మానవునిగా పుట్టి, ధర్మ సంరక్షణకోసం, సత్య వాక్పరిపాలన కోసం ఆదర్శ జీవనాన్ని గడిపిన ఆ ధర్మమూర్తి రామచంద్రుని స్మరిస్తే సకల భయాలు, ఆపదలు, పాపాలు తొలగుతాయని, మోక్షము కలుగుతుందని ఎన్నలేని నిదర్శనాలు ఈ భారత భూమిపై కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఎందరో ఋషులు, యోగులు, కవులు, పండితులు, పరమ భక్తులు, వాగ్గేయ కారులు ఈ రామ నామ మహిమను వివరించారు, నుతించారు. స్వయంగా పరమశివుడే పార్వతికి ఈ రామ నామ మహత్తును చెప్పాడుట.
ఆ రాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ రామ రక్షా స్తోత్రాన్ని రచించారు. ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనదిగా చెప్పబడింది. ఇందులో వేర్వేరు మూలాలనుంచి రామ మహిమను చెప్పే శ్లోకాలను పొందు పరచారు.
రామ రక్షా స్తోత్రము, తాత్పర్యము. శ్రవణం అనురాధా పోడ్వాల్ గారి గాత్రంలో.
ఓం శ్రీగణేశాయ నమః
వినియోగః
అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః
వినియోగః
అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః
శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః
సీతా శక్తిః శ్రీమద్ హనుమాన్ కీలకం
శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః
అథ ధ్యానం
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం
వామాంకారూఢ సీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రం
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం
వామాంకారూఢ సీతాముఖకమలమిళల్లోచనం నీరదాభం
నానాలంకారదీప్తం దధతమురుజటామండనం రామచంద్రం
మోకాళ్ళ వరకు ఉండే పొడవైన చేతులు కలవాడు, ధనుస్సు, శరములు ధరించిన వాడు, పద్మాసనములో కూర్చుని ఉన్నవాడు, పసుపు పచ్చని వస్త్రము ధరించిన వాడు, నవ కలువలతో పోటీ పదే కన్నులు కలవాడు, ప్రసన్నుడు, తన ఎడమ తొడపై కూర్చుని ఉన్న కమలము వంటి ముఖము కల సీతపై చూపులు కలవాడు, మేఘ శ్యాముడు, అనేకమైన ఆభరణములు ధరించిన వాడు, పొడవైన కేశములు తొడలవరకు కలవాడు అయిన శ్రీ రాముని ధ్యానించుము.
ఇతి ధ్యానం
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ౧
చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం ౧
శ్రీరాముని చరితము ఎంతో విస్తారమైనది. ఇందులోని ప్రతి అక్షరము మానవుని మహా పాతకములను నాశనము చేయగలిగిన శక్తి కలది.
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం ౨
జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం ౨
కలువల వంటి కన్నులు, నీలి మేఘము వంటి శరీర ఛాయ, అందమైన కేశములు కిరీటముగా కలిగి, సీతా లక్ష్మణులు చెరొక వైపు కలిగి ప్రకాశిస్తున్న రాముని ధ్యానించుదాము.
సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకం
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం ౩
స్వలీలయా జగత్త్రాతు మావిర్భూత మజం విభుం ౩
ఖడ్గము, ధనుస్సు, అమ్ముల పొదిలో బాణములు ధరించిన వాడు, నిశాచరులైన రాక్షసులను సంహరించిన వాడు, జన్మ లేని వాడు, దుష్ట శిక్షణ కోసమే అవతారమెత్తిన వాడు, ప్రకాశించే ప్రభువును ధ్యానించుదాము.
రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదాం
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ౪
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః ౪
రామ రక్షా స్తోత్రము పఠించే జ్ఞానులకు పాపములన్ని నశించి అని కోరికలు తీరును. రఘువంశములో పుట్టిన రాముడు నా శిరస్సును కాపాడు గాక, దశరథ కుమారుడైన రాముడు నా నుదురును కాపాడు గాక.
కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియఃశ్రుతీ
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ౫
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ౫
కౌసల్యా సుతుడైన రాముడు నా కన్నులను కాపాడు గాక. విశ్వామిత్రుని ప్రియుడైన రాముడు నా కర్ణములను కాపాడు గాక. యజ్ఞమును కాపాడిన రాముడు నా నాసికమును కాపాడు గాక. లక్ష్మణుని పట్ల ప్రేమతో ఉండేవాడు నా ముఖమును కాపాడు గాక.
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ౬
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ౬
విద్యా నిధి యైన రాముడు నా నాలుకను కాపాడు గాక. భరతునిచే పూజించ బడిన రాముడు నా కంఠమును కాపాడు గాక. దివ్యాయుధములు ధరించే రాముడు నా భుజములను కాపాడు గాక. శివుని విల్లుని విరిచిన రాముడు నా బాహువులను కాపాడు గాక.
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ౭
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ౭
సీతాపతి యైన రాముడు నా కరములను కాపాడు గాక. పరశురాముని గర్వము అణచిన రాముడు నా హృదయమును కాపాడు గాక. ఖర దూషణ రాక్షసులను సంహరించిన రాముడు నా ఉదరమును కాపాడు గాక. జామ్బవంతునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా నాభిని కాపాడు గాక.
సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ౮
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ ౮
సుగ్రీవునికి ప్రభువైన రాముడు నా నడుమును కాపాడు గాక. హనుమంతునికి ప్రభువైన రాముడు నా తుంటెను కాపాడు గాక. రఘు కులములో ఉత్తముడు, రాక్షసులను వినాశనము చేసినవాడైన రాముడు నా రెండు తొడలను కాపాడు గాక.
జానునీ సేతుకృత్ పాతు జంఘే దశముఖాంతకః
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ౯
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః ౯
సేతువును నిర్మించిన రాముడు నా మోకాళ్లను కాపాడు గాక. రావణుని సంహరించిన రాముడు నా పిక్కలను కాపాడు గాక. విభీషణునికి ఆశ్రయమిచ్చిన రాముడు నా పాదములను కాపాడు గాక. ఈ విధముగా రాముడు నా శరీరము నంతటినీ కాపాడు గాక.
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ౧౦
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ ౧౦
రాముని అంత బలం కల ఈ స్తోత్రమును పఠించిన సత్పురుషునికి దీర్ఘాయుష్షు, సుఖము, సంతానము, విజయము, వినయము కలుగు గాక.
పాతాలభూతలవ్యోమచారిణ శ్ఛద్మచారిణః
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ౧౧
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ౧౧
రూపమును మార్చుకుంటూ, భూమిపైన, పాతాళములో, ఆకాశములో, అదృశ్య రూపులై తిరిగేవారికి (దుష్టశక్తులు) రామనామముచే రక్షించబడిన వారు కనబడక యుందురు.
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి ౧౨
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి ౧౨
రామ, రామభద్ర, రామచంద్ర అని ఆ దేవుని స్మరించే మానవులకు ఎటువంటి పాపము అంటదు. వారికి భుక్తి, ముక్తి కలుగును.
జగజైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితం
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ౧౩
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ౧౩
ప్రపంచాన్ని జయించిన రామ నామ మనే ఈ మంత్రమును ధరించిన వారికి సర్వ కార్య సిద్ధి కలిగి, సిద్ధులు వారి కనుసన్నలలో యుండును.
వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ౧౪
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళం ౧౪
వజ్రపంజరమనే ఈ రామ కవచాన్ని స్మరించే వారికి ఓటమి యుండదు. వారికి ఎల్లవేళలా జయము, శుభము కలుగును.
ఆదిష్టవాన్ యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః
తథా లిఖితవాన్ ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః ౧౫
తథా లిఖితవాన్ ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః ౧౫
పరమ శివుడు బుధ కౌశిక మునిని ఈ స్తోత్రము రచించుమని స్వప్నములో ఆదేశించెను. మరునాడు ఉదయము ఆ ఋషి ఈ స్తోత్ర రచన చేసెను.
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదాం
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ౧౬
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ౧౬
అన్ని కోరికలు తీర్చే కల్పవ్రుక్షమైన వాడు, అన్ని ఆపదలను పోగొట్టేవాడు, మూడులోకములచే వందితుడు అయిన రాముడే నిస్సంశయముగా మన ప్రభువు.
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ౧౭
పుండరీకవిశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ౧౭
యువకులు, సుందరమైన వారు, సుకుమారులు, మహాబలము కలవారు, కలువలవంటి విశాలమైన కన్నులు కలవారు, నార వస్త్రములు, జింక చర్మము ధరించిన ఆ రామలక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడుదురు గాక.
ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ౧౮
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ౧౮
దశరథుని పుత్రులైన ఈ రామలక్ష్మణులు కందమూల ఫలములు భుజించి, నిగ్రహముతో, తపస్సు చేస్తూ, బ్రహ్మచర్యం పాటిస్తూ ఉన్నారు.
శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతాం
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ౧౯
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ౧౯
రఘువంశ రాజ కుమారులు, ధనుర్విద్యలో ఆరితేరిన వారు, రాక్షసులను సంహరించిన వారు, అందరి రక్షకులు అయిన రామ లక్ష్మణులు మనలను ఎల్లప్పుడూ కాపాడు గాక.
ఆత్తసజ్జధనుషావిషుస్పృశౌ అక్షయాశుగనిషంగసంగినౌ
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతాం ౨౦
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతాం ౨౦
ధనుర్బాణములు ధరించి తయారుగా ఉన్న, వారి చేతులు నిండుగా ఉన్న అమ్ములపొదిలోని బాణములపై కలిగిన రామ లక్ష్మణులు మనలను మన మార్గములో ఎల్లవేళలా కాపాడెదరు గాక.
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః ౨౧
గచ్ఛన్మనోరథోస్మాకం రామః పాతు సలక్ష్మణః ౨౧
ఖడ్గము, కవచము, బాణములు, ధనుస్సుతో ఎల్లప్పుడూ సన్నద్ధుడై యుండి, లక్ష్మణుడు అనుసరించగా, మన మనోరథము తీర్చుటకై వచ్చిన రామ చంద్రుడు లక్ష్మణ సమేతుడై మనలను కాపాడు గాక.
రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ౨౨
కాకుత్స్థః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ౨౨
దశరథ మహారాజు, కౌసల్యల తనయుడు, శూరుడు, లక్ష్మణునిచే అనుగమించ బడిన వాడు, బలవంతుడు, సూర్యవంశమున జన్మించిన వాడు, పూర్ణ పురుషుడు, రఘు కులములో ఉత్తముడు ఈ రాముడు.
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ౨౩
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ౨౩
వేదాంతములచే గ్రహించబడే వాడు, యజ్ఞములకు అధిపతి, సనాతనుడు, పురుషోత్తముడు, సీతాప్రియుడు, శుభకరుడు, అనంతమైన పరాక్రమము కలవాడు ఈ రాముడు.
ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ౨౪
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ౨౪
పరమ శివుడు ఇలా అన్నాడు - నా భక్తులారా! రాముని ఈ నామములను శ్రద్ధతో జపించేవారికి సంశయం లేకుండా అశ్వమేధ యాగము చేసిన దాని కన్నా ఎక్కువ ఫలము లభించును.
రామం దుర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః ౨౫
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరాః ౨౫
కలువల వంటి కన్నులు కలవాడు, నీల మేఘ శ్యాముడు, పీతాంబరములు ధరించిన వాడు అయిన రాముని దివ్య నామములు స్తుతించే వారు ఇంక ఈ సంసార సాగరములో చిక్కుకొని యుండరు (వారికి మోక్షము కలుగును).
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరం
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం ౨౬
కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికం
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిం ౨౬
మనోహరుడు, లక్ష్మణుని అగ్రజుడు, సీతాపతి, రఘుకులములో ఉత్తముడు, కరుణా సాగరుడు, సర్వ సులక్షణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియుడు, ధర్మ రక్షకుడు, సత్య సంధుడు, రాజేంద్రుడు, దశరథ పుత్రుడు, నల్లని వాడు, శాంతమూర్తి, రావణుని సంహరించిన వాడు, లోకాభిరాముడు అయిన రామునికి వందనములు.
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ౨౭
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః ౨౭
శుభకరుడు, రక్షకుడు, చంద్రుని వలె చల్లనైన వాడు, సీతాపతి, లోక నాథుడు యైన రామునికి నమస్కారములు.
శ్రీరామ రామ రఘునందన రామ రామ
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ౨౮
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ
శ్రీరామ రామ శరణం భవ రామ రామ ౨౮
రఘునందనుడు, భరతునికి అగ్రజుడు, యుద్ధములో అరివీర భయంకరుడు అయిన రాముని నేను శరణు కోరుచున్నాను.
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే ౨౯
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే ౨౯
శ్రీరామచంద్రుని పాదములను - మనసులో స్మరిస్తున్నాను. మాటలలో పొగడుతున్నాను, శిర్స్సుతో నమస్కరిస్తున్నాను, శరణు కోరుతున్నాను.
మాతా రామో మత్పితా రామచంద్రః
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాఽన్యం జానే నైవ జానే న జానే ౩౦
స్వామీ రామో మత్సఖా రామచంద్రః
సర్వస్వం మే రామచంద్రో దయాళుః
నాఽన్యం జానే నైవ జానే న జానే ౩౦
శ్రీరాముడే నాకు తల్లి, తండ్రి, ప్రభువు, స్నేహితుడు. నా సర్వస్వం ఆ దయాళువైన రామచంద్రుడే. అటువంటి వారు నాకు ఇంక ఎవ్వరు లేరు, లేరు గాక లేరు.
దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం ౩౧
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనం ౩౧
కుడి పక్కన లక్ష్మణుడు, ఎడమ పక్కన సీత, ముంగిట హనుమంతుడు కలిగిన రామునికి వందనములు.
లోకాభిరామం రణరంగధీరం
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ౩౨
రాజీవనేత్రం రఘువంశనాథం
కారుణ్యరూపం కరుణాకరం తం
శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ౩౨
కన్నులకు ఇంపైన వాడు, సమరములో శత్రుజన భయంకరుడు, అందమైన కన్నులు కలవాడు, రఘువంశ నాథుడు, కరుణా రూపుడు, కరుణాకరుడు అయిన రాముని శరణు కోరుతున్నాను.
మనోజవం మారుతతుల్యవేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ౩౩
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠం
వాతాత్మజం వానరయూథముఖ్యం
శ్రీరామదూతం శరణం ప్రపద్యే ౩౩
మనస్సు అంత వేగము కలవాడు, వేగమున తండ్రియైన వాయువుతో సమానమైన వాడు, ఇంద్రియములను జయించిన వాడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, వాయు పుత్రుడు, వానరసేనలో ముఖ్యుడు, శ్రీరాముని దూత అయిన హనుమంతుని శరణు కోరుతున్నాను.
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ౩౪
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం ౩౪
రామాయణ కావ్యం ద్వారా మధురమైన రామ నామమును చెట్టుపై యున్న కోయిల వలె గానం చేసిన వాల్మీకి మహర్షికి వందనములు.
ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ౩౫
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ౩౫
అన్ని ఆపదలు తొలగించే వాడు, సకల సంపదలను ఇచ్చే వాడు, లోకాభిరాముడు అయిన శ్రీరామునికి నేను పరి పరి నమస్కారములు చేయుచున్నాను.
భర్జనం భవబీజానాం అర్జనం సుఖసంపదాం
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం ౩౬
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనం ౩౬
రామనామ ఉచ్చారణ, గర్జన పునర్జన్మ యనే బీజమును నాశనము చేయును (మోక్షము కలిగించును). అది సకల సంపదలను ఇచ్చును, యమ దూతలను పారద్రోలును.
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ౩౭
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోఽస్మ్యహం
రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ౩౭
రాజులలో మణి వంటి వాడు, రాక్షసులను సంహరించిన వాడు అయిన రామున్ని భజిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఆ రాముని మించిన కొలువు, దైవము లేదు, నేను అతని సేవకుడను. నా మనసు ఆ రాముని యందే లయమై యున్నది. ఓ రామా! నన్ను ఉద్ధరించుము, తరించుము.
శ్రీరామ రామేతి రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ౩౮
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ౩౮
పరమశివుడు ఇలా అన్నాడు - ఓ పార్వతీ దేవీ! నేను రామ నామ ఉచ్చరణను ఆస్వాదిస్తున్నాను. అది నాకు ఎంతో ప్రియమైనది. ఈ నామమును ఒక్కసారి ఉచ్చరించుట పరమాత్ముని ఇతర సహస్ర నామములను ఉచ్చరించినంత ఫలము నిచ్చును.
ఇతి శ్రీ బుధకౌశికఋషి విరచితం శ్రీరామరక్షాస్తోత్రం సంపూర్ణం
vivarana chala baga iccharu
రిప్లయితొలగించండి