ఈ మధ్య ఓలా క్యాబ్‌లో ఆఫీసునుండి ఇంటికి వస్తున్నాను. ఎక్కినవాడిని ఊరుకోకుండా డ్రైవర్లతో మాట్లాడటం. వాళ్ల భవసాగరాల గాథలు వినటం జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఆ సంభాషణల సింహావలోకనమే ఈ ఓలాయణం ధారావాహికం.
ఓలాయణం - మొదటి భాగం:
ఏం భిక్షపతి! బానే నడుస్తోందా ఈ క్యాబ్ జీవితం? ఎంత సంపాదిస్తావు నెలకు?
ఏం చెప్పను సార్! రోజుకు 15 గంటలు నడపాల్ల్సి వస్తోంది. ఇది వరకు జీడిమెట్లలో కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసే వాడిని. నాలుగేళ్ల క్రితం దాన్ని మూసేశారు. రోడ్డున పడ్డాను.
మరి క్యాబ్ నీదా లేక డ్రైవింగ్ ఒక్కటేనా?
నాదే సార్. ఓ రెండేళ్లు డ్రైవరుగా పని చేశాను. అందరూ క్యాబ్ నడిపితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అని చెప్పారు. అందుకని ఓ మూడు లక్షల అప్పుకోసం ప్రయత్నించాను. మీలాంటి సార్ ఒకరు బ్యాంక్ మేనేజర్ ఎటువంటి హామీ పత్రాలు లేకుండా నాకు లోన్ ఇప్పించారు.
ఫ్యామిలీలో ఎంతమంది?
నేను, నా భార్య, ముగ్గురు మగపిల్లలు, అమ్మ, నాన్న. నాన్న కూడ డ్రైవర్‌గా చేసే వాడు. ఇప్పుడు చేతకావటం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు.
నెలకు ఎంత వస్తుంది ఆదాయం?
25-30వేల దాక వస్తుంది. లోన్లు చిట్టీలు పోను ఏమీ మిగలవు సార్.
మరి పిల్లల స్కూలు?
ఈ మధ్య నవోదయ స్కూలులో ముగ్గురు పిల్లలకు అడ్మిషన్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూలులో చదువుతున్నారు. చాలా ఖర్చైంది సార్ వాళ్ల చదువులకు.
నవోదయ స్కూళ్లు బాగుంటాయా?
పిల్లలు బాగా చదువుతారు సార్. కాబట్టి స్కూల్ ఎలాంటిది అని ఆలోచించలేదు.
మరి నువ్వు రాత్రింబవళ్లు నడిపితే పిల్లల చదువులు?
మా ఆవిడ టెంత్ క్లాస్ వరకు చదివింది. పిల్లలకు ఇప్పటివరకు తనే చెప్పింది. చాలా కష్టపడుతుంది సార్.
ఆదివారాలు కూడా నడుపుతావా?
తప్పదు సార్.
ఇంత డ్రైవింగ్ చేస్తే నీ ఆరోగ్యం...
రాత్రి ఇంటికి వెళ్లేసరికి నడుం నొప్పి, కాళ్లు చేతులు విపరీతంగా లాగుతాయి సార్. తలనొప్పిగా ఉంటుంది. కానీ, తప్పదు. ఈమధ్య ఒకసారి క్యాబ్‌కు యాక్సిడెంట్ అయ్యింది. దాదాపు 40వేలు రిపేర్లకు ఖర్చయ్యింది. బ్యాంకులో ఒక్క రూపాయి కూడా లేదు సార్.
మరి డ్రైవర్ ఉద్యోగం మానేసి క్యాబ్‌కు ఎందుకు వచ్చావు?
తెలియక సార్. క్యాబ్‌లో చాలా కష్టాలు ఉన్నాయి సార్. లోన్లు, ఆరోగ్యం, రాత్రిపూట నడపటం...
నీకు ఎన్నేళ్లు?
ముప్ఫై ఐదు సార్.
మరి ఏమైనా దాచుకున్నావా?
పెద్దగా ఏమీ లేదు సార్.
రేపు పొద్దున నీకు నీ కుటూంబానికి ఆరోగ్య సమస్యలు వస్తే ఎలా? ఆరోగ్యశ్రీ కానీ, ఇన్షూరెన్స్ కానీ ఉన్నాయా?
లేవు సార్.
గవర్నమెంటు ఈ మధ్య తక్కువ ప్రీమియంకు ఇన్షూరెన్స్ ఇస్తుంది. తెలుసా?
తెలీదు సార్.
వెంటనే తెలంగాణా మరియు భారత ప్రభుత్వం వారి ఆరోగ్య భీమా పథకాల వివరాలు చూపించాను. చాలా సంతోషించాడు. దిగేటప్పుడు సార్ ఎప్పుడైనా ఏదైనా వివరాలు కావాలంటే మీకు ఫోన్ చేయ్యచ్చా అని అడిగాడు. తప్పకుండా అని చెప్పాను. భిక్షపతి కళ్లలో కొంచెం ధైర్యం కనబడింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి