జంధ్యాల హాస్య గుళికలు - మొదటి సంచిక
జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు సినీ చరిత్రలో హాస్యాన్ని కొత్త స్థాయికి తీసుకు వెళ్లిన మహానుభావులు. ఎటువంటి వెకిలి, ద్వంద్వార్థాలు లేకుండా తెలుగు పదాలతో అద్భుతమైన హాస్యరసాన్ని తన చిత్రాలలో పండించారు. ఆ మహానుభావుడి వల్ల ఎనభై, తొంభయ్యవ దశకాలలో తెలుగు చలన చిత్రాలలో సుత్తి వీరభద్రరావు, వేలు, బ్రహ్మానందం, శ్రీలక్ష్మి వంటి గొప్ప హాస్య కళాకారులు వెలుగొందారు. జంధ్యాల గారికి నివాళిగా ఈ హాస్య గుళికలు శీర్షికన వ్యాసాలు మీకు అందిస్తున్నాను. మొదటి సంచికలో ఆనందభైరవి చిత్రంలో ప్రాసలు మాట్లాడే వీరభద్రరావు, ఈలలు వేసే శ్రీలక్ష్మి, వీరిద్దరి బాధితునిగా సుత్తి వేలు మధ్య పొట్టలు చెక్కలయ్యే సన్నివేశం ఇది.
వీరభద్రరావు పేషెంటుతో: "మింగినట్టున్నావు కొత్త ఆవకాయతో కొండంత వాయ"
పేషెంటు: "చిత్తం. ఆహా! చేయి చూడగానే ఎలా చెప్పగలిగారో మహానుభావులు"
వీరభద్రరావు: "ఆవకాయలో వేడుంటుంది. ఆ వేడి నాలాంటి వాడి గల వైద్యుడికి నాడిలో తెలుస్తుంది రా బోడి..."
వీరభద్రరావు కొడుకుతో: "జంటగా వెళ్లి ఒంటిగా తగలడ్డావేం"..."కోడలేదిరా...కోడలేది అంటే గోడలకేసి నీడల కేసి చూస్తావేంటి రా గూడల జుట్టు వెధవ. ఏ అమ్మేశావా?"
కొడుకు వేలు: "నా ఖర్మ! సినిమాకి వెళ్లామా! అందులో ఓ మాంచి ఫైటింగ్ సీన్ వచ్చింది. హీరో రౌడీలను బాదుతున్నాడు. అది చూసి నీ కోడలు నీ కోడలు కయ్య్ అని అమెరికాకి వినిపించేంత గట్టిగా ఓ ఈల కొట్టింది. దాంతో దీని ముందు సీట్లో కూర్చున్న ఒకావిడ గుండె జబ్బు వచ్చి పడిపోయింది..."
వీరభద్రరావు దిమ్మతిరిగి పడిపోతాడు...
వేలు: "నాన్నా! నాన్నా! నీకు కూడా...నాకంత అదృష్టం కూడానా"..."ఆ ఈల విని ఆపరేటర్ అదిరిపడి సినిమా ఆపేసి లైట్లేశాడు. జనమంతా మాకేసి చూస్తుంటే సిగ్గేసి నేను పారిపోయొచ్చాను. అది మాత్రం కుర్చీ ఎక్కి నిలబడి మిగితా సినిమా కూడా చూపించమంటూ ఈలేసి గోల చేస్తోందక్కడ...."
వీరభద్రరావు: "అబ్బా! మనకా ఈలల గోల ఏల? ఈ ఈలన్నది ఇలలో కలలో మన ఇంటావంటా లేని విద్యే? "
వేలు: "అబ్బా! దాని ఈలతోనే చస్తుంటే మధ్యలో నీ కవిత్వం గోలేమిటి నాన్నా తలవాచిపోతోంది..."
వేలు శ్రీలక్ష్మితో: "ఆగు! ఏమిటే? ఊ! ఏమిటి ఇందాక నువ్వక్కడ చేసిన పని?"
శ్రీలక్ష్మి: "కోప్పడకండీ! అంత శబ్దం వస్తుందని అనుకోలేదు..."
వేలు: "నిన్ను...నిన్ను ఇక జన్మలో బయటికి తీసుకెళితే నా చెవిలో ఈలేసి చంపెయ్యవే"
శ్రీలక్ష్మి: "అంత మాటనకండీ. ఈల వెయ్యటం నాకు మాత్రం ఇష్టమేనా? ఏం చేయను ఎక్కువ సంతోషం కానీ బాధ కానీ కలిగినప్పుడు వేళ్లు వాటంతట అవే దగ్గరవుతాయి, నోటి దగ్గరికి వెళ్లిపోతాయి, లోపలనుంచి గాలి వస్తుంది, బయటకి శబ్దమొస్తుంది. ఇవన్నీ నాకు తెలియకుండానే జరిగిపోతాయండీ..."
వేలు: "నా వల్ల కాదే! ఈలేసే పెళ్లాన్ని ఏలుకోలేను. ఇవాళ్లో రేపో వకీలు గారిని కలిసి నీకు విడాకులిచ్చేస్తాను"
శ్రీలక్ష్మి: "అంటే ఏంటండీ"
వేలు: "కోర్టు వారు ఇక నీకు నాకు ఏ సంబంధం లేదని కాయితం ఇస్తారు..అది.."
దుఃఖంతో శ్రీలక్ష్మి కయ్య్ అని ఈల వస్తుంది
శ్రీలక్ష్మి: "క్షమించండి ఇది బాధ ఈల"
వీరభద్రరావు: "ఓసి నీ బాధ తగలెయ్య. అమ్మ అమ్మ...గుండిగి కింద పడ్డ అప్పడంలా గుండె చితికిపోయింది కదమ్మా. ఒరేయ్ కుంకాక్షీ. ఇకనుంచి క్షమించమని అదీ మీ ఆవిడనడక్కు. ఆ సంబరంలో మళ్లీ ఈల కొట్టిందంటే ఈ గుండెకి ఆ ఈల జోలవుతుంది. స్వస్తి..పో అవతలకి పో"
వేలు:"నాన్న..నాన్న గుండాడుతోందా?"
వీరభద్రరావు - "ఆ ఆ"
వేలు: "అమ్మబాబోయ్...పదవే లోపలకి పద"
ఆ.వె. ప్రాస పిచ్చితోటె పారిపోయె బుర్ర
రిప్లయితొలగించండిఈల వేయ నింక నేమి వ్రాయ
పద్య పిచ్చి నాది పనికిరానా నేను
పారిపోక నిలుడు ప్రసాదయ్య.....
ఆ ఆ ఆ ఆ య్...
అదండి సంగతి నాలాటోణ్ణి ఇలాంటి వాటికి కామెంటులు అడిగితే పద్యాలే పిప్పర మెంటు....
Bhale Gopannayya
రిప్లయితొలగించండిప ప న
రిప్లయితొలగించండిAla Padi Padi navvulatho ( PA PA NA) mee blog chadivi ee udayam modalu ayindi maa andariki .Dhanavadamulu mitrama
రిప్లయితొలగించండిసూపర్...నవ్వి నవ్వి కడుపు నొప్పొచ్చేస్తోంది.....హాట్స్ ఆఫ్ జంధ్యాల గారు !!!!
రిప్లయితొలగించండి