మహాభారతంలో అరణ్యపర్వంలో యక్షుడు యుధిష్ఠిరుని అడిగిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధికెక్కాయి. అవి, వాటి సమాధానాలు:
మొదటి ప్రశ్న:
౧. భూమి కన్నా బరువైనది ఏది? - తల్లి
౨. ఆకాశం కన్నా ఎత్తైనది ఏది? - తండ్రి
౩. గాలి కన్నా వేగవంతమైనది ఏది? - మనస్సు
౪. గడ్డి కన్నా వేగంగా పెరిగేది ఏది? - ఆలోచనలు
రెండవ ప్రశ్న:
౧. ప్రయాణికుని స్నేహితుడు ఎవరు? - తోటి ప్రయాణికుడు
౨. గృహస్తునికి స్నేహితుడు ఎవరు? - భార్య
౩. రోగికి స్నేహితుడు ఎవరు? - వైద్యుడు
౪. మరణం ముందున్న వానికి స్నేహితుడు ఎవరు? - అతడు చేసిన దానధర్మాలు
మూడవ ప్రశ్న:
౧. దేన్ని త్యజిస్తే మనిషి ప్రేమ స్వరూపుడవుతాడు? - అభిమానం/ఈర్ష్య
౨. దేన్ని త్యజిస్తే మనిషి శోకరహితుడవుతాడు? - కోపం
౩. దేన్ని త్యజిస్తే మనిషి ధనవంతుడవుతాడు? - కోరిక
౪. దేన్ని త్యజిస్తే మనిషి సంతుష్టుడవుతాడు? - లోభం
మిగతావి తరువాయి భాగంలో...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి