4, జులై 2020, శనివారం

కమలాప్త కుల కలశాబ్ది చంద్ర - త్యాగరాజ స్వామి కృతి

కమలాప్త కుల కలశాబ్ది చంద్ర!
కావవయ్య నన్ను కరుణా సముద్ర!!

కమలా కళత్ర! కౌసల్యా సుపుత్ర!!
కమనీయ గాత్ర! కామారి మిత్ర!!

మును దాసులనెల్ల బ్రోచినదెల్ల చాల
విని నీ శరణాశ్రితుడైతినయ్య!
కనికరంబున నాకభయమివ్వుమయ్య
వనజ లోచన శ్రీ త్యాగరాజ వినుత!!

కమలములకు ఆప్తుడైన సూర్యుని వంశమనే పాలకడలికి చంద్రుని వంటి వాడవైన రామా! నీవు కరుణా సముద్రుడవు! నన్ను కాపాడుము! లక్ష్మీదేవికి పతివి, కౌసల్య పుత్రుడవు! మనోహరమైన రూపము కలవాడవు! మన్మథుని శత్రువైన శివుని మిత్రుడవు! ఇంతకు మునుపు నీ దాసులను నీవు కాపాడినది చాలా విని నీ శరణాగతుడనైతిని! దయతో నాకు అభయమీయవయ్యా! కమలముల వంటి కన్నులు కలిగి శివునిచే నుతించబడిన రామా! నన్ను కాపాడుము.

- సద్గురువు త్యాగరాజ స్వామి

https://www.youtube.com/watch?v=HSG0uFo1XKI


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీనివాస గద్యం సాహిత్యం, భావం

ఆనందనిలయ వాసుడైన శ్రీనివాసుని వైభవాన్ని తెలిపే స్తుతులు, కృతులు ఎన్నో. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కొలిచి తరించిన భక్తవరేణ్యులెందరో. అటువంటి వ...