రమా రమణ రారా! ఓ రమా రమణ రారా!
సమానమెవరు వినుమా నా మనవిని తమాము పొగడ తరమా అహిపతికిని
బుధాద్యవన దశరథార్భక మనోరథంబొసగు సుమరథార్హ సద్గుణ
కలార్ధభూష సకలార్ధ శశధరకళాధరనుత వికలార్తి సంహర
రణాదిశూర శరణాగతాత్మచరణంబు భవతారణంబు చేసిన
ముఖాబ్జమును శత ముఖారి జూపు సముఖాన గొలుతు దుర్ముఖాసుర హరణ
బిరాన బ్రోవగ రాదా శ్రీమదగరాజధర త్యాగరాజ సన్నుత!
ఓ సీతాపతీ! వేగమే నన్ను బ్రోవగా రారా! నీ సమానమెవరు రామా! నా మనవిని వినుము. నిన్ను పరిపూర్ణముగా పొగడుటకు ఆదిశేషునికైనా తరమా! బుధజనులను రక్షించే దశరథ కుమారా! పుష్పకవిమానమును అధిరోహించిన సద్గుణ సంపన్నా! నా మనోభీష్టమును నెరవేర్చుము, వేగమే నన్ను బ్రోవగా రారా! సకల విద్యా పారంగతుడవు, సమస్త కళలకు అర్థము, ధ్యేయము నీవే. చంద్రకళాధరుడైన శివునిచే నుతించబడినవాడవు, దీనుల ఆర్తిని సంహరించే వాడవు, వేగమే నన్ను బ్రోవగా రారా!. యుద్ధరంగములో శూరుడవు, శరణాగతుల క్లేశములను తొలగించి భవసాగర తారణం చేసిన వాడవు, శతముఖుడైన రావణుని శత్రువువు, దుర్ముఖాసురుని సంహరించినవాడవు నీవు నిన్ను ప్రత్యక్షముగా కొలిచెదను నీ ముఖకమలమును చూపుము, వేగమే నన్ను బ్రోవగా రారా! . శ్రీరామా! మందర పర్వతమును ధరించినవాడవు, పరమశివునిచే నుతించబడిన వాడవు, నన్ను వేగమే బ్రోవగా రారాదా!
సద్గురువులు ఈ కృతిని శంకరాభరణం రాగంలో స్వరపరచారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి