ఇవాళ్ళ ఎందుకో పొద్దునే ఈ పాట విన్నాను రేడియోలో. సున్నితమైన శృంగారం, వర్ణన గొప్ప సాహిత్యంతో నారాయణరెడ్డి కలాన ఈ గేయంగా అవతరించింది. మైసూరులో రవివర్మ గీసిన చిత్రాలు నిలువెత్తున ఒక ప్రదర్శనశాలలో పెట్టారు. ఆ చిత్రాలను చూసిన తర్వాత సినారె గారు ఈ పాటను ఏ సందర్భానికి రాసారో అర్థం అయ్యింది. తేట తేనె తెలుగులో, సామాన్య భాషలో నాయికను నాయకుడు వర్ణించాడు. కథానాయిక జయచిత్రకు, రవివర్మ చిత్రాలలో ఉన్న స్త్రీలకు పోలిక అని కాదు, ఆ పాత్రలో కథానాయకుడి ప్రేమ, ఆరాధన అలా కనిపించిందేమో. అందుకే ఈ పాట బాలు పాడిన పాటల్లో ఒక మరపురాని గీతంగా మిగిలిపోతుంది.
చిత్రం: రావణుడే రాముడైతే (1978)
నేపథ్యగాయకులు: బాలసుబ్రహ్మణ్యం, జానకి
సంగీత దర్శకుడు: జి.కె. వెంకటేష్
గేయ రచయిత: సినారె
నటీనటులు: జయచిత్ర, నాగేశ్వరరావు
ఆ ఆ ఆ రవివర్మకే అందని ఒకే ఒక అందానివో
ఆ ఆ ఆ రవి చూడని పాడని నవ్యనాదానివో |రవివర్మకే|
ఏ రాగమో తీగదాటి ఒంటిగా నిలిచే
ఏ యోగమో నన్నుదాటి జంటగా పిలిచే
ఏ మూగ భావాలో అనురాగ యోగాలై
ఆ ఆ ఆ ఆ ఆ....
ఆ ఆ నీ పాటనే పాడనీ |రవివర్మకే|
ఏ గగనమో కురులజారి నీలిమై పోయే
ఏ ఉదయమో నుదుట చేరి కుంకుమై పోయే
ఆ కావ్య కల్పనలే నీ దివ్య శిల్పాలై
ఆ ఆ ఆ ఆ ఆ...
ఆ ఆ కదలాడనీ పాడనీ |రవివర్మకే|
ఈ పాట వేటూరి రాశారని స్వరాభిషేకం లో చెప్పారు
రిప్లయితొలగించండిhttps://youtu.be/78ZOPQPI7ow?feature=shared