4, అక్టోబర్ 2026, ఆదివారం

తీర్థయాత్ర - ఝరణి జలనరసింహస్వామి క్షేత్రం


రెండు రోజుల తీర్థయాత్రలో చివరిగా అక్టోబర్ 3 2026 నాడు బీదర్ సమీపంలోని ఝరణి జలనరసింహుని దర్శనం చేసుకున్నాము. ఆ విశేషాలు.

కర్ణాటకలోని బీదర్‌ నగరపు మల్కాపూర్‌ రోడ్డులో, మణిచూల పర్వతశ్రేణి ప్రాంతంలో ఉన్న ఝరణి నరసింహస్వామి ఆలయాన్ని ఝరణి నరసింహ గుహాలయం, నరసింహ ఝీరా అనే పేర్లతో కూడా పిలుస్తారు. నరసింహావతారానికి అంకితమైన ఈ క్షేత్రం ప్రత్యేకత, నీరు ప్రవహించే గుహలో నడిచి వెళ్లి స్వామిని దర్శించుకోవడం. ఈ గుహామార్గం సుమారు 300 మీటర్ల పొడవు ఉంటుంది, నీటిమట్టం  కొంత మేర నడుము వరకు, కొన్ని చోట ఛాతీ వరకు ఉంటుంది. గుహలో ఏడాది పొడవునా నీరు ఉంటుందని దేవాదాయ శాఖ పేర్కొంటుంది. గుహ చివర రాతిగోడపై చెక్కిన నరసింహుని రూపం ఉంటుంది. గాథల ప్రకారం ఝరాసురుడు (జలాసురుడు) పరమశివుని ఇక్కడ కొలిచేవాడని, హిరణ్యకశిపుని చంపిన తరువాత నరసింహుడు ఈ ఝరాసురుడిని చంపగా అతని కోరిక మేరకు ఇక్కడ వెలసాడని, అ ఝరాసరుడు దేహము వీడి ఇక్కడ నీటి రూపంగా మారాడని చెప్పబడింది. ఈ గాథకు అనుగుణంగా నరసింహుడి పక్కనే శివలింగం ఉంది. 

ఈ ఝరణి నరసింహస్వామి క్షేత్రం బీదరుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక వైపు వెళితే దాదపు 50 మెట్లు దిగి వెళ్లాలి. ఇప్పుడు కొత్తగా వేసిన మార్గంలో కారు క్షేత్రం వరకు వెళుతుంది. సాయంత్రం 5:00 వరకు ఈ క్షేత్రం తెరిచి ఉంటుంది. గుహ మొదట్లో చక్కని లక్ష్మీ నరసింహుని విగ్రహం ఉంది. నీటిలో దిగిన తరువాత అడుగున ఇసుక వల్ల జారి పడే అవకాశం లేదు. మొదట్లో, చివర, పట్టుకోవటానికి రెయిలింగ్ ఉంది. దర్శనం తరువాత స్నానం, బట్టలు మార్చుకోవటానికి పరిమితమైన వసతులు మాత్రమే ఉన్నాయి. గుహలో నీరు మురికిగానే ఉన్నాయి. దుస్తులు, బ్యాగులు పెట్టుకోవటానికి లాకరు వసతి ఉంది. బాత్రూం వసతి ఉంది.  

నరసింహస్వామి  రూపం ఈ ఫోటోలో ఉన్నట్లుగా ఉంటుంది. ఇది నేను తీసింది కాదు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

సింగీతం శ్రీనివాసరావు గారి కౌశలం

సింగీతం శ్రీనివాసరావు గారు తెలుగు సినిమాకు అందించిన గొప్ప సంపద వినూత్నంగా వైవిధ్యంగా ఆలోచించే ధైర్యం. నిజజీవిత కథ, మాటలు లేని హాస్యం, కాలప్ర...