24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

వర్షరుతు వీడ్కోలు - శరదృతు ఆగమనం

 
గర్జించిన రుతు కాలమేఘం కురిపించింది నిత్య నిర్ఝరవర్షిణి
సుజలమైన సస్య ఆంధ్రమాత వినిపించింది సత్యసుధాతరంగిణి

నిండినాయి మా జలధారలు కుదిరినాయి రైతన్నల గుండెలు
అదిరినాయి నాళ్లతో పంటలోగిళ్లు చెదరినాయి కరవు పీడకలలు

నోచినారు సతులు వరలక్ష్మీ వ్రతం పలికినారు పతులు గణనాథునికి మంగళం
వీచినారు శ్రీనివాసుని  బ్రహ్మోత్సవం సమర్పిస్తున్నారు పితరులకు తర్పణం

విరిసింది పెరట్లో పచ్చని ముద్దబంతి మురిసింది ప్రతియింట ప్రౌఢ యువతి
వికసించింది తోటలో తెల్లని చేమంతి వేసింది శరదృతు శోభలకు నాంది

వస్తున్నవి ఆ సర్వమంగళ నవరాత్రులు తెస్తున్నవి మాయిళ్ల భక్తిసుధలు
వీస్తున్నవి శరచ్చంద్రుని చల్లని వెన్నెలలు ఇస్తున్నవి మాకు సకల శుభాలు


1 కామెంట్‌:

  1. "గర్జించిన రుతు కాలమేఘం కురిపించింది నిత్య నిర్ఝరవర్షిణి
    సుజలమైన సస్య ఆంధ్రమాత వినిపించింది సత్యసుధాతరంగిణి"
    పదజాలం, భావజాలం రెండూ అద్భుతంగా ఉన్నాయి.
    ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి