చేర రావదేమిరా? రామయ్యా!
మేరగాదురా ఇక మహామేరుధీర! శ్రీకర! రామయ్య!
తల్లి తండ్రి లేని బాల తన నాథు గోరు రీతి పలుమారు వేడుకొంటే పాలించ రాదా?
వలచుచు నేను నీదు వదనారవిందమును తలచి కరుగ జూచి త్యాగరాజ సన్నుత!
ఓ రామయ్యా! నన్ను చేర రావేమిరా! మేరు పర్వతమంతటి మహా ధీరుడవు, శుభకరుడవు, ఇక నా వల్ల గాదురా రామయ్యా! తల్లి తండ్రి లేని బాలిక తన రక్షణను కోరే రీతి నేను అనేకమార్లు నిన్ను వేడుకొన్నాను.నన్ను పాలించ రాదా! శివునిచే నుతించబడిన ఓ రామా! నీ మనసు కరుగుటకై, నిన్నే కోరుచు, నీ ముఖారవిందమును తలచుచున్నాను. నన్ను చేర రావేమిరా!
- సద్గురువులు త్యాగరాజస్వామి
మల్లాది సోదరులు గానం చేసిన ఈ కృతి రీతిగౌళ రాగంలో స్వరపరచబడినది.
There is a mesmerising rendition of this song by balaji shankar in youtube.
రిప్లయితొలగించండి