ఈ రోజు గురు పూర్ణిమ. సమర్థ సద్గురు సాయినాథుని చరితామృతం పారాయణానికి చాలా దివ్యమైన రోజని చరిత్రలోనే రాశారు. పొద్దున్న పారాయణ చేస్తున్నప్పుడు ఈ పేజీలు ఉన్న అధ్యాయం నన్ను ఈ పోస్ట్ రాయటానికి ప్రేరేపించింది.
సాయి సచ్చరిత్ర 16 -17 అధ్యాయములలో నుంచి ఒక ముఖ్యమైన అంశం - ఆత్మ సాక్షాత్కారమును పొందుటకు యోగ్యత. ఈ కింద పది సూత్రాలను అద్భుతంగా వివరించాడు హేమాడ్ పంత్, అంతకన్నా అద్భుతంగా తెలుగులో వివరించారు ప్రత్తి నారాయణ రావు గారు. సాయి చరిత్ర పారాయణ చేస్తే ఈ అంశాల గురించి వివరాలు తెలుస్తాయి.
- మోక్షాన్ని పొందుటకు తీవ్రమైన కోరిక
- విరక్తి లేదా ఇహ పర సౌఖ్యములందు విసుగు చెందుట
- అంతర్ముఖత (లోనికి చూచుట)
- పాప విమోచన పొందుట
- సరియైన నడవడి
- ప్రియమైన వాటికంటే శ్రేయస్కరమైన వాటిని కోరుకొనుట
- మనసును, ఇంద్రియములను స్వాదీనమందు ఉంచుకొనుట
- మనసును పావనము చేయుట
- గురువు ఆశ్రయము, సహాయం పొందుట
- భగవంతుని కటాక్షం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి