ తే ధనుః
తయాఽస్మాన్విశ్వతస్త్వమయక్ష్మయా పరిబ్భుజ
నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే
పరి తే ధన్వనో హేతిరస్మాన్వృణక్తు విశ్వతః
అథో య ఇషుధిస్తవారే అస్మన్నిధేహి తం
హస్తే దిక్ష్విషవ ఉభాభ్యాం ద్వావిగ్ంశతిశ్చ
ఇతి ప్రథమోఽనువాకః
నమస్తే అస్తు భగవన్విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ
త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః ఓమ్
అథ ద్వితీయోనువాకః
నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో
నమో వృక్షేభ్యో హరికేశేభ్యః పశూనాం పతయే నమో
నమః సస్పింజరాయ త్విషీమతే పథీనాం పతయే నమో
నమో బభ్లుశాయ వివ్యాధినేఽన్నానాం పతయే నమో నమో
హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో
నమో భవస్య హేత్యై జగతాం పతయే నమో
నమో రుద్రాయాతతావినే క్షేత్రాణాం పతయే నమో
నమః సూతాయాహంత్యాయ వనానాం పతయే నమో
నమః రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో
నమో మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో
నమో భువంతయే వారివస్కృతాయౌషధీనాం పతయే నమో
నమ ఉచ్చైర్ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమో
నమః కృత్స్నవీతాయ ధావతే సత్వనాం పతయే నమః
వనానాం పతయే నమో నమ ఏకాన్నత్రిగ్ంశచ్చ
ఇతి ద్వితీయోనువాకః
అథ తృతీయోనువాకః
నమః సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో
నమః కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమో
నమో నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో
నమో వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో
నమో నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమః
సృకావిభ్యో జిఘాసద్భ్యో ముష్ణతాం పతయే నమో
నమోఽసిమద్భ్యో నక్తం చరధ్భ్యః ప్రకృన్తానాం పతయే నమో
నమ ఉష్ణీషిణే గిరిచరాయ కులుంచానాం పతయే నమో
నమః ఇషుమధ్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో
నమ ఆతన్వానేభ్యః ప్రతిదధానేభ్యశ్చ వో నమో
నమ ఆయచ్ఛధ్భ్యో విసృజద్భ్యశ్చ వో నమో
నమో ఽస్యద్భ్యో విధ్ధ్యద్భ్యశ్చ వో నమో
నమ ఆసీనేభ్యః శయానేభ్యశ్చ వో నమో
నమః స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చ వో నమో
నమ స్తిష్ఠధ్భ్యో ధావద్భ్యశ్చ వో నమో
నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వో నమో
నమో అశ్వేభ్యోఽశ్వపతిభ్యశ్చ వో నమః
కులు ఞ్చానాం పతయే నమో నమోశ్వపతిభ్య స్త్రీణి చ
ఇతి తృతియోఽనువాకః
అథ చతుర్థోఽనువాకః
నమ ఆవ్యధినీభ్యో వివిధ్యన్తీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృగ్ంహతీభ్యశ్చ వో నమో నమో
గృత్సేభ్యో గ్రుత్సపతిభ్యశ్చ వో నమో నమో
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో
గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చ వో నమో నమో
మహద్భ్యః క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
రథిభ్యోరథేభ్యశ్చ వో నమో నమో రథేభ్యః
రథపతిభ్యశ్చ వో నమో నమః
సేనాభ్యః సేనానిభ్యశ్చ వో నమో నమః
క్షత్తృభ్యః సంగ్రహీతృభ్యశ్చ వో నమో నమ
స్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమః
కులాలేభ్యః కర్మారేభ్యశ్చ వో నమో నమః
పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చ వో నమో నమ
ఇషుకృద్భ్యో ధన్వకృధ్భ్యశ్చ వో నమో నమో
మృగయుభ్యః శ్వనిభ్యశ్చ వో నమో నమః
శ్వభ్యః శ్వపతిభ్యశ్చ వో నమః
రథేభ్యః శ్వపతిభ్యశ్చ ద్వేచ
ఇతి చతుర్థోఽనువాకః
అథ పంచమోఽనువాకః
నమో భవాయ చ రుద్రాయ చ నమః శర్వాయ చ పశుపతయే చ
నమో నీలగ్రీవాయ చ శితికణ్ఠాయ చ
నమః కపర్దినే చ వ్యుప్తకేశాయ చ
నమః సహస్రాక్షాయ చ శతధన్వనే చ
నమో గిరిశాయ చ శిపివిష్టాయ చ
నమో మీఢుష్టమాయ చేషుమతే చ నమో హ్రస్వాయ చ వామనాయ చ
నమో బృహతే చ వర్షీయసే చ
నమో వృద్ధాయ చ సంవృధ్ధ్వనే చ
నమో అగ్రియాయ చ ప్రథమాయ చ నమ ఆశవే చాజిరాయ చ
నమః శీఘ్రియాయ చ శీభ్యాయ చ
నమ్ ఊర్మ్యాయ చావస్వన్యాయ చ
నమః స్రోతస్యాయ చ ద్వీప్యాయ చ
సంవృద్ధ్వనే చ పంచవిగ్ం శతిశ్చ
ఇతి పంచమోఽనువాకః
అథ షష్ఠోఽనువాకః
నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ
నమః పూర్వజాయ చాపరజాయ చ
నమో మధ్యమాయ చాపగల్భాయ చ
నమో జఘన్యాయ చ బుధ్నియాయ చ
నమః సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ
నమో యామ్యాయ చ క్షేమ్యాయ చ
నమ ఉర్వర్యాయ చ ఖల్యాయ చ
నమః శ్లోక్యాయ చావసాన్యాయ చ
నమో వన్యాయ చ కక్ష్యాయ చ
నమః శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ
నమ ఆశుషేణాయ చాశురథాయ చ
నమః శూరాయ చావభిన్దతే చ
నమో వర్మిణే చ వరూథినే చ
నమో బిల్మినే చ కవచినే చ
నమః శ్రుతాయ చ శ్రుతసేనాయ చ
ప్రతిశ్రవాయ చ పంచవిగ్ంతిశ్చ
ఇతి షష్ఠోఽనువాకః
అథ సప్తమోఽనువాకః
నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో ధృష్ణవే చ ప్రమృశాయ చ
నమో దూతాయ చ ప్రహితాయ చ నమో నిషంగిణే చేషుధిమతే చ
నమస్తీక్ష్ణేషవే చాయుధినే చ నమః స్వాయుధాయ చ సుధన్వనే చ
నమః స్రుత్యాయ చ పథ్యాయ చ నమః కాట్యాయ చ నీప్యాయ చ
నమః సూద్యాయ చ సరస్యాయ చ నమో నాద్యాయ చ వైశన్తాయ చ
నమః కూప్యాయ చావట్యాయ చ నమో వర్ష్యాయ చావర్ష్యాయ చ
నమో మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ ఈఘ్రియాయ చాతప్యాయ చ
నమో వాత్యాయ చ రేష్మియాయ చ
నమో వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ
వైశన్తాయ చ త్రిగ్ం శచ్చ
ఇతి సప్తమోఽనువాకః
అథ అష్టమోఽనువాకః
ఇతి సప్తమోఽనువాకః
అథ అష్టమోఽనువాకః
నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చారుణాయ చ
నమః శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ
నమో అగ్రేవధాయ చ దూరేవధాయ చ
నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో
నమస్తారాయ నమః శంభవె చ మయోభవె చ
నమః శంకరాయ చ మయస్కరాయ చ
నమః శివాయ చ శివతరాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యాయ చ
నమః పార్యాయ చావార్యాయ చ
నమః ప్రతరణాయ చోత్తరణాయ చ
నమ ఆతార్యాయ చాలాద్యాయ చ
నమః శష్ప్యాయ చ ఫేన్యాయ చ నమః
సికత్యాయ చ ప్రవాహ్యాయ చ
శివతరాయ చ త్రిగ్ంశచ్చ
ఇతి అష్టమోఽనువాకః
అథ నవమోఽనువాకః
ఇతి అష్టమోఽనువాకః
అథ నవమోఽనువాకః
నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ
నమః కిగ్ంశిలాయ చ క్షయణాయ చ
నమః కపర్దినే చ పులస్తయే చ
నమో గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ
నమస్తల్ప్యాయ చ గేహ్యాయ చ
నమః కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ
నమో హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ
నమః పాగ్ంసవ్యాయ చ రజస్యాయ చ
నమః శుష్క్యాయ చ హరిత్యాయ చ
నమో లోప్యాయ చోలప్యాయ చ
నమ ఊర్వ్యాయ చ సూర్మ్యాయ చ
నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ
నమోఽపగురమాణాయ చాభిఘ్నతే చ
నమ ఆఖ్ఖిదతే చ ప్రఖ్ఖిదతే చ
నమో వః కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో
నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో
నమ ఆనిర్హతేభ్యో నమ ఆమీవత్కేభ్యః
ఉలప్యాయ చ త్రయస్త్రిగ్ంశచ్చ
ఇతి నవమోఽనువాకః
అథ దశమోఽనువాకః
ఇతి నవమోఽనువాకః
అథ దశమోఽనువాకః
ద్రాపే అంధసస్పతే దరిద్రన్నీలలోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మారో మో ఏషాం కిన్చనామమథ్
యా తే రుద్ర శివా తనూః శివా విశ్వాహ భేషజీ
శివా రుద్రస్య భేషజీ తయా నో మృడ జీవసే
ఇమాగ్ంరుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతిం
యథా నః శమసధ్ద్విపదే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే ఆస్మిన్ననాతురం
మృడా నో రుద్రోతనో మయస్కృధి క్షయద్వీరాయ నమసా విధేమ తే
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా తదశ్యామ తవ రుద్ర ప్రణీతౌ
మా నో మహాన్తముత మా నో అర్భకం
మా న ఉక్షంత ముత మా న ఉక్షితం
మా నో వధీః పితరం మోత మాతరం ప్రియా మానస్తనువో రుద్ర రీరిషః
మానస్తోకే తనయే మా న ఆయుషి మా నో గోషు మా నో అశ్వేషు రీరిషః
వీరాన్మా నో రుద్ర భామితోఅవధీర్హవిష్మన్తో నమసా విధేమ తే
ఆరాత్తే గోఘ్న ఉత్త పూరుషఘ్నే క్షయద్వీరాయ సుమ్నమస్మే తే అస్తు
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ నః శర్మ యచ్ఛ ద్విబర్హాః
స్తుహి శ్రుతం గర్తసదం యువానం మృగన్న భీమముపహత్నుముగ్రం
మ్రుడా జరిత్రే రుద్ర స్తవానో అన్యన్తే అస్మన్నివపన్తు సేనాః
పరిణో రుద్రస్య హేతిర్వృణక్తు పరి త్వేషస్య దుర్మతిరఘాయోః
అవ స్థిరా మఘవద్భ్యస్తనుష్వ మీఢ్వస్తోకాయ తనయాయ మృడయ
మీఢుష్టమ శివతమ శివో నః సుమనా భవ
పరమే వృక్ష ఆయుధం నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం విభ్రదాగహి
వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవః
యాస్తే సహస్రగ్ం హేతయోఽన్యమస్మన్నివపన్తు తాః
సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హ్తయః
తాసామీశానో భగవః పరాచీనానా ముఖా కృధి
అస్మిగ్గ్ం స్తనువ స్తుహి పినాక మేకాన్న త్రిగ్ం శచ్చ
ఇతి దశమోఽనువాకః
అథ ఏకాదశోఽనువాకః
ఇతి దశమోఽనువాకః
అథ ఏకాదశోఽనువాకః
సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యాం
తేషాగ్ంసహస్రయోజనేఽధన్వాని తన్మసి
అస్మిన్ మహత్యర్ణవేఽంతరిక్షే భవా అధి
నీలగ్రీవాః శితికణ్ఠాః శర్వా అధః క్షమాచరాః
నీలగ్రీవాః శితికణ్ఠా దివగ్ం రుద్రా ఉపశ్రితాః
యే వృక్షేషు సస్పింజరా నీలగ్రీవా విలోహితాః
యే భూతానామధిపతయో విశిఖాసః కపర్దినః
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధః
యే తీర్థాని ప్రచరన్తి సృకావన్తో నిషంగిణః
య ఏతావంతశ్చ భూయాగ్ంసశ్చ దిశో రుద్రా వితస్థిరే
తేషాగ్ంసహస్రయోజనే అవధన్వాని తన్మసి
నమో రుద్రేభ్యో యే పృథివ్యాం యేఽంతరిక్షే
యే దివి యేషామన్నం వాతో వర్షమిషవస్తేభ్యో దశ
ప్రాచీర్దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచీర్దశోర్ధ్వాస్తేభ్యో
నమస్తే నో మృడయన్తు తే యం ద్విష్మో యశ్చ నో ద్వేష్టి
తం వో జంభే దధామి
తీర్థాని యశ్చ షట్చ
ఇతి ఏకాదశోఽనువాకః
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బన్ధనాన్మృత్యోర్ముక్షీయ మాఽమృతాత్
యో రుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు
యో రుద్రో విశ్వా భువనాఽఽవివేశ
తస్మై రుద్రాయ నమో అస్తు
తముష్టుహి యః స్విషుః సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం నభోభి ర్దేవమసురం దువస్య
అయం మే హస్తో భగవానయం మే భగవత్తరః
అయం మే విశ్వాభేషజోఽయం శివాభిమర్శనః
యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాన్తకః
తేనాన్నేనాప్యాయస్వ
నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి
ఓం శాంతిః శాంతిః శాంతిః
ఇతి శ్రీకృష్ణయజుర్వేదీయ తైత్తిరీయ సంహితాయాం
చతుర్థకాండే పంచమః ప్రపాఠకః
తాత్పర్యము:
మొదటి అనువాకము:
భగవంతుడైన రుద్రునికి నా నమస్కారములు. ఓ రుద్ర! నీ శరములకు, ధనుస్సుకు, బాహువులకు నమస్కారము. ఎంతో శుభకరమైన నీ అమ్ముల పొది, అస్త్ర శస్త్రముల్తో మాకు ఆనందాన్ని కలిగించు. వెండి కొండ పైనుండి మమ్మల్ని ఆనంద పరిచే ఓ రుద్రా! ఎంతో శాంతి కలిగిన, శుభకరమైన, పాపరహితమైన, మోక్షకరమైన, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే నీ వీక్షణములను మా వైపు ప్రసరించు. మాకు ఆత్మ జ్ఞానాన్ని కలిగించు. ధవళగిరిపై కూర్చుని మాకు ఆనందము, ఉపశమనము కలిగించే, పాపులను నాశనం చేయటానికి పొందిన అస్త్రాలను శాంతింప చేయుము. నిన్ను కాన్చుటకు మేము నిన్ను స్తుతించి, నుతించు చున్నాము. ప్రసన్నుడవై మమ్ము, మా బంధువులను, గోవులను కాపాడి మాకు రోగములనుండి విముక్తి కలిగించుము. మేము ప్రేమతో ఉండునట్లుగా చేయుము. అన్నిటా ప్రథముడై, దేవతలలో దైవత్వమై, భక్తుల రోగాలను బాపే వైద్యుడై, భక్తుల సత్కార్యములను పొగడే వాడి, వారి పాపములను పోగోట్టేవాడైన ఓ రుద్ర! అసురులను, క్రూర మృగములను నాశనము చేసి మమ్ము కాపాడుము. ఎరుపు, బంగారపు వర్ణములో ఉండి, తానే సూర్యుడై ఉన్నాడు ఆ రుద్రుడు. అటువంటి సహస్ర దిక్కులలో ఉన్న సహస్ర రుద్రులకు మా నమస్కారములు. వారంతా శాంతిన్చెదరు గాక. గరళము కంఠం నందు కలిగి పశుకాపరులకు, స్త్రీలకు కూడా ఎర్రని కాంతితో రాగి రంగులో సూర్యుని వలె కనిపించే ఆ రుద్రుడు మా అందరికి ఆనందమునిచ్చు గాక. నీలకంఠుడు, వేయి కన్నులు కలవాడు, అనంతమైన వరాలు ఇచ్చేవాడు అయిన ఆ రుద్రునికి, ఆయన భక్తులకు నా నమస్కారములు. ఓ దేవా! ధనుస్సు యొక్క తాడు ముడి తీసి, దానిని దించి, అస్త్రములను అమ్ములపొదిలో ఉంచి దానిని పక్కకు పెట్టుము. బాణముల పదునైన మొనలను త్రుంచి, ధనుస్సును దించి, శాంత రూపంతో మమ్మల్ని ప్రసన్నించు. అస్త్రములు, ఆయుధములు అన్ని శాంతించి, వాటి స్థానాల్లో ఉండు గాక. భక్తుల కోర్కెలను తీర్చే ఓ రుద్రా! మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడు. నీ ఆయుధాలకు, ధనుస్సుకు నా వందనములు. నీ అస్త్ర శస్త్రాలు మా శత్రువులను నాశనము చేయు గాక (శత్రువులంటే పాపములు). అవి మా నుండి దూరముగా వెళ్ళు గాక.
రెండవ అనువాకము:
జగత్పతి, దేవాదిదేవుడు, త్రినేత్రుడు, త్రిపురాంతకుడు, ప్రళయాగ్ని రూపుడు, నీలకంఠుడు, యముని జయించిన వాడు, అన్నిటికి నాథుడు, శాంతముర్తి, సమస్త శుభకరుడు అయిన రుద్రునికి నా నమస్కారములు. స్వర్ణ భుజములు కలిగి, సేనాపతి, దిక్కులకు అధిపతి, వృక్షముల వలె ప్రకాశించు వాడు, ఆకులను జుట్టుగా కలవాడు, అన్ని జీవరాసులకు పతి, లేత చిగురుల వలె పచ్చగా, ఎర్రగా ఉన్నవాడు, మిక్కిలి ప్రకాశించేవాడు, మనలను సమస్త మార్గములలో నడిపే వాడు, నందిని అధిరోహించే వాడు, శత్రువుల పాలిటి రోగము వంటి వాడు, సమస్త ఆహారములకు అధిపతి, నల్లని జుట్టు కలవాడు, ఉపవీతమును ధరించిన వాడు, శక్తిమంతులకు అధిపతి, భవసాగరాన్ని దాటించేవాడు, ధనుస్సును ధరించిన వాడు, క్షేత్రములకు అధిపతి, జీవితమనే రథాన్ని నడిపించే వాడు, అజేయుడు, అరణ్యమునకు అధిపతి, ఎరుపు వర్ణము కలిగిన వాడు, అన్నిటికి అధిపతి, వృక్షములకు అధిపతి, మంత్రి, వ్యాపారి, చెట్టు చేమకు అధిపతి, చుట్టూ సైన్యము ఉండే వాడు, భక్తులను కాపాడే వాడు, మంచి వారికి అధిపతి అయిన రుద్రునికి నా నమస్కారము.
మూడవ అనువాకము:
శత్రువులను సంహరించేవాడు, అటువంటి వారికి అధిపతి, ఉన్నతమైన వాడు, ఖడ్గమును, అమ్ముల పొది, ధనుస్సును ధరించేవాడు, తస్కరులకు అధిపతి, మోసము చేసే వాడు, మోసగాళ్ళకు అధిపతి, అడవులను దోచుకునే వారికి అధిపతి, నిశాచరుడు, హంతకులకు అధిపతి, తలపాగా ధరించే వాడు, అడవులలో నివసించేవాడు, ధనుస్సును, బాణములను ధరించి సంధించే వాడు, చేదించేవాడు, స్థిరాసనంలో ఆసీనుడై ఉన్నవాడు, పడుకొని ఉన్నవాడు, నిద్ర, చేతనావస్థలో ఉండేవాడు, స్థిరముగా ఉన్నవాడు, పరుగెత్తే వాడు, సభలో ఉన్నవాడు, సభాధ్యక్షుడిగా ఉన్నవాడు, సదాత్మల పట్ల ఆదరం చూపేవాడు, దురాత్మల పట్ల ఆగ్రహం చూపేవాడు, తానే ఆశ్వమైన వాడు, ఆశ్వపతి అయిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
నాలుగవ అనువాకము:
దుష్ట శక్తుల పాలిటి శత్రువు, వాటిని ఎదుర్కునే వాడు, ఉపకారము చేసే ఆత్మయే తానై, ఆ యాత్మలకు సహకరించే వాడు, అనుబంధములు కలిగిన వాడు, అట్టి వారికి అధిపతి అయిన వాడు, రకరకములైన జీవరాసుల సమూహము అయిన వాడు, అట్టి సమూహములకు అధిపతి అయిన వాడు, గణములో సభ్యుడు, గణములకు అధిపతి అయిన వాడు, సామాన్యమునగాను, భయానకముగాను కనిపించే వాడు, ఉత్తమమైన ఆత్మగా, బలహీనంగా కనిపించేవాడు, రథమును అధిరోహించే వాడు, రథము లేని వాడు, తనే రథమైన వాడు, రథపతి అయిన వాడు, తానే సైనికుడు, సేనాధిపతి అయిన వాడు, తానే రథమును నడిపేవాడు, రథమును ఆపగలిగిన శక్తి గలవాడు, కుమ్మరి వాడు, స్వర్ణకారుడు, వేటగాడు, మత్స్యకారుడు, ధనువు, బాణములు తయారు చేసే వాడు, శునకముల కాపరి, తానే శునకరుపమై, వాటిని కాపాడే వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
అయిదవ అనువాకము:
సృష్టి కారకుడు, దుఃఖమును పోగొట్టేవాడు, పాపములను తొలగించే వాడు, జగత్తుకు అధిపతి, నీలకంఠుడు, భస్మమును దేహమంతా కలిగిన వాడు, కపాలములు ధరించి, కేశములు ముడి వేసుకొన్న వాడు, వేయి కన్నులు, వందల అస్త్రములు కలవాడు, గిరీశుడు, కాంతితో సమానమైన వాడు, సువృష్టి కురిపించే వాడు, చిన్నగాను, పొట్టిగాను ఉండేవాడు, పెద్దగా ఉండేవాడు, సర్వ సులక్షణ సంపన్నుడు, వృద్ధునిగా కనిపించే వాడు, అనంతమైన యశస్సు కలవాడు, సృష్టి కన్నా ముందే ఉన్నవాడు, దేవతలలో ప్రథముడు, అంతటా ఉన్నవాడు, వేగముగా కదిలేవాడు, వేగమైన ప్రవాహములో ఉన్నవాడు, అట్టి ప్రవాహంలో ఈదగలవాడు, అలలలో, నిశ్చలమైన నీటిలో, సెల ఏళ్ళలో, ద్వీపములలో ఉన్నరుద్రునికి నా నమస్కారములు.
ఆరవ అనువాకము:
అందరికన్నా పెద్ద వాడు, మరియు చిన్న వాడు, అన్నిటికన్నా ముందు జన్మించిన వాడు, తర్వాత జన్మించిన వాడు, మధ్య వయస్కుడు, అతి పిన్నవాడు, మూలమునుంచి మరియు మధ్య నుంచి జన్మించిన వాడు, భూ మరియు ఇతర లోకముల నుండి జన్మించిన వాడు, నరకమున శిక్ష వేసి స్వర్గమున సుఖమును ఇచ్చేవాడు , పొలములలోను , వనములలోను ఉండే వాడు, వేదములలో, వాటి శాంతి మంత్రములలో పొగడబడిన వాడు, అడవులలోని వ్రుక్షములలోను, చిన్న పొదలలో ఉండేవాడు, శబ్దము మరియు ప్రతిధ్వనిలోను ఉండేవాడు, వేగముగా నడిచే సైన్యము, ఆయుధాలలో ఉండేవాడు, వీరులు మరియు రాజుల రూపములో ఉండేవాడు, అస్త్ర శాస్త్రములు కలిగి రథమును అధిరోహించిన వాడు, శిరస్త్రాణము మరియు కవచము ధరించిన వాడు, గొప్ప యశస్సు మరియు సేన కలిగిన వాడు అయిన రుద్రునికి నా నమస్కారములు.
ఏడవ అనువాకము:
పెద్ద నగారా నుంచి వెలువడే శబ్దము నందు ఉన్న వాడు, ఆ నగారా మోగించే ఓడు నందు ఉండే వాడు, సమరభూమి నుంచి పారిపోని వాడు, వేగు తెచ్చిన సమాచారాన్ని పరిశీలించేవాడు, దూత మరియు సేవకుని రూపములో ఉండేవాడు, ఖడ్గము, అమ్ముల పొది కలిగిన వాడు, పదునైన బాణములు మరియు ఇతర అస్త్రములు కలిగిన వాడు, ఉత్తమమైన ధనుస్సు మరియు ఇతర శస్త్రములు కలిగిన వాడు, విశాలమైన మరియు ఇరుకైన మార్గములందు వెళ్లే వాడు, కాలువలలోను, సెలయేటి లోను ఉండేవాడు, నీటి మడుగులోను, సరస్సులోను ఉండేవాడు, నదులలోను, ఏటి లోను ఉండేవాడు, బావిలోను, జలపాతములలోను ఉండేవాడు, వర్షములోను, ఎడారిలోను ఉన్నవాడు, మేఘము మరియు మెరుపులో ఉన్నవాడు, నిర్మలమైన శరదృతు ఆకాశాములోను, వర్షములోను, సూర్యుని లోను ఉన్నవాడు, భీకర వర్షపు గాలిలోనూ, వేడి వడగాల్పు లోను ఉన్నవాడు, గృహ నిర్మాణములో ఉండే ప్రతి వస్తువులోను, వాస్తు పురుషుడి రూపంలో గృహాన్ని కాపాడే వాడు అయిన ఆ రుద్రునికి నా నమస్కారములు.
ఎనిమిదవ అనువాకము:
ఉమాపతి, దుఃఖములను పోగొట్టే వాడు, సూర్యోదయ, అస్తమయ సమయము నాటి సూర్యుని వర్ణము కలిగిన వాడు, సంతోషాన్ని కలిగించే వాడు, రక్షకుడు, ఉగ్రముగాను, భయానకముగాను ఉన్నవాడు, నాయకుడు, శత్రు సంహారము చేసే వాడు, దూరము నుండి మాట్లాడే వాడు, ప్రళయ కారకుడు (పూర్తి విధ్వంసం), కర్మ యనే సువ్రుక్షమైన వాడు, ఓంకార ప్రకాశకుడు, భోగ కారకుడు, మోక్ష కారకుడు, అనేక లోకముల భోగమునిచ్చే వాడు, శుభమైన వాటిలో ఉన్నవాడు, శుభకరుడు, పవిత్రమైన జలము లో ఉన్నవాడు, ప్రవాహముల వద్ద అర్చించ బడే వాడు, సిద్ధి పొందిన వారిచే నుతించ బడిన వాడు, కామ్యప్రదుడు, భవ సాగరాన్ని, పాపాలను దాటించి, మోక్షాన్ని కలిగించే వాడు, ఆత్మలను ఈ ప్రపంచములోకి పంపించే వాడు, కర్మ ఫలములను అనుభవింప చేసే వాడు, రెల్లుగడ్డి లోను, నీటి ప్రవాహపు నురగలోను, నదులయందు ఇసుకలోను, నీటి ప్రవాహంలో ఉండేవాడు అయిన రుద్రునికి నా నమస్కారములు
తొమ్మిదవ అనువాకము:
నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నివసించేవాడు, మార్గములో నడిచేవాడు, ఎడారుల్లో, ఉన్నతమైన ప్రదేశాల్లో నివసించేవాడు, జటా ఝూటములు కలిగి, భక్తులను కాపాడుటలో ముందుండే వాడు, గృహములలోను, పాకలలో, గుహలలోను నివసించేవాడు, తల్పముపై ఉండేవాడు, అలంకరిచబడిన మందిరములలో, ముళ్ళ పొదలలో నివసించేవాడు, లోతైన నీటి మడుగుల్లో, హిమ బిందువుల్లో ఉన్నవాడు, ధూళిలో , బురద మట్టిలో, ఎండిపోయిన చెక్కలో, పచ్చి కొమ్మలో, నేలలో, పచ్చికలో, మైదానములో, నీటి తరంగాలలో, పచ్చని ఆకులలో, ఎండుటాకులలో ఉండేవాడు, అస్త్రములు ధరించి శత్రు సంహారం చేసే వాడు, ఎక్కువ బాధ పెట్టని వాడు, పెట్టే వాడు, భక్తులకు సకల సంపదలు ఇచ్చే వాడు, దేవతల ఆత్మలలో ఉన్నవాడు, నాశనములేని వాడు, దేవతల హృదయంలో ఉన్నవాడు, కోర్కెలు తీర్చే వాడు, పాపములను తొలగించే వాడు, సర్వాంతర్యామి అయిన రుద్రునకు నా నమస్కారములు.
పదవ అనువాకము:
పాపులను నరకంలో శిక్షించే, భక్తులకు ఆహారాన్ని ఇచ్చే, జ్యోతి స్వరూపుడవు, నీలకంఠుడవు, ఎరుపు వర్ణము కలవాడవు అయిన ఓ దేవా! భక్తులకు భయము, మృత్యువునీయకు, రోగముల నుండి కాపాడు. ఓ రుద్రా! జగత్పాలక! జనన మరణాల నుండి ముక్తిని కలిగించే, నీలో ఉన్న, పార్వతి దేవితో కూడిన రూపమును మాకు అనుగ్రహించుము. మేము ఎలా జీవించాలో అలా జీవించే వరం ప్రసాదించు. ఓ రుద్రా! జగత్పాలక! జటా ఝూటములు కలిగిన, ధ్యానములో ఉన్న తపస్వీ, వ్యాకులమైన మా మనస్సులను నీ మీదకు మరల్చు. నీ ధ్యానముతో మాకు, గోవులకు సకల పాపములు తొలగి, శుభములు కలిగి, ఆరోగ్యవంతులమగుదుము, మరల మాకు రోగములు రావు. ఓ రుద్రా! జగత్పాలక! మాకు ఆనందము కలిగించు, మోక్షము కలిగే అవకాశాలు పెంచి, పాపములు చేసే అవకాశాలు తగ్గించు. మాకు ఆనందము, మోక్షము కలిగించుటకు నీకు మరోసారి మా ప్రణామములు. ఓ రుద్రా! జగత్పాలక! వృద్ధులకు, స్త్రీలకు, పిల్లలకు, గర్భము నందున్న శిశువులకు, తల్లీ, తండ్రులకు ఎప్పుడు హాని కలగకుండా చూడు. మాకు ప్రియమైన ఈ శరీరమునకు హాని కలుగకుండా చూడు. ఓ రుద్రా! జగత్పాలక! మా సంతానమునకు శోకము కలుగ కుండా కాపాడు. ఆవులను, ఆశ్వములను కాపాడు. కోపాగ్నికి మా సేవకులను గురి చేయకు. నీకు పవిత్రమైన వస్తువులు, నమస్కారములు సమర్పిస్తాము. ఓ రుద్రా! జగత్పాలక! నీ భయానక తత్వము మాకు, మా సేవకులకు దూరముగా ఉండు గాక. నీ శుభ తత్వము మాతో ఉండు గాక. నీ కరుణ ఎల్లప్పుడూ మాతో ఉండు గాక. మాకు సకల లోకాల సుఖాలు అందించు. ఓ మనసా! నీ హృదయ కమలములో యున్న, నిత్య యౌవనుడైన, సింహమువలె శత్రువులను సంహరించే, అమితమైన యశస్సు కల్గిన ఆ రుద్రుని ధ్యానము చేయుము. ఓ రుద్రా! నీ సైనికులచే మా శత్రువులను సంహరించు. రుద్రుని ఆయుధములు మా నుండి దూరముగా ఉండు గాక. శత్రు సంహారము చేయగల ఆ రౌద్ర రూపము మానుండి దూరముగా ఉండు గాక. ఓ రుద్ర! నీ రౌద్ర రూపమును మిమ్ము ప్రార్థించే, హవనము సమర్పించే మా పట్ల శాంతింప చేయుము. మా పుత్ర పౌత్రాదులను కాపాడుము. భక్తుల కోర్కెలను తీర్చతంలో అగ్రుడవైన ఓ రుద్రా! శుభ వీక్షణములు కలిగిన ఓ రుద్ర! నీ అస్త్రములు వృక్షముపై ఉంచి, పులి చర్మము ధరించి, పినాకము అలంకారముగా ఉంచుకొని మా వద్దకు శుభకరుడవై రమ్ము. మాకు సంపదలు ఇచ్చే, ఎరుపు వర్ణములో ఉన్న ఓ రుద్రా! నీకు మా నమస్కారములు. నీ ఆయుధములు మా శత్రువులను నాశనం చేయు గాక. వేల రకాల, వేల ఆయుధాలు కలిగిన ఓ రుద్రా! నీ అస్త్రాలు మమ్ములను దాడి చేయకుండు గాక.
పదకొండవ అనువాకము:
ఓ రుద్రా! వేల కొలది, వేల రకాల ఆయుధాలు కలిగి ఉన్న వేల మంది నీ సైనికులను మాకు వేల మైళ్ళ దూరమున ఉంచు. ఈ విశ్వములో ఉన్న అనంతమైన రుద్రుని సైనికులు - కంఠములు నీలము, తెల్లగను గలిగిన వారు, పాతాళంలో, స్వర్గంలో ఉండే వారు, కంఠములు నీలము, ఎరుపుగాను ఉండి వ్రుక్షములపై ఉన్నవారు, ముడి వేసుకున్నవారు, కేశములు లేని వారు, జనులను బాధించి వారు పాత్రలనుండి ఆహారము, నీరు తీసుకునే వారు, అన్ని మార్గములలో నున్న వారిని రక్షించే వారు, కాపాడే వారు, పదునైన ఆయుధములు కలిగిన వారు, పవిత్రమైన జలాలను కాపాడే వారు - వివిధ దిక్కులలో నున్న వీరందరినీ, వారి ఆయుధాలను మానుండి దూరముగా ఉంచుము. భూమి, ఆకాశము, ఇతర లోకములలో ఉండి మమ్మల్ని కాపాడే సైనికులకు మా వ్రేళ్ళతో, చేతులతో, దిక్కు దిక్కున నమస్కారములు. మాకు వారు ఆనందము కలిగింతురు గాక. వారికి మేము మా శత్రువులను ఆహారముగా సమర్పిస్తున్నాము. సుగంధం వెదజల్లేవాడు, ఆహారం ఇచ్చి పోషించేవాడు, త్రినేత్రుడు అయిన పరమశివుడిని ఆరాధిద్దాం. దోసపండు కాడ నుండి విడిపడేటట్లు మరణం పట్టు నుండి విడివడెదము గాక! ఆత్మ స్థితి నుండి విడివడక ఉందాం గాక!. సమస్త జగత్తు యందు ఉన్న ఆ శివునికి మా నమస్కారములు. ఉత్తమమైన అస్త్ర శాస్త్రములు కలిగి, వైద్యుడై మన రోగాలను నిర్మూలించే, రాక్షసులను సంహరించే రుద్రునికి మన మనస్సులను పవిత్రం చేస్తున్నందుకు నమస్కారములు. శివుని తాకి, పూజించే ఈ హస్తము మాకు దేవునితో సమానము. శివుని తాకినా ఈ హస్తము నా సర్వ రోగములకు దివ్యౌషధము. ఓ దేవా! ప్రాణులను చంపుటకు ఉపయోగించే సహస్రమైన నీ పాశములను మాకు దూరముగా యుంచమని మా ప్రార్థన. దానికోరకై మేము ఈ అగ్నిహోత్రము ద్వారా నీకు ప్రీతిని సమర్పిస్తున్నాము. రుద్రునకు నా నమస్కారములు. మృత్యుదేవత నా వాద్దకు రాకుండు గాక. ప్రాణము, ఇంద్రియముల కలిసే గ్రంధులలో నివసించే ఓ దేవా! నేను సమర్పిస్తున్న ఆహారమును స్వీకరించి నాయందు నివసించుము. మృత్యు దేవతను నా నుండి దూరముగా ఉండు గాక.
ఓం శాంతి శాంతి శాంతి. ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, అయిదవ ప్రపాఠకములోనిది.
8, నవంబర్ 2010, సోమవారం
చంద్రశేఖరాష్టకం
పదహారేళ్ళ యువప్రాయంలో మృత్యుదేవత ప్రాణాలకై వచ్చి ఎదుట నిలుచున్నప్పుడు భక్త మార్కండేయుడు శివలింగాన్ని పెనవేసుకుని ఆ పరమ శివుని స్తుతిస్తే ఆ బోళాశంకరుడు ఆ బాలుని కరుణించి యముని ధిక్కరించి ఆ బాలునికి ఆయుష్షు ప్రసాదిస్తాడు. ఇది మార్కండేయుని చరిత్ర. ఆ సందర్భంలో ఆ భక్తాగ్రేసరుడు శివుని ఈ చంద్రశేఖరాష్టకం రూపంలో స్తుతించాడుట. యూట్యూబ్ లంకె.
![]() |
| మార్కండేయుని శివుడు రక్షించుట |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమాం
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమాం
రత్నసాను శరాసనం రజతాద్రి శృంగనికేతనం
శింజినీ కృత పన్నగేశ్వర మచ్యుతానలసాయకం
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
పంచపాదప పుష్పగంధి పదాంబుజద్వయ శోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథ విగ్రహం
భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహం
దేవసింధు తరంగశీకర సిక్తశుభ్ర జటాధరం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం
శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరం
క్ష్వేడనీలగళం పరశ్వధధారిణం మృగధారిణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం
నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరం
అంధకాంతకామాశ్రితామర పాదపం శమనాంతకం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం
భుక్తిముక్త ఫలప్రదం సకలాఘ సంఘనివర్హణం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
భక్తవత్సల మర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పర మప్రమేయమనుత్తమం

సోమవారిణ భూహుతాశన సోమపానిలఖాకృతిం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలన తత్పరం
సంహరంత మపి ప్రపంచ మశేషలోక నివాసినం
క్రీడయంత మహర్నిశం గణనాథయూథ సమన్వితం
చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః
ఫలశ్రుతి
మృత్యుభీత మృకండ సూను కృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్నహి తస్య మృత్యుభయం భవేత్
పూర్ణమాయుర రోగతా మఖిలార్థ సంపద మాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః

రత్నముల సమూహముచే చేయబడిన ధనుస్సును ధరించిన, వెండికొండ పై నివసించే, వాసుకిని తాడుగా కలిగి, విష్ణువును బాణములుగా కలిగి, త్రిపురములను నాశనము చేసిన, మూడు జగములచే పూజించబడిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
సుగంధభరితమైన ఐదు కల్పక వృక్షముల పుష్పములతో పూజించబడే పాదములతో, తన మూడవ నేత్రము యందలి అగ్నితో మన్మథుని దగ్ధము చేసిన, భస్మమును దేహమంతా కలిగిన, నా పాపములను నాశనము చేసే, నాశనములేని, చంద్రుని ధరించిన శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
తాను ధరించిన ఏనుగు చర్మముతో చేసిన ఉత్తరీయముతో ముగ్ధులను చేసే, పద్మముల వంటి పాదములు కలిగి, బ్రహ్మ విష్ణువులచే పూజింపబడే, గంగా తరంగములతో తడిసిన జటా ఝూటం కలిగిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
యక్షరాజైన కుబేరుని స్నేహితుడు, భగుని నేత్రములు నాశనము చేసిన, సర్పములను ఆభరణంగా కలిగిన, వామ భాగమున పార్వతీదేవి ఉన్న శరీరము కలిగిన, గరళం కంఠంలో ధరించిన, గొడ్డలి ఆయుధంగా కలిగి, జింక చర్మము ధరించిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
మెలికలు తిరిగిన సర్పములు కర్ణ కుండలములుగా ధరించిన, నారదుడు మొదలగు మునులచే నుతించబడిన, లోక పాలకుడైన, అంతకుడనే రాక్షసుని సంహరించిన, భక్తులపాలిట కల్పవృక్షమై, యముని అణచిన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
భవ రోగములను బాపే వైద్యుడై, సకల అశుభములను, ఆపదలను తొలగించే వాడైన, దక్షుని యజ్ఞమును నాశనము చేసిన, మూడు గుణములు, మూడు నేత్రములు కలిగిన, భక్తి, ముక్తి ప్రసాదించి, సర్వ పాపములను నాశనము చేసే చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
భక్తవత్సలుడిగా పూజించబడి, నాశనము లేని సంపద యైన వాడు, దిక్కులే అంబరముగా కలవాడు, భూత నాథుడైన, పరాత్పరుడైన, నిర్వచనానికి అందని, అన్నిటికన్నా ఉత్తమమైన, పంచభూతములచే సేవించబడే, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
సృష్టి, స్థితి, ప్రళయ కారకుడై, ప్రతి ప్రాణిలో ఉండేవాడు, ప్రాణులతో నిరంతరం క్రీడలో ఉండేవాడు, గణ నాథుడై, గణములో ఒకడైన, చంద్రుని ధరించిన ఆ శివుని పాహి అన్నాను, ఇంక నన్ను ఆ యమ ధర్మరాజు ఏమి చెయ్యగలడు?.
ఫలశృతి:
భీతావహుడైన మార్కండేయుడు (మృకండ మహర్షి కుమారుడు) రచించిన ఈ స్తోత్రము శివుని సన్నిధిలో పఠించిన వారికి మృత్యు భయము తొలగి, ధన ధాన్యములతో పూర్ణ ఆయుష్షు కలుగును. చివరకు శివుడు వారికి మోక్షము ప్రసాదించును.
6, నవంబర్ 2010, శనివారం
మహాన్యాసము - అధికార పధ్ధతి
నారుద్రో రుద్రమర్చయేత్ - అనగా రుద్రుడు కాని వాడు రుద్రాభిషేకమునకు అర్హుడు కాడు. ఇది ప్రమాణ వచనము. అందుకనే, కల్ప సూత్రకారులగు బోధాయనులు మహాన్యాసము అనే రౌద్రీకరణ విధానాన్ని మనకు ఇచ్చారు. అప్పటినుంచి ఈ మహాన్యాసము శ్రీ రుద్రాభిషేకమునకు పూర్వాంగముగా ఏర్పడి మన దేశములో ప్రసిద్ధమై, ప్రచారములో ఉంది.
మరి ఈ మహాన్యాసము అంటే?
మహాన్యాసము అంటే భక్తుడు శ్రీ రుద్ర జప, హోమ, అర్చన, అభిషేకాదులు చేయుటకు అధికారి అవ్వటానికి, వాటికి ముందు మహా మహిమలు కలిగిన రుద్రుని తన (ఆత్మ) యందు విశిష్టముగా నిలుపుకొనుట, రౌద్రీకరణము. ఇది చాలా మహిమ కలది. దీన్ని అనుష్ఠించటంలో భక్తుడు పంచాంగ న్యాసములందు వివిధ మంత్రములు పఠించుచు, తన సర్వాంగములను తాకుచుండుట చేత, రుద్రుని తన దేహాత్మలందు భావించి తనలో ప్రవేశపెట్టుటచే, తాను రుద్రుడే అయి, రుద్రార్చనకు అధికారి అగును.
రుద్ర మహాన్యాసము ఐదు అంగ న్యాసములు కలిగినది.
౧. ప్రథమాంగన్యాసము - శిఖాది అస్త్రాంతము ముప్ఫై ఒకటి అంగన్యాసములు కలది
౨. ద్వితీయాంగన్యాసము - మూర్ద్నాది పాదాంతము దశాంగన్యాసము కలది
౩. తృతీయాంగన్యాసము - పాదాది మూర్ధ్నాంతము పంచాంగన్యాసము కలది
౪. చతుర్థాంగన్యాసము - గుహ్యాది మస్తకాంతము పంచాంగన్యాసము కలది
౫. పంచమాంగన్యాసము - హృదయాది అస్త్రాంతము పంచాంగన్యాసము కలది
ఇవి అయిదు కలవారు పంచాంగ రుద్రులు.
౧. ప్రథమాంగన్యాసము
భక్తుడు సంకల్పము చేసిన మీదట పూర్వాంగ రుద్ర, దక్షిణాంగ రుద్ర, పశ్చిమాంగ రుద్ర, ఉత్తరాంగ రుద్ర, ఊర్ధ్వాంగ రుద్రులకు స్తుతి పూర్వక నమస్కారములు చేయవలెను. అటు తర్వాత, పూర్వాంగముఖ రుద్ర, దక్షిణాంగముఖ రుద్ర, పశ్చిమాంగముఖ రుద్ర, ఉత్తరాంగముఖ రుద్ర, ఊర్ధ్వాంగముఖ రుద్రులకు స్తోత్ర పూర్వక నమస్కారములు చేయవలెను. తర్వాత, "యా తే రుద్ర శివాతమా" మొదలగు మంత్రములను పఠించుచు, తన శిఖాదులను తాకవలెను.
౨. ద్వితీయాంగన్యాసము
ఓం నమో భగవతే రుద్రాయ అని పలికి నమస్కరించి, ఓం మూర్ద్నే నమః, నం నాసికాయై నమః, మోం లలాటాయ నమః, భం ముఖాయ నమః, గం కంఠాయ నమః, వం హృదయాయ నమః, తేం దక్షిణ హస్తాయ నమః, రం వామ హస్తాయ నమః, యం పాదాభ్యాం నమః అనే మంత్రాలు చదువుతూ ఆయా అంగాల యందు నమస్కార పూర్వకంగా న్యాసము (రుద్రుని నిలుపుట) చేయవలెను.
౩. తృతీయాంగన్యాసము
సద్యోజాతాది మంత్రములు చదువుతూ పాదాది అంగములను న్యాసము చేయవలెను. హంస గాయత్రీ మంత్రము పఠించి "హంస హంస" అని పలికి శిరస్సును స్పృశించవలెను. హంస అనగా శివుడు. ఇలా న్యాసము చేయుట వలన భక్తుడు ఆ సదాశివుడే తానగును.
తర్వాత, అంజలి చేసి "త్రాతార మింద్ర...." మొదలగు మంత్రములు పఠించుచు ఆయ దిక్కుల అధిదేవతలగు ఇంద్రాదులకు నమస్కారములు చేయవలెను. దీనినే, సంపుటం అంటారు.
తర్వాత దశాంగ రౌద్రీకరణం - భక్తుడు అంజలి ఘటించి, పైన సంపుటంలో చెప్పిన మంత్రములు పఠించుచు, వరుసగా తూర్పు నుండి మొదలు పెట్టి అథో దిక్కు వరకు , ఆయా దేహ స్థానాన్ని తాకి (లలాటము నుండి పాదముల వరకు), ఆయా దేవతకు నమస్కరించుచు (ఇంద్రుని మొదలు పృథివి చివర) రుద్రుని తన దేహము యందు న్యాసము చేయవలెను. ఇందులో ప్రతి మంత్రమునకు ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని చెప్పవలెను.
తర్వాత షోడశాంగ రౌద్రీకరణము - ఓం అం విభూరసి ప్రవాహణో.... అనే మంత్రముతో మొదలు పెట్టి ఓం అః ఆహిరసి బుధ్నియో" అను మంత్రముల వరకు (అకారాది వర్ణమాల), అన్ని మంత్రములు ప్రతి దాని చివర 'రౌద్రేణానీకేన పాహిమాగ్నే పిపృహి మా మా మాహిగ్ం సీః' అనే మంత్రభాగమును జోడించి చదువుతూ, తన శిఖ నుండి పాదముల వరకు పదహారు అంగములను తాకుచు, తన దేహమును రుద్రుని భావించవలెను. కొంతమంది దీనికి కూడా ప్రతి మంత్రము ముందు "ఓం నమశ్శంభవేచ...శ్శివ తరాయచ" అని సంపుటీకరణ చేస్తారు.
దీనివలన తన చర్మము, ఎముకలయందు సర్వ పాపములనుండి విముక్తి పొందును, సర్వ భూతములచే అపరాజితుడగును, ఉపఘాతములన్ని తొలగి, రక్షణ పొందును.
౪. చతుర్థాంగన్యాసము
"మనోజ్యోతిః...." మొదలగు మంత్రములు చదువుతూ, గుహ్యాది శిరస్యంతం అంగముల తాకుతూ, ఆ అంగములను అభిమంత్రణము చేయవలెను. గుహ్యము, పాదములు తాకినప్పుడు అప ఉపస్పృశ్యము చేయవలెను (రెండు చేతులను నీతితో శుద్ధి) - ఈ ప్రక్రియ మొత్తాన్ని ఆత్మ రక్షా అంటారు. దీనితో పాటు "బ్రహ్మాత్మ న్వదసృజత" మొదలగు మంత్రములు చదివి 'ఆత్మనే నమః' అని నమస్కారము చేయవలెను. ఇలా చేయటం వలన తన ఆత్మ యందు ఆ పరమాత్మ ఉండునట్లు చేయుట అగును.
