గీతగోవిందం లోని దశావతార స్తుతి చాలా ప్రాచుర్యం పొందింది. సంగీత, నాట్య రంగాలలో విరివిగా నుతిన్చబడి, ప్రదర్శించ బడినది. సాహిత్యం, తాత్పర్యము మీకోసం. సుబ్బులక్ష్మి గారి గాత్రంలో శ్రవణం. ఈ వర్ణనలో బుద్ధుని ఒక దశావతారం గా చెప్పబడినది. కాబట్టి అప్పటికే బౌద్ధ మతం ప్రాచుర్యం బాగా చెందినదని తెలుస్తోంది.
ప్రళయపయోధిజలే ధృతవానసి వేదం
విహితవహిత్రచరిత్రమఖేదం
కేశవ ధృతమీనశరీర జయ జగదీశ హరే ౧
క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణిధరణకిణచక్రగరిష్ఠే
కేశవ ధృతకచ్ఛపరూప జయ జగదీశ హరే ౨
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే ౩
తవ కరకమలవరే నఖమద్భుతశృంగం
దళితహిరణ్యకశిపుతనుభృంగం
కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే ౪
ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన
పదనఖనీరజనితజనపావన
కేశవ ధృతవామనరూప జయ జగదీశ హరే ౫
క్షత్రియరుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమితభవతాపం
కేశవ ధృతభృఘుపతిరూప జయ జగదీశ హరే ౬
వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే ౭
వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతిభీతిమిళితయమునాభం
కేశవ ధృతహలధరరూప జయ జగదీశ హరే ౮
నిందతి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతం
సదయహృదయదర్శితపశుఘాతం
కేశవ ధృతబుద్ధశరీర జయ జగదీశ హరే ౯
మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతుమివ కిమపి కరాలం
కేశవ ధృతకల్కిశరీర జయ జగదీశ హరే ౧౦
శ్రీజయదేవకవేరిదముదితముదారం
శృణు సుఖదం శుభదం భవసారం
కేశవ ధృతదశవిధరూప జయ జగదీశ హరే ౧౧
విహితవహిత్రచరిత్రమఖేదం
కేశవ ధృతమీనశరీర జయ జగదీశ హరే ౧
క్షితిరతివిపులతరే తవ తిష్ఠతి పృష్ఠే
ధరణిధరణకిణచక్రగరిష్ఠే
కేశవ ధృతకచ్ఛపరూప జయ జగదీశ హరే ౨
వసతి దశనశిఖరే ధరణీ తవ లగ్నా
శశిని కళంకకలేవ నిమగ్నా
కేశవ ధృతసూకరరూప జయ జగదీశ హరే ౩
తవ కరకమలవరే నఖమద్భుతశృంగం
దళితహిరణ్యకశిపుతనుభృంగం
కేశవ ధృతనరహరిరూప జయ జగదీశ హరే ౪
ఛలయసి విక్రమణే బలిమద్భుతవామన
పదనఖనీరజనితజనపావన
కేశవ ధృతవామనరూప జయ జగదీశ హరే ౫
క్షత్రియరుధిరమయే జగదపగతపాపం
స్నపయసి పయసి శమితభవతాపం
కేశవ ధృతభృఘుపతిరూప జయ జగదీశ హరే ౬
వితరసి దిక్షు రణే దిక్పతికమనీయం
దశముఖమౌళిబలిం రమణీయం
కేశవ ధృతరామశరీర జయ జగదీశ హరే ౭
వహసి వపుషి విశదే వసనం జలదాభం
హలహతిభీతిమిళితయమునాభం
కేశవ ధృతహలధరరూప జయ జగదీశ హరే ౮
నిందతి యజ్ఞవిధేరహహ శ్రుతిజాతం
సదయహృదయదర్శితపశుఘాతం
కేశవ ధృతబుద్ధశరీర జయ జగదీశ హరే ౯
మ్లేచ్ఛనివహనిధనే కలయసి కరవాలం
ధూమకేతుమివ కిమపి కరాలం
కేశవ ధృతకల్కిశరీర జయ జగదీశ హరే ౧౦
శ్రీజయదేవకవేరిదముదితముదారం
శృణు సుఖదం శుభదం భవసారం
కేశవ ధృతదశవిధరూప జయ జగదీశ హరే ౧౧
తాత్పర్యము:
ప్రళయ కాలములో సాగర జల ఘోషలో వేదములను నావ వలె కాపాడిన మీనావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.
మందర పర్వతాన్ని తన వీపుపై మోసి, ఆ పర్వతము ఒక చక్రం లాగ తిరిగి సాగర మథనం ముందుకు సాగేలా చేసిన కూర్మావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునికి జయము జయము.
నీట మునిగిన భూమిని తన ముక్కుపై చంద్రుని నెలవంక వలె నిలిపి కాపాడిన ఖడ్గమృగావతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.
దానవుడైన హిరణ్యకశిపుని తన చేతులకు ఉన్న గోళ్ళతో చీల్చి చెండాడి పురుగువలె నలిపి చంపిన నృసింహ అవతారమైన శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.
తన విశ్వవ్యాప్తమైన పదములతో బలిని పాతాళమునకు పంపి, ఆ పాదముల వద్ద నుండి ఉబికిన నీరు జనులను పావనం చేయగా, బడుగు బాపని రూపమైన ఆ వామనావతార రూప శ్రీహరికి, జగదీశ్వరునకు జయము జయము.
క్షత్రియుల రక్తముతో భూదేవికి స్నానము చేయించి, భూమిపై ఉన్న పాపమును నాశనము చేసిన, భూతాపమును తగ్గించిన పరశురామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
దశ దిక్కులకు రావణుని పది తలలను బహుకరించిన రామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
యమునానది రంగులో తన తెల్లని శరీరము పై వస్త్రములు ధరించిన, తన నాగలి ధాటితో యమునను భయపెట్టి తన వైపు మళ్లించిన, బలరామావతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
వేదములలో చెప్పబడిన యజ్ఞ విధి, దానిలో జరిగే జంతు బలిని వ్యతిరేకించిన, దయారూపమైన, బుద్ధ అవతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
తోకచుక్కవలె, ఆశ్వముని అధిరోహించి, తన ఖడ్గముతో మ్లేచ్ఛులను సంహరించి కలియుగాంతము చేసే కల్కి అవతారమైన శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
ఈ జయదేవ విరచిత దశావతార స్తుతిని వినినంత శుభము, సుఖము కలిగించే శ్రీ హరికి, జగదీశ్వరునకు జయము జయము.
Interesting, "Krishna" is excluded from dasaavataras as per this stuti.
రిప్లయితొలగించండిఅవునండీ. కృష్ణ బలరాములను ఒకే అవతారముగా భావించారేమో జయదేవులు.
రిప్లయితొలగించండి