7, అక్టోబర్ 2026, బుధవారం

గరుడగమన తవ చరణకమలమిహ - భారతీతీర్థస్వామి వారి శ్రీమహావిష్ణు స్తోత్రం



గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం
మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ

జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ విబుధ వినుత పదపద్మ
మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ

భుజగశయన భవ మదన జనక జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ
మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ

శఙ్ఖ చక్రధర దుష్టదైత్య హర సర్వలోక శరణ సర్వలోక శరణ౹
మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ

అగణితగుణగణ అశరణశరణద విదళిత సురరిపు జాల విదళిత సురరిపు జాల
మమ తాపమపాకురు దేవ మమ పామపాకురు దేవ

భక్తవర్యమిహ భూరికరుణయా పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం
మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ

గరుడునిపై విహరించే ఓ దేవా! నీ కమలాలవంటి పాదాలు నా మనస్సులో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉండుగాక. ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. కమలాలవంటి నేత్రాలు కలవాడా! బ్రహ్మదేవునిచే, నముచి అనే రాక్షసుని సంహరించిన ఇంద్రునిచే, ఇతర దేవతలచే స్తుతించబడే పవిత్రమైన పాదపద్మాలు కలవాడా!  ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. ఆదిశేషునిపై శయనించేవాడా! సంసారబంధాన్ని నశింపజేసేవాడా! మన్మథునికి జనకుడవైనవాడా! జననమరణాల భయాన్ని తొలగించేవాడా!  ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. శంఖచక్రాలను ధరించినవాడా! దుష్టులైన దైత్యులను సంహరించేవాడా! సమస్త లోకాలకు శరణు కల్పించేవాడా!  ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. లెక్కించలేనన్ని సద్గుణాలకు నిలయమైనవాడా! శరణు లేనివారికి శరణు ఇచ్చేవాడా! దేవతల శత్రువుల సమూహాన్ని నాశనం చేసినవాడా!  ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. అపారమైన కరుణతో నీ భక్తులలో ఒకడైన ఈ భారతీతీర్థుని కాపాడుము. ఓ దేవా!  ఓ దేవా! నా తాపములను, పాపములను తొలగించు. 

ఈ భారతీతీర్థస్వామి వారి గీతాన్ని శృంగేరి సోదరీమణులు శారద-శ్రీలక్ష్మి ఆలపించారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గరుడగమన తవ చరణకమలమిహ - భారతీతీర్థస్వామి వారి శ్రీమహావిష్ణు స్తోత్రం

గరుడగమన తవ చరణకమలమిహ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం మమ తాపమపాకురు దేవ మమ పాపమపాకురు దేవ జలజనయన విధినముచిహరణ ముఖ విబుధ వినుత పదపద్మ ...