౫. పంచమాంగన్యాసము
ఇందులో శివ సంకల్ప సూక్తం ప్రధాన మైనది. శివ సంకల్పం గురించి ప్రత్యేక వ్యాసం తర్వాత రాస్తాను. "యే వేదం భూతం భువనం భవిష్యతి.." మొదలుకొని ముప్ఫై తొమ్మిది మంత్రములున్న శివ సంకల్ప సూక్తాన్ని పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ శివసంకల్పగ్ంహృదయాయ నమః" అని చెప్పి తన హృదయమున న్యాసము చేయవలెను. దీనివలన మోక్షము కలుగును.
తరువాత పురుష సూక్తము పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ పురుష సూక్తగ్ంశిరసే స్వాహా" అని శిరసున న్యాసము చేయవలెను. దీనివలన జ్ఞానమోక్ష ప్రాప్తి.
తర్వాత, ఉత్తర నారాయణమును "అద్భ్య స్సం భూతః" మొదలు "సర్వమ్మనిషాణ" వరకు పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఉత్తర నారాయణగ్ంశిఖాయై వషట్" అని శిఖ యందు న్యాసము చేయవలెను.
తరువాత అప్రతిరథకవచమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ ఆశుశ్శిశానోప్రతిరథం కవచాయ హుం" అని చెప్పి కవచముగా న్యాసం చేయవలెను. దీని వలన శత్రు బాధా నివారణం, విజయ ప్రాప్తి.
తరువాత, "ప్రతి పూరష మేకకపాలా న్నిర్వపతి......" అనే అనువాకమును, "జాతా ఏవ ప్రజా రుద్రా న్నిరవదయతే..." అను అనువాకమును పఠించి, "ఓం నమో భగవతే రుద్రాయ ప్రతి పూరుషం ప్రతి పూరుషం విభ్రా డితి నేత్రత్రయాయవౌషట్" అని చెప్పి మూడు నేత్రములను తాకవలెను.
తరువాత, "త్వ మగ్నే రుద్ర ....." అనే అనువాకమును, "దేవా దేవేషు శ్రయధ్వం..." అనువాకమును పఠించి "ఓం నమో భగవతే రుద్రాయ అస్త్రాయ ఫట్" అని న్యాసము చేయవలెను. తరువాత "భూ ర్భువ స్సువ ఇతి దిగ్బంధః" అని దిగ్బంధమును చూపించ వలెను.
తరువాత, ఆష్టాంగ ప్రణామములు చేయవలెను (ప్రతి అంగమునకు ఒక మంత్రము ఉంది. దాన్ని పఠించి, ఎనిమిది అవయవములు భూమిపై తాకునట్లు, వాటిని తాను కూడా తాకుచు ఒక్కొక్క అవయవామునకు ఒక్కొక్క సాష్టాంగ ప్రణామము చేయవలెను (రొమ్ము, శిరస్సు, కన్నులు, మనస్సు, వాక్కు, పాదములు, చేతులు, చెవులు - ఇవి అష్టాంగములు).
వీటి తర్వాత, తన్ను రుద్ర రూపునిగా ధ్యానించ వలెను.
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
దీని తర్వాత, రుద్ర స్నానార్చనాభిషేక విధిని ప్రారంభించ వలెను.
లింగమును ప్రతిష్ఠించి, "ప్రజననే బ్రహ్మాతిష్ఠంతు" మొదలు "సర్వేష్వంగేషు సర్వాః దేవతాః యథాస్థానాని తిష్ఠంతు మాం రక్షంతు" అని చెప్పవలెను. (ఇప్పుడు అన్ని అంగములలో ఆయా దేవతలు యథా స్థానములందు ఉండునట్లు ప్రార్థించునది).
[తరువాత, "అగ్ని ర్మే వాచిశ్రితః వాగ్ఘ్రుదయే హృదయం మయి" మొదలు "అంత స్తిష్ఠ త్వమృతస్య గోపాః" వరకు పఠించి లింగము, అంగములను స్పృశించ వలెను. గంధము, అక్షతలు, బిల్వ పత్రములు, పుష్పాలు, ధూప దీప నైవేద్య తాంబూలములతో లింగమును అర్చించి ఆత్మను ప్రత్యారాధించ వలెను.అభిషేక ప్రారంభములో చమకములోని 'శంచమ' అనువాకమును, నమక చమకముల లోని మొదటి అనువాకములను పఠించి, "ప్రాణానాం గ్రంథిరసి" అనే నాలుగు అనువాకములు, దశ శాంతి మంత్రములు, ప్రశ్నాంతము జపించి, శతానువాకములను, పంచకాఠకములను పఠించి అభిషేకము చేయవలెను. ఇట్లు ఏకాదశ వారములు చేసినచో అది ఏకాదశ రుద్రాభిషేకమగును.]
ఇది క్లుప్తంగా మహాన్యాసం లోని అధికార అర్హతకు చేయవలసిన పధ్ధతి.
5, నవంబర్ 2010, శుక్రవారం
బిల్వాష్టకం
![]() |
| బిల్వ పూజ |
శివ పూజకు అత్యంత శ్రేష్ఠమైనది మారేడు ఆకు. దీనినే సంస్కృతంలో బిల్వ పత్రం అంటారు. మారేడు చెట్టుకి వచ్చే ఆకులు విశేషమైన ఆకారం లో ఉంటాయి. మూడు ఆకులు ఒక సమూహంగా ఉంది కాబట్టి త్రిదళం అని పేరు పొందాయి . ఇది మూడు గుణాలకు ప్రతీకగా (సత్వ రజస్తమో గుణములు), పరమశివుని మూడు కన్నులుగా, మూడు జన్మల పాపాన్ని హరించేదిగా చెప్పబడింది. ఈ బిల్వపత్రాలు ఎండినా కూడా పూజలో వినియోగించ వచ్చు. మారేడు పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బిల్వపత్రాల మహిమ గురించి రాసిన బిల్వాష్టకం, తాత్పర్యం మీకోసం. వేర్వేరు మూలాల్లో ఈ అష్టకం సాహిత్యం కొంత తేడా ఉంది నాకు తెలిసి కిందది ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. యూట్యూబ్ లంకె.
త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం
అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం
సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం
దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం
లక్ష్మ్యాస్తనత ఉత్పన్నం మహాదేవస్య చ ప్రియం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
బిల్వవృక్షం ప్రయచ్ఛామి ఏకబిల్వం శివార్పణం
దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణం
కాశీక్షేత్రనివాసం చ కాలభైరవదర్శనం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
ప్రయాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం
మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం
ఫలశృతి
అగ్రతః శివరూపాయ ఏకబిల్వం శివార్పణం
ఫలశృతి
బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్
సర్వపాప వినిర్ముక్తః శివలోకమవాప్నుయాత్
తాత్పర్యము:
![]() |
| బిల్వ దళం |
మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను.
ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
కోటి ఏనుగుల దానం ఫలం, నూరు యజ్ఞాల ఫలం, కోటి కన్యాదానాల ఫలం తో సమానమైన ఈ బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
లక్ష్మీ దేవీ స్తన్యము నుండి జన్మించిన, శివునికి ఎంతో ప్రియమైన, బిల్వ వృక్షం ఇచ్చిన దానితో సమానమైన బిల్వపత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
దర్శనం, స్పర్శనం వలన మహా పాపాలను నాశనం చేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
కాశీ నివాసం, కాల భైరవుని దర్శనం, ప్రయాగలో మాధవుని చూసిన తర్వాత బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
మూలంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, కొసలో శివుని కలిగిన బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను.
ఫల శృతి:
శివుని సన్నిధిలో ఈ బిల్వాష్టకం పఠనం చేయటం వలన పాపాలు తొలగి, పుణ్యం కలిగి చివరకు శివలోక ప్రాప్తి కలుగుతుంది.
శ్రీ రుద్రదేవతా రూపం - శ్రీ రుద్ర పంచముఖ ధ్యాన శ్లోకాలు, తాత్పర్యము
రుద్రాభిషేకంలో పంచముఖ ధ్యానంలోని శ్లోకాలు న్యాసంలో ప్రస్తావించబడ్డాయి. తత్పురుష, అఘోర, సద్యోజాత, వామదేవ, ఈశానముఖ రూపాలలో ఉండే పరమేశ్వరుని ఐదు ధ్యాన శ్లోకాల రూపంలో బోధాయనులు రచించారు. ఈ మహాన్యాస వివేచనము రావణ ప్రోక్త న్యాస ప్రక్రియలోనిది. ఆ శ్లోకాలు, తాత్పర్యము క్రింద. దీనినే శివ పంచానన స్తోత్రం అని కూడా అంటారు.
తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)
తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)
తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)
తాత్పర్యము: గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)
ఈశాన ముఖ ధ్యానమ్
![]() |
| పంచాంగ రుద్ర రూపం |
తత్పురుష ముఖ ధ్యానమ్
సంవర్తాగ్ని తటిప్రదీప్త కనక - ప్రస్పర్ధితేజోమయం
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః
గంభీర ధ్వని మిశ్రితోగ్ర దహన - ప్రోద్భాసితామ్రాధరం
అర్ధేందుద్యుతిలోలపింగలజటా - భారప్రబద్ధోరగం
వందే సిద్ధ సురాసురేంద్రనమితం - పూర్వం ముఖం శూలినః
తాత్పర్యము: ప్రళయ కాలము నందలి అగ్ని తేజము తోనూ, మెరపుల తేజముతోను, బాగా కరిగిన బంగారు కాంతితోను పోటీ పదే తేజములే తన రూపముగా కలది, గంభీరధ్వనితో మిశ్రితము అగుతతో పాటు భయంకరమైన అగ్ని వలె ప్రకాశించు ఎర్రని పెదవి కలదియు, చంద్ర ఖండ కాంతితో చక చక మెరయు పింగళ వర్ణపు జడల గుంపును, దాని చుట్టూ గట్టిగా చుట్టిన సర్పములు కలదియు, సిద్ధులు, సురాసురుల చేత నమస్కరించబడుతున్న, శూలికి సంబంధించిన తూర్పున ఉన్న ముఖమును నమస్కరించుచున్నాను. (రజో గుణ ప్రధానమైన సృష్టి తత్వమును ఈ శ్లోకములో స్తుతి చేయబడినది)
అఘోర ముఖ ధ్యానమ్
కాలాభ్రభ్రమరాంజనద్యుతినిభం - వ్యావృత్తపింగేక్షణం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం
కర్ణోద్భాసితభోగిమస్తకమణి - ప్రోద్భిన్న దంష్ట్రాంకురం
సర్పప్రోత కపాలశుక్తి శకల - వ్యాకీర్ణ సంచారగం
వందే దక్షిణమీశ్వరస్య కుటిల - భ్రూభంగ రౌద్రం ముఖం
తాత్పర్యము: నల్లని మేఘములు, తుమ్మెదల కాటుక - వీటి కాంతిని పోలిన కాంతితో ప్రకాశించునదియు, మిక్కిలి మిట్టగా తిరుగుచుండు పింగా వర్ణపు కన్నులు కలదియు, చెవుల యందు మిక్కిలి ప్రకాశించుచుండు సర్ప శిరోరత్నములతో బాగా కలిసిపోవుచున్న కోరల మొలకలు కలదియు, సర్పములతో పాటు (హారముగా) కూర్చబడిన కపాలములతో, ముత్యపు చిప్పల ముక్కలతోను, ఎగుడు దిగుదగుచున్న నడకను పొందినదియు, వంకరలుగా నున్న కను బొమ్మల ముడులతో భయంకరముగా నున్న ఈశ్వరుని దక్షిణ ముఖమును నమస్కరించు చున్నాను. (తమో గుణ ప్రధాన లయ కర్త తత్వము ఇక్కడ స్తుతి చేయబడింది)
సద్యోజాత ముఖ ధ్యానమ్
ప్రాలేయాచల చంద్రకుంద ధవళం - గోక్షీరఫేన ప్రభం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం
భస్మాభ్యక్తమనంగదేహ దహన - జ్వాలావళీలోచనం
బ్రహ్మేంద్రాది మరుద్గణైః స్తుతి పరై - రభ్యర్చితం యోగిభిః
వందేహం సకలం కళంకరహితం - స్థాణోర్ముఖం పశ్చిమం
తాత్పర్యము: హిమవత్పర్వతము, చంద్రుడు, మొల్ల పూవు - వీని వలె తెల్లనిదియు, ఆవుపాల మీద నురుగు వలె తెల్లని కాంతి కలదియు, విభూతి పూయబదినదియు, మన్మథుని శరీరమును దహించు జ్వాలల పంక్తితో నిండిన కన్ను కలదియు, స్తోత్రము చేయుచున్న బ్రహ్మేన్ద్రాది దేవ సమూహముల చేతను, యోగుల చేతను శ్రద్ధతో అర్చించ బడుచున్నదియు, నిర్మలమైన నిండు వాదనముతో కనబడుచున్నదియును అగు శివుని పశ్చిమ నమస్కరించు చున్నాను. (సత్వ గుణ ప్రధాన రక్షణ కర్త తత్వమును ఈ శ్లోకములో స్తుతించ బడినది)
వామదేవ ముఖ ధ్యానమ్
గౌరం కుంకుమ పంకిలం సుతిలకం - వ్యాపాండు గండ స్థలం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం
భ్రూ విక్షేప కటాక్ష వీక్షణలసత్ - సంసక్త కర్ణోత్పలం
స్నిగ్ధం బింబ ఫలాధర ప్రహసితం - నీలాల కాలం కృతం
వందే పూర్ణ శశాంకమండల నిభం - వక్త్రం హరస్యోత్తరం
తాత్పర్యము: గౌర (ఎరుపుతో కలిపిన తెలుపు) వర్ణము కలదియు, కుంకుమ పూ పూతతో నిన్దినదియు, అందమగు తిలకము కలదియు, విశేషముగా తెల్లదనము కళ చెక్కిళ్ళు కలదియు, కనుబొమ్మల కదలికతో ఒప్పుచుండు కడగంటి చూపుతో ప్రకాశించుటతో పాటు, చెవికి అలంకారముగా నున్న తెల్ల కలువ పూవు కలదియు, నున్నని దొండపండు పోలు ఎర్రని క్రింద పెదవిపై స్పష్టమగు నవ్వు కలదియు, నల్లని మున్గుతులచే అలంకరించబడిన, నిండు చంద్రుని మండలమును పోలుచు ప్రకాశించునదియు అగు శివుని ఉత్తరాముఖమును నమస్కరించు చున్నాను. (గుణ త్రయ మిశ్రమమగు ఈశ్వర తత్త్వము ఇక్కడ స్తుతించ బడినది)
ఈశాన ముఖ ధ్యానమ్
వ్యక్తావ్యక్త గుణేతరం సువిమలం - శట్త్రింశతత్వాత్మకం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం
తస్మాదుత్తర తత్త్వమక్షరమితి - ధ్యేయం సదా యోగిభిః
వందే తామస వర్జితం త్రినయనం - సూక్ష్మాతి సూక్ష్మాత్పరం
శాంతం పంచమమీశ్వరస్య వదనం - ఖవ్యాపి తేజోమయం
తాత్పర్యము: వ్యక్తము, అవ్యక్తము (స్పష్ట రూపము కలది, స్పష్ట రూపము లేనిది) అణు రెండు రెండు లక్షణముల కంటెను ఇతరమగు లక్షణము కలదియు, ముప్ఫై ఆరు తత్వముల రూపమున పరిణమించు నదియు, సకల తత్వముల కంటెను ఉన్నతమైనదియు అగు అనుత్తరము అను అక్షర (అకార) తత్వమును ఎల్లప్పుడును యోగులచే ధ్యానించబడ దగినదియు, తమో గుణ రహితంను, మూడు కన్నులు కలదియు, సూక్ష్మాతిసూక్ష్మమగు దాని కంటే గోప్పదియు, శాస్తమును, ఆకాశము నందంటను వ్యాపించు తేజమే తన రూపముగా కలదియు అగు ఈశ్వరుని ముఖమును నమస్కరింతును (గుణాతీత బ్రహ్మ తత్వమును ఇక్కడ స్తుతించబడినది)
బ్రహ్మాండ వ్యాప్త దేహ భసితహిమరుచో - భాసమానా భుజంగైః
కంఠేకాలాః కపర్దాకలిత శశికలా - శ్చండకోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరాః - శాంభవా మూర్తిభేదాః
రుద్రాః శ్రీ రుద్రసూక్తప్రకటిత విభవా - నః ప్రయచ్ఛంతు సౌఖ్యం
తాత్పర్యము: బ్రహ్మాండము నందంతటను వ్యాపించిన దేహము కలవారును, భస్మము చేత మంచుకాంతి వంటి దేహకాంతి కలవారును, సర్పములతో ప్రకాశించువారును, తమ కంఠములందు నలుపు వన్నె కలవారును, జటా ఝూటము నందు చంద్ర కళలు కలవారును, భయము గొలుపు ధనుస్సులు తమ హస్తములందు కలవారును, మూడు కన్నులు కలవారును, రుద్రాక్షలు తమ అలంకారములుగా కలవారును, తమ విషయమున ప్రణమిల్లిన వారి భయమును పోగొట్టువారును, పూజ్యమగు రుద్రసూక్త మంత్రములచే ప్రకాశింప జేయబడిన వైభవము కలవారును అగుచు శంభుని మూర్తి భేదములే అగు రుద్రులు మాకు సౌఖ్యమును కలిగింతురు గాక!
శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం దశభుజగ్ం సర్వాభరణ భూషితం నీలగ్రీవగ్ం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మోత్తరీయకం కమండల్వక్షసూత్రధర మభయవరదకరగ్ం శూలహస్తం జ్వలంతం కపిలజటినగ్ం శిఖా ముద్ద్యోతధారిణం వృషస్కంధసమారూఢ ముమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతా సమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యంచ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షర మవ్యయం సర్వ్యవ్యాపిన మీశానం రుద్రం వై విశ్వరూపిణం ధ్యాయేత్
తాత్పర్యము: శుద్ధ స్పటికమువలె ప్రకాశించు వానిగా, మూడు కన్నులు, ఐదు ముఖములు, పది భుజములు కలవానిగా, సర్వాభరణములతో అలంకరించబడిన వానిగా, నీలకంఠముతో, చంద్రుని ఖండపు గుర్తుతో, సర్పపు యజ్ఞోపవీతము, నాగాభరణములు, పులిచర్మపు ఉత్తరీయము, హస్తములందు కమండలము, జపమాల, అభయము, వరదానము తెలిపే హస్త ముద్రలు, హస్తమునందు శూలము కలిగి ప్రజ్వలించుచు కపిల వర్ణము (ఎరుపు పసిమి కలిసిన) కళ జడలును, పైకి ఎత్తి కట్ట బడిన శిఖ కలిగి, నంది వృషభపు మూపును ఆరోహించి దేహార్ధమున ఉమను కలిగి అమృతముతో తడిసిన వానిగా హర్షము, దివ్యభోగాములు కలిగి దిగ్దేవతలతో కూడి సురాసురుల నమస్కారములను అందుకొనువానిగా, నిత్యునిగా, శాశ్వతునిగా, శుద్దునిగా, సర్వవ్యాపియగు ఈశానునిగా సకల జగద్రూపునిగా రుద్రుని భావించి ధ్యానించ వలెను.
శ్రీరుద్రధ్యానమ్

ప్రకారాంతరేణ శ్రీరుద్రధ్యానమ్

4, నవంబర్ 2010, గురువారం
ఒడిషా యాత్ర
ఇటీవలే నా సహోద్యోగి సతీష్ భువనేశ్వర్ వెళ్లి వచ్చాడు. ఆ మాట వినగానే నాకు ఉత్సాహం వచ్చి అప్పటికప్పుడు వెళ్ళటానికి నిర్ణయం చేసాము. నా సహోద్యోగి బిప్లబ్ నాయక్ ఒడిషాకు చెందిన వాడు. భువనేశ్వర్లో వాళ్ల నాన్నగారు, బావమరిది సహాయంతో మాకు మంచి ప్లాన్, హోటల్ బుకింగ్ చేసాడు.
హైదరాబాదులో శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ఇండిగో విమానం ద్వారా బయలు దేరి భువనేశ్వర్ కు పది గంటలకు చేరుకున్నాము. ఒడిషా రాజకీయ పితామహుడు బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో దిగి బయటకి రాగానే ఎదురుగా ఆయన విగ్రహం కనబడుతుంది. కారు ఎక్కి లింగరాజ్ అనే హోటల్లో దిగాము.
లింగరాజ స్వామి గుడి:
స్నానం చేసి మా మొదటి మజిలీ పేరుపొందిన లింగరాజ స్వామి గుడి. గుడి మొదటిలోనే పండాలు మా వెంట పడ్డారు. వారిలో తెలుగు వచ్చిన ఒక పండాను మాట్లాడుకొని మా గైడ్ గా పెట్టుకున్నాము. పదకొండవ శతాబ్దానికి చెందిన ఈ గుడి భారత దేశంలోని గుళ్లలో మాణిక్యం. అద్భుతమైన శిల్ప సంపద, ఒడిషా సాంప్రదాయంలో కట్టబడి ఉంది. గోపురం 180 అడుగుల ఎత్తు. దాదాపు 15 కిలోమీటర్ల దూరం వరకు దీని శిఖరము కనపడుతుంది. గుడిలోపల దాదాపు 150 చిన్న పెద్ద గుళ్ళు ఉన్నాయి.
ప్రధాన దైవం శివుడు సాలగ్రామ రూపంలో స్వయంభూ. అందుకని అక్కడ లింగాకారం బయటకు కనిపించదు. ప్రతిమరూపంలో వెండి త్రినేత్రుడు మనకు కనిపిస్తాడు. బిల్వ దళములతో స్వామిని అర్చించి చుట్టూ ఉన్న గుళ్ళు చూడటం మొదలు పెట్టాము. గుడి ప్రాకరంలోనే వైద్యనాథుడు, కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణ, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, సూర్యనారాయణుడు, దుర్గ, నంది, సీతారాములు, హనుమంతుడు మొదలగు అన్ని దేవతలకు మందిరాలు ఉన్నాయి. వీటిలో విశేషమైనవి విశ్వనాథుడు, అన్నపూర్ణ. వీరినందరిని దర్శించటానికి ఒక గంటన్నర పడుతుంది. పండాకు నూటపదహార్లు చెల్లించి బయట పడ్డాము. గుడికి ఉత్తర భాగంలో గుడి మొత్తం కనిపించేలా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. అక్కడ నుంచి ఫోటోలు తీసుకోవచ్చు.
విరజాదేవి (గిరిజా దేవీ) శక్తి పీఠం - నాభి గయ క్షేత్రం
మధ్యాహ్న భోజనం వీనస్ ఇన్ అనే దక్షిణ భారత హోటల్లో చేసి ఆదిశంకరులు స్థాపించిన శక్తి పీఠంలో ఉన్న విరజాదేవి (గిరిజా దేవీ అని కూడా అంటారు) దర్శనానికి జాజ్పూర్ బయలుదేరాము. ఈ జాజ్పూర్ భువనేశ్వర్ నుంచి 120 కిలోమీటర్ల దూరం. జాతీయ స్వర్ణ చతుర్భుజి లో భాగమైన జాతీయ రహదారి 5 మీద రెండు గంటలలో ఇక్కడికి చేరాము. ఇక్కడ అమ్మ విరజాదేవి (రజో గుణం తొలగించే శక్తి కలిగినది). ఈ ఆలయము 13వ శతాబ్దము నాటిదని ఇక్కడ చెప్పబడింది. ఇది మూడు గయా క్షేత్రాలైన ముఖ (బీహార్లోని గయ) , నాభి, పాద గయ (ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం) క్షేత్రాలలో నాభి గయ. కాబట్టి ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానము, శ్రాద్ధము చేస్తారు.
ఈ క్షేత్రము ప్రఖ్యాత వైతరిణి నదికి సమీపంలో ఉంది. ఈ వైతరిణి ఒడ్డున బ్రహ్మ అశ్వమేధం చేసాడని ప్రతీతి. ఈ క్షేత్రంలో శివుడు విశ్వనాథుని రూపంలో పెద్ద శివలింగాకారంలో ఉన్నాడు. గర్భ గుడి వెనుక దుర్గ బగళా ముఖి రూపంలో ఒక చిన్న గుడి ఉంది. అలాగే శివలింగాల సమూహం గర్భగుడికి ఈశాన్య భాగంలో ఉంది. విరజా అమ్మవారికి పూజ చేయించుకొని రాత్రికి భువనేశ్వర్ పట్టణం చేరుకున్నాము. అక్కడ శ్రీ రాం మందిర్ అద్భుతమైన మందిరం. ఈ మందిరంలో సీతారామలక్ష్మణులు, రాధాకృష్ణులు, పంచముఖ హనుమాన్ ప్రధాన దేవతలు. గర్భ గుడి బయట దుర్గ, లక్ష్మి, శివుడు, గణపతి ఆలయాలు ఉన్నాయి. చాలా అందంగా ఉంది ఈ మందిరం. దర్శనం చేసుకొని వీనస్ ఇన్ లో రాత్రి భోజనం చేసి పడుకున్నాము. మర్నాడు సూర్యోదయం కోణార్క్ బీచ్ లో చూడాలని నిర్ణయించుకొని పడుకున్నాము.
కోణార్క్ బీచ్:
శనివారం ఉదయం మూడున్నరకే లేచి రూం చెకౌట్ చేసి కారులో అయిదున్నరకు కోణార్క్ బీచ్ చేరుకున్నాము. తూర్పున ఉన్న బంగాళా ఖాతం తీరంలో ఉన్న కోణార్క్ బీచ్ పేరు చంద్రభాగ. అద్భుతమైన సూర్యోదయం అక్కడ చూసి, సాగర కెరటాల్లో మునిగి తేలి కుటుంబమంతా చాలా మానసిక విశ్రాంతి పొందాము. ఎర్రటి అరుణ కిరణాలు సముద్రుడి అంచులను దాటి పైకి ఎగ బాకుతూ, వాయుదేవుడు చల్లని మలయ మారుతాలను కెరటాలతో కలిసి తీరం వైపు నెడుతూ ఉంటే చెప్పలేని ఆనందం. ఈ కోణార్క్ బీచ్ సూర్యోదయం చూసి తీరాల్సిందే. బీచ్ పక్కనే ఒడిషా పర్యాటక శాఖ వారి సులభ స్నాన గదులు చాలా సదుపాయంగా ఉన్నాయి. వీటి పక్కనే పర్యాటక శాఖ వారి భోజనశాల కూడా ఉంది. స్నానాలు, ఫలహారము చేసి సూర్య దేవాలయ సందర్శనానికి బయలుదేరాము.
కోణార్క్ సూర్య దేవాలయము:
ఈ యుగపు అధ్బుతాల్లో ఒకటిగా అనుకోవచ్చు ఈ సూర్య దేవాలయము. చంద్రభాగా తీరంనుంచి రెండు కిలోమీటర్ల దూరమలో ఉన్న ఈ దేవాలయము తెల్లవారి దోపిడీలకు గురై శిథిలావస్థలో ఉంది. పదమూడవ శతాబ్దంలో నరసింహదేవ రాజు చే నిర్మించబడిన ఈ దేవాలయం సాంకేతిక, శిల్పకళ నైపుణ్యానికి తలమానికం. ఆనాటి సామాజిక స్థితి, శృంగారం, ఆధ్యాత్మికము చక్కని శిల్పాల రూపంలో చెక్కబడింది. రథమున ఎక్కి విలసిస్తున్న సూర్యుని దేవాలయం ఇది. గర్భ గుడి గోపురం 227 అడుగుల ఎత్తు. 24 చక్రాలు గుడికి చుట్టూ అమర్చబడ్డాయి. గర్భగుడికి మూడు దిక్కులా మూడు సూర్యులు (ఉదయించే సూర్యుడు, మధ్యాహ్న సూర్యుడు, అస్తమించే సూర్యుడు - మానవుని మూడు జీవిత కాలాలకు (యవ్వనం, నడి వయస్సు, వృద్ధాప్యం) సంకేతంగా ఇవి అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. శిథిలాలలో దాదాపు సగం గర్భ గుడి లేదు. గుడి ముందు భాగంలో అద్భుతమైన నాట్య మంటపం ఉంది. ఇక్కడ ఎత్తైన స్థంభాలు, ఏక శిలా విగ్రహాలు నాలుగు వాకిళ్లతో మనోజ్ఞంగా కనిపిస్తాయి. గర్భ గుడి, జగ్మోహన మంటపం నాలుగు ద్వారాలు బ్రిటిష్ దొరలచే 1908 సంవత్సరంలో మూయబడి జాతీయ వారసత్వ సంపదగా గుర్తించబడి, తర్వాత ఏ.ఎస్.ఐ వారికి అప్పగించబడింది. సూర్యుని కిరణాలు అయస్కాంతములతో ఒక అద్భుతమైన సూర్య సమూహాన్ని భువి మీద శ్రుష్టించారు ఆ నాటి సాంకేతిక నిపుణులు, శిల్పులు. ఒక సాంకేతిక అద్భుతం ఈ మందిరం. శిథిలావస్థలో ఉండటం మన దురదృష్టం. కోణార్క్ సూర్యదేవాలయానికి వెళ్లే దారిలో ఒడిషా ప్రాంతానికి చెందిన హస్త కళలు (నార, కొమ్ములు, గవ్వలతో చేసినవి ప్రముఖంగా) అమ్మకానికి దొరుకుతాయి. గైడ్ సహాయంతో మొత్తం గుడిని తనివి తీరా చూసి, చిత్రాలు, వీడియోలు తీసుకొని పురీకి బయలు దేరాము.
మెరీన్ డ్రైవ్ (చంద్రభాగా తీరం):
ఒడిషా పర్యాటక శాఖ ప్రభుత్వం కోణార్క్ నుంచి పురీ వెళ్ళటానికి సముద్రం వెంబట చక్కని రహదారి, దానికి ఇరుపక్కల చెట్లు వేసారు. బ్యాక్ వాటర్స్, ఈ చెట్లు, రహదారి - కోణార్క్- పురీ ప్రయాణాన్ని మనకు ఒక తీపి గుర్తుగా మిగులుస్తాయి. బంగాళా ఖాతం యొక్క ఎగిసే అలలు పచ్చని ప్రకృతి, రెండు వైపులా కలువలు ఈ సౌందర్యానికి ఆలవాలం. దాదాపు 30 కిలోమీటర్ల దూరం కోణార్క్-పురీ మధ్య.
మహా పుణ్య క్షేత్రం పురీ:
పురీ జగన్నాథ దేవాలయం నాలుగు దివ్య ధామాల్లో అగ్రగణ్యం. పురీ, రామేశ్వరం, ద్వారక, బదరీనాథ్ - ఇవి నాలుగు దివ్య ధామాలు. ఆది శంకరులచే పూజించ బడినవి ఈ దేవాలయాల ప్రధాన దేవతలైన జగన్నాథుడు, రామ లింగేశ్వరుడు, శ్రీ కృష్ణుడు, నారాయణుడు. నగరంలో అడుగు పెడుతూనే ఆ నీల మేఘ శ్యాముని సుగంధం, ఆయన భక్తుల సందోహం, పారవశ్యం, ఆధ్యాత్మిక సంపద ఒక వైపు మరొక పక్క సముద్రం వెంబడ ఉన్న హోటల్స్/రిసార్ట్స్/ఆహ్లాదము.
ఒడిషా పర్యాటక శాఖ వారి పంథనివాస్ పేరుతో వసతి గృహాలు ప్రతి పర్యాటక ప్రదేశంలో ఉన్నాయి. వాటిలో మన పున్నమి లాగ అన్ని వసతులు ఉన్నాయి. పురీలో పంథనివాస్ సీ బీచ్ రోడ్డులో (ఊరిలో స్వర్గధామం అనే వైపు) సముద్రపు ఒడ్డున కట్టారు. రూము దాటి వెళితే బంగాళా ఖాతమే. దాదాపు 4-5 కిలోమీటర్ల పొడవున ఉన్న పురీ నగర తీరం మొత్తం హోటల్స్, రిసార్ట్స్. డబ్బును బట్టి వసతులు, దగ్గర/దూరం. పంథనివాస్ లో చెక్ ఇన్ చేసి, సామాను పడేసి, స్నానం చేసి స్వామి దర్శనానికి బయలు దేరాము. పురీ గుడికి, పార్కింగ్ కి దాదాపు 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దూరం వెళ్ళటానికి గుడి వారి బస్సులు, రిక్షాలు, ఆటోలు ఉన్నాయి. గుడి ముఖ ద్వారం ముందు నిలిచోగానే అదొక అలౌకిక ఆనందం. ఇక్కడ పండాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎంత ఓపిక ఉన్నవారికైనా విసుగు, కోపం కలిగించే ఈ బ్రాహ్మణులు డబ్బు కోసం పీక్కుతింటారు. ప్రతి పనికి డబ్బే ఈ దేవాలయంలో. ఒక పండాను పట్టుకొని దర్శనం చేసుకున్నాం. పాద దర్శనానికి 25 రూపాయల టికెట్. ప్రధాన దేవాలయం చుట్టూ ఎన్నలేని గుళ్ళు ఉన్నాయి. గర్భగుడి ఎత్తు 214 అడుగులు. దేవాలయ ప్రాంగణం కొలతలు 650 x 650 అడుగుల చతురస్రం. చుట్టూ గోడ 20 అడుగుల ఎత్తు. నాలుగు వైపులా నాలుగు మహా ద్వారాలు.
భారత దేశంలో ఉండే ఇతర దేవాలయాల లాగ కాకుండా ఇక్కడ ప్రధాన దేవతలు సోదరీ సోదరులు - బలరాముడు, సుభద్ర, శ్రీ కృష్ణుడు. ఆలాగే, విగ్రహాలు చెక్కతో చేయబడినవి. దాదాపు 6000 మంది సేవకులతో నిత్యము 10,000 - 25,000 భక్తులకు అన్న సంతర్పణతో ఆ జగన్నాథుడు అలరారుతున్నాడు. గర్భ గుడి బయట విమలా దేవీ (అమ్మవారు), రాధా కృష్ణులు, విశ్వనాథుడు, మహాలక్ష్మి, హనుమంతుడు, సూర్యనారాయణుడు ఇతర దేవతలు ఉన్నారు.
దేవాలయం చుట్టూ ఉన్న మంటపాలు, కూర్చునే ప్రదేశాల్లో యోగులు, యోగినిలు దినం, జపం, కీర్తనలో మునిగి తేలుతూ బాహ్య ప్రపంచం పట్టకుండా ఆ జగన్నాథుని భక్తి సామ్రాజ్యంలో ఉంటారు. వీరినే చూస్తే ఒళ్ళు పులకించి తెలియకుండా నారాయణ నామస్మరణ చేస్తుంది.
ఇక్కడ మహా ప్రసాదం గురించి కొంత చెప్పాలి.
దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా పంచ భక్ష్య పరమాన్నాలు పెడతారు. ఈ వంటలన్నీ మట్టి కుండల్లో వండుతారు. విశేషం ఏమిటంటే ప్రతి సారి వండేవి కొత్త కుండలే. అన్నము, పప్పు, కూర, సాంబారు, పాయసం వండి నైవేద్యం పెట్టి మంతపాల్లో భక్తులకు సంతర్పణ చేస్తారు. ఇవి కాకుండా, ఆలయ ప్రాకారంలో, వసారాలో ప్రతి వ్యక్తికీ అరటి ఆకు లేదా విస్తరిలో ఇవి వడ్డించి పెడతారు. మంటపాలను ఆనంద్ బజార్ అంటారు. అక్కడ ఎన్నో రకాల మిఠాయిలు అమ్ముతారు. భోజన సమయంలో ఈ దేవాలయ ప్రాంగణం క్రిక్కిరిసి ఉంటుంది. అందుకని కొంత శుభ్రం తక్కువ అనిపించొచ్చు. మహా ప్రసాదం తినకుంటే పురీ ప్రయాణం పూర్తి కానట్టే. దర్శనము చేసి, ప్రసాదము తిని బయట పడ్డాము.
పురీ బీచ్:
పంథనివాస్ లో కాసేపు విశ్రాంతి తీసుకొని వెనకనే ఉన్న తీరానికి వెళ్ళాము. పురీ బీచ్ చాలా విశాలమైనది. అక్కడ లైఫ్ గార్డ్స్, బీచ్లో వాలీ బాల్ ఆడే వారు, వాకింగ్, జాగింగ్ చేసే వారు ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. హాయిగా కాసేపు అక్కడ సేద తీరి, స్వర్గ దామము వైపు వెళ్లి ఒడిషా చేనేత వారి సంభాల్పూర్ చీరలు కొనుక్కుని నా శ్రీమతి. అక్కడ బీచ్ లో రాత్రిపూట బజార్ చాలా బాగుంది. దీపాల కాంతిలో కూర్చీలు వేసుకొని బీచ్ లో హాయిగా కూర్చో వచ్చు. అక్కడే ఉన్న విట్టల్ కామత్ హోటల్ లో భోజనం చేసి రూం కి చేరాము. హాయిగా నిద్రపోయాం. ఆదివారం ఉదయమే లేచి సూర్యోదయము సముద్రం మీద చూసి కాసేపు ఆడుకున్నాము అందరం. స్నానాలు చేసి చెక్ అవుట్ చేసి చిలికా సరస్సుకు బయలుదేరాము.
చిలికా సరస్సు:
పురీ నుంచి బర్కుల్ చిలికా వెళ్లే మార్గంలో ఒక ౩౦ కిలోమీటర్లు రోడ్డు అసలు బాగోలేదు. దాదాపు రెండు గంటలు నరక యాతనే. అది దాటితే, జాతీయ రహదారి 5 . దాదాపు మూడు గంటల ప్రయాణం తర్వాత బర్కుల్ చేరుకున్నాము. అక్కడ పంథనివాస్ చెక్ ఇన్ చేసి అక్కడే భోజనం చేసి (శాఖాహారులకు ఇక్కడ భోజనం అసలు బాలేదు కాబట్టి ఏమైనా తీసుకెళ్లటం మంచిది) బోటు విహారానికి బయలు దేరాము. పంథనివాస్ లో ఏ.సీ కాటేజీ వసతి రేటు 1700 రూపాయలు.
చిలికా సరస్సు ఆసియాలో కెల్లా పెద్దదైన సహజమైన సరస్సు. పదకొండు వందల చదరపు కిలోమీటర్ల వైశాల్యముతో ఒక వైపు బంగాళా ఖాతంలో కలిసే ఈ సరస్సు రకరకాల పక్షులకు, జల చరాలలు ఆలవాలం. చిలికా సరస్సుకు నాలుగు మార్గాలు ఉన్నాయి కాని ఉండటానికి వసతి ఒక్క బర్కుల్ లో మాత్రమే ఉంది. ఇక్కడ నవంబర్, డిసెంబర్ నెలలో ప్రపంచంలో అన్ని ప్రాంతాల నుంచి వలస పక్షులు వస్తాయిట. మేము వెళ్ళినప్పుడు ఇంక ఆ సీజన్ మొదలు కాలేదు. నౌక విహారం మోటర్ బోటు లో దాదాపు గంటన్నర. ఈ విహారం బర్కుల్ నుండి కాలిజై ద్వీపం వరకు వెళ్లి తిరిగి రావటం. కాలిజై ద్వీపం అతి చిన్నది. ఈ ప్రాంతం భారతీయ నౌకాదళం వారిచే నడపబడుతున్నది. అక్కడ ఒక కాళికా మందిరం ఉంది. నాలుగు వైపులా నీరు, మధ్యలో ఈ గుడి - చాలా బాగుంది. కొంత పరిశుభ్రత తక్కువే కాని ప్రకృతి మనల్ని చాలా ఆహ్లాదపరుస్తుంది ఇక్కడ.
ఒక సరస్సులా కాకుండా సముద్రంలా అనిపిస్తుంది ఈ చిలికా. నీరు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. కానీ, సముద్రం ఒక వైపు ఉండటం వలన కొంత ఉప్పగా ఉంటాయి. చిలికా బర్కుల్ పంథనివాస్ లో కుటుంబాలకు వసతిగా కాటేజీలు, రూములు ఉన్నాయి. సరస్సు మీద సూర్యోదయం చాలా బాగుంటుందిట. మేము ఉదయం టైములో అక్కడ ఉండలేదు కాబట్టి చూడలేకపోయాం. పైగా వర్షము కూడా. ఈ సరస్సులో చిన్న చిన్న ద్వీపాలు చాలా ఉన్నాయి. బోటింగ్ వసతి బర్కుల్, రంభ, బాలుగావ్, సత్పద ప్రాంతాలనుంచి ఉంది. ఈ ప్రదేశాలనుంచి చిలికను సందర్శించ వచ్చు.
చిలికా చూసుకొని మేము రాత్రికి మళ్లీ భువనేశ్వర్ చేరాము. రెండు గంటల ప్రయాణం జాతీయ రహదారి 5 మీద. హోటల్ గ్రాండ్ సెంట్రల్ లో వసతి. ఇక్కడ సదుపాయాలు, భోజనము బాగున్నాయి. 2100 రూపాయలు రోజుకి ఈ హోటల్లో.
భువనేశ్వర్ లోకల్:
ధౌళి:
సోమవారం ఉదయం త్వరగా తయారు అయ్యి, ఫలహారం చేసి మొట్ట మొదలు ధౌళికి వెళ్ళాము. ఈ ధౌళి గిరి బౌద్ధ క్షేత్రం. ఇది భువనేశ్వర్ కు 8 కిలోమీటర్ల దూరం. దయానది ఒడ్డున ఉన్న పర్వతంపై అశోక చక్రవర్తి కాలం నాటి రాళ్ళకు గుర్తుగా ఈ క్షేత్రం నిర్మించ బడింది. 260 బీ.సీ నాటి రాళ్ళు ఇక్కడ ఉన్నాయి. బౌద్ధ గురువుల సలహాతో 19వ శతాబ్దంలో రాజు ఇక్కడ శాంతి స్తూపాన్ని నిర్మించాడు. శాంతి స్తూపం వలయాకారంలో ఉంటుంది. నాలుగు వైపులా నాలుగు బుద్ధుల విగ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. ఈ శాంతి స్తూపం వెనక శివుని గుడి చాలా బాగుంది. పెద్ద లింగము, మంచి అలంకరణ, బిల్వ దళములతో, తెల్లని పూలతో పూజ చాలా అందంగా ఉంది. ఈ గుడి గోడలో ఒకవైపు అమ్మ వారు ఇంకోవైపు గణపతి, వెనుక లక్ష్మీ నారాయణులు, దుర్గ ఉన్నారు. ఈ కొండ మీద నుంచి పచ్చని ప్రకృతి, దయానది, భువనేశ్వర్ పట్టణం కనిపిస్తాయి. ఎంతో ఆహ్లాదంగా, పరిశుభ్రంగా ఉంది ఈ ధౌళి.
ముక్తేశ్వర్, సిద్దేశ్వర్, కేదారగౌరి దేవాలయాలు:
ధౌళి నుంచి తిరిగి వచ్చే దారిలో ముక్తేశ్వర్ మందిర సముదాయం ఉంది. ఇది ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. అద్భుతమైన మందిరం ఇది. ఇక్కడ శివుడు ముక్తేశ్వర్, సిద్ధేశ్వర్ పేరులతో ఆలయాలు ఉన్నాయి. అలాగే ఎన్నో దేవతల సముదాయం ఉంది. ఇది 950 సంవత్సరం నాటిది. ఇక్కడ తోరణం చాలా ప్రత్యేకమైన ఆకర్షణ. ఈ గుడి వెనుక కొలను ఉంది. ఇందులో స్నానం చేస్తే వ్యాధులు తగ్గి సంతానము లేని వారికి సంతానం కలుగుతుందని నమ్మకం. మేము వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక నాట్య కళాకారిణి ఛాయ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఈ గుడికి ఇంకొక వైపు కేదార గౌరీ మందిరం ఉంది. చాలా పురాతనమైన ఈ మందిరంలో శివుడు స్వయంభూ. కాబట్టి లింగం కనిపించదు. గౌరీ అమ్మవారు చక్కని అలంకరణలో నయనానందకరం. పక్కనే హనుమంతుని గుడి, మహిమ గల కొలను ఉన్నాయి. తప్పకుండా చూడాల్సిన వాటిల్లో ఇదొకటి.
రాజ రాణి ఆలయం:
ఈ దేవాలయం విశాలమైన ప్రాంగణంలో ఉంది. ఏ.ఎస్.ఐ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం ప్రత్యేకమైన ఇసుక రాయితో కట్టబడింది. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. గర్భగుడిలో ఏ దేవతా లేదు కాని అష్ట దిక్పాలకులకు విగ్రహాలు గోడల పై ఉన్నాయి. ఇది అప్పటి రాజు, రాణిల స్మారకం అని కొంత మంది అభిప్రాయం. విశాలమైన లాన్, ప్రశాంతంగా ఉంది ఈ దేవాలయం. ప్రేమికులకు మంచి ప్రదేశం.
ఉదయగిరి, ఖండగిరి గుహలు:
భువనేశ్వర్ కి ఏడు కిలోమీటర్ల దూరం లో ఈ ఉదయగిరి, ఖండగిరి గుహలు ఉన్నాయి. ఇవి ప్రముఖంగా బౌద్ధ, జైన క్షేత్రాలు. ఇవి మొదటి బి.సి. నాటివి. ఎడమవైపు ఖండగిరి గుహలు, కుడివైపు ఉదయ గిరి గుహలు. ఖండగిరి గుహలు పదిహేను. ఈ గుహల పైన జైనుల మందిరాలు ఉన్నాయి. అప్పటి దిగంబర జైనుల విగ్రహాలు అద్భుతమైన శిలా సమపాలో దర్శనమిస్తాయి. ఉదయగిరి గుహలు పద్దెనిమిది. ఇందులో ప్రధానమైనది హాథీ (ఏనుగు) గుహలు. ఇది ఉన్నవాటిలో పెద్ద గుహ. ఇవి కాక రాణీ గుహ, గణేశ గుహ లాంటి పేర్లతో చాలా ఉన్నాయి. జైనుల ధ్యానానికి, విశ్రాంతికి అనువుగా ఈ గుహలు ఉన్నాయి. చారిత్రిక ప్రాధాన్యం, ఆనాటి సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఎన్నో చెక్కడాలు ఈ గుహల పైన ఉన్నాయి. వివిధ రకాల జంతువుల ఆకారాలు, పెళ్లిళ్లు ఈ చెక్కడాల పైన మనకు కనిపిస్తాయి. గైడ్ చాలా వివరంగా మాకు అన్ని తెలియ చేసాడు. ఈ ప్రదేశం మంచి విహార యాత్ర ప్రదేశం. ఇది కూడా ఏ.ఎస్.ఐ వారి ఆధీనంలో ఉంది. ఇక్కడ కోతులు విపరీతంగా కనిపిస్తాయి. ఈ రెండు కొండల పైనుంచి భువనేశ్వర్ పట్టణం కనిపిస్తుంది. దట్టమైన చెట్ల మధ్య ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికి, ఆనాటి జీవన శైలికి ఆలవాలం. ఈ రెండు గుహల సముదాయం, కొండలు ఎక్కటానికి, చూడటానికి దాదాపు 2 -3 గంటలు పడుతుంది.
ఇవి ముగించుకొని మేము ఇస్కాన్ మందిరానికి వెళ్ళాము. అక్కడ మంచి భోజనం చేసి మార్కెట్ కి వెళ్లి కొంత షాపింగ్ చేసాము. రూం కి చేరుకుని, సర్దుకొని సాయంత్రం 6 :50 కి బిజూ పట్నాయక్ విమానాశ్రయంలో హైదరాబాదు విమానం ఎక్కాము. మొత్తం మీద చాలా హాయిగా, విశ్రాంతిగా, భక్తితో, ఒడిషా వారసత్వ సంపదను చూసే యాత్ర చేసాము. విహారం, వినోదం, దైవం, చారిత్రకం - అన్ని సమ పాళ్ళలో మేళవించి శరీరాన్ని కొంత పదును పెట్టి తిరిగి వచ్చాము.
ప్రదేశాలు, వసతులు, ఫోన్ నెంబర్లు - వీటికొరకు ఒడిషా పర్యాటక శాఖ వారి వెబ్ సైట్ చూడండి.

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)
వెడలెను కోదండపాణి - త్యాగరాజస్వామి కృతి
వెడలెను కోదండపాణి అనుజ సౌమిత్రితో గూడి పుడమిలో జనులెల్ల పొగడ పూజితుడౌ మునితో గూడి శిరమన కొండెయు జార వురమున హారములు మెరయ కరమున శరచాపములును ఘ...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దే...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...