కవిగా బ్రహ్మానందం, ఆసనాలు వేస్తూ, వేర్వేరు ప్రయోగాలు చేసే ఇంటి యజమాని/బావ/భర్తగా సుత్తి వీరభద్రరావు వివాహభోజనంబు చిత్రంలోని కొన్ని సన్నివేశాలు. యోగా డే సందర్భంగా నవ్వుకోండి. హాస్య బ్రహ్మ జంధ్యాల గారికి ఈ సందర్భంగా మరోమారు జోహార్లు.
***********************************************************************
బావ-బామ్మర్ది, తమ్ముడు-అక్కయ్య,మొగుడు-పెళ్లాల మధ్య సంభాషణ

రెండు కాళ్లూ మెడచెట్టు పెట్టుకొని కప్పలా ఆసనంలో వీరభద్రరావు, ఆ అసనాన్ని అనుకరించి వేయటానికి అవస్థ పడుతున్న ఆయన బామ్మర్ది.
బామ్మర్ది: బావగారూ! మీ పెళ్లైన పదిహేనేళ్లకి మా అక్కయ్యను చూసి వెళదామని పొరపాటున భోపాల్ నుంచి ఇక్కడకి వచ్చాను. ఇలా మీ ఇంట్లో భోజనం చెయ్యాలంటే ఆసనం వెయ్యాలని నిజంగా నాకు తెలియదు బావగారు! ఆ భోపాల్ గ్యాస్ ప్రమాదంలో పోయినా బాగుండేది. ఈ బాధ తప్పేది.
బావ: మాట్లాడబాక. మాట్లాడితే ఆసనం పవర్ పోద్ది.
బామ్మర్ది: మీరేమైనా అనుకోండి నా వల్ల కాదు బావగారూ! ఈ ఆసనాలు వేయటం నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.నే పోతా భోపాల్ పోతా..హా.
బావ: ఇప్పుడెట్లాగెల్తావయ్యా. ఇప్పుడు రైళ్లు లేవు.
బామ్మర్ది: లేకపోయినా సరే. పట్టాలుచ్చుకుని పరిగెడతా. నే పోతా. భోపాల్ పోతా.
అక్క: అదేంట్రా తమ్ముడూ. ఎక్కడికీ?
తమ్ముడు: అక్కయ్యా - నా ఒంట్లో ఉన్న అవయవాలన్నిటినీ చాకలి మూట కట్టినట్లు కట్టిస్తున్నాడే బావ. ఈ ఆసనాలు వేయటం నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.
అక్క: అదేమిటిరా ఓ నాలుగు రోజులుండెళ్లు.
తమ్ముడు: నాల్రోజులుంటే నలభై ఆసనాలు వేయిస్తాడే బావ. నా వల్ల కాదు. నే పోతా. భోపాల్ పోతా.
భార్య: పదిహేనేళ్లకొచ్చాడు మా తమ్ముడు. అతన్నిలా వెళ్లగొట్టి పంపించేశారు.
భర్త: ష్ష్. నా గొడవొదిలేసి అట్టా ఈధిలోకెళ్లి సూస్తా నిలబడు. మనింట్లో ఖాళీ అయిన వాటాలోకి అద్దెకు ఏ తలకుమాసినోడైనా వస్తాడేమో.

కవి-ఇంటి యజమాని మధ్య సంభాషణ

కవి ఇంటివైపు తొంగి చూస్తాడు. అక్కడ యజమాని ఆసనాలు వేస్తూ కనబడతాడు. ఆయన బారినుండి తప్పించుకునేలోపు...
ఇంటి యజమాని: కవీ! దా... దా... దా..
కవి: మహాప్రభో! ఓ కొత్త కథ చెప్తానండయ్యా! ప్రేమ కథ ఓ అందమైన అబ్బాయికి, ఓ ఆకర్షణీయమైన అమ్మయికి సంబంధించిన కథ.
యజమాని:ఆపు, ఆసనం వేస్తా చెప్పు.
కవి కథ చెబుతాడు.
యజమాని: ఛత్. ఇంకాపు. ఈ లత్తుకోరు కథ సినిమాగా తీస్తే నేనారిపోతా. ఈ కథలో ఇలన్ మన రాజు గారి బామ్మర్ది.
కవి: మన సోషల్ సినిమాలో రాజుగారు...
యజమాని: తిత్తి తీస్తా.
కవి: వద్దు.
యజమాని:అదే వెరైటీ. రాజు గారి బామ్మర్ది కిరీటమెట్టుకొస్తాడు. ఆణ్ణి సూసి ఈరో లగెడతాడు. ఆడెనకాల రాజు గారి బామ్మర్ది పడతాడు. ముందు ఈరో యెనక ఇలను ముందు ఈరో యెనక ఇలను. ..ఛేజ్
కవి: మహాప్రభో! ఈ ఆసనం వేస్తుంటే నా కూసాలు కదులుతున్నై. ఇప్పుడు నేనిదాపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను వెనక మీరు. ముందు నేను వెనక మీరు. ఛేజ్.

