మటర్ పన్నీర్
కావలసిన పదార్థాలు:
ఫ్రోజెన్ బఠాణీలు పావుకిలో
పన్నీర్ పావుకిలో
ఉల్లిపాయలు పెద్దవి మూడు
టమాటోలు పెద్దవి నాలుగు
కాస్త తరిగిన అల్లం
(కావలసిన వారు వెల్లుల్లి ముక్కలు)
ధనియాల పొడి
గరం మసాలా పొడి
తగినంత వంట నూనె, ఉప్పు, పసుపు మరియు కారం
చేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి. టమాటో ముక్కలను గ్రైండర్లో వేసి గుజ్జు చేయాలి. బాణలిలో 3-4 చెంచాల నూనె వేసి అందులో ఉల్లిపాయలను, అల్లం తురుమును వేసి (వెల్లుల్లి తినేవారు ఆ ముక్కలను) ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఇవి రంగు మారిన తరువాత బాణలిలో టమాటో గుజ్జును వేసి కాసేపు తిప్పుతూ ఉండాలి. అందులో కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, పసుపు, కారం వేసి ఉడకనివ్వాలి. ఒక ఐదు నిమిషాల తరువాత ఫ్రోజెన్ బఠాణీలను బాగా కడిగి ఆ బాణలిలోని మిశ్రమంలో వేయాలి. బఠాణీలు మెత్తబడేలోపు పన్నీర్‌ను 1/2 అంగుళం పరిమాణంలో క్యూబ్స్‌గా కోసి బాణలిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలు ఉడికిన తరువాత దించేయాలి. ఈ కూర వేడి వేడిగా చపాతీలు, పూరీలు లేదా అన్నంతో తింటే బాగుంటుంది.
రిప్లయితొలగించండిఅంతర్యామి అంతయు నీవే మటర్ పన్నీర్ :)
జిలేబి