24, జులై 2020, శుక్రవారం

పరాకేల నన్ను పరిపాలింప - శ్యామశాస్త్రి


పరాకేల నన్ను పరిపాలింప
మురారి సోదరి! అంబా!

నిరాదరణ సేయరాదమ్మా శివే!
పరాశక్తి! నా మొరనాలకింప

ధరాద్యఖిలమునకు రాణి! హరి
హరాదులు పొగడు పరాత్పరి!
దురంధర మహిషాసుర దమని!
స్మరాధీనుడౌ శ్యామకృష్ణనుత!

విష్ణు సోదరివైన ఓ అంబా! నన్ను రక్షించుటకు పరాకెందుకు? ఓ శివానీ! నీవు పరాశక్తివి! నన్ను నిరాదరణ చేయకుము, నన్ను రక్షించుటకు పరాకెందుకు? భూమ్యాది సమస్త భువనములకు రాణివి నీవు! హరి హరాదులు పొగడు భగవతివి నీవు! మహాపరాక్రమవంతుడైన మహిషాసురుని సంహరించిన అమ్మవు నీవు, నల్లని వర్ణము గల కృష్ణునిచే నిరంతరము స్మరించబడే అమ్మా! నన్ను రక్షించుటకు పరాకెందుకు?

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

శ్రీనివాస గద్యం సాహిత్యం, భావం

ఆనందనిలయ వాసుడైన శ్రీనివాసుని వైభవాన్ని తెలిపే స్తుతులు, కృతులు ఎన్నో. కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కొలిచి తరించిన భక్తవరేణ్యులెందరో. అటువంటి వ...