కవి-ఇంటి యజమాని మధ్య మడ్ ప్యాక్‌లో సంభాషణ

కవి: ఇంకా ఎంత సేపు మహాప్రభో ఈ మట్టి పట్టీ.
యజమాని: ఇంకొక్క గంటుంటే ఒంటికి మంచిదయ్యా. ఈ చెమ్మంతా ఇగిరి పోవాలా.
కవి: ఈ చెమ్మ ఇగిరేలోపు మన కళ్లు చెమ్మగిల్లుతాయేమో మహాప్రభో! ఇట్లా మనల్ని ఎవరు చూసినా ప్రమాదమే. జూ వాళ్లు చూస్తే వాళ్లు కోతులు తప్పించుకొచ్చాయని పట్టుకెళ్లిపోతారు. జనమెవరైనా చూస్తే ఇతర గ్రహాలనుంచి ఎవరో వచ్చారని రాళ్లుచ్చుకు కొడతారు. ఇంక ఎంచక్కా కడిగేసుకుందామా మహాప్రభూ!
యజమాని: తిత్తి తీస్తా. ఇట్లాగే కథ చెప్పు. ఇంటాను.
కవి కథ చెబుతాడు.
యజమాని కవి మీద మట్టి చల్లుతూ
ఆపు. ఇది కతా.
కవి: పోనీ స్టొరీ అనుకోండి మహప్రభో!
యజమాని: తిత్తి తీస్తా. ఈ కత సినిమాగా తీస్తే నేనడుక్కు తినాల. ఓ ఊరు ఊరంతా పస్తుండి నాకు ముష్టెయ్యాల్సొస్తది. అరే. ఇన్నాళ్లనుంచీ సూస్తున్నాను సినిమాకు సంబంధించి ఒక్క కథ కూడా చెప్పలేనోడివి నువ్వేం కవివయ్యా అసలు. నేనొక గొప్ప కథ చెబుతాను ఇనుకో....... మధ్యతరగతి ఎదవ నాయాలా!
కవి: మహాప్రభో! తమరు నన్ను తిట్టారా?
యజమాని: లేదు. సినిమా పేరు చెప్పా.
కవి: ఆ పేరు తిట్టులా ఉంది మహాప్రభో.
యజమాని: పేరులో తిట్టుంటేనే సినిమా హిట్టవుద్దయ్యా.
తెర లెగవంగానే ఈరో ఓ కాఫీ హోటలుకెళతాడు. సర్వర్ రాగానే ఈరో ఏమున్నయ్ అని అడిగాడు.
అప్పుడు సర్వరు - ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, గారె, మషాలా గారె, ఉప్మా, కిచిడీ, పెసరట్టు, మినపట్టు, రవ్వట్టు, మషాలా అట్టు, బాతు, టమటా బాతు, బోండా, బజ్జీ, మైసూరు బజ్జీ, మిరపకాయ బజ్జీ, అరటికాయ బజ్జీ, తమలపాకు బజ్జీ, లడ్డూ, బందరు లడ్డూ, రవ్వలడ్డూ, మిఠాయి, పీచు మిఠాయి,బందరు మిఠాయి, బొంబాయి మిఠాయి, కలకత్తా మిఠాయి, జాంగ్రీ, పాలకోవా, హల్వా, మైసూరు పాకు, అమలాపురం కాజా, భీమవరం బాజా, పెద్దాపురం కూజా ఉన్నయంటాడు.
అప్పుడు ఈరో అట్టు తే అన్నాడు
అప్పుడు సర్వరు - ఏ అట్టు? పెసరట్టా, మినపట్టా, రవ్వట్టా, మషాలా అట్టా, సెవెంటీ ఎం.ఎం అట్టా, ఎమ్మెల్యే అట్టా, నూనేసి కాల్చాలా, నెయ్యేసి కాల్చాలా, నీళ్లోసి కాల్చాలా, పెట్రోలు పోసి కాల్చాలా, కిరసనాయిల్ పోసి కాల్చాలా, డీసిలేసి కాల్చాలా అసలు కాల్చాలా వద్దా అనడిగాడు.
అప్పుడు ఈరో పెసరట్టు నెయ్యేసి కాల్పించమన్నాడు. కాపీ కూడా తెమ్మన్నాడు.
ఏ కాపీ? మామూలు కాఫీ ఆ, స్పెషల్ కాపీ ఆ, బుర్రు కాపీ ఆ, నెస్కేప్ ఆ, బ్లాక్ కాపీ ఆ, వైట్ కాపీ ఆ, హాట్ కాపీ ఆ, కోల్డు కాపీ ఆ, నురుగు కావాలా వద్దా, కావాలంటే ఎన్ని చెంచాలు అనడిగాడు.
అప్పుడు ఈరో మామూలు కాపీ తెమ్మన్నాడు. అప్పుడు సర్వరు నీలగిరి కాపీ ఆ, హిమగిరి కాపీ ఆ, విమలా కాపీ ఆ..
కవి: ఆపండి మహాప్రభో ఆపండి. తమలో ఇంత ఊహా శక్తి ఉందని ఊహించలేకపోయాను....ఈ కథే సినిమా తీసుకోండి. పదివేల రోజులాడుతుంది. జనం వృద్ధులై పండి రాలిపోయేంతవరకు, కలియుగాంతం వచ్చి సర్వప్రాణి నాశనమైపోయేంతవరకూ ఈ సినిమా ఆడుతూనే ఉంటుంది మహాప్రభో. ఆడుతునే ఉంటుంది. నన్నొదిలేయండి. అర్భకుడిని. తమకు కథ వినిపించే శక్తి లేనివాడిని. నన్నొదిలేయండి మహాప్రభో!
ఈ సన్నివేశాల వీడియోలు 1 2 చూడండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి