కోనసీమ అందాల గురించి ఎంత చెప్పినా చాలదు. ఇదివరకు నాలుగు సార్లు తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో క్షేత్రాలు దర్శిస్తూ అక్కడ అందాల్ని ఆస్వాదించాను. ఈ మధ్య నేను నరసాపురం వెళ్లి, అక్కడనుంచి అంతర్వేది కారులో వెళ్లాను. దాదాపు గుడివాడనుండి మొదలయ్యింది మన కోస్తా అందాలు. కాలువలు, కొబ్బరి చెట్లు, పచ్చగా నాట్లు, నారు మళ్ళ నిండా నీరు, అరటి తోటలు..ప్రకృతి అందమంతా అక్కడే ఉంది అనిపించింది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ తెల్లవారేసరికి ఈ అందాల్ని చూపించటం మొదలు పెట్టింది. ఇక అక్కడనుంచి 9 గంటలకు నరసాపురంలో దిగేంత వరకు రైల్లోంచి మాకు నేత్ర పర్వమే. కొబ్బరి చెట్లు ఎంత ఎత్తు, పొడవు, మరియు దట్టంగా ఉన్నాయో అక్కడ. మీ కనుచూపు అందినంత మేర పచ్చని వరిపొలాలు, గట్లు, కొబ్బరి తోటలు. కొన్ని వందల ఎకరాలు అలా ఒక దృశ్యంలో కనిపిస్తూనే ఉన్నాయి.
గోదావరి జిల్లాల్లో ప్రవేశించగానే కనిపించేవి చక్కని కాలువలు, కాలువలు దాటటానికి కట్టిన వంతెనలు - వాటి చుట్టూ అల్లుకున్న జీవితాలు. కొన్ని వందల కిలో మీటర్ల దూరం ఇవి కనిపిస్తాయి. పొలాల మధ్యలో పెంకుటిల్లు, వసారాలు, శుభ్రంగా, హాయిగా జీవితాన్ని సాగిస్తూ, ప్రేమగా పలకరిస్తూ కనిపించే ప్రజలు అక్కడ. ఏ మాత్రం వాళ్ల జీవితాల్లో ఒత్తిడి లేదు అనిపిస్తుంది. కాలువలు దాటటానికి కొబ్బరి బోదెలు, రాళ్ళు, బండలు వేసుకుని, ఆ కాలువల్లో బట్టలు ఉతుక్కొనే జనాలు. కాలువ గట్టు పక్కనే మంచి పెంకుటిల్లు, గుడిసె, దాని చుట్టూ పాదులు, మొక్కలు, వృక్షాలు, మధ్యలో పశువుల కొష్టాలు, ఆరోగ్యంగా, పుష్టిగా ఉన్న పశువులు - ఇదీ ఆ గ్రామీణ జీవితం. గ్రామాల లాగా కనిపించినా అక్కడ ఉన్నంత ఆధునికత మనకు కూడా లేదేమో అనిపిస్తుంది. పచ్చని అరటి పండ్ల గెలలు, కుప్పలుగా పోసిన కొబ్బరి కురిడీలు అక్కడ సర్వ సామాన్యం. బాగా నీరుంటే కలువలు పెరుగుతాయి కదా. ఈ ప్రాంతాల్లో రంగు రంగుల కలువలు కనిపిస్తాయి చెరువుల్లో. ప్రతి ఊరు ఒక దృశ్య కావ్యమే.
నరసాపురం ఎక్ష్ప్రెస్స్ మందవల్లి, కైకలూరు, ఆకివీడు, భీమవరం, వీరవాసరం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుతుంది. ఈ ప్రాంతాలన్నీ ప్రకృతి మాట అందాల నివాసాలే. హరిత శోభలు విశ్వరూపమై ఉన్నాయా ఇక్కడ అన్నంత ఆవేశం, ఆనందం కలుగుతుంది. కాలువలు, గట్లు, పిల్ల కాలువలు, వంతెననలు నిర్మించిన వారికి నా జోహార్లు. అవిలేకపోతే కోనసీమ లాంటి భూతల స్వర్గం మనకు ఉండేది కాదు. దేవుని దేశంగా పేరుపొందిన కేరళ రాష్ట్రంలో కన్నా మన కోన సీమ అందాలు మిన్న. ఇది మన భూమి, మన భాష, మన సంస్కృతి, మన ఆప్యాయతలు ఉన్న సువర్ణ భూమి. అన్నపూర్ణ అంటే ఈకోనసీమే. సంపద అనేది పట్టణాల్లో ఉంది అనుకుంటే పొరపాటు. నిజమైన సంపద ఈ ప్రకృతి. కొన్ని వేల సంవత్సరాల పాటు ఒక మంచి జీవన విధానానికి పునాది వేసే ప్రకృతి అసలు లక్ష్మి. మళ్ళా హైదరాబాద్, మన కాంక్రీట్ అడవులు ఈ కోనసీమ పచ్చదనం ముందు వెలవెల పోయి జీవచ్చవాలుగా అనిపించాయి నాకు.
ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ పరమాత్మ అన్నది ఎంత సత్యమో ఈ ప్రాంతాలో తిరిగితే మేకు అర్థం అవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నన్ని అతి పురతాన, మహిమాన్విత పుణ్యక్షేత్రాలు ఆంధ్ర ప్రదేశ్‌లో ఎక్కడా లేవు . ఆ ప్రకృతి పురుషుల కలయిక, నదీ నాదాలు, చెరువులు, కాలువలు, తీరాలు భగవంతుని ప్రతిరూపాలు. అందుకే అక్కడ పంటలు, ప్రజలు, వృత్తులు బాగా వృద్ధిలో ఉన్నాయి. ప్రకృతి ఒడిలో భగవంతుడు నివసిస్తాడు అనటానికి కర్నాటకలోని పశ్చిమ కనుమలు, సహ్యాద్రి పర్వతాలు ఇంకొక తార్కాణం. వాటి వివరాలు ఇంకొక సంచికలో.
22, జులై 2010, గురువారం
బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - రెండో అంకం
మొత్తానికి మరాఠీ ఖాఖీల చేత లాఠీ దెబ్బలు తిని, నాలుగు రోజులు అక్కడ మగ్గి, నాటకీయంగా చంద్రన్న, బృందం హైదరాబాద్ వచ్చారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు చంద్రన్నా మన పెద్దలు. కానీ తమరు ఇంట్లో ఏమి చెయ్యలేక మహారాష్ట్రలోకి వెళ్లి నేను 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను, నాకు గౌరవం ఇవ్వాలి, మంచి బస్సు ఇవ్వాలి, బస ఇవ్వాలి అంటే ఎలా సార్. ఢిల్లీలో మేడంకి మీ మీద బానే గుర్రు ఉంది సార్. అది గుర్తుపెట్టుకొని, మీరు తొమ్మిదేళ్ళలో బాబ్లీ గురించి ఏమి చేశారో ఒక సారి రివైండ్ చేసుకోండి. కాబట్టి, మీకు మర్యాదలు చేయాల్సినంత సీన్ లేదు.
ఇకపోతే, ఎమ్మెల్యేలను కొట్టి, మహిళా ఎమ్మెల్యేలను అవమాన పరచి, కనీస వసతులు ఇవ్వకపోవటం అనేది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పెద్ద తప్పు. అలాగే, బాబుని ఈ సమయంలో విమర్శించి కే.సి.ఆర్ హాయిగా తమ చేతిలో ఉన్న తెలంగాణా ప్రాంతపు జనాల వోటును కొంత పళ్లెంలో పెట్టి చంద్రన్నకి ఇచ్చినట్టే. బాబు రాజకీయ చాణక్యం, కుతంత్రం మనకు బాగా తెలిసి ఆయనకు అవకాశం ఎందుకు ఇవ్వటం?. నిజంగా తెలంగాణా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీలో మార్పు వస్తే చాలు. దానికి చంద్రన్న ఆశీర్వాదం అక్కర్లేదు. ఇంతే కాదు, తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, ఆ ప్రాంతంలో చంద్రన్న పట్టు, ప్రభావం ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి, ఆయనకు ఎందుకు మనం అవకాశాలు ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి.
బాబ్లీ అంశం తెలంగాణలో ఉప ఎన్నికల్ని ఏ మాత్రం ప్రభావితం చెయ్యదు అని కాంగ్రెస్, కే.సి.ఆర్ అనుకుంటే, ఆ విషయం గురించి పట్టించుకోకూడదు, మాట్లాడ కూడదు. కానీ, వారిలో ఈ విషయంలో భయం కనిపిస్తోంది. రాజకీయాల్లో, ప్రత్యర్థి ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి కానీ చేతులు కాలాక ఆకులు రాసుకోవటం ఎందుకు?. బాబు 9 ఏళ్లలో ఏమి చేసాడు అనే నినాదం ఇంక ఎక్కువ రోజులు పని చేయ్యదండి. ఎందుకంటే, మీరు అధికారంలోకి వచ్చి 6 ఏళ్ళు దాటింది. మీరు ఏమి చేస్తున్నారు తెలంగాణా, బాబ్లీ విషయంలో ఈ ఆరేళ్లలో?. అంతమాత్రం వోటు వేసే ప్రజలు ఆలోచించరా?.
ఏమి చేసినా, చెయ్యకపోయినా - సీమాంధ్ర ప్రజల అభిమానం చూరగొని ముఖ్యమంత్రి కావాలన్న జగన్ యాత్ర బానే సాగుతోంది. నేను ఇటీవలే ఆయన పర్యటిస్తున్న ప్రాంతాలకు వెళ్ళాను. ప్రజలకు అక్కడ వై.ఎస్.ఆర్ దేవుడు. వాళ్లు తప్పకుండా జగన్ వెంటే ఉన్నారు అన్నది స్పష్టంగా కనిపించింది. అభిమానం ఉన్నంత మాత్రాన వోట్లు రావాలని కూడా లేదు. అందుకనే, జగన్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాడు రోశయ్యను దింపి తాను రావాలని. ఈ నేపథ్యంలో చంద్రన్న బాబ్లీ విషయంలో ఒక అడుగు ముందు వేసి - రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు నాకన్నా ఎవ్వరికీ తెలీవు, పట్టవు అని బ్రహ్మాస్త్రం వదిలాడు. అది బలహీనంగా ఉన్న తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు దెబ్బే. అలానే, జగన్ మీది నుంచి దృష్టిని కొంత మళ్ళించ వచ్చు. ఉప ఎన్నికల్లో ఓట్లు, సీట్లు రాకపోయినా, టీ.డీ.పీ ఆ ప్రాంతంలో పాతుకు పోవాలని ఈ యత్నం అంతా. దానికి మన టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఇతోధికంగా సహాయం చేస్తున్నారు.
ఇవన్ని చూస్తుంటే, ఆంధ్ర రాజకీయ చిత్ర పఠం ఒక వైకుంఠ పాళీలా ఉంది. ఎప్పుడు ఎవరు ఎలా పైకి వెళ్తారు, ఎలా అకస్మాత్తుగా కింద పడతారు అనేది చెప్పటం కష్టంగానే ఉంది. వై.ఎస్.ఆర్ కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతుందా?. లేక కాంగ్రెస్ వాళ్లు జాగ్రత్త పడతారా? బాబు ఈ దూకుడును ఎన్నాళ్ళు చూపిస్తూ, ఎంత రాజకీయ లబ్ది పొంద గలరు?. వేచి చూడాల్సిందే.

21, జులై 2010, బుధవారం
అమెరికా-ఇండియా: పిల్లలు, తల్లిదండ్రుల ఆలోచనలు
"మా పిల్లలిద్దరూ అమెరికాలో ఉన్నారండి. ఈ మధ్య దాక ప్రతి సంవత్సరం పిల్లల పురుళ్ళనో ఇంకోటనో అక్కడికి వెళ్లి వచ్చే వాళ్లము. డెబ్భై కి దగ్గర పడుతున్నాము. ఇంక అంతంత దూరాలు ప్రయాణం చేత కావట్లేదు. మా వారేమో 'నాకు అక్కడ ఏమి తోచట్లేదు, ప్రతిదానికి వల్ల మీద ఆధార పడాలి, బయటకి పోవటానికి లేదు, రావటానికి లేదు, ఎప్పుడూ ఆ కొంపలో పడి ఉండాలి. ప్రతిది వీకెండ్ లో జరగాలి. నేను రాను. ఇక్కడే ఉంటాను, నువ్వు కావాలంటే వెళ్ళు' అంటున్నారు వదిన గారు. అమ్మాయేమో పిల్లల్ని చూసుకోవటం ఇబ్బందిగా ఉంది అని రమ్మని ఒకటే ఫోన్లు. నాకా మోకాళ్ళ నొప్పులు, బీపీ, ఇప్పుడిప్పుడే షుగర్ కనిపిస్తోంది. నీరసం, దడ. ఒకరోజు బాగుంటే ఇంకొక రోజు పడుకోవటమే. మాకు చేసే వాళ్ళు లేరని మేము కనీసం అనుకోడానికి కూడా లేదు. ఆ చలి, ఆ వాతావరణం పడి చావట్లేదు. ఏమి చెయ్యాలో పాలు పోవట్లేదు వదినగారు. అబ్బాయేమో ఈ మధ్యనే పెళ్లి అయ్యింది, సంపాదనలో ఇప్పుడే పడ్డారు, ఇప్పటికిప్పుడు మాకోసం తిరిగి రమ్మనటం ఎలా?. ఇక్కడ మా పనులకు ఎన్నాళ్ళు బయట వాళ్ల మీద ఆధార పడతాం చెప్పండి?. పిల్లలు అక్కడ, మేము ఇక్కడ ఏంటో ఈ బతుకు."
ఇది ఆంధ్ర ప్రదేశ్ లో వృద్ధాప్యపు అంచున ఉన్న సగటు తల్లిదండ్రుల యొక్క ఆవేదన. ఇక నాణాన్ని రెండోవైపు తిప్పితే:
"మా ఆవిడ కడుపుతో ఉందిరా. రెండు నెలల్లో డెలివరీ ఉంది. అమ్మ, నాన్నను సాయంగా ఉంటుంది రమ్మని అంటున్నాను. తను ఉద్యోగం ఈ మధ్యనే చేరింది, కాబట్టి వాళ్లు ఇచ్చే 8 వారాల సెలవు తర్వాత బిడ్డ ఎట్లాగ అని టెన్షన్. ఉద్యోగం మానుకుంటేనేమో మళ్ళీ వస్తుందన్న నమ్మకం లేదు. నా ఉద్యోగం అంతంత మాత్రంగా ఉంది ఎప్పుడు ఊడుతుందో తెలియదు. గ్రీన్ కార్డు లేదు. ఉద్యోగం పొతే హెచ్-1 మీద ఉద్యోగాలు తీసుకోవట్లేదు ఎక్కువ. అమ్మ, నాన్నకు ఆరోగ్యం అంతంత మాత్రమే..ఇక్కడికి వచ్చి జబ్బున పడి నేను సరిగ్గా చూపించలేక ఎలాగా అని ఇంకో పక్క..ఏంటోరా అర్థం కావట్లేదు పరిస్థితి...ఇవన్ని అమ్మ, నాన్నకు చెప్పలేను. పోనీ అత్త గారి వాళ్ళను రమ్మని అందామంటే అంటే మామ గారు ఉద్యోగం సెలవు లేదు, ఆయనకు ఇబ్బంది. "
"అమ్మ, నాన్న బాబు పుట్టినప్పడు వచ్చారే. నేను ఇంట్లో ఉన్నన్ని రోజులు వాళ్లకి అసలు బోర్ కొట్టలేదు. కానీ ఇప్పుడేమో నేను ఆఫీసుకి వస్తున్నాను. వాళ్ళకు బాబు తప్ప వేరే మొహం పగలంతా లేదు. బాబుని వదిలి ఎక్కడికి వెళ్లే పరిస్థితి లేదు. నాకేమో వీడు ఇంక సెలవులు ఇవ్వట్లేదు. పోనీ ఇంట్లోంచి పని చేద్దామా అంటే పిల్లాడితో సరిగ్గా వర్క్ చూసుకోలేకపోతున్న. ఆఫీసు వాళ్లు ఫోన్ చేసినప్పుడు పిల్లాడి చప్పుడు పక్కన వినిపిస్తే విసుక్కుంటున్నారు. ఇల్లు కొనుక్కున్నాము. ఆ లోన్ బోలెడు. ఒక్క జీతంలో కట్టలేము. కాబట్టి నేను ఉద్యోగం చెయ్యాల్సిందే. వాళ్లకు ఇబ్బంది అని తెలిసినా నాకు వేరే గత్యంతరం లేదే. ఏవైనా ప్రదేశాలు చూపిద్దామ అంటే అన్ని ఒకేలా ఉంటాయి అమెరికాలో మాకు బోర్ అంటున్నారు. ఎక్కడికి పోయిన అదే వాల్‌మార్ట్, అదే ఇండియన్ స్టోర్స్. వాళ్లకు ఇండియాను ఇక్కడ సృష్టించలేము కదా. ఆలోచిస్తే పిచ్చెక్కుతోంది."
ఇవి అమెరికాలో ఉన్న పెళ్ళైన సగటు తెలుగు ఆడ, మగల ఆలోచన. మీరే చెప్పండి ఇందులో ఎవరి తప్పుందో?. ఎవరి బాధల్లో వాళ్ళున్నారు. బాధ్యతలు, సంసారం, డబ్బు, విదేశం, మన సంస్కృతికి దూరం కాకూదన్న తపన, వృద్ధాప్యం, ఒంటరి తనం, పిల్లలతో ఉండాలన్న సహజమైన కోరిక - వీటన్నిట మధ్య కొట్టు మిట్టడుతున్న తల్లిదండ్రులు, పిల్లలు లక్షల మంది.
దీన్ని కొంత విశ్లేషణ చేద్దాము.
ఈ సందర్భంలో నాకొక పాట గుర్తుకొస్తున్నది. 'అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న...ఆరాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు ఉత్త చవటలయ్యారు...'. మనిషి చదివి కూడా చవట ఎందుకు అవుతున్నాడు?. తనకు ఏమి కావాలో అది తెలుసుకోలేక, ఉన్న దానితో సంతృప్తి పడక, అన్నీ కావాలని, ఆత్రుతతో ఉన్నది పోగొట్టుకోవటం వలన. చదువు, డబ్బే కాదు జీవితంలో ఆనందాన్నిచ్చే సంతులన, సమాజం, పరిసరాలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకోక పోవటం వలన.
యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు: మిమ్మల్ని జీవితాంతం మీరు రెండు పడవల్లో చెరొక కాలు పెట్టిన పరిస్థితిలో ఉంచుకోకండి. మీకు తృప్తి, ఆనందం ఇచ్చే అతి ముఖ్యమైన ఓ మూడు అంశాలను మీరు ఆలోచించి, నిర్ణయించుకొని వాటిని సాధించుకోండి. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.
తల్లిదండ్రులు: మీరు ప్రోత్సహించి పంపించిన పిల్లలు మీరు రమ్మనప్పుడు రావటానికి పరిస్థితులు చాలా మీరు ఊహించలేకుండా ఉంటాయి. మీ పిల్లలకు ఆ సుఖాలు కావాలి అనుకుంటే, కొంత మీ అంతటా మీరు ఉండటం అలవాటు చేసుకుంటే మంచిదేమో?. ఇంతకన్నా ముఖ్యం: మంచి విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం ఇవి ముఖ్యం కాని డబ్బు, కార్లు,స్కూళ్ళు, పార్కులు కాదు. చెట్టులో కాండం లాంటివి - విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం. ఆకుల్లంటివి డబ్బు, కార్లు, హోదా వగైరా లాంటి సుఖాలు. ఒక ఆకు పొతే ఇంకో ఆకు వస్తుంది, కాని కాండమే లేకపొతే?. ఆలోచించండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, వారికి ఏది ముఖ్యమని చెప్పాలో?.
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మమనేది మనం ఆచరించి, మన పిల్లలకు నేర్పితే కదా వాళ్లు దాన్ని పాటించేది?. మీరు పాటిస్తున్న ధర్మం తప్పు అనుకుంటే దాన్ని పాటించకండి. మేము పడిన కష్టాలు మీరు పడ కూడదు అని మనం నేర్పాల్సిన విషయాలు నేర్పని తప్పు చేసేది మనమే. మరి వాటి ఫలితాలు కూడా అనుభవించాలి కదా?. జిల్లేడు చెట్టు నాటి పనస పళ్ళు కాయాలంటే ఎలాగండి?. మీరు మీ అమ్మాయికి వంట నేర్పించరు, కానీ మీ కోడలు మీకు బాగా వండి పెట్టాలి. మీరు అవతలావాళ్ళ దగ్గరనుంచి ఏమి ఆశిస్తున్నారో, దాన్ని మీరు పాటిస్తున్నారా?. ఆలోచించండి.....ఏమంటారు?.
ప్రాధాన్యతలు, ప్రాముఖ్యాలు: ఇవి చాలా స్వంతమైన విషయాలు. చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా - వీటికి దేశం/రాష్ట్రం/పట్టణంతో మనం అనుకున్నంత సంబంధం లేదు. పల్లెటూరులో ఉండి కూడా ఇవన్ని సాధించి తమ ప్రతిభను చూపిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మనకు తేలికగా ఇవి కావాలి అంటే కుదరదు. 16,000 వేల మైళ్ళు వెళుతున్నాము అంటే - దానికి చాలా ఆలోచించి, అది మన జీవన శైలిని, విధానాన్ని మారుస్తుందని తెలుసుకొని, దాని వల్ల వచ్చే ఆటు, పోటులను తట్టుకునే శక్తి మనకు ఉండాలని, అక్కడ ఇక్కడ పరిస్థితులు సృష్టించలేమని - మనకు వెళ్ళేటప్పుడు ఇవన్ని కూలంకషంగా అర్థం అయ్యే పరిస్థితి ఉండదు. ఒకటి రెండు అంశాలు/ప్రాధాన్యతలు (విద్య, డబ్బు) ఆధారంగా నిర్ణయం తీసుకొన్న నిర్ణయం అన్ని అంశాల్లో కరెక్ట్ అవ్వలేదు. కానీ, మీ ఆ ఒకటి, రెండు అంశాలు/ప్రాధాన్యతలు చాలా ముఖ్యమైనవి అయితే, మీకు దువిధ అనేది చాలా తగ్గుతుంది.
ఇంకొక విషయం - మనం ఎక్కడున్నా, ఆ క్షణాన్ని, అక్కడ ఉన్న మంచి విషయాన్ని గ్రహించి, ఆనందించి, ఆస్వాదించకపోతే - మనం ఎక్కడున్నా ఈ రంధ్రాన్వేషణ తప్పదు. ఆత్రేయ గారు రాసిన ఈ పాట ఈ వ్యాసాంశానికి మంచి కొసమెరుపు.
మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరవుతావు
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల గయ్యాళివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు

- పెరిగే వయసులు ఉన్నప్పుడు తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఆశలు పెంచుకుంటారు. వాళ్ళే లోకమని తమ రక్తం ఓడ్చి చదివించి, మేము పడిన కష్టాలు మా పిల్లలు పడకూడదు అన్న ఆలోచనతో తమ పరిధి దాటిన అమెరికా అనే "స్వర్గానికి" పంపిస్తారు చదువులకు. ఇక్కడ మొదటి రిస్క్ తల్లిదండ్రులు తీసుకున్నారు. తమకు తెలియని, తాము చూడని కొత్త దేశానికి కేవలం 'అక్కడికి వెళితే మనకన్నా పిల్లలు బాగుంటారు' అన్న అపోహతో. ఈ అపోహ తల్లిదండ్రుల్లో కొంత కలగజేసేది పిల్లలే. డబ్బు సంపాదన అనేది ఎక్కడ ఉండినా చెయ్యొచ్చు అనేది చాలా మంది తల్లిదండ్రులకు, పిల్లలకు తెలియదు. ఎంత డబ్బు సంపాయిస్తాము అనేది మన సామర్థ్యము, లౌక్యము, ఫ్లెక్సిబిలిటీ మీద ఆధార పడి ఉంటుంది. వేరే దేశంలో ఇది తేలిక అనిపించినా వాటిక సమపాళ్ళలో మనకు అర్థం కాని కొత్త కష్టాలు కూడా దాగుంతాయని ఊహించరు తల్లిదండ్రులు, పిల్లలు.
- అమెరికా చదువులు తేలిక కాదు. కొత్త దేశం, అప్పటిదాకా స్వతంత్ర నిర్ణయాలు తీసుకోని అమ్మాయి/అబ్బాయి ఒక కొత్త దేశంలో, కొత్త సంస్కృతిలో, కొత్త విద్యా విధానంలో ఒక్క సారి మునుగుతారు. అప్పుడు డబ్బు, దాని విలువ, ఎంత కష్టపడితే ఒక డాలర్ మిగులుతుందో తెలుస్తుంది. డాలర్ విలువెంతో తెలుస్తుంది. దాంతో 'మేము చాలా కష్టపడి చదివాము అమెరికన్ యూనివెర్సిటీలో, కాబట్టి మేము బాగా సంపాయించి ఆ కష్టం యొక్క ఫలితాన్ని పూర్తిగా ఈ దేశంలోనే అనుభవించాలి' అని మనసులో చాలా మందికి నిర్ణయం ఏర్పడుతుంది. అమెరికాలో సుఖాలేంటో మొదటి రుచి చూస్తారు (సాఫీ జీవితం, పనులు వాటంత ఆవే తేలిగ్గా అవ్వటం, రూల్స్ పాటించే ప్రజలు, మంచి రోడ్లు, సార్లు, చెట్లు, పార్కులు, స్వేచ్చ వగైరా వగైరా). ఈ నిర్ణయంతో పాటే ఇండియా వెళ్ళకూడదు అనే నిర్ణయం కూడా చాలా మంది తీసుకుంటారు, తమకు తెలియ కుండా.
- కానీ, ఇది పూర్తిగా కూలంకషంగా ముందుచూపుతో ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు. ఎందుకంటే, జీవితంలో ప్రతి ఒక్క మెట్టులో వేర్వేరు ఆలోచనా పద్ధతులు, అవసరాలు, ప్రాముఖ్యాలు ఉంటాయి. పెళ్లి కాక ముందు/చదువుకునేటప్పుడు ఉండే ఉత్సాహంలో అమెరికా అంతా పచ్చగా, తీయగా, హాయిగా కనిపిస్తుంది. పెళ్లి అయ్యి, ఇల్లు కొనుక్కుని, ఇండియాలో ఉన్న అయిన వారి జీవితాల్లో ముఖ్యమైన అవసరాలు/ఘట్టాలు (పెళ్ళిళ్ళు, మరణాలు) మిస్ అయినప్పుడు అసలు నిజాలు బయట పడుతుంటాయి - మనుషులు, బంధుత్వాలు, ఆత్మీయతలు, సంస్కృతి, తెలుగుదనం, ఇరుగు, పొరుగు, పెళ్ళిళ్ళు, గుళ్ళు ఇలా ఎన్నో. ప్రతిది అమెరికాలొ బాఉండదు ఇండియాలో బాగుంటుంది అన్న ఆలోచన తొలవటం మొదలవుతుంది.. అలాగే, అమెరికాలో పని వాళ్లు ఉండరు, ఇండియాలో డబ్బులు పారేస్తే పని వాళ్లు దొరకుతారు, ఇండియాలో పిల్లల్ని పనిమనుషుల దగ్గర ఉంచి ఉద్యోగానికి పోవచ్చు, లేకపొతే అమ్మ, నాన్నదగ్గర ఉంచొచ్చు ఇలా ఎన్నో అభిప్రాయలు.
- ఇవేవి పూర్తిగా సరైన అభిప్రాయలు కాదు. ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న జనంలో కూడా బంధుత్వాలు, ఆత్మీయతలు చాలా తగ్గిపోయాయి. పొగరు/అసూయలతో, ప్రేమతో పిలిచినా రాని దుస్థితి. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు, నిజంగా పాశ్చాత్య దేశాలో కూడా లేని అసభ్య, అనాగరిక వేషాలు ఇక్కడ ఉన్న వాళ్లు వేస్తున్నారు. అలాగే, అమ్మ, నాన్నలను బయటకు గెంటి, అనాథ ఆశ్రమాల్లో ఉంచిన వాళ్లు చాలా మంది ఉన్నారు. పిల్లలకు మన భాష, సంస్కృతీ నేర్పించని స్కూళ్ళు, తల్లిదండ్రులే ఎక్కువ. తల్లిదండ్రులు కూడా చాలా మంది స్వాతంత్ర్యాన్ని కోరుకుంటున్నారు. బాధ్యత పిల్లల వైపు నుంచి కనిపిస్తేనే తాము వాళ్లకు సాయంగా ఉండాలని మనసులో అనుకుంటున్నారు. అమెరికాలో లేదు, ఇండియాలో ఉంది అన్న ఆలోచనలో - ఇండియాలో ఉన్న కాలుష్యము, ట్రాఫిక్, జబ్బులు, దోపిడీలు, లంచాలు, రోడ్డు ప్రమాదాలు, కిడ్నాప్‌లు, హత్యలు, రహస్యంగా జరుగుతున్నా పెళ్లి ముందు శృంగారం, ఏ మాత్రం అడ్డు, అదుపు లేని టీవీ చానల్స్, చదువుల్లో ఊహించలేని పోటీ, ఒత్తిడి (ఓటమి చూసిన విద్యార్థుల ఆత్మ హత్యలు), ఆకాశంలో ఉన్న ధరలు - వీటన్నిటిని మర్చిపోతారు. ఇక్కడ పనివాళ్ళు మూడు రోజులు వస్తే రెండు రోజులు రారు, చుట్టాలు వచ్చారు అంటే ఎక్కువైనా అడుగుతారు లేదా మానేస్తారు, ఏదైనా రిపైర్ వచ్చిందంటే వాళ్ల చుట్టూ వంద సార్లు తిరగాలి, ఫోన్ చెయ్యాలి - అమెరికాలో ఉంది ఇండియా గురించి కలలు కనే చాలా మందికి ఈ విషయాలు తెలియవు, తెలిసినా, కళ్ళతో చూస్తే కాని ఇవన్ని ఎంత ఒత్తిడో మనిషి మీద అర్థం కాదు. మంచి స్కూల్లో సీటు రావాలంటే లక్ష రూపాయలు డొనేషన్ కట్టాలి. మీకు వామ్మో అనిపిస్తే మేము ఏమి చెయ్యలేము. కాని అది వాస్తవం. అలాగే ఒక మంచి కాలేజీలో ఎం.బీ.బీ.ఎస్ డొనేషన్ కోటి రూపాయలు దాటే. సంవత్సరానికి ఇంజనీరింగ్ ఫీజు ముప్ఫై వేలు, ఇవి కాక డొనేషన్, నెల ఖర్చులు. ఇన్సూరెన్స్ లేకుండా హాస్పిటల్ లో వారం ఉంటే ఖర్చు లక్ష రూపాయలకు తక్కువ కాదు. గుండె ఆపరేషన్ కు మూడు-నాలుగు లక్షలు కనీసం ఖర్చు. ఇలా ఎన్నో తెలియని, ఊహించలేని మార్పులు మీ చిన్నతనానికి, ఇప్పటికీ జరిగాయి ఇక్కడ.
- అలాగే, అమెరికాలో ఇండియాలో కన్నా మన సంస్కృతిని, భాషను కాపాడి, అనుసరిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉన్నంత మంచి, నిజాయితీ ఉన్న సంగీతం, నృత్యం నేర్పే అధ్యాపకులు ఇక్కడ లేరు. అక్కడ వీళ్ళు 10-15 ఏళ్ళు నేర్పించి ఆ విద్యార్థిని ఆ శాస్త్రంలో నిష్ణాతులుగా చేస్తున్నారు. అలాగే, అక్కడ తెలుగు భాష మీద చూప్తున్న శ్రద్ధ, వాగ్గేయ కారులను ప్రచారం చేసే కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యాక్రమాలు ఎన్నో. సిలికానాంధ్ర అనే సంస్థ అమెరికాలో ఆవిర్భావించిందే తెలుసా?. ఎన్ని భారతీయ సంస్థలు లక్ష గళ అర్చన లాంటి కార్యక్రమాలు నిర్వహించి మనల్ని గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాయి?. అక్కడ పెరిగిన పిల్లలందరూ చెడిపోతున్నారు అనేది తప్పు. మీకు తెలియ కుండ ఇక్కడున్న పిల్లలు చాలా పెద్ద తప్పులు చేసి మానసికంగా దెబ్బ తింటున్నారు. కాబట్టి అమెరికా పిల్లలు అంటే వారికి మన విషయాలు తెలియవు అనేది చాలా పెద్ద దురభిప్రాయం. ఇండియాలో మీ పిల్లలు సెల్ ఫోన్లో, బయటికి వెళ్ళినప్పుడు ఏమి చేస్తున్నారో మీకు తెలుసా?...అక్కడ చాలా విషయాల మీద ప్రభుత్వం, సమాజం చాలా స్పృహతో చట్టాలు చేశారు. కాబట్టి విలువలు అక్కడే ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాకపొతే మన హిందూ మతంలో, శృంగారం, పెళ్లి, ఆడ వాళ్లకు ఉన్న కట్టుబాట్లు వాళ్లకు లేవు కాబట్టి అక్కడి వాళ్లు చేసే ప్రతిది మనకు తప్పుగా, నేరంగా, ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. తక్కువగా బట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళంతా పతితలు ఎలా అవుతారు?.
- ఇండియాలో పెరిగిన పిల్లలు చదువులు తప్ప మిగత విషయాలలో ఎంత రాణిస్తున్నారు?. ఎంత స్వయంశక్తులై నలుగురికి ఉపాధి కలిగించగలుగుతున్నారు?. అమెరికాలో 10 +2 తర్వాత మంచి కాలేజీలో (మన ఐ.ఐ.టి లాంటి విద్యా సంస్థలలో) డిగ్రీ చదవాలి అంటే విద్యార్థి చదువుతో పాటు ఆట, సేవలలో కొంత ప్రతిభ చూపించాలి. అలాగే, అన్ని విషయాలలో - చదవటం, రాయటం, గ్రహించటం, భాషణలు ఇవ్వటం లాంటి ప్రతిభను సమపాళ్ళలో చూపించాలి. కాబట్టే, అక్కడి విద్యార్థులు 17 -18 ఏళ్ళ వయసుకి తమంతట తాము ఉండగలిగే సామర్థ్యం చూపుతారు. ఇండియాలో 18 ఏళ్ళ కుర్రాడిని తనకు ఇష్టమైన సబ్జెక్ట్ మీద ఒక అరగంట మాట్లాడమంటే ఎంత మంది మాట్లాడగలరు?. ఎంత మంది తమ అభిప్రాయాల్ని నిర్దిష్టంగా వెలిబుచ్చగలరు?. ఎంతమంది తమ పని తాము చేసుకొని నాలుగు రూపాయలు సంపాదించగలరు?. ఎంతమంది అమ్మాయిలు వాళ్ల నాన్న లేకుండా వేరే ఊళ్లకు వెళ్లి తమ పనులు తాము చేసుకోగలరు?. (ఇక్కడ పరిస్థితులు కూడా మారుతున్నాయి కానీ క్వాలిటీ, క్వాంటిటీ ఇంకా చాలా తక్కువ).
ఈ సందర్భంలో నాకొక పాట గుర్తుకొస్తున్నది. 'అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్న రాణి మనసు వెన్న...ఆరాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండికూడ చవటలయ్యారు ఉత్త చవటలయ్యారు...'. మనిషి చదివి కూడా చవట ఎందుకు అవుతున్నాడు?. తనకు ఏమి కావాలో అది తెలుసుకోలేక, ఉన్న దానితో సంతృప్తి పడక, అన్నీ కావాలని, ఆత్రుతతో ఉన్నది పోగొట్టుకోవటం వలన. చదువు, డబ్బే కాదు జీవితంలో ఆనందాన్నిచ్చే సంతులన, సమాజం, పరిసరాలు కూడా చాలా ముఖ్యమని తెలుసుకోక పోవటం వలన.
యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు: మిమ్మల్ని జీవితాంతం మీరు రెండు పడవల్లో చెరొక కాలు పెట్టిన పరిస్థితిలో ఉంచుకోకండి. మీకు తృప్తి, ఆనందం ఇచ్చే అతి ముఖ్యమైన ఓ మూడు అంశాలను మీరు ఆలోచించి, నిర్ణయించుకొని వాటిని సాధించుకోండి. త్యాగాలకు సిద్ధంగా ఉండండి.
తల్లిదండ్రులు: మీరు ప్రోత్సహించి పంపించిన పిల్లలు మీరు రమ్మనప్పుడు రావటానికి పరిస్థితులు చాలా మీరు ఊహించలేకుండా ఉంటాయి. మీ పిల్లలకు ఆ సుఖాలు కావాలి అనుకుంటే, కొంత మీ అంతటా మీరు ఉండటం అలవాటు చేసుకుంటే మంచిదేమో?. ఇంతకన్నా ముఖ్యం: మంచి విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం ఇవి ముఖ్యం కాని డబ్బు, కార్లు,స్కూళ్ళు, పార్కులు కాదు. చెట్టులో కాండం లాంటివి - విలువలు, ప్రేమ, ధర్మం, ధైర్యం, సామర్థ్యం. ఆకుల్లంటివి డబ్బు, కార్లు, హోదా వగైరా లాంటి సుఖాలు. ఒక ఆకు పొతే ఇంకో ఆకు వస్తుంది, కాని కాండమే లేకపొతే?. ఆలోచించండి. మీ పిల్లల్ని ఎలా పెంచాలో, వారికి ఏది ముఖ్యమని చెప్పాలో?.
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. స్వధర్మమనేది మనం ఆచరించి, మన పిల్లలకు నేర్పితే కదా వాళ్లు దాన్ని పాటించేది?. మీరు పాటిస్తున్న ధర్మం తప్పు అనుకుంటే దాన్ని పాటించకండి. మేము పడిన కష్టాలు మీరు పడ కూడదు అని మనం నేర్పాల్సిన విషయాలు నేర్పని తప్పు చేసేది మనమే. మరి వాటి ఫలితాలు కూడా అనుభవించాలి కదా?. జిల్లేడు చెట్టు నాటి పనస పళ్ళు కాయాలంటే ఎలాగండి?. మీరు మీ అమ్మాయికి వంట నేర్పించరు, కానీ మీ కోడలు మీకు బాగా వండి పెట్టాలి. మీరు అవతలావాళ్ళ దగ్గరనుంచి ఏమి ఆశిస్తున్నారో, దాన్ని మీరు పాటిస్తున్నారా?. ఆలోచించండి.....ఏమంటారు?.
ప్రాధాన్యతలు, ప్రాముఖ్యాలు: ఇవి చాలా స్వంతమైన విషయాలు. చదువు, ఉద్యోగం, డబ్బు, హోదా - వీటికి దేశం/రాష్ట్రం/పట్టణంతో మనం అనుకున్నంత సంబంధం లేదు. పల్లెటూరులో ఉండి కూడా ఇవన్ని సాధించి తమ ప్రతిభను చూపిన వాళ్లు చాలా మంది ఉన్నారు. మనకు తేలికగా ఇవి కావాలి అంటే కుదరదు. 16,000 వేల మైళ్ళు వెళుతున్నాము అంటే - దానికి చాలా ఆలోచించి, అది మన జీవన శైలిని, విధానాన్ని మారుస్తుందని తెలుసుకొని, దాని వల్ల వచ్చే ఆటు, పోటులను తట్టుకునే శక్తి మనకు ఉండాలని, అక్కడ ఇక్కడ పరిస్థితులు సృష్టించలేమని - మనకు వెళ్ళేటప్పుడు ఇవన్ని కూలంకషంగా అర్థం అయ్యే పరిస్థితి ఉండదు. ఒకటి రెండు అంశాలు/ప్రాధాన్యతలు (విద్య, డబ్బు) ఆధారంగా నిర్ణయం తీసుకొన్న నిర్ణయం అన్ని అంశాల్లో కరెక్ట్ అవ్వలేదు. కానీ, మీ ఆ ఒకటి, రెండు అంశాలు/ప్రాధాన్యతలు చాలా ముఖ్యమైనవి అయితే, మీకు దువిధ అనేది చాలా తగ్గుతుంది.
ఇంకొక విషయం - మనం ఎక్కడున్నా, ఆ క్షణాన్ని, అక్కడ ఉన్న మంచి విషయాన్ని గ్రహించి, ఆనందించి, ఆస్వాదించకపోతే - మనం ఎక్కడున్నా ఈ రంధ్రాన్వేషణ తప్పదు. ఆత్రేయ గారు రాసిన ఈ పాట ఈ వ్యాసాంశానికి మంచి కొసమెరుపు.
మౌనమె నీ భాష ఓ మూగమనసా
తలపులు ఎన్నెన్నో కలలుగ కంటావు
కల్లలు కాగానె కన్నీరవుతావు
చీకటి గుహ నీవు చింతల చెలి నీవు
నాటక రంగానివే మనసా తెగిన పతంగానివే
ఎందుకు వలచేవో ఎందుకు వగచేవో
ఎందుకు రగిలేవో ఏమై మిగిలేవో
కోర్కెల చెల నీవు కూరిమి వల నీవు
ఊహల ఉయ్యాలవే మనసా మాయల గయ్యాళివే
లేనిది కోరేవు ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు
20, జులై 2010, మంగళవారం
తిరుమలేశునికి విన్నపం
ఎంకన్న సామీ,
దండాలయ్య!. నీకేమి సామీ హాయిగా ఏడు కొండలెక్కి కూసుంటివి. కింద మా మడుసులు సేసే మోసాలు నీకు తెలియవా సామి?. ఎప్పుడో రాయల పెబువు నీకోసం పేమతో నగలు నటరా సేయిచ్చి కొండలెక్కి నీకోసం తెచ్చినాడు కదా, మరి అయ్యాటిని కాపాడుకునే బాధ్యత నీ మీద లేదా దొర?. నిన్న మొన్న దాక ఆడున్నాయి ఈడున్నాయి అని సెప్పిన పెబుత్వం ఇప్పుడు ఆ అవి ఎప్పుడో కరగ బెట్టినం అంటోంది. ఇదేందన్న?. ఏదో ఒకటి అర కాదు కదయ్యా!. కొన్ని వందల కోట్లు సేసే నగలయ్య. పాపం రాయలయ్య గీ మడుసులు ఇంత మోసం సేస్తారంటే సేయించే వాడు కాదేమో?. ఎట్లా సామీ ఈ అన్యాయాన్ని అడ్డుకునేది?. నువ్వే ఏదో సేయాలయ్య.
మరి నువ్వేమో శానా పెసిద్ధి పొందితివి. బక్తులు విపరీతంగా నీ కాడికి వస్తుంటిరి. కష్టాలు పెరిగానాయి కదయ్యా మాకు?. రాకుండా ఎట్టా ఉంటామయ్య?. వస్తే మరి మూడు నాల్గు దినాలు నీ చూపు దక్కక పాయె. దక్కిన 5 సెకండ్లు. ఇంతల గాడ నిడుచున్న పోరలు నూకి నూకి పడేస్తున్నరు. గింతలో యాడో అంబాని అని వస్తే ఆళ్ళ కోసం మమ్మల్ని 2 -3 గంటలు ఆపుతున్నారే . బ్రేక్ దర్శనం అంటే నరకమే అన్న మాకు. క్యూలో నిలబడి నిలబడి మాకు కాలు సెయ్యి నొప్పి, నిన్ను సూసేకే ఓపిక లేకుండా పోతున్నామన్న.
ఈడ ఓ బోర్డు మొత్తం నాశనం సేసేస్తుందయ్యా. ఒకడేమో మందు వ్యాపారం సేసే దుర్మార్గుడయ్య. ఇంకొకడు రాజకీయ నాయకుడి శిష్యుడు, ఇంకోడు పని పాటలేని పోరంబోకు ఎదవ, ఇంకోడు పూర్తి నాస్తికుడు. ఇంకో భక్తి ఉన్న మడిసి ఏమి సేయ్యలేని పరిస్థితి అయ్యా. సామీ! నీకు ఇంత డబ్బు ఉంది కదా?. ఇంకా ఎందుకయ్యా నీ గుడికి బంగారం పుయ్యటం?. దాని పేరు పెట్టి ఈ నా ద్రోహులు బంగారం మింగేస్తున్నరే. ఏమి సెయ్యాలే సామి?. అంత మందు సాములు, రాజకీయ నాయకుల సుట్టాలు, పరమతస్తులు తప్ప నిజంగా నువ్వంటే ప్రేమ, బక్తి, నిజాయతి ఉన్నోడే లేదన్న. మరి నువ్వు ఇవన్ని సూస్తు ఎట్టా ఊరక ఉంటుండావు?. నీ సేవ మానేసి నీ పేరు పెట్టి నీ నగలు, నీ డబ్బు, మా డబ్బు దోచుకోటం ఏంటి అన్న?.
ఇంకా మాకు ఇసుగు వచ్చేసిందే అన్న. ఈ నా కొడుకులు ఏసే ఏసాలు సూసి. సేసే మోసాలు విని, సూసి. ఏడు కొండల్ని నువ్వే కాపాడుకోవాలన్న. నీ డబ్బు, నీ భూమి, నీ గుళ్ళు, నీ పాత్రలు, నీ కొండలు, నీ సెట్లు - అన్నే నువ్వే సూసుకోవాల.
దండాలన్న.

అంతర్వేది
ఎక్కడ, ఎలా?
తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రాలలో అంతర్వేది ఒకటి. అంతర్వేది సఖినేటి పల్లి మండలంలో ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే నరసాపురం వెళ్లి అక్కడ పడవ ఎక్కి సఖినేటి పల్లిలో దిగి ఆటో, బస్సులో వెళ్ళవచ్చు. ఈ మార్గంలో అంతర్వేది నరసాపురం నుంచి 7 కిలోమీటర్లు దూరం. లేదా, చించినాడ బ్రిడ్జి మీదుగా రోడ్ మార్గంలో వెళ్లి దిండి, కేశవదాసుపాలెం మీదుగా అంతర్వేది చేరవచ్చు. ఈ మార్గంలో నరసాపురం నుంచి అంతర్వేది 20 కిలో మీటర్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి నరసాపురంకి ప్రతిరోజూ రైలు ఉంది. నరసాపూర్ ఎక్ష్ప్రెస్స్ రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ లో ఎక్కి ఉదయం 9 గంటలకు నరసాపురంలో దిగ వచ్చు.
విశేషాలు:
వశిష్ఠ గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే సంగమ స్థానంలో ఈ నారసింహ క్షేత్రం ఉంది. ఈ సాగర సంగమం లో నది, సముద్రము నీటి మధ్య తేడ స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని అన్నా చెల్లెళ్ళ గట్టు అని అంటారు. సాగర కెరటాలు, నదిలో వరదలు లేనప్పుడు ఇక్కడ సంగమ స్నానం చేస్తే చాలా పుణ్యం. క్షీర సాగర మథనం, కూర్మావతారం, దేవ దానవుల మధ్య అమృతం కోసం పోరాటం ఈ ప్రాంతాల్లో జరిగింది అని పురాణాలు చెప్తున్నాయి. కొన్ని వందల ఏళ్ళ చరిత్ర ఉన్న క్షేత్రంలో నరసింహస్వామి రాజ్యలక్ష్మీ సమేతుడై ఉన్నాడు.
అంతర్వేది చాలా చిన్న ఊరు. మొత్తం కలిపి వంద ఇళ్ళు కూడా ఉండవు. ఊరిలో ప్రవేశించగానే ఒక పురాతన శిథిలావస్థలో ఉన్న మంటపం కనిపిస్తుంది. దాన్ని దాటి ముందుకు వెళితే దేవస్థానం విశాలమైన ప్రాంగణంలో ఉంది. పచ్చని చెట్లు, గాలి గోపురం, శిలా శాసనం కనిపిస్తాయి. ఈ ఆలయానికి ఈశాన్య దిశలో క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వరుడి ఆలయం ఉంది. సాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని కంఠంలో నిలిపిన ఈశ్వరుడికోసం నిర్మించిన దేవస్థానం. నరసింహస్వామి దేవస్థానానికి తూర్పు ఆగ్నేయ దిశలో రేవు ఉంది. ఇక్కడ గోదావరి నదీ స్నానం చెయ్యవచ్చు. నౌక విహారం చెయ్యటానికి చిన్న, పెద్ద పడవలు ఉన్నాయి. ఇక్కడ గోదావరి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంతర్వేదిలో గుడికి 2 కిలోమీటర్ల దూరంలో బీచ్, లైట్ హౌస్, ఓ. ఎన్. జీ. సి వారి డ్రిల్లింగ్ స్టేషన్ ఉన్నాయి.
పూజలు, సేవలు, వసతులు:
దేవస్థానం కార్యాలయంలో అర్చన, అభిషేకం కోసం టికెట్స్ పొందవచ్చు. ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు ఇక్కడ అభిషేకం జరుగుతుంది. వచ్చే అక్టోబర్ నుంచి నిత్యం సుదర్శన హోమం జరిపే కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు ఆలయ అధికారులు. పురాతన ప్రాకారాలు, స్థంభాలు, విశాలమైన ప్రాంగణం ఈ క్షేత్రం యొక్క విశిష్టత. మొగల్తూరు రాజాలు, జమీందార్లు చక్కగా నిర్వహించినట్లుగా కనిపిస్తుంది ఈ క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆగమ సాంప్రదాయంలో స్వామి వారికి సేవలు, పూజలు జరుగుతాయి.
గర్భగుడిలో మనోహరమైన లక్ష్మీ నరసింహుడి దివ్య మంగళ విగ్రహము శోభాయమానంగా ఉంటుంది. అభిషేకం సమయంలో స్వామి వారి నిజరూప సందర్సనం చేసుకోవచు. మూల విరాట్టే కాక ఉత్సవ విగ్రహ రూపంలో లక్ష్మి, నృసింహులు, సుదర్శనుడు గర్భగుడిలో కనిపిస్తారు. తులసి, రకరకాల సుగంధ పుష్పాలతో ఇక్కడ స్వామి వారికి అలంకారం. స్థల పురాణం, క్షేత్ర మహిమ తెలిపే పుస్తకాలు దేవస్థానం వాళ్లు విక్రయిస్తున్నారు. ఇక్కడ నిత్యాన్నదాన పథకం ఉంది. శుభ్రమైన పరిసరాల్లో శుచి, రుచి కలిగిన ఆహారాన్ని గర్భగుడి వెనకగల భోజన శాలలో 12 నుంచి 2 గంటల వరకు ఉచిత భోజన వసతిని దేవస్థానం వాళ్లు భక్తి, శ్రద్ధలతో ఏర్పాటు చేస్తున్నారు. దర్శన సమయంలో భోజనానికి టికెట్ తీసుకొని హాయిగా స్వామి వారి ప్రసాదంగా భోజనం చెయ్య వచ్చు.
అన్నాచెల్లెలు గట్టు:
వశిష్ఠ గోదావరి బంగాళాఖాతంలో కలిసే స్థానాన్ని సప్తసాగర సంగమ ప్రదేశం అంటారు. ఇది అన్నాచెల్లెలు గట్టుగా పేరొందింది. ఇక్కడి నీరు తీయగా ఉండటం విశేషం.
ఇతర ఆకర్షణలు:
దేవస్థానానికి తూర్పు దిక్కుగా ఒక రాజు గారు ఈ మధ్య వశిష్ఠ మహర్షి పేరిట దేవాలయం కట్టారు. ఈ ఆలయం చాలా బాగుంది. ఆ ఆలయం వృత్తాకారంలో ఉంది. ఆలయం చుట్టూ ఒక నీటి వలయం ఉంది. ఆలయంలో పై అంతస్తులో సప్తర్షుల విగ్రహాలు ప్రతిష్ఠించారు రాజు గారు. ఈ ఆలయ ప్రాంతంలో వశిష్ఠ, వ్యాస మహా మునులు తిరిగినట్లుగా రాజు గారికి నిదర్శనం కలిగి ఆయన ఈ ఆలయాన్ని నిర్మించినట్టు అక్కడ రాసి ఉంది. కింది అంతస్తులో కూర్మ (తాబేలు) ప్రతిష్ఠ ఉంది. చుట్టూ దశావతారాలు కూడా ఉన్నాయి. చుట్టూ పచ్చగా చెట్లు, ఒక పక్క గోదావరి, మరొక పక్క దూరంగా సముద్రము - ఈ ఆలయానికి చాలా శోభను ఇస్తున్నాయి. ఈ ఆలయానికి ముందే ఒక పెద్ద గోశాల రాజుగారు నడుపుతున్నారు. గోపూజ, వాటికి జీవనానికి కావలసిన అన్ని ఏర్పాట్లు రాజు గారు చాలా బాగా చేశారు. ఇక్కడ గోవులు, ఎద్దులు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. అంతర్వేదికి ఈ వశిష్ఠ ఆలయం, గోశాల ఒక పెద్ద ఆకర్షణ.
సంప్రదించటం ఎలా?
అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రధాన అర్చకులు బుచ్చి బాబు గారు (ఆయన పేరు శేషాచార్యులు). వారిని ముందుగా సంప్రదించి స్వామి వారికి కళ్యాణం చేయించుకోవచ్చు. అంతర్వేదిలో నివాసానికి ఆలయానికి దగ్గరలోనే (నీలకంఠేశ్వరుడి ఆలయం సమీపంలో) తిరుమల తిరుపతి దేవస్థానం వారి రెండంతస్తుల వసతి సముదాయం ఉంది. అక్కడ రూం బుక్ చేసుకొని ఉండవచ్చు. ఇది కాక అక్కడ వేరే హోటల్స్ లాంటివి ఏమీ ఉండవు. కాబట్టి అంతర్వేదిలోనే ఉండాలి అనుకుంటే తితిదే వాళ్ల భవనం ఒక్కటే మనకున్న ఆమ్నాయం. ఈ భవనంలో గదులు, శౌచాలయాలు అంత పరిశుభ్రంగా లేవు. కొన్ని మౌలిక వసతులు, సుఖాలు కావాలి అనుకునే వాళ్లకు దిండి రిసార్ట్స్ (దిండి గ్రామంలో గోదావరి నది ఒడ్డున రిసార్ట్ కట్టారు) కానీ, నరసాపురం/రాజోలు లో కానీ ఉండవచ్చు.
ఇక్కడ శాశ్వత నిత్యాన్నదాన పథకం ఉంది. దాతలు రూ. 1,116 /- మొదలుకొని ఆపైన ఎంతైనా ఈ అన్నదాన పథకానికి విరాళం ఇవ్వవచ్చు. భోజనశాలలో ఈ విరాళం ఇచ్చి రసీదు పొందండి. చెక్, డీడీ కూడా పంపవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఆంధ్ర బ్యాంకు, కేశవదాసుపాలెం, ట్రస్ట్ ఎకౌంటు నెంబర్ 100310011008148 ద్వారా కూడా చెల్లించవచ్చు.
దేవస్థానం చిరునామా:
కార్య నిర్వహణాధికారి,
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం,
అంతర్వేది, సఖినేటిపల్లి మండలం,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
పిన్ కోడ్: 533252 .
ఫోన్ నంబర్లు:
- ఎక్జిక్యూటివ్ ఆఫీసర్: 9440219241
- దేవస్థానం మెయిన్ నెంబర్: 08862 -259313 (వసతికి, సేవలకు ఈ నెంబర్ కు చెయ్యండి).
- ప్రధాన అర్చకులు వి.బి. వి.కే. ఎస్. శేషాచార్యులు (బుచ్చిబాబు) - 08862 -259333 , 9010126977 .
19, జులై 2010, సోమవారం
బాబ్లీ ప్రాజెక్టు - రాజకీయం - మొదటి అంకం
చంద్రన్నకు ఒక బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలను ఇరకాటంలో పెడదాం అని ఆ చాణక్యుడి బుర్ర అనుకుంది. వెంటనే మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లిలో "అక్రమంగా" కడుతున్న ప్రాజెక్ట్ పట్ల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులకు గాజులు తొడుక్కొని కూర్చుందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో ఘోరంగా విఫలమయ్యిందని అసెంబ్లీలో అగ్గి రగిల్చారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉండి ఇప్పుడే ఎందుకు ఈ ఆందోళన టీడీపీ నుంచి?.
- తెలంగాణలో ఉపఎన్నికలు 26వ తేదీ జరుగనున్నాయి. గత ఏడాదిగా తెలంగాణా సెంటిమెంట్ ఉధృతమైన నేపథ్యంలో ఆయనకు తెలంగాణలో ప్రవేశించి ప్రచారం చేసే పరిస్థితులు లేవు. కాబట్టి ప్రచారానికి వెళ్ళటానికి జంకిన చంద్రన్న ఈ అంశం లేవనెత్తారు. బాబ్లి వల్ల తెలంగాణా జిల్లాలకు తీరని నష్టం అని, శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఎండిపోతుందని, లక్షలాది ఎకరాలు బీడు పోతాయని ఈ ఆందోళన సారాంశం. ఈ సాకు చూపించి తెలంగాణా లో సానుభూతి పొంది బాబ్లి యాత్ర పేరుతొ ప్రచారం, పేరు సంపాదిన్చుకుందామని చంద్రన్న కుతంత్రం. మొత్తానికి ఇంతమటుకు బాబ్లి సందర్శన యాత్ర పేరుతొ కొంతమంది ఎమ్మెల్యేలను కూడబెట్టుకుని బస్సులో బయల్దేరారు బాబు గారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అగ్నికి ఆజ్యం పోసినట్టు అరెస్ట్ చేసింది ఆ బృందాన్ని. నిజంగా బాబ్లిలో మోసం లేకపొతే సందర్శన ఎందుకు ఆపాలన్నది బాబు వాదన. అది సరైనదేనేమో?.
- తెలంగాణా ఉపఎన్నికల్లో టీఆరెస్ , కాంగ్రెస్, టీడీపీ మధ్య త్రిముఖ పోటీలో మూడో స్థానం టీడీపీది అని మనకు బానే తెలుసు. ఈ పరిస్థితి మార్చి టీడీపీకి వోట్లు తేవాలి అంటే తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడలేని దుస్థితిలో బాబు ఉన్నారు. అందుకని టీఆరెస్, కాంగ్రెస్ లను బాబ్లి అంశం మీద ఎండగట్టి వారికి నిజంగా తెలంగాణా అభివృద్ధి, ప్రయోజనాల మీద చిత్తశుద్ధి లేదు అని చాటటానికి ఈ యత్నం. వింత ఏంటంటే - ఊదరగొట్టి, అదరగొట్టి మాట్లాడే మన కేసీఆర్ ఈ విషయంపై మౌనమేలనో?. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం వారే పోగొట్టుకున్నారు. మరి ముందుగానే చొరవ తీసుకొని బాబ్లి విషయాన్ని టీఆరెస్ ప్రయోజనానికి ఎందుకు వాడుకోలేదు?. కాంగ్రెస్ తో ఏమైనా లోపాయకారి ఒప్పందం ఉందా?.
- మహా జాగ్రత్తగా ఉండే కాంగ్రెస్ అధినాయకత్వం ఈ విషయం ముందే ఊహించి ప్రధానమంత్రితో ఒక మీటింగ్ పెట్టించి నిప్పు రాజుకోక ముందే మీద నీళ్ళు ఎందుకు పోయలేదు?. చంద్రన్న ఇచ్చిన ఈ ఝలక్ కి తెలంగాణా కాంగ్రెస్ నేతలకు దిమ్మి తిరిగి, కళ్ళు బైర్లు కమ్మి తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కొందరేమో బాబు తెలంగాణాలో తిరిగే దమ్ము లేక బాబు ఈ నాటకమాడుతున్నారని, కొందరేమో ఇది ఉపఎన్నికల్లో లబ్ధికి టీడీపీ నాటకమని, ఇక ముఖ్యమంత్రిగారైతే నేను పీ.ఎం. తో మాట్లాడాను, ఆయన అఖిలపక్షాన్ని కలవటానికి అంగీకరించారు, శాంతి భద్రతల దృష్ట్యా మనం సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరిద్దాము అని ఢిల్లీ మాట వినిపించారు. ఎందుకు అంత నిర్లిప్తత కాంగ్రెస్ పార్టీలో?. ఒక పక్క జగన్ ప్రజాదరణలో ముందుకు దూసుకు వెళ్తున్నాడు, మరొక పక్క చంద్రన్న బాబ్లి అంశంతో రాజకీయ లబ్ది పొంది తన మనుగడకు జీవం పోయాలని ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్ర విషయాలను, రాజకీయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకుని నివేదికలు పంపే నరసింహన్ లాంటి మేధావి మన గవర్నర్. రాజకీయాల్లో ఎదుటివాళ్ళను తన నోటితో అణగదొక్కే దూకుడు మనస్తత్వం మన రోశయ్య గారిది.అయినా ఎందుకింత అలసత్వ, నిర్లక్ష్య ధోరణి?.
శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం - పిఠాపురం
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
పవిత్రమైన గోదావరీ పరీవాహక ప్రాంతంలో పిఠాపురం పూర్వం ఋషులచే, యోగులచే సవితృ కాఠక చయనం వంటి ఎన్నో గొప్ప యాగాలకు, పవిత్రమైన కార్యాలకు సాక్షి. పీఠికాపురంగా చరిత్రలో చెప్పబడిన ఈ పిఠాపురం రాజుల కళాపోషణకు, సాహితీకారులకు ఆలవాలం. పచ్చని పొలాలు, రమణీయ దృశ్యాలకు నెలవైన ఈ పిఠాపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన పురుహూతికా, కుక్కుటేశ్వరుల దేవస్థానానికి నిలయం. ఇక్కడే దత్తావతారులైన శ్రీపాదశ్రీవల్లభులు జన్మించారు.
శ్రీపాద శ్రీవల్లభులు:
పిఠాపురంలో ఎన్నో మహిమలు చూపించి పదహారేళ్ల ప్రాయంలో కురువరపురంలో (ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ సమీపంలో కృష్ణా నది ఒడ్డున గల దత్తక్షేత్రం) వెళ్లి అక్కడ తన అవతార మహిమలను పరిపూర్ణంగా, విశేషంగా చూపించారు.
శ్రీపాద శ్రీవల్లభుల మాతామహులైన మల్లాది బాపనర్యుల వంశంలో జన్మించిన మల్లాది గోవింద దీక్షితులు గారు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అనే పుస్తకాన్ని శ్రీపాదుల ఆజ్ఞ మేరకు తెలుగులోకి అనువదించారు. సంసృత మూలం శంకర భట్టు అనే ఆయన రచించినది. శ్రీపాదుల తదుపరి దత్తావతారం గాణుగాపురంలో నివసించిన నృసింహ సరస్వతి. వాసుదేవానంద సరస్వతి (టెంబే స్వామి) రచించిన శ్రీ గురు చరిత్ర మొదటి అధ్యాయాల్లో శ్రీపాదుల గురించి వివరంగా ఉంది.
చరితామృతం:
శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం గ్రంథంలో శ్రీపాద శ్రీవల్లభుల జీవిత విశేషాలతో పాటు మనకు తెలియని, ఆశ్చర్యపరిచే కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు, సంబంధాలు ఉన్నాయి. ఈ పుస్తకం సంస్థానంలో కానీ, పోస్ట్ ద్వారా గానీ, హైదరాబాదులో టాగోర్ బుక్ హౌస్ లో కానీ పొందవచ్చు. ఈ గ్రంథ పారాయణ మహాత్మ్యం, ఇందులో ఉన్న వివరం, విశిష్టత చదివితేనే అర్థం అవుతుంది. తప్పక వెంటనే పారాయణం చేయండి.
క్షేత్రం:
పీఠికాపురంగా అప్పట్లో పిలవబడిన ఈ పిఠాపురం తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే లోని చెన్నై-హౌరా మార్గంలో పిఠాపురం స్టేషన్ ఉంది. ఈ ఊళ్ళో శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉంది. కుక్కుటేశ్వర స్వామి గుడి ముందుగా వెళ్లి అక్కడ వేణుగోపాలస్వామి గుడి వీధి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతి శ్రీ సజ్జనగడ రామస్వామి గారు. వీరు సమర్థ రామదాసు శిష్యులైన కర్ణాటకలోని వరదహళ్లిలో సిద్ధి పొందిన భగవాన్ శ్రీధర స్వామి శిష్యులు. రామస్వామిగారు చాలా సమర్థవంతంగా ఈ పీఠాన్ని నడిపిస్తున్నారు. వారి ఆశీస్సులు, ఆధ్వర్యంలో ఈ పీఠం బాగా వృద్ధి చెంది శ్రీపాద శ్రీ వల్లభుల మహత్మ్యం, సందేశం మనకు అందేలా కృషి జరుగుతోంది. ఇక్కడ ఉండటానికి ఉచిత వసతి, ఉచిత భోజన వసతి ఉన్నాయి. సంస్థానం కార్యాలయానికి ముందుగా ఫోన్ చేసి రూం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్నపూర్ణ భోజనశాలలో మధ్యాహ్నం 12 నుంచి 2 వరకు భోజనము, రాత్రి 8:30 నుంచి 9:00 వరకు అల్పాహారము ఉంటుంది. రుచి, శుచి ఉన్న ఆహారాన్ని ఉచితంగా భక్తులకు అందిస్తున్నారు సంస్థానం వారు.
ఈ పీఠంలో అడుగు పెట్టగానే ఎడమ వైపు కార్యాలయము, దానిపైన వసతికి గదులు ఉన్నాయి. కొంచెం ముందుకు వెళితే కుడివైపు ఔదుంబరం (మేడి చెట్టు), పాదుకలు, ఆవులు కనిపిస్తాయి. వీటికి ఎదురుగా తూర్పు ముఖంగా గర్భగుడి. ఈ గర్భగుడిలో పాలరాతి విగ్రహ రూపంలో దత్తాత్రేయుడు, వారికి కుడివైపు శ్రీపాద శ్రీవల్లభులు, ఎడమవైపు నృసింహ సరస్వతి ప్రతిష్ఠించబడి ఉన్నారు. గర్భగుడికి ఎడమవైపు పాదుకలు,మేడి చెట్టు, దాని పక్కనే దత్తాత్రేయుల పురాతన విగ్రహం ఉంటాయి. గర్భ గుడి వెనుక ధ్యాన మందిరం ఉంది కానీ వాడుకలో లేదు.
ఈ పీఠంలో మూర్తులకు నిత్యం అభిషేకం (పాదుకలకు), పల్లకి సేవ, అర్చన చేయించుకోవచ్చు. ప్రతి మాసం చిత్త నక్షత్రం రోజున, చైత్ర శుద్ధ పాడ్యమి మొదలు వసంత నవరాత్రులు, శ్రీరామ నవమి, ఆషాఢ పౌర్ణమి (గురు పౌర్ణిమ), శ్రావణ బహుళ పంచమి (వాసుదేవానంద సరస్వతి జయంతి) , శ్రీపాద శ్రీవల్లభుల జయంతి సప్తాహం (శ్రావణ బహుళ త్రయోదశి నుండి భాద్రపద శుద్ధ చవితి వరకు), గురు ద్వాదశి (శ్రీపాద శ్రీవల్లభుల అవతార సమాప్తి - ఆశ్వయుజ బహుళ ద్వాదశి), గురు ప్రతిపాద (నృసింహ సరస్వతి అవతార సమాప్తి - మాఘ బహుళ పాడ్యమి), నృసింహ సరస్వతి జయంతి (పుష్య శుద్ధ తదియ), ప్రతి నెల బహుళ ద్వాదశి రోజులలో సంస్థానంలో విశేష పూజలు జరుగుతాయి. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఈ రోజుల్లో.
సంస్థానం వాళ్ల బుక్ స్టాల్ ఇక్కడ ఉంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం తెలుగు, మరాఠీ, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది. అలాగే శ్రీ గురుచరిత్ర తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో దొరుకుతుంది - వాసుదేవానంద సరస్వతి మరాఠీ మూలాన్ని తెలుగులోకి పన్నాల భట్ట శర్మ గారు అనువదించారు. ఇంకా గురు గీత, దత్తాత్రేయ పూజా విధానము, ఫోటోలు, పోస్టర్లు, సీడీలు, సంక్షిప్త గురుచరిత్ర, శ్రీపాద శ్రీవల్లభుల సిద్ధ మంగళ స్త్రోత్రం, దత్త మంత్ర కరుణార్ణవం లాంటి పుస్తకాలు చాలా సంస్థానం వాళ్లు ప్రచురించి ఇక్కడ విక్రయిస్తున్నారు.
సిద్ధ మంగళ స్తోత్రము:
వారి మాతామహులైన బాపనార్యులు స్తుతించిన సిద్ధ మంగళ స్తోత్రం అత్యంత మహిమాన్వితమైనది. మీకోసం ఆ స్తోత్రం:
- శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - శ్రీ విద్యాధరి రాధా సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - మాతా సుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీ చరణా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - సవిత్రకాఠక చయన పుణ్యఫల భరద్వాజ ఋషిగోత్ర సంభవా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - దో చౌపాతీ దేవ్ లక్ష్మీ ఘనసంఖ్యా బోధిత శ్రీ చరణా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భపుణ్యఫల సంజాతా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - సుమతీనందన, నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!! - పీఠికాపుర నిత్యవిహారా, మధుమతి దత్తా, మంగళరూపా!
జయ విజయీభవ, దిగ్విజయీభవ, శ్రీమదఖండ శ్రీ విజయీభవ!!
పిఠాపురం చేరటం ఎలా?
- విమానంలో వచ్చేవాళ్ళు రాజమండ్రి కానీ, విశాఖపట్నంలో కానీ దిగి రావచ్చు. రాజమండ్రి నుంచి 70 కిలోమీటర్లు, విశాఖనుంచి 180 కిలోమీటర్లు.
- ట్రైన్లో: సామర్లకోట పిఠాపురం నుంచి 10 కిలోమీటర్లు. ఇది జంక్షన్. ఇక్కడ ఆగే రైళ్లు: ఫలక్‌నుమ, కోణార్క్, నిజాముద్దీన్ లింక్, ఒఖ లింక్, నవజీవన్, ప్రశాంతి, యశ్వంతపూర్, శేషాద్రి, షిర్డీ ఎక్స్ ప్రెస్‌లు. సామర్లకోట స్టేషన్ నుంచి బస్సు, ఆటో, కార్ వసతి చాలా బాగా ఉన్నాయి. సామర్ల కోట గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
- మెయిన్ లైన్లో వెళ్లే పిఠాపురంలో ఆగే రైళ్లు: గోదావరి, ఈస్ట్ కాస్ట్, బొకారో ఎక్స్ ప్రెస్‌లు. పిఠాపురం గుండా వెళ్లే రైళ్ళ రాకపోకల లైవ్ వివరాలు.
- కాకినాడకు గౌతమి ఎక్ష్ప్రెస్స్ లో/బస్సులో వెళ్లి అక్కడనుంచి కూడా రావచ్చు. కాకినాడ పిఠాపురం మధ్య దూరం 18 కిలోమీటర్లు.
సంస్థానం అడ్రస్, ఫోన్ నెంబర్:
శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం, వేణుగోపాలస్వామి గుడి వీధి,
పిఠాపురం - 533450,
తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
కార్యాలయం పని వేళలు : ఉదయం 9 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 వరకు.
ఫోన్ - (08869) 250300
ఫ్యాక్స్ - (08869) 250900
ఇమెయిల్ : info@sripadasrivallabha.org
వెబ్ సైటు: http://www.sripadasrivallabha.org , http://sreepadasreevallabhapithapuram.org/home1.html
పిఠాపురంలో ఇంకా చూడాల్సిన ప్రదేశాలు:
- పాదగయా క్షేత్రమైన కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో శివుడు, ఈ ఆలయంలోనే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి పురుహూతిక అమ్మ వారి గుడి, దత్తాత్రేయుల గుడి (గురు స్థానం, శ్రీపాద శ్రీవల్లభుల మూర్తి, ఔదుంబరం), షిర్డీ సాయి గుడి, ఇంకా చాలా విగ్రహాలున్నాయి (వినాయకుడు, దుర్గ, నవగ్రహాలు, సీతారాములు వగైరా). ఇక్కడ లింగం అష్ట దిగ్బంధనం చేసి ఉంది.
- కుంతీమాధవస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం - చాలా పురతానమైన దేవస్థానం. ఇక్కడ విగ్రహాలు అపురూపంగా ఉన్నాయి.
- గణపతి సచిదనంద స్వామి దత్తపీఠం వారి శ్రీపాద శ్రీవల్లభ అనఘాలక్ష్మి దత్తాత్రేయ క్షేత్రం ఎంతో ప్రశాంతంగా, మనోజ్ఞంగా ఉంటుంది.
- కాకినాడ పిఠాపురం రోడ్లో పరిపూర్ణానంద సరస్వతి వారి శ్రీపీఠం (ఐశ్వర్యాంబిక ఇక్కడ ప్రధాన దేవత)
- కాకినాడ పిఠాపురం రోడ్లో సర్పవరం భావనారాయణ స్వామి - చాలా పురాతనమైన వైష్ణవ సాంప్రదాయ దేవస్థానం. ఇక్కడ అందమైన కలువల కొలను ఉంది.
- ఉప్పాడ బీచ్ ఇక్కడికి 15 కిలో మీటర్లు.
దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)
అంతా రామమయం - భద్రాచల రామదాసు కృతి
అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడనంత రూపముల వింతలు సలుపగ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అండాండంబులు పిండ...
-
శివాష్టకంగా పిలువ బడిన ఈ స్తోత్రము ఆది శంకరుల విరచితమని అంటారు. కాని నేను దాన్ని ధ్రువీకరించ లేకపోయాను. దీని సాహిత్యంలో ఉత్తర దక్షిణ భారత దే...
-
నీ నామ రూపములకు నిత్య జయ మంగళం పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు ||నీ నామ|| పంకజాక్షి నెలకొన్న అంక యుగమునకు ||నీ నామ|| నళినారి ...
-
న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజదేతద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః స...