భగవద్రామానుజులు 1017 సంవత్సరములో శ్రీ పెరంబుదూర్ లో కేశవ సోమయాజి మరియు కాంతిమతి దంపతులకు జన్మించారు. కాంచీపురం లోని యాదవ ప్రకాశ అనే గురువు వద్ద వేదాధ్యయనము చేస్తుండగా, గురువు గారు ఈర్ష్య వలన కల్పించిన విపత్కర పరిస్థితులలో అక్కడినుంచి బయట పడి తన ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలు పెడతారు. భారత దేశమంతా తిరిగి విశిష్టాద్వైత తత్త్వాన్ని ప్రచారం చేసి వైష్ణవ సాంప్రదాయాన్ని నలుదెసలా చాటారు. ఆయన బ్రహ్మ సూత్ర భాష్యము అత్యంత విశిష్టమైనది. ఇది శ్రీ భాష్యం గా పిలువబడినది. ఆయన వేదార్థ సారము, వేదాంత సంగ్రహము, వేదాంత దీపము అనే అద్భుతమైన రచనలు కూడా చేశారు. ఇవే కాక, వైకుంఠ గద్యము, శరణాగతి గద్యము, శ్రీ రంగ గద్యము మొదలగు వచన రచనలు సామాన్యులకు భగవద్భక్తి ఇనుమడిన్చేలా చేశారు.
భగవద్రామానుజులు |
శ్రీరంగము లోని రంగనాథ క్షేత్రము, తిరుమలలో శ్రీ వేంకటేశ్వరుని క్షేత్రము, మెల్కోటేలో చెలువ నారాయణ క్షేత్రము మొదలగు అత్యంత పవిత్రమైన క్షేత్రాలలో వైష్ణవ సంప్రదాయాన్ని స్థాపించి, దైవారాధనను పునరుద్ధరించి, నిలిపి, ఉత్థానమునకు తీసుకువచిన జగద్గురువులు రామానుజులు. 120 ఏళ్ల విశేషమైన మానవ జీవితాన్ని ఆ విష్ణు భక్తిలో గడిపిన ముని రామానుజులు. అంత వరకు రహస్యముగా ఉన్న నారాయణ మంత్రమును (ఓం నమో నారాయణాయ) గురువులు, పెద్దలను ఎదిరించి శ్రీ రంగములోని మందిరం ఎక్కి ఎలుగెత్తి చాటుతాడు. భగవంతుని చేరటానికి సాధనమైన మంత్రాన్ని అందరికీ చెప్పటం వలన పాపం కలిగితే, ఆ పాపము, దాని ఫలితము అనుభవించటానికి నేను సిద్ధము అని తన ఔన్నత్యాన్ని చాటారు రామానుజాచార్యులు.
ఈనాటికి కూడా, ఆయన స్థాపించిన క్షేత్రాలలో సాంప్రదాయము, భక్తి, ఆచారములతో సేవలు నిర్వహించటం ఆయన మహత్తుకు నిదర్శనం. ఆయన రచించిన అద్భుతమైన నుతి ఒకటి ఈ వ్యాసములోని శ్రీరంగ గద్యము. ఆర్తితో, సర్వస్య శరణాగతితో, భక్తి నివేదనతో చేసిన రచన ఇది. సాహిత్యం, తాత్పర్యము మీకోసం. మాధుర్యానికి మారు పేరైన మదురై షణ్ముఖవడివు (ఎమ్మెస్) సుబ్బులక్ష్మి గారి గళంలో శ్రవణం.
శ్రీరంగ గద్యము
స్వాధీన త్రివిధ చేతనాచేతన స్వరూప స్థితి ప్రవృత్తిభేదం క్లేశ కర్మాద్యశేష దోషా సంస్పృష్టం!
స్వాభావికానవధికాతిశయ జ్ఞానబలైశ్వర్య వీర్యశక్తి తేజస్సౌశీల్య వాత్సల్య మార్దవ ఆర్జవ సౌహార్ద సామ్య కారుణ్య మాధుర్య గాంభీర్య ఔదార్య చాతుర్య స్థైర్య ధైర్య శౌర్య పరాక్రమ సత్యకామ సత్యసంకల్ప కృతిత్వ కృతజ్ఞతాద్యసంఖ్యేయ కల్యాణ గుణగణౌఘ మహార్ణవం!
పరబ్రహ్మ భూతం! పురుషోత్తమం! శ్రీరంగ శాయినం! అస్మద్స్వామినం! ప్రబుద్ధ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావోహం! తదేకానుభవః! తదేకప్రియః! పరిపూర్ణం భగవంతం విశదతమ అనుభవేన నిరంతరమనుభూయ! తదనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేషావస్థోచిత అశేష శేషతైకరతిరూప నిత్య కింకరో భవాని!
స్వాత్మ నిత్య నియామ్య నిత్యదాస్యైకరసాత్మ స్వభావాను సంధానపూర్వక భగవదనవధికాతిశయ స్వామ్యాద్యఖిల గుణగణానుభవజనిత అనవధికాతిశయ ప్రీదికారిత అశేషావస్థోచిత అశేష శేషైతైకరతిరూప నిత్య కైంకర్య ప్రాప్త్యుపాయ భూతభక్తితదుపాయ సమ్యగ్ జ్ఞాన తదుపాయ సమీచీనక్రియాతదనుగుణ సాత్వికత్ ఆస్తిక్యాది సమస్త ఆత్మ గుణ విహీనః! దురుత్తరానంత తద్విపర్యయ జ్ఞానక్రియానుగుణ అనాది పాప వాసనా మహార్ణవాంతర్నిమగ్నః! తిలతైలవత్! దారువన్హివత్! దుర్వివేచ త్రిగుణ క్షణక్షరణస్వభావ అచేతన ప్రకృతి వ్యాప్తిరూప దురత్యయ భగవన్ మాయాతిరోహిత స్వప్రకాశః! అనాద్య విద్యా సంచితానంతాశక్య విస్రంసన కర్మపాశ ప్రగ్రథితః! అనాగతానంతకాల సమీక్షయాఽఅపి అదృష్ట సంతారోపాయః! నిఖిల జంతు జాత శరణ్య!! శ్రీమన్నారాయణ!! తవ చరణారవిందయుగళం చరణమహం ప్రపద్యే!
ఏవమవస్థితస్యాప్యర్థిత్వమాత్రేణ! పరమకారుణికో భగవాన్! స్వానుభవ ప్రీత్యోపనీతైకాంతికాత్యంతిక నిత్యకైంకర్యరతిరూప నిత్య దాస్యం దాస్యతీతి విశ్వాసపూర్వకం భగవంతం నిత్య కింకరతాం ప్రార్థయే!
తవానుభూతి సంభూత ప్రీతికారిత దాసతాం!
దేహి మే కృపయా నాథ! న జానే గతిమన్యథా!!
సర్వావస్థోచితాశేషశేషతైకరతిస్తవ!
భవేయం పుందరీకాక్ష! త్వమేవైవం కురుష్వ మాం!!
ఏవంభూత తత్వాథాత్మ్యావబోదతదిచ్ఛారహితస్యాపి! ఏతదుచ్చారణ మాత్రావలంబనేన! ఉచ్యమానార్థ పరమార్థ నిష్టమ్ మే మనః త్వమేవ అద్యైవ కారయ!
అపార కరుణాంబుధే! అనాలోచిత విశేష అశేష లోక శరణ్య! ప్రణతార్తి హర! ఆశ్రిత వాత్సల్యైక మహో దధే! అనవరత విదిత నిఖిల భూత జాత యాథాత్మ్య! సత్యకామ! సత్య సంకల్ప! ఆపత్సఖ! కాకుత్స్థ!శ్రీమన్!
నారాయణ! పురుషోత్తమ! శ్రీరంగ నాథ! మమ నాథ!నమోస్తు తే!

తాత్పర్యము:
ఓ భగవాన్! నీవు చేతనా, అచేతనా అవస్థలలోని మూడు రకాలు వాటి ఉనికి, వాటికి సంబంధించిన పనులను స్వాధీనములో కలవాడవు, కష్టములు, సుకర్మలు, దుష్ట కర్మల ప్రభావము లేని వాడవు, ఎన్నలేనన్ని విశేష కళ్యాణ గుణ గణములు కలవాడవు. వాటిలో కొన్ని - జ్ఞానము, బలము, ఐశ్వర్యము, వీర్యము, శక్తి, తేజస్సు, సౌశీల్యము, వాత్సల్యము, మార్దవము (మృదుత్వము), ఆర్జవము (విశ్వాసము/నమ్మకము), సౌహార్ద్రము (అన్నీ మంచి ఆలోచనలే), సామ్యము (సమాన భావము) , కారుణ్యము, మాధుర్యము, గాంభీర్యము, ఔదార్యము, చాతుర్యము, స్థైర్యము, ధైర్యము, శౌర్యము, పరాక్రమము, సత్య కామ (నీ అభీష్టము ఎప్పుడూ నెరవేరును), సత్య సంకల్ప (ఎల్లప్పుడూ నీ కార్యములు నెరవేరును), కృతిత్వము (భక్తుల మరియు దేవతల కార్యములు పూర్తి చేసే వాడవు), కృతజ్ఞత. అటువంటి అనేక గుణముల సాగరానివి, నిధివి. నీవే పరబ్రహ్మవు, పురుషోత్తముడవు, శ్రీరంగ శాయివి, నా స్వామివి. నీ ఆజ్ఞకు బద్ధుడను. నీ సేవలోని మాధుర్యాన్ని చవి చూసినాను. నా భక్తి జ్ఞాన ఫలము, గమ్యము నీవు. ఎటువంటి అంతరములు, అంతరాయములు లేకుండా, నీవే నా ఏకైక గమ్యముగా ఆరాధిస్తున్నాను. దానివలన కలిగే ఆనందము వర్ణించలేని సచ్చిదానందము. నేను ప్రతిక్షణము, ఎల్లప్పుడూ, నీ విశేషమైన అశేషమైన సేవలో నిమగ్నుడనై ఉందును.
జీవాత్మ అనే నేను నీ కనుసన్నలకై వేచి ఉన్నాను. నీ సేవకు, సేవ చేయాలనే ఆలోచనకు నేను నిరంతరమూ దాసుడను. నీ అశేషమైన కళ్యాణ గుణ గణముల వలన ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను. అటువంటి ఆనందము వలన భక్తి, జ్ఞాన, కర్మ యోగములు, సాత్వికము, ఆస్థికము మొదలగునవి కలుగును. కానీ అవేవీ నాలో లేవు. పైగా నాలో విపరీత జ్ఞానము, కర్మలు ఉన్నాయి. వాటి వలన నేను పాపముల సాగరములో చిక్కుకొని ఉన్నాను. నాకున్న భక్తి జ్ఞానములతో ఈ సాగరాన్ని నేను దాటలేను. ఎందుకంటే అవి అహంకారము, మరియు మాయ ప్రకృతి యొక్క గుణములచే కప్పబడి యున్నవి. త్రిగుణములతో నా సాంగత్యము నువ్వు గింజలోని నూనె వలె, యాగ సమిధలోని అగ్ని వలె యున్నది. ఎన్నో జన్మలలో మూట గట్టుకున్న గుణములు, పాపముల వలన, అజ్ఞానము వలన నేను కర్మ పాశామునకు బద్ధుడ నైతిని. ఈ సంసార సాగరాన్ని దాటుటకు నేను ఆశక్తుడను. నేను ఎంత ప్రయత్నించినను ఇది సాధ్యముగా లేదు. కావున ఆర్త రక్షకా! ఓ ప్రభూ! శ్రీమన్ నారాయణా! లక్ష్మీ పతీ! నీవొక్కడవే నాకు దిక్కు. నేను నీ పాద పద్మముల వద్ద శరణంటిని. నీవే కాపాడుము.
నేను ఇటువంటి దీనావస్థలో ఉన్నాను. అయినా, నిన్ను శరణు అన్నందు వలన, కరుణామూర్తివైన నీవు, తదేక దీక్ష, శ్రద్ధలతో నీకు సేవ చేసే భాగ్యమును కలిగిస్తావు. ప్రభూ నేను ప్రార్థిస్తున్నాను. నాకు ఆ వరమొసగుము.
ఓ భగవాన్! నాకు వేరే రక్ష లేదు. వేరే మార్గము లేదు. నిన్ను దర్శించి, అనుభూతి పొందే ఆనందముతో నీ సేవా భాగ్యమును ప్రసాదించుము. నా ప్రేమతో నిన్ను తృప్తి పరచే భాగ్యము, నీ అనంతమైన కృపను ప్రసాదించుము.
కలువల వంటి కనులు కల ఓ నారాయణ! నీ సేవకొరకు ఎటువంటి రూపము తీసుకొనుటకు, ఎటువంటి పని చేయుటకు నేను సిద్ధముగా ఉండవలెను. అటువంటి మానసిక స్థితిని నాకు ప్రసాదించుము.
సత్యమును తెలుసుకునే కోరిక కాని, మనసు కాని లేని వాడను. నేను గమ్యమైన నిన్ను పొందుటకు అర్హుడను కాను ఎందుకంటే నేను మానసిక నిజాయితీ లేకుండా కేవలం పదములను పెదవుల ద్వారా పలుకుతున్నాను - దీనిని నా విన్నపముగా తీసుకుని నా మాటలపై ధ్యాస, నిజాయితీ చూపే మనసును ప్రసాదించు. నా ఈ మాటలను నాలోని లోపములను సరిదిద్దేలా చేయుము.
అపారమైన, అనంతమైన కరుణ కలిగిన సాగరమా! ఎటువంటి తారతమ్యము లేకుండా దయ చూపి రక్షణ కలిగించే ప్రభూ! శరణాగతుల కష్టములను దుఃఖములను రూపు మాపే ప్రభూ! భక్తులకు ప్రేమ సాగరమైన దేవా! జీవరాసుల జన్మ సత్యమును తెలిసిన దేవా! పరిపూర్ణుడా! అన్ని కోరికలు తీర్చేవాడా! సంకల్పములన్ని నెరవేర్చే వాడా! శ్రీ రామా! శ్రీ పతీ! శ్రీమన్ నారాయణా! పురుషోత్తమా! శ్రీ రంగ నాథా! నా నాథా! శరణు శరణు. నీకు నమస్కారము చేయుచున్నాను. నన్ను కాపాడుము.
శ్రీమతే రామానుజాయ నమః
meeru telugu lo ela rasthunnaro thelusukovalani undhi...
రిప్లయితొలగించండిrajesh garu - google blogger editor provides transliteration (if u type in english, it converts to telugu with certain rules). there are some tools like Baraha which have desktop editors for the same. So, I use the two get the work translated. For many of the sansrkit originals, there is a transliterated text available, which I use in one of these tools and make slight modifications for text to be properly displayed. For the translations, its my direct typing in blogger with transliteration to telugu enabled. It takes time :-). Most of it goes in proof reading. But I am enjoying.
రిప్లయితొలగించండి